చంద్రశేఖర్ కాలనీ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా గురువారం చేపట్టిన బంద్‌కు జి ల్లా సిద్ధమైంది. టీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపునకు జేఏసీతో సహా అన్నిసంఘాలు, వర్గాలు మద్దతు పలికాయి. రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం అనుసరిస్తు న్న వైఖరికి నిరసనగా బంద్‌ను విజయవంతం చేయాలని, పదిజిల్లాల తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కె.బాపూరావు కోరారు.
జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి, సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ఇప్పుడు రాయల తెలంగాణ అంటూ నాటకాలాడుతోందన్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం కిరికిరి చేస్తే మహోద్యమాన్ని సృష్టిస్తామని వారు హెచ్చరించారు. జిల్లాబంద్‌కు అన్నివర్గాలు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, లక్ష్మణ్‌రావు, విఠల్‌రావు, భాస్కర్, బస్వా లక్ష్మీనర్సయ్య, కిషన్, రాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
బంద్‌కు సిద్ధం
Published Thu, Dec 5 2013 5:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement