హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నెల 5 (గురువారం)న ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలను www.smania.ac.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
నేటి పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్షలు 30కి వాయిదా
తెలంగాణ బంద్ నేపథ్యంలో నేడు జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్షలను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి డీ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు.
బీఎస్సీ నర్సింగ్, ఎంఎల్‌టీ పరీక్షలు వాయిదా
విజయవాడ: తెలంగాణ బంద్ నేపథ్యంలో గురువారం జరగాల్సిన బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఎస్సీ (నర్సింగ్) పరీక్షలు వాయిదా వేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. విజయ్‌కుమార్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. 6వ తేదీ శుక్రవారం నుంచి జరుగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
Published Thu, Dec 5 2013 3:22 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement
Advertisement