హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా, పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ పిలుపుతో శనివారం తెలంగాణ జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. అర్థరాత్రి నుంచే తెలంగాణ వాదులు రోడ్లెక్కారు. బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు. ఇక తెలంగాణలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
దాంతో బస్సులు లేక ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సందట్లో సడేమియాలా ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రాజధానిని కలిపే అన్నిదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.