కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరా ట ఆకాంక్షపై కేంద్రం యూటర్న్ తీసుకు న్నా... హైదరాబాద్‌పై ఇంకేమైనా నిర్ణ యం తీసుకున్నా.. యుద్ధానికి సిద్ధమేనని టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అ న్నారు. సోమవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన టీఎన్జీఓస్ భేరిలో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఉద్యమా ల ఫలితంగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు. ఆ ప్రకటనపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్‌ఆంధ్రప్రదేశ్ సభకు సర్కారే దగ్గరుండి రాచ మర్యాదలు చేసిందని విమర్శిం చారు. ఏపీఎన్జీఓలకు బస్‌లలో బిర్యాని పొట్లా లు, మినరల్ బాటిల్లు అందించిందన్నారు. సభ నిర్వహణ, స్క్రిప్ట్ అంతా ముఖ్యమంత్రి కనుసన్నుల్లో నడిచిందన్నారు.తెలంగాణ ఉద్యోగుల పోరాటం సీమాంధ్ర ప్రజలపై కాదని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, మండలాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీఎన్జీఓలకు తెలంగాణ ప్రాంతంపై అవగాహన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీఎన్జీఓ అధ్యక్షులు అశోక్‌బాబు ఒక్కటేనన్నారు.
చంద్రబాబు రచించిన స్క్రిప్ట్‌ను అశోక్‌బాబు అమలు పరుస్తున్నాడన్నా రు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులపై మొదటి నుంచి వివక్ష కొనసాగుతోందన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల తరబడి పోరాటం కొనసాగిస్తున్నారన్నా రు. ఈ పోరాటంలో ఎంతో మంది ఉద్యోగులు అరెస్టు అయ్యారని, సస్పెన్షన్‌లు, డిస్మిస్‌లు జరి గినా అలుపెరుగకుండా పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సకల జనుల భేరికి లక్షలాదిగా తరలిరావాలన్నారు.సకల జనుల భేరి విజయవంతానికి తెలంగాణలోని అన్ని జిల్లాలో టీఎన్జీఓల భేరి నిర్వహిస్తున్నామన్నారు. 1969 సంవ త్సరం నుంచి టీఎన్జీఓలు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారన్నారు. 1969లో 38 రోజులు, 1985లో ఎన్‌టీఆర్ హయాంలో, 2009 సకల జనులసమ్మెలో తెలంగాణ కోసం గొంతెత్తి టీఎన్జీఓలు పోరా టం చేశారన్నారు. సీడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేసిన అనంతరం కూడా కేంద్రం తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేస్తోందన్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తన మాతృశాఖలో ఏం జరుగుతుందో కూ డా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.ట్రెజరీ గజిటెడ్ అధికారులు నేటి నుంచిసమ్మొకు పిలుపునిస్తే ఆయన సీమాంధ్ర సమ్మె ఉధృతం గా ఉందంటూ ఢిల్లీలో లాబీలకు దిగారన్నారని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు.జూలై 1 నుంచి పీఆర్సీ ప్రకటించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోం దన్నారు.
ఉద్యోగులందరికీ 45 శాతం ఇంటీరియల్ రిలీఫ్ ఫండ్ విడుదల చేయాలని ఆయ న డిమాండ్ చేశారు. టీఎన్జీఓస్ రాష్ట్ర కార్యాదర్శి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఉం దన్నారు. ఏపీఎన్జీఓలు రెచ్చగొట్టినా తెలంగాణ ఉద్యోగులు మౌనం దాల్చరని, అది బలహీనత అనుకుంటే భ్రమేనన్నారు. మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సహనాన్ని సీమాంధ్రులు పరీక్షిస్తున్నారన్నారు. నిజంగా తెలంగాణ ప్రజ లు తలుచుకుంటే హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ వెనక్కి వెళ్లలేకపోయేవారన్నారు. తెలంగాణ కోసం 1969లో 400 మంది, 2009 నుంచి వెయ్యిమందికిపైగా అమరులైనారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఏపీఎన్జీఓల అధ్యక్షులు అశోక్‌బాబుది దింపుడు కల్లెం ఆశ మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని యూీ పఏ కాకుంటే ఎన్డీయే ఇచ్చితీరుతుందన్నారు.
టీపీఎఫ్ ఉపాధ్యక్షులు వేదకూమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన, సామాజిక ఉద్యమం తెలంగాణ ఉద్యమమన్నారు. ఉద్యమానికి ప్రజ లు నాయకత్వం వహిస్తున్నారన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ, తెలంగాణ కళాకారుడు రసమయి బాలకిషన్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు గైని గంగారాం, ఎ.కిషన్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కరుణాటి యాదగిరి, బీజేపీ నాయకులు బాపురెడ్డి, బీఎస్ పీ నాయకులు ఎడ్ల రాము, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్, జేఏసీ నాయకులు విఠల్‌రావు, భాస్కర్, లక్ష్మన్, బాబురాం, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకర్, ట్రెజరీ అధ్యక్షులు రాములు, వెయ్యి మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏపీఎన్జీఓలకు సర్కారు ప్రోత్సాహం
Published Tue, Sep 24 2013 5:15 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement