ఆర్మూర్/ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నాలుగు వందల ఏళ్లుగా తెలంగాణ ప్రాంత ప్రజలు తమ శ్రమశక్తితో నిర్మించుకున్న హైదరాబాద్‌పై వేరెవ్వరికీ హక్కులేదని, ముమ్మాటికీ హైదరాబాద్ తమదేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌పై ఏపీఎన్జీవోలు ఆధిపత్య, దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని, లేనిపక్షంలో విస్ఫోటం తప్పదన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల మౌనమే రాష్ట్ర ఏర్పాటులో జాప్యానికి కారణమన్నారు. ఈ నెల 29న జరిగే సకల జనుల భేరిని ఉద్యోగులు విజయవంతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఆత్మగౌరవాన్ని చాటాలని కోరారు. సమావేశం సంఘం కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో పెట్టేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీఎన్జీవోల భేరిలో దేవీప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ మాదే! : దేవీప్రసాద్
Published Wed, Sep 25 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
Advertisement
Advertisement