APNGOs
-
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎన్జీఓలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ ఎన్జీవోలు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఓ బృందం తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి పీఆర్సీ విషయమై చర్చించారు. పీఆర్సీ నివేదిక ఇచ్చి చాలా రోజులు అవుతోందని, జాప్యం లేకుండా పీఆర్సీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చారని గుర్తుచేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం చెప్పినట్లు ఎన్జీఓ నాయకులు తెలిపారు. ముందు పీఆర్సీ ఇస్తామన్నారు.. తరవాత డీఏలు ఇస్తామన్నారు.. సీపీఎస్ రద్దు పై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పినట్లు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖపరమైన పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరినట్లు మీడియాతో బండి శ్రీనివాస రావు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
సంక్షేమంలో ముందున్నాం: సజ్జల
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సంక్షేమం.. ప్రజా సంక్షేమంలో భాగమేనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలన అనుభవం లేకున్నా.. సంక్షేమంలో ముందున్నామని, ఏడాదిన్నరలోనే ప్రపంచ, దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.2లక్షల కోట్లకుపైగా అప్పులు పెట్టి పోయింది. కోవిడ్ కట్టడిలో ఖర్చుకు వెనుకాడని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: కావాలనే ఘర్షణ వైఖరి) ‘‘ప్రజా జీవనం కోవిడ్ కారణంగా స్తంభించింది. ఎవరికైనా సమాచారం చాలా ముఖ్యం. సమాచార వారధి ఉండటం చాలా అవసరం. నేను రాజకీయ నాయకుడిని కాదు. పరిష్కారం దిశగా ఏ సమస్య అయినా ఆలోచించగలగడానికి కారణం సీఎం జగన్ పట్టుదల. సీఎం జగన్ వెంట నడుస్తున్న వారిగా మేం అంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. ప్రభుత్వ విధానాలను అమలు చేసే యంత్రాంగం సమస్యలు తీర్చాలి. సీఎం జగన్ స్వేచ్ఛగా తాను అనుకున్నవి చేస్తున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.(చదవండి: ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్) -
‘స్వప్రయోజనాల కోసమే ఏకపక్ష నిర్ణయం’
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో పిలుపునిచ్చిన ఆందోళనకు మా మద్దతు లేదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏకపక్షంగా ఎన్టీవోలు ఆందోళనకు పిలుపునివ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసేందుకే ఆందోళనకు పిలుపునిచ్చారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తగదన్నారు. ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచిందని తెలిపారు. పెద్దఎత్తున ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఆందోళనకు పిలుపునివ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని వెంకటేశ్వర్లు సూచించారు. -
ఏపీ ఎన్జీవోల నేత యువరాజులు నాయుడు కన్నుమూత
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి సమైక్య ఉద్యమంలో కీలక భూమిక నివాళులర్పించిన ఏపీఎన్జీవోలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పలమనేరు: పలమనేరు ఏపీ ఎన్జీవోస్ నేత యువరాజులు నాయుడు (52) గుండె పోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని సోమవారం పలమనేరుకు తరలించారు. యువరాజులు నాయుడు మృతిచెందారనే వార్తతో స్థానికంగా ఉన్న పలువురు ఎన్జీవో సంఘ నేతలు విస్మయానికి గురయ్యారు. ఆయన స్వగ్రామమైన మండీపేటకోటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయన గతంలో బెరైడ్డిపల్లె డెప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తూ బదిలీపై వి.కోట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లో జరిగే అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్‌కు రెండు నెలల క్రితం వెళ్లారు. అక్కడ గుండెపోటుకు గురై తొలుత నిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అయితే 15 రోజుల క్రితం పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబీకులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమైక్య ఉద్యమంలో కీలక భూమిక పలమనేరు పట్టణంలో 213 రోజుల పాటు నిరంతరాయంగా సాగిన జై సమైక్యాంధ్ర ఉద్యమంలో యువరాజులునాయుడు కీలకభూమిక పోషించారు. రాష్ట్ర విభజన అంశం తెరమీదికి రాగానే సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకుని రోడ్లపైకొచ్చేశారు. రాష్ట్రం లోనే మొట్టమొదట ఉద్యమాన్ని పలమనేరులోనే ప్రారంభించడంలో ఆయన కృషి ఉంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, సంఘటిత, అసంఘటిత, విద్యార్థులను ఉద్యమంలో సమీకృతం చేసి జేఏసీ ద్వారా ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్దారు. రాజకీయ పార్టీలను సైతం ఉద్యమ గొడుకు కిందకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. ఉద్యమం సాగినన్నాళ్లు ప్రతి కార్యక్రమంలోనూ నాయుడు జేఏసీ అధ్యక్షులుగా కీలకంగా వ్యవహరించారు. తను నివాసముండే కాలనీకి జై సమైక్యాంధ్ర కాలనీగా నామకరణం సైతం చేయించారు. ఎమ్మెల్యే పరామర్శ పలమనేరు: పలమనేరు ఏపీ ఎన్జీవోల నాయకులు యువరాజులు నాయుడు కుటుంబాన్ని సోమవారం పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పరామర్శించారు. యువరాజులు నాయుడు మృతిచెందారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు విమానంలో వచ్చి అక్కడి నుంచి పలమనేరుకు చేరుకున్నారు. సమైక్య ఉద్యమ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి కష్టమొచ్చినా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట పలమనేరు పట్టణ, మండల, గంగవరం వైఎస్సార్సీపీ కన్వీనర్లు హేమంత్‌కుమార్‌రెడ్డి, బాలాజీనాయుడు, మోహన్‌రెడ్డితో పాటు పలువురున్నారు. -
బాబు గారు ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి
అధికారాన్ని 'విషం'గా అభివర్ణించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ముఖ్యమంత్రి పీఠం ముళ్లకిరీటం అంటూ సచివాలయ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నిజమే అధికారం ముళ్ల కిరీటమే. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. తెలిసినప్పుడు మళ్లీ ముళ్లకిరీటం అందుకోవాలని ఎందుకు తహతహలాడినట్లు? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా గతంలో లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని ఆయన భావించినట్లు ఉన్నారు. అందుకే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు కైవనం చేసుకోగా బాబు తెగ ఖుషీ ఖుషీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకు మెల్లగా అర్థమవుతున్నాయి. దాంతో బాబులోని వేదాంతి బయటకు తన్నుకొచ్చినట్లు ఉన్నాడు. అందుకే సీఎం పీఠం ముళ్ల కిరీటం అంటూ వేదాంతాలు పలుకుతున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెలన్నర అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాలన ప్రారంభమైంది లేదు. అదికాక ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదు. ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన హమీపై నేటికి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇవాళో రేపో రుణమాఫీపై బాబు ప్రకటన చేస్తారంటూ రైతులు ఎదురు చూస్తున్నారు. ఆ అంశంపై కమిటీ వేశాం... నివేదిక వస్తుంది... అంటూ చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు. దాంతో రైతులకు రుణమాఫీ చేయాలంటూ చంద్రబాబును ప్రతిపక్షాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అదే అంశంపై ప్రతిపక్షాలు చంద్రబాబుపై రోజురోజూకు ఒత్తిడి పెంచుతున్నాయి. మరో పక్క మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు రుణమాఫీపై మీ నాయకుడు ఏం చేశారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. దాంతో సదరు నాయకులు తమతమ నియోజకవర్గాల్లో ప్రజలకు మోహం చూపించలేక పోతున్నామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. రోలు వచ్చి మద్దెలతో దరువు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. రైతులు, సొంత పార్టీ నాయకులు, ప్రతిపక్షాలకు రైతు రుణమాఫీపై ఏం చెప్పాలో అర్థం కాక చంద్రబాబు తలను గోడకు బాదుకుంటున్నారు. సీఎంగా మరోమారు ఎన్నికైనందుకు నవ్వాలో లేక ఏడవాలా తెలియని పరిస్థితి బాబులో నెలకొంది. అందుకే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న ఠీవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆ విషయం చంద్రబాబు తీరులోనే ఇట్టే స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠంపై అధిష్టించిన ఆయనకు ముళ్ల మీద కుర్చునట్లుంది. ఆ విషయాన్ని వెల్లడిస్తే బాగోదని అనుకున్నారో ఏమో పాపం చంద్రబాబు సీఎం పీఠం బంగారమని అందరూ అనుకుంటారు కానీ ... ముళ్ల కిరీటం అంటూ బాబు సెలవిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు శనివారం విజయవాడలో ఏపీఎన్జీవోలు ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు 'సీఎం పీఠం'పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. -
వనరులతో సంబంధం లేనివన్నీ చేస్తాం: చంద్రబాబు
విజయవాడ: రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకుని ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ రోజు ఇక్కడ జరిగిన ఏపి ఎన్జీఓల అభినందన సభలో ఆయన ప్రసంగించారు. ఏపీలో 17వేల కోట్ల రూపాయలకు పైగా లోటుబడ్జెట్ ఉందని తెలిపారు. ఏపీఎన్జీవోలు అడిగిన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రైగ్యులరైజ్ చేయడం వనరులతో కూడుకున్నపని అన్నారు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఏపి ఎన్జీఓల సమస్యల్లో వనరులతో సంబంధం లేనివన్నీ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. విజయవాడ, విశాఖ కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
దేశం దృష్టిని ఆకర్షించిన ఘటనలు
దేశరాజధానికి సమైక్య సెగతగిలింది. సమైక్య నినాద హోరుతో ఢిల్లీ నగరం దద్దరిల్లింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సమైక్యవాదులు ఢిల్లీలో జంతర్‌మంతర్, రామ్లీలామైదానం, విజయ్‌చౌక్‌లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం పన్నుతున్న కుయుక్తులను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గట్టిగా సమైక్యవాదం వినిపించింది. జాతీయ మీడియాతో పాటు అందరి దృష్టి జంతర్‌మంతర్‌పైనే పడింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే రెండు సార్లు నిరాహార దీక్ష చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో జంతర్‌మంతర్‌లో భారీ ఎత్తున సమైక్య ధర్నా నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలోని రాజకీయ దురుద్దేశాలను, రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే అనూహ్యపరిణామాలను ధర్నాలో వేలాది మంది పాల్గొన్న సమైక్యవాదులకు వివరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ఏకైక ప్రధాన పార్టీ వైఎస్ఆర్ సిపి. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నాయకత్వంలో జరిగిన జంతర్ మంతర్ వద్ద ధర్నా - ఆ తరువాత పార్లమెంటు వరకు జరిపిన సమైక్య నడక - పార్లమెంటు స్ట్రీట్ వద్ద వారి ఆందోళన - జగన్ అరెస్ట్ - విడుదల .... సంఘటనలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఈ ఘటనలతో కాంగ్రెస్ వెనక్కి తగ్గకపోయినా, లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా వ్యక్తమవుతుందని భావిస్తున్నారు. ధర్నానుద్దేశించి జగన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అధికారం ఉందని అన్యాయం చేసుకుంటూ పోతున్నారు - స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూలేని విధంగా ఆర్టికల్ త్రీ దుర్వినియోగం అవుతోంది- అసెంబ్లీ తీర్మానం లేకుండా ఏ రాష్ట్రమూ ఏర్పడలేదు - కమిషన్ సిఫార్సు చేయకుండా ఏ ఒక్క రాష్ట్రమూ ఏర్పడలేదు - జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే అన్నిటికంటే ఉత్తమ మైనదని పేర్కొంది - విభజన వద్దని అసెంబ్లీలో తీర్మానం చేశాం - పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటులో ఖూనీ చేశారు - బిల్లును అప్రజాస్వామిక రీతిలో ప్రవేశపెట్టారు - పదంటే పది సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టామని చెప్పారు - రాష్ట్రం విడిపోతే తెలంగాణాయే కాదు, సీమాంధ్ర ప్రాంతం కూడా నష్టపోతుంది- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్‌గా మారిపోయింది - కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి...అని ప్రసంగించారు. ఆ తరువాత జగన్ పిలుపుతో సమైక్యవాదులు ఢిల్లీ వీధులలో కదం తొక్కారు. పార్లమెంటు వరకు కాలినడక వెళ్లారు. కేంద్రానికి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ వీధులలో సమైక్య సమరం చేశారు. మరోవైపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనా కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఎన్జీవోలు దీనికి హాజరయ్యారు. అధికారం, పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోను, రాష్ట్రప్రజల భవిష్యత్తుతో సోనియాగాంధీ ఆటలాడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కనబడలేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నిలదీశారు. కేంద్రం తీరుపై తమ నిరసన కొనసాగుతుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఇంకోవైపు పార్లమెంటు సమీపంలో ఉన్న విజయ్‌చౌక్ దగ్గర లోక్‌సభ నుంచి బహిష్కారానికి గురైన సీమాంధ్ర ఎంపీలు విభప బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. తమను సభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని, నిరంకుశధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ రకంగా అందరూ కలిసి తెలుగువారి సత్తాను ఢిల్లీకి చూపించారు. -
ఢిల్లీకి తరలివెళ్లిన ఎన్జీఓలు
విజయనగరం టౌన్, కలెక్టరేట్ న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో నూకలు చెల్లిపోయాయని సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమి తి సభ్యులు అన్నా రు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తుతున్న పరిణామాలపై వారు తీవ్రంగా స్పం దించారు. ఈ నెల 17న ఢిల్లీలో జరగనున్న నిరసనకు జిల్లా నుంచి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు సుమారు 500 మంది శని వారం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఈ సందర్భంగా స్టేషన్ మొత్తం సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిపోయింది. సమైక్యాం ధ్రను పరిరక్షించుకుంటామని వారంతా నినాదాలు చేశారు. అనంతరం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకుడు గంటా వెంకటరావు మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లుపై సీమాంధ్ర ఎంపీలను మాట్లాడనివ్వకుండా సస్పెండ్ చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తే సహించేది లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న నాయకులకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఢిల్లీ సభ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా సీఎం కిరణ్ తదితరులు హాజరవుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తు న్న కుట్రలను తిప్పికొట్టేందుకు నాయకులందరితో కలిసి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. ‘సమ్మె చేసేందుకు వెనుకాడం’ విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏ క్షణానైనా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి డి.వి.రమణ పేర్కొన్నార ు. పార్లమెంట్లో సీమాంధ్రకు చెందిన ఎంపీలపై దాడికి నిరసనగా శనివారం పట్టణంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ముందు రిలే నిరశన దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ దీక్షలు చేపడుతున్నామన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి శేషుకుమారి, దీక్షలో ప్రశాంత్, ఎన్.శ్రీధర్, బి.శివప్రకాష్, మౌళి, టి.రమణమూర్తి, పి.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీకి బయలుదేరిన ‘సమైక్య’ రైలు
లక్ష్మీపురం(గుంటూరు), న్యూస్‌లైన్: విభజన వ్యతిరేకతను ఢిల్లీకి చాటేందుకు ఈనెల 17న ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన మహా ధర్నాలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి రాత్రి 8 గంటలకు ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఈ రైలుకు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పచ్చ జెండా ఊపారు. ఈ ప్రత్యేక రైలు రెండు నెంబరు ప్లాట్ఫారం నుంచి బయలుదేరగా రైలులో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున సమైక్యవాదులు బయలుదేరి వెళ్ళారు. ఈ ప్రత్యేక రైలు వెళుతుందని తెలుసుకున్న సమైక్యవాదులు పెద్ద ఎత్తున రైల్వే ప్రాంగణానికి చేరుకుని జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. -
విభజన బిల్లు రాజ్యాంగ విరుద్ధం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీఓ, వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలో టీడీపీ నాయకులు రైల్‌రోకో చేపట్టారు. బంద్ ప్రభావంతో జిల్లా కేంద్రం బోసిపోయింది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. వైద్య ఉద్యోగులు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. విభజనకు సహకరిస్తున్న పాలకులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం రాజ్యంగ విరుద్ధమని విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మా మిడి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం గా గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కోసం కేసీఆర్, కోదండరాంరెడ్డి తెలుగు ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల వల్ల ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ వారి విభజించు.. పాలించు పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు బిల్లును అడ్డుకుని సోనియాగాంధీకి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మహా సభ జిల్లా కోకన్వీనర్ మద్దిల సోంబాబు, కార్యదర్శి కిశోర్, విద్యార్ధి సంఘ నాయకులు భరత్, శ్యామ్, పాల్గొన్నారు. చరిత్ర హీనులవుతారు.. విజయనగరం మున్సిపాలిటీ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లును సీమాంధ్రకు చెందిన ఎంపీలందరూ పార్టీలకతీతంగా అడ్డుకోవాలని, లేనిపక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు విమర్శించారు. బంద్‌లో భాగంగా టీడీపీ నాయకులు రైల్‌రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోనియాగాంధీ దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే తెలుగు ప్రజలందరూ నష్టపోతారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్.ఎన్.ఎం.రాజు, మన్యాల కృష్ణ, వి.వి.ప్రసాద్, కనకల మురళీమోహన్, ప్రసాదుల రామకృష్ణ, సైలాడ త్రినాథ్, మైలపల్లి పైడిరాజు, మోహనరావు, నైదాన శ్రీను, కోండ్రు శ్రీనువాసరావు, గెదేల ఆదిబాబు, మద్దాల ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు. జాతి విద్రోహులను ప్రజలు క్షమించరు విజయనగరం టౌన్ :రాష్ట్ర పునర్విభజనకు పూనుకున్న కాంగ్రెస్, టీడీపీ జాతి విద్రోహులను ప్రజలు ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అవనాపు విజయ్ అన్నారు. ఏపీఎన్జీఓలు పిలుపునిచ్చిన బంద్‌కు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి సుమారు వంద బైక్‌లపై ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ రోడ్డు, కోట జంక్షన్, మూడులాంతర్లు, కన్యకాపరమేశ్వరీ కోవెల మీదుగా గూడ్స్‌షెడ్ , బాలాజీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లు పూర్తిగా తప్పుడు తడకలతో కూడుకున్నదన్నారు. చట్టాల పట్ల గౌరవం లేని యూపీఏ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు అవనాపు విక్రమ్, కాళ్ల గౌరీశంకర్ మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాంబార్కి సత్యం, నామాల సర్వేశ్వరరావు, బొద్దూరు లక్ష్మణరావు, తొగరోతు నారాయణప్పడు, మొయిద ఆదిబాబు, వంకర గురుమూర్తి, వాజా మంగమ్మ, సియ్యాదుల శేఖర్, సతీష్‌రెడ్డి, పొట్నూరు శివ, సాధుకృష్ణ, భీమరశెట్టి ఉపేంద్ర, అలమండ గౌరి, పూల్‌బాగ్ నారాయణ, దేవి, పడగల శ్రీను అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ పోరాడాలి విజయనగరం లీగల్ : విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి అందరూ పోరాడాలని రాష్ట్ర బార్ కౌన్సెల్ సభ్యుడు కేవీఎన్ తమ్మన్నశెట్టి, పట్టణ న్యాయవాదులు సంఘ అధ్యక్షుడు జి.రామ్మోహన్రావు, ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విభజన బిల్లును అడ్డుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం తమ్మన్నశెట్టి మాట్లాడుతూ, ఈ నెల 17న ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు న్యాయవాదులు భారీగా హాజరవుతారని చెప్పారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి శివప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. బిల్లును వ్యతిరేకించాలి విజయనగరం ఆరోగ్యం : సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు మూకుమ్మడిగా విభజన బిల్లును వ్యతిరేకించాలని వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి. ఇజ్రాయిల్ కోరారు. స్థానిక కేంద్రాస్పత్రి వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. అనంతరం సోనియా దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సోనియా డౌన్ డౌన్, యూపీఐ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇజ్రాయిల్ మాట్లాడుతూ, సోనియాగాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యులు సత్యశేఖర్, మధుకర్, సత్యశ్రీనివాస్, శ్రీకాంత్, వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు ఆచారి, ఉమాపతి, భువనేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీమాంధ్ర బంద్
-
ఆర్టీసీ సమ్మెపై అనిశ్చితి
ఆర్టీసీ సమ్మెపై అనిశ్చితి సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు చేపట్టిన మలివిడత సమ్మెకు మద్దతుగా తాము కూడా సమ్మెలోకి వెళ్లాలనే విషయంపై ఏపీఎస్ ఆర్టీసీ యూనియన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే మళ్లీ ప్రైవేటు బస్సులు విజృంభిస్తాయని, ఇది సంస్థ మనుగడకు ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో ఉద్యోగులు ఉన్నాయి. దీంతో సమ్మెలోకి వెళ్లేందుకు యూనియన్లు కూడా వెనకాడుతున్నాయి. బుధవారం ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్యుల సమావేశం రాజధానిలో జరిగింది. దీనికి జోనల్ కార్యదర్శి వైవీ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తంకావడంతో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని, పార్లమెంట్లో చోటు చేసుకునే పరిణామాలను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని వైవీ రావు ‘సాక్షి’కి తెలిపారు మరో కార్మిక సంఘం ఎన్ఎంయూ ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు అందచేసింది. ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో భవిష్యత్ కార్యాచరణను చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని ఎన్ఎంయూ భావిస్తోంది. -
నేడు సీమాంధ్ర బంద్
ఏపీఎన్జీవోల సంఘం పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అప్రజాస్వామికంగా బిల్లును లోక్‌సభ ముందుకు తేవడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రజలంతా ఈ బంద్‌లో పాల్గొనాలని కోరారు. ఈ బంద్‌కు అన్ని రాజకీయ, ప్రజా, విద్యార్ధి, కార్మిక సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... మెజార్టీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా, చట్టసభల సంప్రదాయాలను పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్రం, విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారంటే... విభజనను అడ్డుకునేందుకు ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం. ప్రస్తుతం ఆఖరి పోరాటం చేస్తున్నాం. విభజన బిల్లును జాతీయ సమస్యగా భావించి అన్ని పార్టీలు పార్లమెంట్లో అడ్డుకోవాలి. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రులతో భేటీలు జరిపి సభలో బిల్లును అడ్డుకునే అంశమై చర్చలు జరిపాం. బిల్లును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ను స్తంభింపజేసి బిల్లు రాకుండా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు శక్తిమేర ప్రయత్నించాలి. రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర మంత్రులు ఢిల్లీకి రావాలని కోరాం. వారు ఇక్కడికి వచ్చాక కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించేలా కార్యాచరణ రూపొందిస్తాం. ఈ నెల 17న ఇక్కడి రాంలీలా మైదానంలో సుమారు 20వేల మందితో మహాధర్నా నిర్వహిస్తాం. దీనిద్వారా విభజన వ్యతిరేకతను ఢిల్లీకి చాటుతాం. కావూరి, పురందేశ్వరిలతో భేటీ.. బిల్లును లోక్‌సభలో అడ్డుకునే విషయమై అశోక్‌బాబు బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరిలను విడివిడిగా కలిసి చర్చించారు. కాగా.. ఏపీఎన్జీవోల బంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) సమైక్యాంధ్ర పోరాట కమిటీ స్పష్టం చేసింది. బంద్ విజయవంతానికి వైఎస్సార్ సీపీ పిలుపు సాక్షి, హైదరాబాద్: విభజనను వ్యతిరేకిస్తూ ఈనెల 13న జరుగనున్న సమైక్య బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. ఢిల్లీ గుండెలు అదిరేలా సమైక్య నినాదం వినిపిస్తూ ఈ బంద్‌లో ముందుండాలని తమ పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలోనే ఒక రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా విభజించే యత్నం, ఒక జాతిని చీల్చే యత్నం మరెన్నడూ జరుగలేదని పేర్కొంది. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని, ఈ పోరాటంలో అందరూ కలిసి ఢిల్లీ విభజన వాదంపై దండెత్తాలని పార్టీ పిలుపు నిచ్చింది. -
'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి'
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పార్టమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు పార్టీలకతీతంగా సభను స్తంభింప చేయాలన్నారు. సీమాంధ్ర బంద్‌ను విజయవంతం చేయాలని అశోక్ బాబు కోరారు. -
కేంద్ర కార్యాలయాలు మూత
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఏపీఎన్జీవో నేతలతో పాటు సమైక్యవాదులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. అనంతపురంలో ప్రభుత్వ వైద్యులు సర్వజనాసుపత్రిలో ఓపీ విభాగాన్ని మూసివేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఎన్జీవోనేతలు కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అనంతపురంలో టీడీపీ నేతలు రాష్ట్రపతి బొమ్మతో శవయాత్ర నిర్వహించి.. పిండ ప్రదానం చేశారు. కడప జిల్లాలోని పోస్టల్, టెలికాం, పీఎఫ్, ఐఓసీతో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పులివెందులలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేరుగా ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి, మదనపల్లె, చిత్తూరు ఆర్డీవో కార్యాలయాల్లో, కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. గ్రీవెన్స్ సెల్ నిర్వహించలేదు. చిత్తూరు, మదనపల్లె, తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏపీ ఎన్జీవోలుకొంతసేపు నిరసన తెలిపారు. కర్నూలులోని ఆదాయపు పన్ను కార్యాలయం, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం, పాతబస్టాండ్, బి.క్యాంప్‌లోని ప్రధాన పోస్టల్ కార్యాలయాలు, రివర్వ్యూ కాలనీలోని ఎల్ఐసీ, వివిధ టెలికాం కార్యాలయాలను ఉద్యోగులు ముట్టడించారు. ప్రజాదర్బార్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా కలెక్టర్ జోక్యంతో వెనుదిరిగారు. శ్రీకాకుళంలో సమైక్యవాదులు పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్, బీమా సంస్థల కార్యాలయాల వద్దకు వెళ్లి విధులు నిర్వహించకుండా సిబ్బందిని అడ్డుకున్నారు. అనంతరం వారిని బయటకు పంపి కార్యాలయాలను మూసివేయించారు. జిల్లా పరిషత్ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట మానవహారం చేపట్టారు. రె వెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద దీక్ష చేశారు. విజయనగరం జిల్లాలో ఉద్యోగులు పోస్టల్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలను మూయించారు. కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌ను అడ్డుకున్నారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట తెలుగు జాతి దుష్టశక్తులకు శాంతి హోమం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, చింతలపూడిలో బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్ తదితర కార్యాలయూలకు సమైక్యవాదులు తాళాలు వేరుుంచారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్జీఓలు తపాలా, ఎల్ఐసీ, ఎఫ్‌సీఐ, బీఎస్ఎన్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూయించి వేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సీటీఆర్ఐ, ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల కార్యాలయాల ఎదుట ఎన్జీఓలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్రేటర్ విశాఖ మున్సిసిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట జీఓఎం సభ్యుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. -
సమైక్యంగా మళ్లీ..సమరసీమకు..
సాక్షి, కాకినాడ :ప్రభుత్వోద్యోగులు మళ్లీ పోరుబాట పట్టారు. ‘సమైక్యాంధ్రే’ తమ సమరలక్ష్యమని ఎలుగెత్తారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో నేపథ్యంలో.. విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని ఎన్జీఓలు సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 32 వేలమంది విధులు గురువారం నుంచి విధులను బహిష్కరించనున్నారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది మినహా రెవెన్యూ, సివిల్ సప్లయిస్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, కమర్షియల్, రవాణా, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, జెడ్పీ, దేవాదాయ, చేనేత, విద్య, వైద్యఆరోగ్యం, పశుసంవర్ధక, గంథాలయ, కార్మిక, సాంఘిక, బీసీ, వికలాంగుల, మైనార్టీ సంక్షేమ తదితర శాఖలతో పాటు ఎక్సైజ్ మినిస్టీరియల్ స్టాఫ్ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో గురువారం లగాయతు మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడనున్నాయి. గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల నుంచి తహశీల్దార్ వరకు అధికారులు, సిబ్బందితో పాటు కలెక్టర్, జేసీ, ఏజేసీ, డీఆర్వోల వద్ద పనిచేసే అటెండర్లు, డ్రైవర్లతో సహా సమ్మెలోకి వెళ్లనున్నారు. శుక్రవారం నుంచి కార్పొరేషన్, మున్సిపాలిటీల సిబ్బంది కూడా సమ్మెలోకి రానున్నారు. ఈనెల 10 నుంచి సమ్మె బాటపట్టాలని హౌసింగ్ సిబ్బంది నిర్ణయించారు. ట్రెజరీ, కోఆపరేటివ్, వ్యవసాయం, ఇరిగేషన్ తదితర శాఖల సిబ్బంది సమ్మెలో పాల్గొనే విషయంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియపై సమ్మె తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిని ఈనెల 10లోగా బదిలీ చేయాల్సి ఉంది. అయితే వారు సమ్మె బాట పట్టనుండడంతో ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవచ్చు. అన్ని శాఖలూ సమ్మెలోకి రావాలి.. కాగా బుధవారం సాయంత్రం కాకినాడలోని ఏపీ ఎన్జీఓ సంఘ భవన్లో రాష్ర్ట ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ నేతలతో పాటు గతంలో జరిగిన సమైక్య సమ్మెలో పాల్గొన్న వివిధ ప్రభుత్వశాఖల జేఏసీ నాయకులు, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జవహర్ అలీ, గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, మున్సిపల్ జేఏసీ నాయకులు డీవీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. ఎన్జీఓల సంఘం పిలుపు మేరకు గతంలో మాదిరిగానే సమ్మెలో పాల్గొంటామని వివిధ ప్రభుత్వశాఖల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేస్తున్న సమ్మెలో ప్రతి ప్రభుత్వోద్యోగీ పాల్గొనాలని ఆశీర్వాదం, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ పిలుపునిచ్చారు. విభజనను అడ్డుకునే ఆఖరి ఘట్టంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన బాధ్యత సమైక్యవాదులపై ఉందన్నారు. సమావేశానంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ విభజన బిల్లును అడ్డుకునేందుకు గత ఏడు నెలలుగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విభజన బిల్లును కూడా అడ్డుకొని సమైక్యతను కాపాడాలన్నారు. ఉద్యమ తీవ్రత ఢిల్లీకి తెలియాలంటే గతంలో మాదిరిగానే ప్రభుత్వశాఖలన్నీ సమ్మెబాట పట్టాలన్నారు. ప్రస్తుతానికి పోరుబాట పడుతున్నది వీరే.. గెజిటెడ్ అధికారులు 3,354 ఎన్జీఓలు 16,823 క్లాస్-4 ఉద్యోగులు 6680 ప్రభుత్వ డ్రైవర్లు 530 వీఆర్ఏలు 2631 వీఆర్వోలు 2185 -
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఏపీ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక తరఫున ఏపీఎన్జీఓలు బుధవారం ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నాచౌక్‌లో నిర్వహించతలపెట్టిన ‘చలో హైదరాబాద్’ ధర్నా నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరాపార్క్ రోడ్డుతో పాటు అసెంబ్లీ చుట్టుపక్కలా ఇవి బుధవారం ఉదయం 6 నుంచి అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. నిరంకారి వైపు నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లే వాహనాలను ద్వారకా హోటల్ నుంచి ఇక్బాల్ మీనార్, మాసబ్‌ట్యాంక్ వైపు పంపిస్తారు నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ, బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి విగ్రహం మీదుగా మళ్లిస్తారు అంబేద్కర్ స్టాట్యూ నుంచి ఐటీ లైన్లోకి వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి దారి మళ్లిస్తారు లిబర్టీ, జీహెచ్ఎంసీ కార్యాలయం, మోర్ మెడికల్ హాల్ వైపు నుంచి ఆదర్శ్‌నగర్ వైపు వచ్చే వాహనాలను క్రిస్టల్ లైన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్ వైపు పంపిస్తారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోఠిల వైపు నుంచి పాత కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ, బీజేఆర్ స్టాట్యూ వైపు మళ్లిస్తారు బషీర్‌బాగ్ వైపు నుంచి ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు వెళ్లే వాహనాలను బీజేఆర్ స్టాట్యూ, జీపీఓ వైపు పంపిస్తారు ఆదర్శ్‌నగర్-కట్టమైసమ్మ దేవాలయం మధ్య ఉన్న మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. ఆర్టీసీ సిటీ, సెట్విన్ బస్సుల్నీ ఈ మార్గాల్లోకి అనుమతించరు. ఇతర జిల్లాల బస్సుల్ని జేబీఎస్, ఎంజీబీఎస్, మెహిదీపట్నం, లింగంపల్లి వరకే అనుమతిస్తారు సిటీ బస్సులు మాసబ్‌ట్యాంక్/మెహిదీపట్నం, వీవీ స్టాట్యూ/పంజగుట్ట, ఖైరతాబాద్, కర్బాలా మైదాన్/సీటీఓ/తాజ్ ఐలాండ్, ఎంజే మార్కెట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్దే ఆపాల్సి ఉంటుంది పార్కింగ్ ప్రాంతాలివి... ధర్నాకు వచ్చే వారికి ఎన్టీఆర్ స్టేడియం, నెక్లెస్‌రోడ్, కులీకుతుబ్‌షా స్టేడియం, సీఏఆర్ హెడ్-క్వార్టర్స్, సికింద్రాబాద్‌లోని ఆర్ఆర్సీ రైల్వే గ్రౌండ్స్‌లో పార్కింగ్ కేటాయించారు. పటిష్ట బందోబస్తు నిరసనకారులతో సహా అనుమతి లేని వారెవ్వరూ అసెంబ్లీ వైపు దూసుకురాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు బుధవారం బందోబస్తు విధుల్లో దాదాపు ఆరు వేలకు పైగా సిబ్బంది పాల్గొంటారు ఉస్మానియా యూనివర్శిటీ చుట్టపక్కల ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శాసనసభ పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు నగర వ్యాప్తంగా పకడ్బందీ నిఘా, పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అసెంబ్లీ, సచివాలయం చుట్టూ రెండు కిమీ పరిధిలో బారికేడ్లు, పికెట్లు, కంచె ఏర్పాటు చేస్తున్నారు కీలక కూడళ్లలో పికెట్లతో పాటు మధ్య మండల పరిధిలోని ప్రాంతాల్లో 20, నగరంలో 35 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న చోటికి అనుమానితులు ప్రవేశించకుండా అసెంబ్లీకి 3 కి.మీ. పరిధి వరకు నిఘా ఉంచేలా కార్డన్ ఏరియాలు, ఇంటరప్షన్ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు -
ఏపీఎన్జీవోల ధర్నాకు షరతులతో అనుమతి
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించదలచిన ధర్నాకు షరతులతో కూడిన అనుమతి లభించింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ముగించాలని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. పదివేలకు మించి ధర్నాకు రాకూడదని, ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ధర్నాను ఇందిరాపార్క్‌కు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. -
గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ తెలుగు గాయకుడు గజల్ శ్రీనివాస్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏపీఎన్జీవో సభలో జాతీయ గీతాన్ని కించపరిచారని ఆరోపణల కింద అతనిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏపీ ఎన్జీవోలు సెప్టెంబర్ నెలలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించినృ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సభకు ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభకు అనుమతించటం, సభలో ఆయన ప్రసంగించడంపై వివాదం రాజుకుంది. అప్పటి సభలో జాతీయ గీతాన్ని శ్రీనివాస్ అవమానపరిచారంటూ ఫిర్యాదు నేపథ్యంలో అతనిపై కేసు నమోదైంది. -
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే: ఆశోక్‌బాబు
-
సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మ దహనం
బెల్లంపల్లిరూరల్, న్యూస్‌లైన్: విభజన ముసాయిదా బిల్లు ప్రతులను భోగిమంటల్లో వేయడాన్ని నిరసిస్తూ సోమవారం బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద తెలంగాణ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవో, సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ బిల్లు ప్రతులను దహనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రపతిని అవమానించడమేనని అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలను సీమాంధ్రులు మానుకుని ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు సహకరించాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ జిల్లాల్లో నివసిస్తున్న సీమాంధ్రులను తెలంగాణ పొలిమేర వరకు తరిమికొడతామని హెచ్చరించారు. అంతకుముందు పాతబస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కీర్తి నరసింగరావు, కొండబత్తిని రాంమోహన్, పోతరాజు నారాయణ, చంద్రశేఖర్, శ్రీనివాస్, మల్లేశ్, రాజన్న పాల్గొన్నారు. అశోక్‌బాబు దిష్టిబొమ్మ ద హనం ఏదులాపురం : తెలంగాణ బిల్లు ప్రతుల దహనాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు దిష్టిబొమ్మను టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సోమవారం జేఏసీ దీక్ష శిబిరం ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా నాయకుడు జంగిలి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు ప్రతులు చించివేయడం రాజ్యాంగ విరుద్ధమని, అశోక్‌బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర అవకాశవాదులు ఎన్నికుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని అన్నారు. అశోక్‌బాబు ఉద్యోగిగా వ్యవహరించాలని కానీ ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు బండారి సతీశ్, గోలి శంకర్, ఎర్రం నర్సింగ్‌రావు, శ్రీపతి శ్రీనివాస్, తిరుపతి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బాల శంకర్‌కృష్ణ పాల్గొన్నారు. -
విభజన పీడ పోవాలని...
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: విభజన పీడ తొలగిపోవాలని కోరుతూ ఏపీ ఎన్జీవో నాయకులు తెలంగాణ నోట్ బిల్లు ప్రతులను భోగిమంటల్లో దహనం చేశారు. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ అశోక్‌బాబుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బిల్లు ప్రతులు దహనం చేసిన అనంతరం ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మచిలీపట్నం ఎంపీ కే నారాయణరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేదని, ఒకరి నాయకత్వాన్ని మరొకరు ఒప్పుకోరన్నారు. ఎన్జీవోలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భోగి రోజు ఇంట్లోని పనికిరాని వస్తువులను తగులబెడుతుంటారని, ప్రజలమధ్య చిచ్చుపెట్టిన టీ నోట్ బిల్లును ద హనం చేయడాన్ని సమర్ధించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సోనియాగాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సభలో ఎవరేమన్నారంటే... రావణకాష్టాన్ని రగిల్చారు: దారా సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు రాష్ట్రంలో విభజన అనే రావణకాష్టాన్ని రగిల్చి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించారని మాజీ శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దారా సాంబయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలికి రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు తెలుసా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సెకండ్ ఎస్సార్సీ ఏర్పాటు చేయాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. తప్పుడు రిపోర్టుతో రోశయ్యను భయపెట్టారు: కరణం బలరాం, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిరాహారదీక్ష సమయంలో తెలంగాణ కు చెందిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు తప్పుడు రిపోర్టు ఇచ్చి భయపెట్టారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. తెలంగాణ ఉద్యమం రాజకీయ నిరుద్యోగులు చేసిందని, సీమాంధ్రలో ప్రజల నుంచి ఉద్యమం వచ్చిందన్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తా : మాగుంట తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. మాలో సఖ్యత లేదు, సమైక్యత అంతకంటే లేదు. ఇది నిజమన్నారు. పార్లమెంటులో బిల్లు ఓడించిన తరువాత నిజమైన సంక్రాంతి చేసుకుందామన్నారు. కాళ్లు పట్టుకొని మద్దతు కోరతాం: కందుల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని జాతీయ పార్టీల నాయకుల కాళ్లు పట్టుకొని మద్దతు కోరతామని మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి తెలిపారు. విభజన జరిగితే జిల్లా తీవ్రంగా నష్టపోతుందన్నారు. విభజన చరమాంకంలో ఉన్నాం: చలసాని శ్రీనివాసరావు, మేధావుల ఫోరం వేదిక కన్వీనర్ విభజన ప్రక్రియకు సంబంధించి చరమాంకంలో ఉన్నామని మేధావుల ఫోరం వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు తన గుండెను చూపించి కాల్చమన్న ధీరశాలి ప్రకాశం పంతులు అని, ఆయన నివసించిన ప్రాంతం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడనివారిని చిత్తుగా ఓడించాలి: విద్యాసాగర్, కృష్ణా జిల్లా ఎన్జీవో అసోసియేషన్ నాయకుడు అసెంబ్లీలో సమైక్యాంధ్రకు కట్టుబడని శాసనసభ్యులను ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కృష్ణా జిల్లా ఎన్జీవో అసోసియేషన్ నాయకుడు విద్యాసాగర్ కోరారు. స్వాతంత్య్ర ఉద్యమం తరువాత అంతస్థాయిలో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ బిల్లు అడ్డుకోవాలి: శ్రీరాం, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకుడు తెలంగాణ బిల్లు అసెంబ్లీ దాటి వెళ్లకుండా అడ్డుకోవాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకుడు శ్రీరాం కోరారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌తో సహా తెలంగాణ , రాయలసీమ, కోస్తాంధ్రలు నష్టపోతాయన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామా చే యాల్సింది: బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణపై నిర్ణయం వెలువడిన వెంటనే సీమాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. టీ నోట్ మరణశాసనం : అబ్దుల్ బషీర్, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మరణశాసనంగా మారిన టీ నోట్‌ను అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌బషీర్ కోరారు. ఈనెల 17 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న శాసనసభ సమావేశాల్లో ఏకవాక్య తీర్మానంతో టీ నోట్‌ను తిప్పిపంపాలన్నారు. ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని తిప్పికొట్టాలి: శివరమేష్‌రెడ్డి, లోక్‌సత్తా రాష్ట్ర నాయకుడు రాష్ట్ర విభజనకు సంబంధించి ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని తిప్పికొట్టాలని లోక్‌సత్తా రాష్ట్ర నాయకుడు అల్లు శివరమేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. విభజనకు సంబంధించి శాసనసభ్యులకు గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజలమధ్య వైషమ్యాలు పెంచారన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్రనాయకుడు బత్తిన నరసింహారావు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు,డాక్టర్స్ జేఏసీ నాయకుడు రాజేంద్రప్రసాద్, సమైక్యాంధ్ర పరిరక్షణ నాయకుడు లంకా దినకర్, ఉపాధ్యాయ సంఘ ం తరఫున వెంకటరావు, న్యాయవాదుల తరఫున సిరిగిరి రంగారావు, ఆర్టీసీ తర ఫున కోటేశ్వరరావు, కాలేజస్ తర ఫున గోరంట్ల రవికుమార్, విద్యార్థుల తరఫున ఆర్ జగదీష్ పాల్గొన్నారు. -
భోగి మంటల్లో టీ నోట్ దహనం నేడు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన సెగను భోగి రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తాకేలా ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ ఏర్పాట్లు చేసింది. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కేంద్రం తెచ్చిన టీ నోట్ బిల్లును సోమవారం భోగి మంటల్లో దహనం చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఒంగోలులోని పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌ను వేదికగా చేసుకొంది. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టీ నోట్‌ను దహనం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు హాజరవుతున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ శ్రీరాం హాజరవుతున్నారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భోగి మంటల్లో టీ నోట్ దహనం గురించి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ వెల్లడించారు. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించిందన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా విభజించిందన్నారు. విభజన వల్ల కలిగే నష్టాల గురించి వివిధ రూపాల్లో నిరసనలు తెలపడంతోపాటు 66 రోజులపాటు నిరవధిక సమ్మెకు దిగినా కేంద్రం ధోరణి మారలేదన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. భోగి మంటల్లో టీ నోట్ దహనం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని అబ్దుల్‌బషీర్ కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు, రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ శ్రీరాం, కో చైర్మన్ శ్రీనివాస్, లంకా దినకర్, ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు బండి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, నాసర్‌మస్తాన్‌వలి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ నాయకుడు చెంచయ్య, టీచర్స్ అసోసియేషన్ నాయకుడు వెంకటరావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్, ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకుడు గోపాల్, లాయర్ల జేఏసీ నాయకుడు సిరిగిరి రంగారావు, విద్యార్థి జేఏసీ నాయకుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
చర్చకు అంగీకరిస్తే.. విభజనకు ఒప్పుకున్నట్టే
తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోండి అశోక్‌బాబుపై ఉద్యోగుల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా చర్చించాలని ఏపీఎన్జీవోలు చెప్పడాన్ని ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. బిల్లుపై చర్చకు అంగీకరిస్తే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లేనని స్పష్టంచేశారు. చర్చను అడ్డుకునే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామంటూ ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని అశోక్‌బాబుకు వారు హితవు పలికారు. చర్చ జరపడానికి సహకరించాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేయడం.. విభజనకు అంగీకరించమని చెప్పినట్టేనని, ఇలా చెప్పడం సమైక్యవాదానికి ద్రోహం చేసినట్లేనని ఉద్యోగులు, వివిధ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. వారి అభిప్రాయాలివీ.. చర్చిస్తే విభజనను ఆమోదించినట్లే రాష్ట్ర అసెంబ్లీలో విభజన అంశం గురించి చర్చిస్తే దానిని ఆమోదించినట్లే. ముఖ్యమంత్రి సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉన్నప్పుడు చర్చ అనవసరం. చర్చ లేకుండా సమైక్యాంధ్ర కోసం తీర్మానం చేయాలి. ఈ విషయంలో వైఎస్ విజయమ్మ సూచన బాగుంది. - అబ్దుల్ బషీర్, ఏపీఎన్జీవో అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఆ పాపాన్ని ఉద్యోగులు మోయడమెందుకు? ‘‘రాష్ట్ర విభజన చేస్తున్నది కాంగ్రెస్... విభజన చేయమని చెప్పింది టీడీపీ. ఆ పార్టీలే చర్చను కోరుకుంటున్నాయి. విభజనకు సహకరిస్తున్నాయి. టీ-బిల్లుపై చర్చించడం ద్వారా రాష్ట్ర విభజనను అంగీకరించినట్లే. విభజనను వ్యతిరేకించే ఏ పార్టీ అయినా, ఎమ్మెల్యే అయినా.. టీ-బిల్లును వ్యతిరేకించాల్సిందే. సమైక్య తీర్మానం చేశాక చర్చ జరిగితే.. విభజనకు ఆమోదం తెలిపినట్లు ఉండదు. విభజనకు సహకరిస్తున్న కాంగ్రెస్, టీడీపీ చెబుతున్న మాటలు.. ఉద్యోగుల నోట పలకడాన్ని సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు అంగీకరించరు. కాంగ్రెస్, టీడీపీ పాపాన్ని ఉద్యోగులు మోయడం ఎందుకు?’’ - గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టు పెట్టవద్దు ‘‘ఇది విభజనకు వ్యతిరేకంగా పార్టీలే ఏకం కావాల్సిన సమయం. రాజకీయాల్లో తలదూర్చి ఉద్యమాన్ని తాకట్టుపెట్టకూడదు’ - సుబ్రమణ్యం, సహకార శాఖ జేఏసీ నేత సీఎం అడుగుజాడల్లో అశోక్‌బాబు అశోక్‌బాబు తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు చేస్తున్నట్లు అర్థమవుతోంది. వైఎస్సార్సీపీ డిమాండ్ చేసినట్లు అసెంబ్లీలో తీర్మానం పెడితేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. ‘సమైక్య’ తీర్మానం ప్రవేశ పెట్టాలని వైఎస్సార్ సీపీ కోరడం తప్పా? సమైక్యం అంటేనే అరెస్ట్ చేస్తారా..?’ - దేవరాజ్, అనంతపురం జిల్లా ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు తీర్మానానికి పట్టుబట్టకుంటే ద్రోహమే ‘‘అశోక్‌బాబు హద్దులుమీరి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు వంతపాడుతున్నారు. సమ్మె విరమణ తర్వాత.. మీడియా ముందు ప్రకటనలు చేయడం తప్ప అశోక్‌బాబు చేసిందేమీ లేదు. చర్చకు అంగీకరిస్తే విభజనకు ఒప్పుకున్నట్టే. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేశాకే మిగతా విషయాలపై మాట్లాడాలి’’ - వెంకట్రామిరెడ్డి, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు -
సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటించండి
ఒంగోలు, న్యూస్‌లైన్: సీఎం కిరన్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదే అయితే సమైక్యపోరాటంలో ఉద్యోగులు పాల్గొన్న కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవుగా తక్షణమే ప్రకటించి సమైక్యవాది అని నిరూపించుకోవాలని ఏపీఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బషీర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో భవనంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నవారికి తమ మద్దతు నిత్యం ఉంటుందన్నారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఇచ్చిన పిలుపునకు స్పందించి జిల్లాలో కూడా సమైక్య పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈనెల 10వ తేదీ హైదరాబాదులో నిర్వహించే సమైక్య సదస్సుకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు కదులుతున్నట్లు తెలిపారు. ఐఆర్ ఇస్తే సరికాదని, పీఆర్సీని, హెల్త్ కార్డుల విషయంలో పెడుతున్న ఇబ్బందులను కూడా సీఎం పరిష్కరించాలన్నారు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు రాజకీయ జేఏసీని కూడా ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సమైక్య ఎజెండాతో రాజకీయ జేఏసీలోకి రావాలన్నారు. తమ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు ఇస్తే ఈనెల 16 వ తేదీలోపు చలో అసెంబ్లీకి సైతం సిద్ధమని ప్రకటించారు. జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర చాంపియన్ అని సీఎం ప్రకటించుకుంటే సరిపోదని, బచావత్ ట్రిబ్యునల్ వల్ల జరిగిన నష్టంతోపాటు అన్ని విషయాలపైనా సుదీర్ఘ చర్చ జరగాలని, టీనోట్‌ను ఏవిధంగా అయితే రాష్ట్రానికి కేంద్రం పంపిందో...అదే విధంగా తిప్పి కొట్టాలని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్జీవో సంఘ ఎన్నికల్లో ఓటమిని తాము క్రీడాస్ఫూర్తిగా తీసుకుంటున్నామని, అశోక్‌బాబు నిర్ణయాలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్టు, కంటింజెంట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరశింహారావు , ఎన్జీవో సంఘ నాయకులు శరత్‌బాబు, స్వాములు, మాలకొండయ్య, శ్రీనివాసరావు, చెంచయ్య, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యమ’ నామ సంవత్సరం
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్:జిల్లాలో ఈ ఏడాది ఉద్యమ పిడికిళ్లు బలంగా బిగుసుకున్నాయి. నినాదాలతో వీధి వీధీ హోరెత్తిపోయింది. ప్రధానంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఊళ్లకు ఊళ్లు పాల్గొని పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. దీనికి తోడు ఉద్యోగుల ఆందోళనలు కూడా భారీ ఎత్తున జరి గాయి. ఇవన్నీ కలిసి ఈ ఏడాదిని ‘ఉద్యమ నామ సంవత్సరం’గా మార్చేశాయి. సమైక్యాంధ్ర ఉద్యమం... జిల్లాలో జరిగిన ఉద్యమాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం అతి పెద్దది. జూలై ఒకటిన ప్రారంభమైన ఈ ఉద్యమం వినూత్న రీతిలో దాదాపు రెండు నెలల పాటు ఏకధాటిగా కొనసాగింది. సామాన్యులే నాయకులుగా మారి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వీరితో పాటు అన్ని ఉద్యోగ సంఘాల వారూ పోరాటంలో పాలు పంచుకున్నారు. అయితే అన్ని చోట్లా శాంతియుతంగానే ఉద్యమం జరగడం జిల్లాకు ఉన్న మంచిపేరును మరోసారి చాటి చెప్పింది. ఒక్క విజయనగరంలోనే కాసింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. విధ్వంసకర సంఘటనలు... అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్జీఓలు ఎంపీలు, మంత్రులకు చెందిన ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించారు. 4వ తేదీన మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి ఇళ్లను ఎన్జీఓలు ముట్టడించారు. అయితే ఉద్యమం ఎంతకీ చల్లారకపోవడంతో కలెక్టర్ 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. అక్టోబర్ 5న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులు బొత్స ఇంటి వద్ద బందోబస్తును పర్యవేక్షిస్తున్న అప్పటి ఎస్పీ కార్తికేయ, అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. అదే రోజు సాయంత్రం సమైక్యాంధ్ర ఉద్యమకారులు బొత్సకు చెందిన ఆస్తులు, కళాశాలల ధ్వంసానికి పాల్పడ్డారు. బొత్స సొదరుడికి చెందిన సత్య టెలివిజన్ చానల్ కార్యాలయానికి ఆందోళన కారులు నిప్పుపెట్టడంతో పూర్తిగా కాలిపోయిది. బొత్స మేనల్లుడు చిన్నశ్రీను ఇంటి పై ఆందోళన కారులు దాడికి యత్నించారు. అలాగే మద్యం దుకాణాలు, ఇతర షాపులపై కూడా దాడి చేశారు. డీసీసీబీ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయంలో ఫైళ్లకు నిప్పంటించారు. కర్ఫ్యూ... సమైక్యాంధ్ర ఉద్యమం హింసాత్మకంగా మారుతోందని భావించిన పోలీసులు జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ పెట్టారు. రాష్ట్ర బలగాలతోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఇద్దరు ఐజీలు, ముగ్గురు డీఐజీలు, ఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించారు. కర్ఫ్యూ తర్వాత అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లో చావబాదారు. ప్రజల ఇళ్లల్లోకి చొరబడి మరీ అరెస్ట్‌లు చేశారు. జీ(వి)తాల కోసం... జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనాలు అమలు చేయాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాదంతా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు కనీస వేతనాలు అమలు చేయాలని ఉద్యమాలు చేశారు. 108 ఉద్యోగులు 33 రోజులపాటు సమ్మె చేశారు. జూలై 18న కేంద్రాస్పత్రి ఎదుట 108 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సమ్మె ప్రారంభించారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగస్టు 23న సమ్మెను ముగించారు. కంప్యూటర్ టీచర్లు, వీఆర్ఏలు, అంగన్వాడీలు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని ఆందోళనలు చేపట్టారు. ధరల దరువు విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: ఉల్లి కోయకుండానే కన్నీరు పెట్టించింది. వంగ దొరక్కుండా బెంగ పడేలా చేసింది. బంగాళాదుంప బంగారంతో పోటీ పడేట్లు కనిపించింది. మరోవైపు గ్యాస్ దిమ్మలు బరువెక్కాయి. విద్యుత్ బిల్లులు షాకిచ్చాయి. మొత్తానికి 2013లో ధరలు దరువేశాయి. సామాన్యుడికి అందకుండా నిత్యావసరాలు పైపైకి పరుగులు తీశాయి. దీనికి తోడుగా పెట్రో ధరలు మాటి మాటికీ పెరిగి ‘ధరల పెరుగుదల’ అనే మాటను సామాన్యం చేసేశాయి. వరుస తుఫాన్ల కారణంగా కూరగాయల ధరలు కూడా మండిపోయాయి. స్మార్టఫోన్లు, సిమ్‌కార్డులు వంటివి మాత్రం అందుబాటులోకి వచ్చాయి. రికార్డులు బద్దలుగొట్టిన ‘ఉల్లి’ ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని నిట్టనిలువునా కూల్చేసిన ఉల్లి ఈ ఏడాదీ తన విలువను పెంచుకుంది. ఒకానొక దశలో రూ.70 పెడితే గానీ కిలో ఉల్లి దొరకలేదు. ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపట్టకపోవడం వల్ల నెల నుంచి రెండు నెలలు ఇదే ధర కొనసాగింది. దీనికి తోడు వరుస తుఫాన్లు కూరగాయల పంటలను సర్వనాశనం చేశాయి. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగాయి. బంగాళాదుంపలు కిలో రూ.60, బీన్స్ ధర రూ.90 వరకు పెరిగింది. చిక్కుడు, టమోటా, క్యారెట్ ధరలు రూ.60 వరకు పెరిగాయి. దీంతో చాలా మంది కూరగాయలు జోలికి వెళ్లలేదు. గత ఏడాది కూరగాయలకు నెలకు రూ.400 నుంచి రూ.500 ఖర్చయితే ఈ ఏడాది నెలకు రూ.1000 నుంచి రూ.1100 వరకు ఖర్చయింది. సన్న బియ్యం ధరలూ... సన్న బియ్యం ధరలు ఈ ఏడాది బాగా పెరిగాయి. 2012లో రూ.35 ఉన్న ధర ఈ ఏడాది రూ.45 నుంచి రూ.50కు చేరింది. కేవలం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నెలకు రూ.3వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సన్న బియ్యంలో అతి తక్కువ ధర గల రూ.38 నుంచి రూ.40 ఉన్న బియ్యంతో రైతులు సరిపెట్టుకున్నారు. పప్పుల ధరలు కూడా పెరిగాయి. కందిపప్పు రూ.65 నుంచి రూ.75కు పెరిగింది. లీటరు ఆయిల్ రూ.60 నుంచి రూ.70 అయింది. రిఫండ్ ఆయిల్ రూ.80 నుంచి రూ.100 అయింది. ‘గ్యాస్’ మంటలు ప్రభుత్వం ఈ ఏడాది గ్యాస్ ధరలను పెంచేసి కట్టెల పొయ్యిలను మళ్లీ సామాన్యుడి దగ్గరకు చేర్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీని ఎత్తివేయడంతో రూ.440 ఉన్న గ్యాస్ ధర రూ.1100 అయింది. ఆధార్ కార్డు ఉన్న వారికి రాయితీ నగదును బ్యాంకులో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ప్రక్రియ ప్రహసనంగా మారింది. బాబోయ్ పెట్రో ధరలు ఈ ఏడాది పెట్రోల్ ధరలు దాదాపు పదిసార్లు పెరిగాయి. డీజిల్ ధరలు పద్నాలుగు సార్లు పెరిగాయి. ఒకే ఏడాదిలో ఇన్ని సార్లు పెరగడం రికార్డు అనే చెప్పాలి. రూ.73 ఉన్న పెట్రోల్ లీటరు ధర రూ.78 అయింది. డీజిల్ ధర రూ.51.35 నుంచి రూ.58.6కు పెరిగింది. అవీ... ఇవీ... ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ఏడాది రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే కొబ్బరి, బాణసంచా ధరలు కూడా పెరగడంలో పోటీ పడ్డాయి. బైక్‌లు, కార్ల ధరలూ పెరి గాయి. అయితే బంగారం మాత్రం కాస్త తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర 2012 డిసెంబర్లో *30,570 ఉంటే ఈ ఏడాది డిసెంబర్‌కు 29,340 ఉంది. -
ఉద్యోగవర్గపోరు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యం కోసం కలిసిన చేతులు కత్తులు దూస్తున్నాయి. ఒకే స్వరంతో నినదించిన గొంతులు అపస్వరం పలుకుతున్నాయి. ఏపీఎన్జీవోల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు రెండుగా చీలిపోవడంతో వర్గపోరు మొదలైంది. స్థానిక ఎన్జీవో హోం దీనికి వేదికైంది. రాష్ట్ర నేతల సమక్షంలోనే చొక్కాలు పట్టుకున్నారు. పరస్పర నెట్టుకున్నారు. కేకలు వేశారు. మీ సంగతి చూస్తామంటే.. మీ సంగతి చూస్తామంటూ సవాళ్లు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకునేందుకూ ప్రయత్నించారు. ఈ పరిస్థితి చూసి రాష్ట్ర నాయకులు బిత్తరపోతే.. జిల్లా నాయకులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. దీనికి కారణం గెజిటెడ్ అధికారుల ఓట్లేనని అంటున్నారు. ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తీరుతో సంఘంలో నిప్పు రాజుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం జరిగిన ఘర్షణ ఈ ఆరోపణలను బలపరుస్తోంది. జనవరి 5న జరగనున్న ఎన్జీవో ఎన్నికల్లో అశోక్‌బాబు, బషీర్ ప్యానళ్లు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూని యన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పోటీలో ఉన్న షేక్ అబ్దుల్ బషీర్, సత్యనారాయణలు శ్రీకాకుళం ఎన్జీవో హోంకు వచ్చారు. ముఖ్య నాయకులతో మాట్లాడిన తరువాత అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించారు. మాటలతో యుద్ధం మొదలు.. సమావేశం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి, ఎన్జీవో సంఘ సభ్యుడు ఉంకిలి శ్రీనివాస్ మాట్లాడుతూ అశోక్‌బాబు ఉద్యోగులను మోసం చేశారని, సమైక్య ఉద్యమాన్ని నీరు గార్చారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా విఫలమయ్యారన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు 15 మంది ఉద్యమంలో పాల్గొనలేదని, వారే ప్రస్తుతం గెజిటెడ్ ఉద్యోగులయ్యారని, వారి ఓటును తొలగించాలని సూచించారు. జిల్లాలో పురుషోత్తంనాయుడు నాయకత్వాన్ని బలపరుస్తున్నామని, అయితే అశోక్‌బాబు తీరు బాగులేనందున, రాష్ట్రస్థాయిలో ఆయన్ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని అశోక్‌బాబు వర్గీయులు చల్లా శ్రీనివాస్, ఆర్.వేణులు శ్రీనివాస్‌ను నిలదీసే ప్రయత్నం చేశారు. ఇంతలో శ్రీనివాస్ సహచరుడు, ఎన్జీఓ సభ్యుడు వేణు జోక్యం చేసుకొని స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకుందని, అడ్డుకునేందుకు మీరెవరని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చొక్కాలు పట్టుకున్నారు. హోం లోపలి నుంచి బయట ఆవరణలోకి వచ్చి కొట్టుకునే ప్రయత్నం చేశారు. దాంతో నాయకులు జోక్యం చేసుకొని ఇరువర్గాల వారికి సర్ది చెప్పారు. ఒక వర్గాన్ని లోపలికి, రెండో వర్గాన్ని బయటకు తీసుకుపోయారు. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. నాన్ గెజిటెడ్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు వారికి ఓటు హక్కు లభించిందని, ఇప్పుడు వారు గెజిటెడ్ ఉద్యోగులైనందున ఓటు హక్కు తొలగించాలని కోరడంలో తప్పేమిటని ఉంకిలి శ్రీని వాస్ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించినందుకే తనపైన, తన సహచరుడిపైన దాడికి ప్రయత్నించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్జీవోల్లో కలకలం ఎన్జీవో హోంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాటం చేస్తున్న ఉద్యోగులు ఐక్యంగా ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి.. వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ఉద్యమాన్ని నీరు గార్చేందుకు యత్నించడం సబబు కాద ని, దీన్ని సహించబోమని పలువురు ఉద్యోగులు అంటున్నారు. కాగా అశోక్‌బాబు వర్గీయులే ప్రణాళిక ప్రకారం ఎన్జీవోల్లో చీలిక తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
'అశోక్ సమైక్య ఉద్యమాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు'
సమైక్య ఉద్యమాన్ని ఏపీఎన్జీవో అధ్యక్షుడుగా అశోక్ బాబు నీరుగార్చారని ఏపీఎన్జీవో రెండో ప్యానల్ నేతలు బషీర్, సత్యనారాయణలు ఆరోపించారు. ఆదివారం వారిరువురు అశోక్ బాబుపై నిప్పులు చెరిగారు. సమైక్య ఉద్యమంలో రాజకీయ పార్టీలను కలుపుకోని పోవడంలో అశోక్‌బాబు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషిస్తున్న దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వస్తే ఆయన పర్యటనను అడ్డుకుంటామని గతంలో అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రావడం అయింది, వెళ్లటం అయింది కానీ ఆయన్ని అశోక్ బాబు అడ్డుకున్నదాఖలాలు లేవని వారు ఉదాహరించారు. అలాగే టి.బిల్లు అసెంబ్లీకి వస్తే ముట్టడిస్తామని, మెరుపు సమ్మెకు దిగుతామని గతంలో అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో ఏ ఒక్కటి అశోక్ బాబు చేయలేదని ఆయన వ్యవహారశైలీని బషీర్, సత్యనారాయణలు ఎండగట్టారు. సొంత ప్రయోజనాల కోసం సమైక్య ఉద్యమాన్ని అశోక్ బాబు వాడుకున్నారని వారు ఆరోపించారు. అందుకే అశోక్ బాబుకు వ్యతిరేకంగా పోటీకి దిగినట్లు వారిరువురు తెలిపారు. తప్పుడు ఓటర్ల జాబితాతో ఏపీఎన్జీవో ఎన్నికల్లో... అశోక్‌బాబు అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అశోక్ బాబు ఎంత ఖర్చు చేసిన నిజాయితీపరులైన ఎన్జీవోలు తమ వైపే ఉన్నారని వారు పేర్కొన్నారు. -
ఎన్జీఓ అధ్యక్ష బరిలో బషీర్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒంటెత్తు పోకడలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సంఘ ప్రస్తుత అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబును ఓడించేందుకు వైరి వర్గాలన్నీ ఏకమయ్యాయి. ఎన్జీఓ సంఘ అధ్యక్షునిగా నిరంకుశంగా వ్యవహరిస్తున్న అశోక్‌బాబుకు చెక్ పెట్టేందుకు మొట్టమొదటగా ప్రకాశం జిల్లాలోనే తిరుగుబాటు మొదలైంది. ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు, పూర్వ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బషీర్, ఎన్జీఓ సంఘ అధ్యక్ష పదవి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అశోక్‌బాబుకు వ్యతిరేక ప్యానెల్లో అధ్యక్ష పదవికి బషీర్ ఆదివారం హైదరాబాద్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. బషీర్‌ను బరిలోకి దించేందుకు అశోక్‌బాబు వ్యతిరేకవర్గమంతా ఏకగ్రీవంగా నిర్ణయించింది. బషీర్ వర్గానికి ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాలరెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్బరామన్, సత్యనారాయణ మరి కొందరు మద్దతు తెలుపుతున్నారు. బషీర్ అనుకూల వర్గ నాయకులు నాలుగు రోజులుగా సీమాంధ్ర ప్రాంతాల్లోకి వివిధ జిల్లాలో పర్యటించి మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. ఎన్నికల్లో గెలుపుపై బషీర్వర్గం ధీమాగా ఉంది. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర శాఖ పరిధిలో మొత్తం 16 జిల్లా యూనిట్లున్నాయి. ఈ యూనిట్లలోని పాలకవర్గ సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. అదే విధంగా ఈ 16 జిల్లా యూనిట్లలోని తాలూకాల అధ్యక్ష, కార్యదర్శులకు రాష్ట్ర నూతన పాలకవర్గ ఎన్నికల్లో ఓట్లున్నాయి. అంటే మొత్తం సుమారు వెయ్యి మంది ఓటర్లున్నారు. 8 యూనిట్లు పూర్తిగా, మరో యూనిట్లో సగం బలం ఇప్పటికే కూడగట్టామని ఎన్నికల నాటికి తమ బలం మరింత పెరుగుతుందని బషీర్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. బషీర్‌కు మద్దతుగా రాజధానికి పయనం ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్ష పదవికి ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్న బషీర్‌కు మద్దతుగా జిల్లా నుంచి ఎన్జీఓ నాయకులు బస్సుల్లో హైదరాబాద్ తరలివెళ్లారు. ఎన్నికల అధికారిగా జిల్లా ఎన్జీఓ సంఘ మాజీ అధ్యక్షుడు చెల్లి హనుమంతరావు వ్యవహరిస్తున్నారు. బషీర్ వర్గానికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లావాసి బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా మద్దతు తెలిపారు. మరికొన్ని ప్రభుత్వ శాఖల రాష్ట్ర సంఘాలు కూడా బషీర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్థానిక ప్రకాశం భవనం నుంచి శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ఎన్జీఓలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. -
'ఏపీ ఎన్జీఓల పోరాటానికి టిడిపి క్షేత్ర స్థాయిలో మద్దతు ఉంటుంది'
-
అశోక్‌బాబు రాజకీయ ప్రవేశానికే అఖిలపక్షం: ఏపీఎన్జీవోలు
ఏపీఎన్జీఓల అఖిలపక్ష సమావేశంపై తమ జిల్లా నేతలెవ్వరికీ సమాచారం లేదని ప్రకాశం జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బషీర్ తెలిపారు. ఈ సమావేశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎప్పుడో నిర్వహించాల్సిన అఖిలపక్ష సమావేశాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నారని, సమైక్య ఉద్యమం మొదలైనప్పుడే ఇలాంటి సమావేశం జరగాలని ఆయన చెప్పారు. ఏపీఎన్జీవో ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నాయనగా ఇప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని బషీర్ ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమం ఒక్కసారిగా పడిపోవడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. సమైక్య ఉద్యమం, ఉద్యోగుల డిమాండ్ల సాధనలో ప్రస్తుత నాయకత్వం విఫలమైందని, సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో నాయకులు తెరచాటు రాజీకీయాలు నడిపారని బషీర్ ఆరోపించారు. సమైక్య ఉద్యమాన్ని మళ్లీ ఉద్దృతంగా నడపాలని ఉద్యోగులంతా కోరుతున్నారన్నారు. ఉద్యమంలో రాజకీయ నాయకులందర్నీ కలుపుకుపోతామని, ఏపీఎన్జీవో ఎన్నికల్లో తమ ప్యానెల్ నిలబడుతోందని వివరించారు. అలాగే, ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాన్ని ఉద్ధృతంగా తీసెకెళ్లాల్సిన సమయంలో ఏపీఎన్జీవో ఎన్నికలు ప్రకటించారని, అందరూ సమైక్యంగా ఉండాల్సిన సమయంలో అశోక్‌బాబు ఎన్నికల ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారని నెల్లూరు ఏపీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌బాబు తెలిపారు. ఉద్యమం నీడన లబ్ధిపొందే ఎత్తుగడలో భాగంగానే అశోక్‌బాబు దొడ్డిదారిని ఎంచుకున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అంటరాని వాటిగా చూశారని, ఉద్యమాన్ని గొప్పగా నడిపే అవకాశాన్ని అశోక్‌బాబు ఎప్పుడో వదులుకున్నారని రవీందర్‌బాబు మండిపడ్డారు. రాజకీయనాయకులకు, ఉద్యోగుల మధ్య పెద్ద అగాధాన్ని అశోక్‌బాబు సృష్టించారని, తన రాజకీయ ప్రవేశం కోసం, పొలిటికల్ మైలేజీ కోసం ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని వేదికగా ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. అఖిలపక్ష సమావేశానికి వచ్చిన రాజకీయ పార్టీల లక్షణాలను, లక్ష్యాలను పరిశీలించి చూడాలని, అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రవిభజనలో ప్రధాన భూమిక కాంగ్రెస్ పార్టీదేనని, విభజనకు లేఖ ఇచ్చిన పార్టీ టీడీపీ ప్రతినిధులు అఖిలపక్షంలో రోజూ చేసే భజనే చేస్తారని రవీందర్రావు అన్నారు. పూర్తిగా రాష్ట్ర విభజనకే సై అన్న బీజేపీని అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పిలిచారో ఏపీ ఎన్జీవో నేతలకే తెలియాలని, ఉద్యోగులకు ఇలాంటి నేతలు ఉండడం తమ దౌర్భాగ్యమని రవీందర్‌బాబు వాపోయారు. సమైక్యం కోసం మొదటనుంచీ పోరాడుతున్న వైఎస్సార్సీపీ, సీపీఎం, ఎంఐఎం లేకుండా ఏ అఖిలపక్ష సమావేశానికీ పరిపూర్ణతరాదని ఆయన అన్నారు. రాజకీయ రంగప్రవేశానికి అశోక్‌బాబు ఆడుతున్న నాటకం, డ్రామాలో భాగమే ఈ అఖిలపక్ష సమావేశమని ఆయన చెప్పారు. సమైక్య ఉద్యమం తగ్గిపోవడానికి అశోక్‌బాబే కారణమని ఏపీ ఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు పి.వి.సత్యన్నారాయణ ఆరోపించారు. సమైక్య రాష్ట్రం కోసం అకుంఠిత దీక్షతో పోరాడతామని, నాయకత్వ మార్పుతో తిరిగి ఉద్యమం ఉద్ధృతం అవుతుందని ఆయన అన్నారు. -
త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు: అశోక్‌బాబు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను ప్రజాసంఘాలకు ఇవ్వాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. తాము సాగిస్తున్న సమైక్య ఉద్యమానికి ఏపీఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు అడ్డురావన్నారు. రాజకీయ పక్షాలు ఏపీఎన్జీవోను ప్రభావితం చేయలేవని దీమా వ్యక్తం చేశారు. త్వరలో సమైక్య పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. వైఎస్ జగన్‌ను కలిసి అఖిలపక్షానికి ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశానికి వచ్చేది, లేనిది.. వైఎస్ జగన్ ఇష్టమన్నారు. రాజకీయ లబ్ధికోసమే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక ప్రకారం అసెంబ్లీని ముట్టడిస్తామని అశోక్‌బాబు తెలిపారు. -
'తెలంగాణపై ముందుకెళ్తే మెరుపు సమ్మె'
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రక్రియపై ముందుకెళ్తే మెరుపు సమ్మె చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. అవసరమైతే చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకునేందుకు వెనకాడబోమని ఆయన పునరుద్ఘాటించారు. విభజనను నిరసిస్తు 66 రోజులు సమ్మె చేశామని ఆయన గుర్తు చశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతున్న ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులను తమ పదవులను వీడకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర మంత్రుల అనుసరిస్తున్న వైఖరి సిగ్గు చేటు అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. -
కనీస వేతనం రూ.15 వేలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 15 వేలుగా, గరిష్ట వేతనం రూ.1.35 లక్షలుగా నిర్ధారించాలని ఏపీఎన్జీవోలు పదో వేతన సవరణ సంఘానికి ప్రతిపాదించా రు. ఉద్యోగులందరికీ 50 శాతం మధ్యంతర భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము పంపిన నివేదికలపై వివరణ ఇచ్చేందుకు వారు సోమవారం సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ పీకే అగర్వాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. 80 అంచెలు, 32 గ్రేడుల విధానంలో వేతనాలు చెల్లించాలని, వచ్చే నెల 15లోగా పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు ఇస్తున్న రాయితీలను పెంచాలని, హెచ్ఆర్ఏను హైదరాబాద్‌లో 30 శాతం, జిల్లా కేంద్రాల్లో 20 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా ఇంకా ఉత్తర్వులు రాలేదన్నారు. పింఛను చెల్లింపులో కేంద్ర విధానాన్ని అనుసరించాలని, ఉద్యోగుల పిల్లలకు ఎడ్యుకేషన్ రీయింబర్స్మెంట్ కింద నెలకు రూ.100 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో కచ్చితంగా పనిచేయాల్సిన కాలవ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని, మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవులు ప్రకటించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను బేషరతుగా వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఉ ద్యోగ సంఘాలతో భేటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌కు గెజిటెడ్ హోదా ఇవ్వాలి రాష్ట్రంలోని డిప్యూటీ తహసీల్దార్లకు గెజిటెడ్ హోదా కల్పించాలని ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ పదో పీఆర్సీని కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో సంఘం ప్రతినిధులు సోమవారం సచివాలయంలో పీఆర్సీ అధ్యక్షుడు అగర్వాల్‌ను కలిశారు. అనంతరం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ... 20 శాఖల విధులను నిర్వర్తిస్తున్న రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సు చెల్లించాలని పీఆర్సీకి విన్నవించినట్టు చెప్పారు. ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన వీఆర్వోలను గ్రేడ్- 1 గా గుర్తించి జూనియర్ అసిస్టెంట్ స్కేలు వర్తింపజేయాలని కోరామన్నారు. పీఆర్సీని కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఎస్ శివకుమార్, కోశాధికారి అంజి ప్రసాదరావు, కె. ఎల్.నరసింహారావు, బి. వెంకయ్య తదితరులున్నారు. -
ఏపీఎన్జీఓల సమ్మె పై నేడు హై కోర్టు తీర్పు
-
యూపీఏకు ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవాలి: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు వెంటనే యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోవాలంటే కేంద్ర ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఎంపీలు రాష్ట్రపతిని కలిసి మద్దతు ఉపసంహరణ లేఖలు అందజేయాలని పేర్కొన్నారు. త్వరలోనే సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పేరును రిజిష్టర్ చేయిస్తున్నామని, తాత్కాలిక కార్యకవర్గం సోమవారం సమావేశమై చర్చించిందన్నారు. వేదిక ద్వారా 7వ తేదీ నుంచి 15వరకూ ఆందోళన కార్యాచరణను ప్రకటించారు. జీఓఎం ఏర్పాటుకు నిరసనగా 7న జిల్లాల్లో నిరసన ర్యాలీలు, 8న సర్వమత ప్రార్థనలు, 9న మహిళల ఆధ్వర్యంలో ర్యాలీలు, 11న కొవ్వొత్తుల ర్యాలీలు, 12న భోజన విరామ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన లు, 13న ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు, బస్సులకు స్టిక్కర్లు అతికించడం, 14న నెహ్రూ జయంతిన విద్యార్థుల ర్యాలీలు, 15న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ర్యాలీలు, 16న భారీ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీని వేదిక, ఇతర వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు. సమావేశంలో చలసాని శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతినిధులు చంద్రశేఖరరెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ దురుద్దేశంతోనే అఖిల పక్ష భేటీ:అశోక్ బాబు
అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తే సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారించిందని ఆయన ఆరోపించారు. విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహర తీరును ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని అశోక్ బాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మెను పలుచన చేయవద్దని పలువురు నేతలకు అశోక్‌బాబు విజ్ఞప్తి చేశారు. తాము చేపట్టిన సమ్మెను తత్కాలికంగా విరమించామని అంతేకాని శాశ్వతంగా సమ్మె విరమించినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తామే కనుక మాట్లాడితే ... నాయకుల చరిత్రను బయటకు తీయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్ని పార్టీల నిర్ణయంతోనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళ్ల లేదని తెలిపారు. ఆర్టికల్ 370 (1) డీపై సంగతి తెలితేనే విభజనపై స్పష్టత వస్తుందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే అఖిల పక్ష భేటీని మరోసారి కేంద్రం ఏర్పాటు చేసిందని అశోక్ బాబు ఆరోపించారు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్
సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినదిస్తూ వరుసగా 91వ రోజూ సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఎన్జీవోల నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తిరుపతిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వోద్యోగులు మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మదన పల్లెలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు అంబేద్కర్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. వీఆర్వోలు ఢిల్లీ పెద్దల మాస్క్‌లు ధరించి నిరసన తెలిపారు. వారిని గోనె సంచుల్లో మూటలుగా కట్టి విసిరి పారవేసినట్టుగా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యాంధ్రప్రదేశ్‌గానే ఉంచాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ విజయనగరం జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయడు ఆధ్వర్యంలో విజయనగరంలో ‘సేవ్ ఏపీ’ అనే అక్షరాల రూపంలో కూర్చొని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు ర్యాలీ చేశారు. అనంతరం మోకాళ్లపై నిలబడి శాడిస్టు సోనియా డౌన్‌డౌన్ అని నినాదాలు చేశారు. పామిడిలో సమైక్యవాదులు మౌనదీక్ష కొనసాగించారు. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో జేఏసీ నాయకులు వరదనీటిలో జలదీక్ష చేశారు. గన్నవరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులో, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కావలిలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. -
సమ్మె కాలానికి సీమాంధ్ర ఉద్యోగులకు స్పెషల్ అడ్వాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్న సీవూంధ్ర ఉద్యోగులకు స్పెషల్ అడ్వాన్స్ చెల్లించేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సమ్మెలో ఉన్నప్పటి పనిదినాల ఆధారంగా అడ్వాన్స్‌ను నిర్ధారించింది. ఏపీఎన్జీఓల సంఘం విజ్ఞప్తిమేరకు స్పెషల్ అడ్వాన్స్ చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వులో స్పష్టం చేసింది. 60 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు సమ్మెలో పాల్గొన్న వారికి రెండు నెలల జీతాన్ని, 45 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు పాల్గొన్న వారికి నెలన్నర జీతం, 30 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు పాల్గొన్న వారికి నెల జీతాన్ని స్పెషల్ అడ్వాన్సుగా చెల్లించనున్నట్టు పేర్కొంది. తిరిగి ఆ మొత్తాన్ని ఒకే విడతలో రికవరీ చేసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, ఏపీఎన్జీవోల సంఘం ప్రతినిధులు సోవువారం హైదరాబాద్‌లో వుుఖ్యవుంత్రి కిరణ్కువూర్రెడ్డితో సవూవేశమై, జీవో నంబర్ 177 ప్రకారం తవు సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం వుుఖ్యవుంత్రి పరిశీలనలో ఉంది. దీనిపై వుుఖ్యవుంత్రి సానుకూలంగా నిర్ణయుం తీసుకున్న పక్షంలో, ఉద్యోగుల సమ్మెకాలానికి చెల్లించే స్పెషల్ అడ్వాన్స్‌ను ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ కింద సర్దుబాటు చేయుడానికి అవకాశం ఉంటుంది. -
దీపావళిలోగా ఐఆర్ చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి వెంటనే చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరాయి. ఎన్నోరోజులుగా పెండింగ్‌లో ఉన్న పదో పీఆర్సీ అమలు, హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని విన్నవించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం వేర్వేరుగా సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సమాఖ్య, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ, యునెటైడ్ టీచర్స్ ఫెడరేషన్, రాష్ట్రోపాధ్యాయ సంఘం తదితర సంఘాల నేతలు వీరిలో ఉన్నారు. మధ్యంతర భృతి (ఐఆర్), వేతన సవరణ కమిటీ (పీఆర్సీ), హెల్త్‌కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సంబంధిత డిమాండ్లపై సీఎం పూర్తి సానుకూలంగా స్పందించినట్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 50 శాతం మధ్యంతర భృతిని దీపావళిలోగా చెల్లించాలని ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ నేత అశోక్‌బాబు డిమాండ్ చేశారు. 2008లో తొమ్మిదో పీఆర్సీ వేసిన మూడు నెలల్లోగానే (అక్టోబర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో) ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ చెల్లించిందని, ఇప్పుడు కూడా అక్టోబర్ నెలలోనే చెల్లించాలని అన్నారు. పీఆర్సీని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు చేసిన 66 రోజుల సమ్మె కాలాన్ని డ్యూటీ పీరియడ్‌గా క్రమబద్ధీకరించాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. సమ్మెపై హైకోర్టులో ఉన్న కేసు విషయమై కూడా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి ఉద్యోగులపై సానుభూతి ప్రదర్శించాలని విన్నవించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్‌కార్డుల అంశంలో ప్రభుత్వం తమతో చర్చిస్తున్న అంశాలకు, డ్రాఫ్ట్‌లో పొందుపరుస్తున్న అంశాలకు పొంతన లేదని, తాము సూచించిన అంశాలు డ్రాఫ్ట్‌లో లేకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఎస్టీయూ నేత కత్తి నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కాగా ఉద్యోగుల డిమాండ్లను వారం రోజుల్లో పరిష్కరించాలని, 45 శాతం ఐఆర్‌ను వెంటనే చెల్లించాలని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు యు.మురళీకృష్ణ కోరారు. సకలజనుల సమ్మె వల్ల తెలంగాణ ఉద్యోగులు 42 రోజులు, సమైక్యాంధ్ర సమ్మె వల్ల సీమాంధ్ర ఉద్యోగులు 66 రోజుల జీతాలను నష్టపోయారని, వీరి పట్ల సానుభూతితో వీలైనంత ఎక్కువ భృతి వెంటనే చెల్లించాలని ఉపాధ్యక్షుడు నరేందర్‌రావు విన్నవించారు. ఇలావుండగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఉద్యోగులు తమ అభిప్రాయాలు, సమస్యలను విన్నవించుకునేందుకు వీలుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను రాష్ట్రపతి, ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రవిభజనకు పూనుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. -
సీమాంధ్ర ఉద్యోగులకు రెండు నెలల అడ్వాన్సు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. వారికి రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించటంతో ఇందుకు మార్గం సుగమమైంది. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏపీ ఎన్జీవోలతో పాటు పలు శాఖల ప్రభుత్వోద్యోగులు 66 రోజులు సమ్మెలో పాల్గొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించాల్సిందిగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. 60 రోజులను గానీ, 45 రోజులను గానీ పరిగణనలోకి తీసుకుని అడ్వాన్సు చెల్లించాలని ఆర్థిక శాఖకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది. నిర్ణయం కోసం ఫైలును మూడు రోజుల క్రితం సీఎం కార్యాలయానికి పంపింది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లే హడావుడిలో ఆయన దానిపై ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి, రెండు నెలలను పరిగణనలోకి తీసుకోవాలని మళ్లీ కోరారు. సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆఫీస్ బేరర్ల సమావేశంలోనూ దీనిపై చర్చించారు. రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తీర్మానించారు. దీపావళి వస్తున్నందున రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా ఇవ్వాలని సోమవారం సాయంత్రం పొద్దుపోయాక సీఎం నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉత్తర్వు వెలువడవచ్చు. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. విభజన కోసం తెలంగాణకు చెందిన ప్రభుత్వోద్యోగులు గతంలో సమ్మె చేసినప్పుడు ఒక నెల జీతాన్ని ప్రభుత్వం అడ్వాన్సుగా ప్రకటించడం తెలిసిందే. ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినప్పుడు కూడా, దసరా దృష్ట్యా వెంటనే విధుల్లో చేరిన వారందరికీ ప్రభుత్వం వెంటనే అడ్వాన్సు చెల్లించింది. -
వానలోనూ ‘ఒక్కటే’ నినాదం
సాక్షి నెట్వర్క్ :ఎడతెరిపిలేకుండా వర్షం పడుతున్నప్పటికీ సమైక్యాంధ్ర కోసం సీమంధ్రులు తమ నినాదాన్ని మాత్రం పక్కకు పెట్టలేదు. గురువారం 86వ రోజూ తమ ఉద్యమాన్ని కొనసాగించారు. తుపానుతో తాము ఏం కోల్పోయిన దానికంటే రాష్ర్టం విడిపోతేనే ఎక్కువ బాధ కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపుమేరకు విశాఖ కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు మధ్యాహ్న భోజన విరామసమయంలో నిరసన వ్యక్తం చేశారు. భీమిలిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సభ్యులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద రెవెన్యూ, జెడ్పీ, వివిధ శాఖల ఉద్యోగుల ప్రదర్శన నిర్వహించారు. రైతులు 50 ట్రాక్టర్లతో దువ్వ గ్రామం నుంచి ర్యాలీగా తణుకు చేరుకుని మానవహారం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో అయ్యప్ప మాలధారులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా నల్లమాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఎస్కేయూ విద్యార్థులు జాతీయ రహదారిపై 86 ఆకారంలో కూర్చొని ఆందోళన చేశారు. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, తనకల్లు, కనగానపల్లి, ఉరవకొండలో విద్యార్థులు ర్యాలీలు చేశారు. తలకిందులుగా తపస్సుచేసయినా రాష్ట్రాన్ని కాపాడుకుంటామంటూ నాగాయలంకలో గురువారం జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. పలువురు తలకిందులుగా నిలబడి జైసమైక్యాంధ్ర, తెలంగాణ వద్దు-సమైక్యాంధ్ర ముద్దంటూ నినాదాలు చేశారు. విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఎన్జీవోలు, ఇరిగేషన్ ఉద్యోగులు భోజనవిరామ సమయంలో ధర్నా చేశారు. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు హైస్కూల్ విరామ సమయంలో పాఠశాల ముందు నుంచి ఉపాధ్యాయులు ధర్నా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరులో జెడ్పీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వెంకటగిరిలో రాత్రి 7 గంటల ప్రాంతంలో జేఏసీ నేతలు గొడుగులతో ర్యాలీ నిర్వహించారు. -
సీఎంకు రెండు నెలల వేతనం అడ్వాన్స్ ఫైలు
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలకు రెండు నెలల వేతనం అడ్వాన్స్‌కు సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదంకోసం ఆర్థిక శాఖ పంపించింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఏపీఎన్జీవోలు సీమాంధ్ర జిల్లాల్లో 66 రోజులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. సమ్మె ఉపసంహరణ సందర్భంగా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో ఎన్ని నెలలు వేతనం అడ్వాన్స్ కావాలనే అంశాన్ని ఏపీఎన్జీవోలు పేర్కొనలేదు. తరువాత ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విడిగా 2 నెలల వేతనం అడ్వాన్స్‌గా ఇవ్వాలని ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ అధికారులు బుధవారం ఏపీఎన్జీవోలకు వేతనం అడ్వాన్స్‌కు సంబంధించిన ఫైలును ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పంపించారు. సంబంధిత ఫైలులో ఎన్ని నెలలు అడ్వాన్స్ ఇవ్వాలనే విషయాన్ని ప్రతిపాదించకుండా మంత్రికి పంపారు. సమ్మె ఉపసంహరణ ఒప్పందంలో రెండు నెలల వేతనం అడ్వాన్స్ కోరనందున మంత్రి ఆనం సంబంధిత ఫైలును సీఎం నిర్ణయం కోసం పంపించారు. ఇప్పుడు సీఎం తీసుకునే నిర్ణయంపై ఏపీఎన్జీవోలకు రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలా లేక నెల అడ్వాన్స్ ఇవ్వాలా అనేది ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు. గురువారం సీఎం నిర్ణయం తీసుకుంటే వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. మధ్యంతర భృతి ఫైలును పీఆర్సీకి పంపించాం: మంత్రి ఆనం రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతికి సంబంధించిన ఫైలును పదో వేతన సవరణ సంఘానికి పంపించినట్లు ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర జిల్లాల్లోను, సచివాలయంలోను ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో పీఆర్సీ నివేదిక విషయంలో జాప్యం జరిగిందన్నారు. అయితే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మధ్యంతర భృతి కావాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో సంబంధిత ఫైలును పీఆర్సీకి పంపించామని, అక్కడినుంచి వచ్చాక సీఎం స్థాయిలో ఎంత శాతం మధ్యంతర భృతి ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
జాతీయనేతల కాళ్లు పట్టుకుంటానికి వెనుకాడం:అశోక్ బాబు
కాకినాడ:రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునేందుకు అవసరమైతే జాతీయ నేతల కాళ్లు పట్టుకుంటామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం జీతాలు వదులుకుని ఉద్యమించామని తెలిపారు. మరలా ఇటువంటి పరిస్థితి వస్తే తమ వేతనాలను వదులుకోవడానికి వెనుకాడమన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలని రెండు నెలలకు పైగా ఉద్యమించామని,.తాము మరలా ఉద్యమించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాల చేసి ఉద్యమంలో వస్తారా?అని ప్రశ్నించారు. తాము ప్రజాభిమానానికి అమ్ముడు పోయామని, తమపై ఆరోపణలు చేసే రాజకీయ నేతలు చేతనైతే దాన్ని కనుక్కోండని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునే క్రమంలో అవసరమైతే జాతీయ నేతల కాళ్ల పట్టుకుంటానికి వెనుకాడమన్నారు. -
'ప్రజాభిప్రాయాన్ని కాదని విభజిస్తే సివిల్ వార్ తప్పదు'
నాగార్జున సాగర్: అసెంబ్లీకి తీర్మానం వస్తుందో.. రాదో చెప్పలేని వారు దేశాన్ని ఏమి ఉద్ధరిస్తారని ఏపీఎన్జీవోల నేత అశోక్ బాబు మండిపడ్డారు. సమైక్య ఉద్యమంలో నేతలు కొట్టుకుపోతారని ఆయన విమర్శించారు. నాగార్జున్ సాగర్ లో ఏర్పాటు చేసి సభలో అశోక్ బాబు ప్రసంగించారు. ప్రజాభిప్రాయాన్ని కాదని విభజిస్తే సివిల్ వార్ తప్పదని ఆయన హెచ్చరించారు. పార్టీ ఆఫీసుల్లో కుర్చుని లేఖలు రాస్తే విభజన జరిగిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు. పరిపాలించమని మాత్రమే ఓటేశామని.. విడదీయమని కాదని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రజలందరిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని అశోక్ బాబు సవాల్ విసిరారు. ప్రస్తుతం పాలిస్తున్న పాలకులకు అసెంబ్లీ తీర్మానం వస్తుందో..రాదో తెలియడం లేదని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. ఇరు ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తీర్చి..రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు పార్లమెంట్ కు ఉందని విచక్షణ కోల్పోయి విభజించడం సరికాదన్నారు. -
సమైక్యతపై చేతులెత్తేసిన సీఎం కిరణ్
హైదరాబాద్: సమైక్యతపై తాను ఎటువంటి హామీ ఇవ్వలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారు. ఏపీ ఎన్జీఓ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. తన చేతిలో ఏమీలేదని, కేంద్రం తరపున ఎటువంటి హామీ ఇవ్వలేనని చెప్పారు. ఆర్టికల్ 371(డి)పై కేంద్రంతో మాట్లాడతానన్నారు. 2014 వరకు రాష్ట్రం విడిపోదని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై జీఓఎంను కలవండని చెప్పారు. విభజనను అడ్డుకునే ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నానన్నారు. సమ్మె విరమించాలని కోరారు. తాను కూడా మీతో కలిసి ఉద్యమం చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చలు ముగిసిన అనంతరం ఏపీఎన్జీఓ నేతలు అంతర్గతంగా సమావేశమయ్యారు. కొందరు సమ్మె విరమించడానికి సంసిద్ధత తెలుపుతుంటే, మరికొందరు సమ్మె కొనసాగించాలని అంటున్నారు. సమావేశం ముగిసిన తరువాత వారు తమ నిర్ణయం ప్రకటిస్తారు. -
ప్రభుత్వ చర్చలకు హాజరవుతాం:ఏపీఎన్జీవోలు
-
'దిగ్విజయ్ , షిండేల విరుద్ధ ప్రకటనల వెనుక ఉద్దేశ్యమేమిటి?
హైదరాబాద్: విభజన అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ ఓ ప్రకటన చేస్తే..కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మరో ప్రకటన చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్ధం కావడం లేదని ఏపీ ఎన్జీవోలు ప్రశ్నించారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వీరికి రాజ్యాంగ పరమైన అహగాహన ఏమీ లేనట్లుందని ఎద్దేవా చేశారు. ఈ రకంగా ముందుకెళితే కాంగ్రెస్ కు సీమాంధ్రలో రాజకీయ భవిష్యత్ ఉండదని ఏపీఎన్జీవోలు మండిపడ్డారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన జీఎంవో విధానం లోప భూయిష్టంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. విభజనను అడ్డుకుంటామంటున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. సమైక్యాంధ్ర కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. . విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏపీఎన్జీవోలు ఎమ్మెల్యేలకు లేఖలు విడుదల చేశారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో కేంద్ర కార్యాలయాల ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ నెల 13, 14 తేదీల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను కలిసి సమైక్య నినాదం వినిపించాలని కోరతామన్నారు -
'స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమం'
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. రేపు సీఎం కిరణ్‌తో చర్చలు జరుపుతామన్నారు. అనంతంర తమ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అలాగే తాము మరోసారి ఉద్యోగ సంఘాలన్నింటితో చర్చలు జరుపుతామన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సొంత జిల్లా విజయనగరంలో జరిగిన దాడులను అశోక్‌బాబు ఈ సందర్భంగా ఖండించారు. ఈ నెలాఖరున న్యూఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జాతీయ నాయకులను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగగా జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో ఆ ప్రాంతంలో అంధకారం అలుముకుందన్నారు. కరెంటు కష్టాలతో సీమాంధ్ర ప్రజలు అల్లాడుతుంటే ఎంపీలు ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని అశోక్‌బాబు పేర్కొన్నారు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో సీఎం కిరణ్ చర్చలు జరుపుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీల ఇళ్ల ముందు ధర్నాలు నిర్వహిస్తాన్నారు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 10వ తేదీన భీమవరం పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అశోక్‌బాబు వెల్లడించారు. -
ఎవడ్రా సమైక్యాంధ్ర అంటోంది
-
ఏపీఎన్జీవోలకు క్షమాపణ చెప్పిన హర్షకుమార్
ఏపీఎన్జీవో నాయకులపై తన కుమారులు అనుసరించిన వైఖరి పట్ల అమలాపురం ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ఏపీఎన్జీవోల నాయకులకు ఈ సందర్భంగా హర్షకుమార్ క్షమాపణలు చెప్పారు. రాజమండ్రిలోని తమ కాలేజీ ఎప్పటి నుంచో మూసివేశామని ఆయన తెలిపారు. తమ కుటుంబమంతా సమైక్య ఉద్యమంలో పాల్గొంటుందని ఆయన ప్రకటించారు. తనను లక్ష్యంగా చేసుకొవడాన్ని సంఘ విద్రోహుల చర్యగా ఆయన అభివర్ణించారు. -
ఏపీఎన్జీవో నేతపై హర్షకుమార్ తనయుల దాడి
రాజమండ్రి నగరంలో అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్కు చెందిన రాజీవ్ గాంధీ కళాశాలను సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు శనివారం ముట్టడించారు. ఆ సమయంలో అక్కడ కట్టిన హర్షకుమార్ ఫ్లెక్సీని సమైక్యవాదులు చించేశారు. ఆ ఘటనపై హర్షకుమార్ తనయులు మండిపడ్డారు. అనంతరం వారు ఏపీఎన్జీవో నేతపై దాడి చేశారు. దాంతో ఏపీ ఎన్జీవోలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తు కళాశాలకు చెందిన బస్సులను ధ్వంసం చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
బోసిపోయిన ఒంగోలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై జిల్లా కేంద్రం ఒంగోలుల నగరం భగ్గుమంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, మహిళలు, కార్మికులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ప్రజా ప్రతినిధులకు శాపనార్థాలు పెట్టారు. కేంద్ర మంత్రివర్గం తీరును నిరసిస్తూ శుక్రవారం ఒంగోలు నగరంలో బంద్ విజయవంతమైంది. బంద్ ప్రభావంతో చిరువ్యాపారులు, టీ దుకాణాలు, బడా వ్యాపారసంస్థలు, విద్యా సంస్థలు, సినిమాహాల్లు, కేంద్ర ప్రభత్వు కార్యాలయాలు, బ్యాంక్‌లు పూర్తిగా మూపతడ్డాయి. నగరంలోని ప్రధాన వీధులైన బాపూజీమార్కెట్ కాంప్లెక్స్, గాంధీరోడ్డు, కర్నూల్‌రోడ్డు, ట్రంకురోడ్, అద్దంకి బస్టాండ్ తదితర ప్రాంతాల్లోని షాపులన్నీ స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇక సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. నగరానికి ఇరుపైపులా ఉన్నా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దక్షిణ, ఉత్తర బైపాస్‌తో పాటు, కర్నూల్‌రోడ్, గుంటూరు రోడ్ ప్రాంతాల్లో రోడ్డుపై మానవహారాలు, ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై పెద్ద ఎత్తున టైర్లు తగలబెట్టి వాహన రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. ఆటోలను కూడా అడ్డుకున్నారు. ఎప్పుడూ జన సంచారంతో రద్దీగా ఉండే ఒంగోలు నగర వీధులన్నీ బోసిపోయాయి. ఎన్జీఓ సంఘ నాయకుడు అబ్దుల్‌బషీర్ మాట్లాడుతూ ఉద్యోగులు 65 రోజులుగా తమ జీతాలు వదులుకొని రాష్ట్ర సమైక్యత కోసం పాటుపడుతుంటే కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఆగ్రహం తెప్పించేలా ఉందన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించని కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో రాజకీయ సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా తమ పదవులకు రాజీనామాలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎన్జీఓ నాయకులు బండి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, స్వాములు, కృష్ణారెడ్డి, శరత్, మస్తాన్‌వలి, ప్రకాశ్ పాల్గొన్నారు. కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు నగరంలో కదం తొక్కారు. బైక్ ర్యాలీగా నగరంలోని ప్రధాన వీధుల వెంట తిరుగుతూ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే భవిష్యత్‌లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థుల రాస్తారోకో సమైక్యాంధ్రకు మద్దతుగా పేర్నమిట్ట శ్రీప్రతిభా విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు కర్నూల్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహన రాకపోకలు భారీ స్థాయిలో నిలిచిపోయాయి. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రతిభా విద్యాసంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రజలను మోసం చేస్తున్న ఎంపీ సమైక్యాంధ్రకు మద్దతుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేయని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా మాయమాటలు చెప్తూ జిల్లా వాసులను మోసం చేస్తున్నారని, ఇప్పటికైనా తీరు మార్చుకొని పదవికి రాజీనామా చేయకపోతే భవిష్యత్‌లో పదవే లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా నగరంలోని దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం సాక్షిగా ఎంపీ శ్రీనివాసులరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ఎంపీ ఢిల్లీ పెద్దలకు లొంగి పదవికి రాజీనామా చేయకపోవడం దురదృష్టకరమని పలువురు సమైక్యవాదులు వ్యాఖ్యానించారు. -
తిరుమలకు వాహనాలు బంద్
సాక్షి, తిరుపతి/తిరుమల : తిరుమలకు శుక్రవారం సమైక్యసెగ తాకింది. తెలంగాణ నోట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ రెండు ఘాట్ రోడ్లలో ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు వాహనాలను అడ్డుకున్నారు. అలిపిరిలో రాస్తారోకో చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన అంకురార్పణ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు. వాహనాలను పైకి పోనివ్వకపోవడంతో వారందరూ అలిపిరిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. టీటీడీ అధికారులు ఉదయం నుంచి రెండో ఘాట్ రోడ్డులో వినాయకుని ఆలయం వద్ద నుంచి రాకపోకలు సాగిస్తూ, సిబ్బందిని తిరుమలకు తరలిస్తుండగా.. ఆందోళనకారులు బస్సుల టైర్లకు గాలి తీసేశారు.పోలీసులు కూడా తిరుమలకు వెళ్లలేకపోయారు. బ్రహ్మోత్సవాలకు వాలంటీర్లుగా వెళ్లాల్సిన 200మంది స్కౌట్స్, గైడ్సు వాహనాలు లేక నడిచి వెళ్లారు. సాయంత్రం ఆరుగంటలకు తిరుమల రహదారిని పునరుద్ధరించారు. శనివారం ఉదయం 7 గంటలకు తిరిగి వాహనాల రాకపోకలను అడ్డుకుంటామని ఏపీ ఎన్జీవోల నాయకులు తెలిపారు. కాగా, బంద్ ప్రభావం తిరుమలలో స్పష్టంగా కనిపించింది. రద్దీ తక్కువగా ఉండడంతో ఆలయంలో లఘు దర్శనం అమలు చేశారు. ఆలయ ప్రాంతం భక్తులు లేక బోసిపోయింది. భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించలేం: టీటీడీ ఈవో గోపాల్ బంద్ పరిస్థితుల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణపరంగా అదనపు ఏర్పాట్లు చేయలేమని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ, మలుపులతో కూడిన ఘాట్ రోడ్లలో కొత్తగా ప్రైవేట్ వాహనాలను తీసుకొచ్చి ప్రయాణం కల్పించే అవకాశాల్లేవన్నారు. కొత్తవారిని ఘాట్ రోడ్డు ప్రయాణానికి అనుమతిస్తే అనుకోని ఘటనలు జరిగే అవకాశముందని తెలిపారు. తిరుమలలో నిలిచిపోయిన భక్తులకు 48 గంటల కాలపరిమితి దాటినా గదులకు ఎలాంటి అపరాధ రుసుమూ వసూలు చేయబోమన్నారు. -
బెజవాడలో రహదారులు దిగ్బంధనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విజయవాడ నగరంలోని సమైక్యవాదులు, ఏపీఎన్జీవోల ఆగ్రహాం కట్టలు తెంచుకొంది. దాంతో శుక్రవారం ఉదయం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై గొల్లపూడి వద్ద వారు రాస్తారోకో నిర్వహించారు. దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల్ని భారీగా నిలిచిపోయాయి. అలాగే బెంజి సర్కిల్‌తోపాటు ఆ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాం వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దాంతో అటు మచిలీపట్నం, ఇటు ఏలూరు వైపు నుంచి వచ్చే వాహానాలు జాతీయ రహదారిపై బారులు తీరాయి. వీటితోపాటు బుడమేరు వంతెనపై సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు సంయుక్తంగా నూజివీడు - విజయవాడ రహదారిపై బైటాయించారు. దాంతో నూజివీడు నుంచి విజయవాడ వైపు, విజయవాడ నుంచి నూజివీడు వైపు వెళ్లే వాహనాలు బారీగా నిలిచిపోయాయి. -
సమైక్య సభకు అనుమతించాలి: అశోక్‌బాబు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సమైక్య సభ నిర్వహించే హక్కు అందరికీ ఉందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఎవరు సభ పెట్టినా ప్రభుత్వం అనుమతించాలని ఆయన సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం సభకు వెళ్లాలా, లేదా అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్పీకర్‌కు రాజీనామాలు ఇచ్చినా సీమాంధ్ర ఎంపీల ఇళ్ల వద్ద ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీకి ఎలాంటి అధికారం లేదని, కేవలం పార్టీ కమిటీ మాత్రమేనని.. అలాంటి కమిటీకి తాము ఎలాంటి నివేదిక ఇవ్వబోమని తెలిపారు. రేపు అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్దకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఎంపీలు రాజీనామాలే చేయడమే కాకుండా అధికార హోదా వదులుకుని నియోజకవర్గాలకు రావాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. -
సమ్మె కొనసాగిస్తాం : అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మెను కొనసాగించేందుకు సీమాంధ్ర ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు సిద్ధమయ్యాయి. ఇక నుంచి ఆందోళనను ఉధృతం చేయాలని, రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించాయి. సమైక్యంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు, ఎంత కాలమైనా సమ్మె కొనసాగించడానికి సిద్ధమని ప్రకటించాయి. ఈ మేరకు 11వ తేదీవరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. దాదాపు 150 ఉద్యోగ, కార్మిక సంఘాలు, పలు ప్రజా సంఘాలతో కూడిన ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమావేశం సోమవారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. భేటీ అనంతరం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు.. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎన్ఎంయూ సీమాంధ్ర నేతలు ప్రసాద్, రమణారెడ్డి, మోహన్, ఈయూ నేత దామోదరరావు తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. - అక్టోబర్ 15 వరకు ఉద్యోగ, కార్మిక వర్గాలన్నీ సమ్మె కొనసాగిస్తాయి. 15న మళ్లీ అన్ని సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తారు. - రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న చిరుద్యోగులు, కార్మికులకు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు ఇప్పించడానికి ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నించాలి. ఉద్యమంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యోగులు తమవంతు సహకారం అందించాలి. - చర్చలకు రమ్మని ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా.. మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలో చర్చలకు వెళ్లడం వల్ల ఫలితం లేదు. సమస్యలు తెలుసుకొనే స్థాయిలో కాకుండా.. వాటిని పరిష్కరించగలిగే స్థాయిలోనే చర్చలు జరగాలి. అందువల్ల ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిగితేనే వెళ్లాలి. - ఆంటోనీ కమిటీ కేవలం పార్టీ కమిటీనే. దానికి ప్రాధాన్యత లేదని దిగ్విజయ్‌సింగ్ పరోక్షంగా చెప్పారు. అందువల్ల దానికి నివేదిక ఇవ్వకూడదు. - పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి విధించిన గడువు పొడిగించాలి. దసరా సెలవులు లేకుండా సిలబస్ పూర్తి చేయాలి. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి కార్యాచరణ నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాలు కూడా సమైక్య ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. వారూ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం వల్ల కేంద్రం మీద ఒత్తిడి పెరిగింది. అందుకే ఎంపీల రాజీనామాలు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారు. కార్యాచరణ ఇదీ.. ఊఅక్టోబర్ 2న గాంధీ విగ్రహాలు ఉన్న చోట్ల శాంతి ర్యాలీలు, నిరసన దీక్షలు ఊ3, 4 తేదీల్లో 48 గంటలపాటు సీమాంధ్రలోని ఎంపీల ఇళ్ల ముందు ధర్నాలు, దీక్షలు. అక్కడే వంటావార్పూ కూడా చేపడతారు. ధర్నాల్లో వేలాది మంది ఉద్యోగులు పాల్గొనే విధంగా జిల్లా స్థాయిలో ప్రణాళిక రూపొందించాలి ఊ5న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహదారుల దిగ్బంధం.. 5, 6 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్స, పెట్రోల్ బంక్‌ల బంద్ ఊ7, 8 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల దిగ్బంధం.. వాటి ముందు ధర్నాలు ఊ9, 10, 11 తేదీల్లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ధ ధర్నాలు. జాతీయ నాయకులను కలిసి విభజనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురమ్మని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం -
'దిగ్విజయ్ హామీ మేరకు సమ్మె విరమించాలి'
హుజూర్నగర్: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ హామీ మేరకు ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడినా ఆంధ్ర ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉండవని ద్విగిజయ్ అన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అక్టోబర్ మొదటి వారంలో కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తుందన్నారు. సీడబ్ల్యుసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీని కలిపి ఉమ్మడి రాజధానిగా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్ట 217 చదరపు కిలోమీటర్లు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ 950 చ.కిలోమీటర్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ 7,200 చ.కిలోమీటర్లు ఉందన్నారు. వీటిలో 217 చ.కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్టను మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేయాలని, దానికి సంబంధించిన నోటును తాను వ్యక్తిగతంగా తయారు చేసి మ్యాప్‌లతో సహా హోంశాఖకు వివరించానని చెప్పారు. ఈ మేరకు సీడబ్ల్యుసీ తీర్మానంలో కూడా ఇదే విషయం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ విషయంలో ఏ ఇతర ప్రతిపాదనలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని వివరించినట్లు చెప్పారు. తాను 610 జీవో చైర్మన్‌గా పనిచేసిన అనుభవం దృష్ట్యా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఏపీ ఎన్జీవోలకు ఎటువంటి సమస్యలు ఉండవని, వెంటనే సమ్మె విరమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: ఏపీ ఎన్జీవోలు
సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆలస్యమయ్యే కొద్దీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి బుధవారం ఏపీ ఎన్జీవోల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా రాజీనామాలు చేసి రాజకీయాలకతీతంగా ఉద్యమంలోకి రావాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. తమ ప్రసంగాలపై అభ్యంతరాలుంటే చర్చకు సిద్ధమని ప్రకటించారు. తమ నాలుకలు కోస్తామంటూ తెలంగాణ నాయకులు చేస్తున్న హెచ్చరికలను ఖండించారు. ‘నాలుకలు కోస్తే మూగవాళ్లం అవుతాం. కాళ్లు విరగ్గొడితే వికలాంగులమవుతాం. కళ్లు పీకేస్తే అంధులం అవుతాం. మేం ఏమైనా, మమ్మల్ని ఏం చేసినా సరే సమ్మెను కొనసాగించి తీరతాం. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం’ అని స్పష్టంచేశారు. ‘మా నాలుకలు కోయాలంటే మా దగ్గరకు రావాలి. మా దగ్గరకు వస్తే మేం చేతులు ముడుచుకుని కూర్చోం’ అని అన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తమ ప్రాంత ప్రజల మనోభావాలూ దెబ్బతింటాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. హిందూపురం సభలో తమ మాటలను వక్రీకరించారని ఆరోపించారు. హైదరాబాద్ అందరిదీ అనే అర్థంలోనే తాము మాట్లాడామన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రాంతం అంటే తమకు ప్రేమ ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారని, తెలంగాణ నోట్ వచ్చే సమయంలో తాము కూడా దేశ రాజధానికి తరలివెళ్లి ధర్నా చేయాలనే యోచనలో ఉన్నామన్నారు. రేపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఈ నెల 27న ముట్టడించనున్నట్లు ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ వెల్లడించారు. గన్‌ఫౌంఢ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన చేపడితే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఆ రోజున ముట్టడిని పోలీసులు అడ్డుకుంటే 28న జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామన్నారు. -
టీ ముసాయిదా రెడీ అవుతోంది: దిగ్విజయ్
* హోంశాఖ రూపొందిస్తున్న ఈ ముసాయిదా వీలైనంత త్వరగా కేబినెట్ ముందుకు వస్తుంది.. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి పంపుతాం * ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలని చేతులు జోడించి కోరుతున్నా * ప్రైవేటు వ్యవస్థ అంతా నడుస్తున్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు మూసేశారు? * కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి * ఆయన అన్ని ప్రాంతాల బాధ్యతను తీసుకోవాలి * సోనియాతో భేటీ.. రాష్ట్రంలోని పరిస్థితులు, సమైక్య ఉద్యమంపై చర్చ సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ ముసాయిదాను తయారు చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. ఈ ముసాయిదా సాధ్యమైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్పారు. కేబినెట్ ముందుకు వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి పంపుతామన్నారు. అయితే ముసాయిదా ఎప్పట్లోగా కేబినెట్ ముందుకు వచ్చేది తనకు తెలియదని, దీనిపై హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేనే అడగాలని సూచించారు. బుధవారం ఉదయం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో దిగ్విజయ్ భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, సీమాంధ్ర ఉద్యమాలపై వివరణ ఇచ్చారు. ఎంపీలు, కేంద్ర మంత్రుల రాజీనామా అంశాలపైనా చర్చించారు. ఈ సమావేశం అనంతరం దిగ్విజయ్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముసాయిదాను హోంశాఖ తయారు చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ ముసాయిదా కేబినెట్ ముందుకు వస్తుంది. అనంతరం ఏపీ అసెంబ్లీకి పంపుతారు’’ అని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల సమ్మెపై ప్రశ్నించగా.. ఎన్జీవోలు సమ్మె విరమించాలని చేతులు జోడించి కోరుతున్నా నని అన్నారు. ఉద్యోగుల ప్రతి సమస్యను వినేందుకు, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదే సమయంలో సమ్మె జరుగుతున్న తీరుపై ఘాటుగా స్పందించారు. ‘‘ఉద్యోగుల సమ్మెతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు దుకాణాలు, పాఠశాలలు, వైద్యశాలలు, రవాణా వ్యవస్థ మొత్తం నడుస్తోంది. ప్రైవేటు వ్యవస్థ అంతా నడుస్తున్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు మూసేశారు? మేం అందరి అభ్యంతరాలు వినేందుకు సిద్ధంగా ఉన్నాం. అందరి క్షేమాన్ని చూసుకుంటాం. మీరు విధుల్లోకి రండి. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి సమస్యను పరిష్కారిస్తాం’’ అని పేర్కొన్నారు. అందరూ ఎన్నుకుంటే సీఎం అయ్యారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంత పక్షపాతిగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను కొందరు విలేకరులు దిగ్విజయ్ వద్ద ప్రస్తావించగా ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘ఆయన సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అన్ని ప్రాంతాల వారు కలిసి ఎన్నుకుంటే సీఎం అయ్యారు. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల బాధ్యతను ఆయన తీసుకోవాలి’’ అని సూచించారు. కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నందునే జగన్‌కు బెయిల్ వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను కొందరు విలేకరులు ప్రస్తావించగా.. ‘‘జగన్‌తో కాంగ్రెస్ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుంటే.. బీజేపీతో టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుందా’’ అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడిన విషయంపై ప్రశ్నించగా.. ‘‘ఎంపీలెవరూ రాజీనామాలు చేయవద్దని కోరుతున్నా. రాజీనామాలతో ఎలాంటి ఫలితం ఉండదు’’ అని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఏపీ పర్యవేక్షణ బాధ్యత రాహుల్‌కు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను ఇక రాహుల్ గాంధీ నేరుగా పర్యవేక్షించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లినందువల్ల రాష్ట్ర వ్యవహారాలను రాహుల్ స్వయంగా చూడనున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలన్నింటినీ అధిష్టానం ముఖ్యులు ఇక రాహుల్ దృష్టికి తీసుకెళతారు. పార్టీ ఉపాధ్యక్షుడి సలహాలు, సూచనల మేరకు ముందుకెళతారు. -
మీరు రాజీనామాలు చేయండి.. మేం విరమిస్తాం!
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా సీమాంధ్ర ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ఎన్జీవోలు స్పష్టం చేశారు. అదేసమయంలో రాజకీయ భవిష్యత్ ఉండాలంటే తమ పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో చేరాలని సీమాంధ్ర ఎంపీలకు సూచించారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డిలు స్థానిక ఏపీ ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘రాజీనామాలు చేస్తే చేసుకోండి’ అన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందకుండా ఉండేందుకు యూపీఏ సర్కారు, లోక్‌సభ స్పీకర్‌ను అందుబాటులో లేకుండా చేసిందని విమర్శించారు. రాజీనామాలకు యూపీఏ భయపడుతోందని విమర్శించారు. ‘సీమాంధ్ర ఎంపీలు ఇప్పుడు ఢిల్లీలో దాక్కోవచ్చు. 2014 ఎన్నికల్లో ప్రజల ముందుకు రాకతప్పదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని హెచ్చరించారు. ఉద్యమం నుంచి తప్పించుకుంటున్న నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ నెల 30 తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ వాళ్లే హైదరాబాద్ విడిచిపెట్టాలన్న వాఖ్యలపై.. హైదరాబాద్ అందరిదీ అని చెప్పడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. సీమాంధ్రలో మంగళవారం జరిగిన బంద్ విజయవంతమైందన్నారు. -
హైదరాబాద్ మాదే! : దేవీప్రసాద్
ఆర్మూర్/ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నాలుగు వందల ఏళ్లుగా తెలంగాణ ప్రాంత ప్రజలు తమ శ్రమశక్తితో నిర్మించుకున్న హైదరాబాద్‌పై వేరెవ్వరికీ హక్కులేదని, ముమ్మాటికీ హైదరాబాద్ తమదేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌పై ఏపీఎన్జీవోలు ఆధిపత్య, దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు సమ్మతమని, లేనిపక్షంలో విస్ఫోటం తప్పదన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల మౌనమే రాష్ట్ర ఏర్పాటులో జాప్యానికి కారణమన్నారు. ఈ నెల 29న జరిగే సకల జనుల భేరిని ఉద్యోగులు విజయవంతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఆత్మగౌరవాన్ని చాటాలని కోరారు. సమావేశం సంఘం కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో పెట్టేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీఎన్జీవోల భేరిలో దేవీప్రసాద్ అన్నారు. -
దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఘర్షణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనరేట్‌లో ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమైక్యాంధ్ర, విభజనకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల మధ్య.. ఇతర శాఖల ఉద్యోగులు వారి ఆందోళనల్లో పాల్గొనవద్దనే ఒప్పందం కుదిరింది. అయితే ఏపీఎన్జీవోలు ఈ ఒప్పందాన్ని మీరి ఇతర శాఖల వారిని పిలిపించుకుని సమ్మె నిర్వహిస్తున్నారంటూ దేవాదాయ శాఖ తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖలోని ఇరుప్రాంతాల ఉద్యోగులు ఒకరినొకరు దూషించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇరు పక్షాలు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. వారు పక్కపక్కనే ఆందోళనలు నిర్వహించడంతో వారి మధ్య తీవ్ర తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఒకరికొకరు తలపడేందుకు యత్నించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనలు విరమించాలని ఇరువర్గాలనూ ఆదేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
సమ్మె మరింత తీవ్రతరం చేస్తాం: అశోక్‌బాబు
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు తమ సమ్మె ఆగదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నట్లు ఆయన వివరించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే కానీ కేంద్ర ప్రభుత్వం దిగిరాదన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ పాటిస్తాయన్నారు. అలాగే ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాయన్నారు. -
ఏపీఎన్జీఓలకు సర్కారు ప్రోత్సాహం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరా ట ఆకాంక్షపై కేంద్రం యూటర్న్ తీసుకు న్నా... హైదరాబాద్‌పై ఇంకేమైనా నిర్ణ యం తీసుకున్నా.. యుద్ధానికి సిద్ధమేనని టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అ న్నారు. సోమవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన టీఎన్జీఓస్ భేరిలో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఉద్యమా ల ఫలితంగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు. ఆ ప్రకటనపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ఆంధ్రప్రదేశ్ సభకు సర్కారే దగ్గరుండి రాచ మర్యాదలు చేసిందని విమర్శిం చారు. ఏపీఎన్జీఓలకు బస్‌లలో బిర్యాని పొట్లా లు, మినరల్ బాటిల్లు అందించిందన్నారు. సభ నిర్వహణ, స్క్రిప్ట్ అంతా ముఖ్యమంత్రి కనుసన్నుల్లో నడిచిందన్నారు.తెలంగాణ ఉద్యోగుల పోరాటం సీమాంధ్ర ప్రజలపై కాదని స్పష్టం చేశారు. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, మండలాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీఎన్జీఓలకు తెలంగాణ ప్రాంతంపై అవగాహన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీఎన్జీఓ అధ్యక్షులు అశోక్‌బాబు ఒక్కటేనన్నారు. చంద్రబాబు రచించిన స్క్రిప్ట్‌ను అశోక్‌బాబు అమలు పరుస్తున్నాడన్నా రు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులపై మొదటి నుంచి వివక్ష కొనసాగుతోందన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల తరబడి పోరాటం కొనసాగిస్తున్నారన్నా రు. ఈ పోరాటంలో ఎంతో మంది ఉద్యోగులు అరెస్టు అయ్యారని, సస్పెన్షన్లు, డిస్మిస్లు జరి గినా అలుపెరుగకుండా పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సకల జనుల భేరికి లక్షలాదిగా తరలిరావాలన్నారు.సకల జనుల భేరి విజయవంతానికి తెలంగాణలోని అన్ని జిల్లాలో టీఎన్జీఓల భేరి నిర్వహిస్తున్నామన్నారు. 1969 సంవ త్సరం నుంచి టీఎన్జీఓలు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారన్నారు. 1969లో 38 రోజులు, 1985లో ఎన్టీఆర్ హయాంలో, 2009 సకల జనులసమ్మెలో తెలంగాణ కోసం గొంతెత్తి టీఎన్జీఓలు పోరా టం చేశారన్నారు. సీడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేసిన అనంతరం కూడా కేంద్రం తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేస్తోందన్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తన మాతృశాఖలో ఏం జరుగుతుందో కూ డా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.ట్రెజరీ గజిటెడ్ అధికారులు నేటి నుంచిసమ్మొకు పిలుపునిస్తే ఆయన సీమాంధ్ర సమ్మె ఉధృతం గా ఉందంటూ ఢిల్లీలో లాబీలకు దిగారన్నారని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు.జూలై 1 నుంచి పీఆర్సీ ప్రకటించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోం దన్నారు. ఉద్యోగులందరికీ 45 శాతం ఇంటీరియల్ రిలీఫ్ ఫండ్ విడుదల చేయాలని ఆయ న డిమాండ్ చేశారు. టీఎన్జీఓస్ రాష్ట్ర కార్యాదర్శి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం కాలం నుంచి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఉం దన్నారు. ఏపీఎన్జీఓలు రెచ్చగొట్టినా తెలంగాణ ఉద్యోగులు మౌనం దాల్చరని, అది బలహీనత అనుకుంటే భ్రమేనన్నారు. మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సహనాన్ని సీమాంధ్రులు పరీక్షిస్తున్నారన్నారు. నిజంగా తెలంగాణ ప్రజ లు తలుచుకుంటే హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ వెనక్కి వెళ్లలేకపోయేవారన్నారు. తెలంగాణ కోసం 1969లో 400 మంది, 2009 నుంచి వెయ్యిమందికిపైగా అమరులైనారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఏపీఎన్జీఓల అధ్యక్షులు అశోక్బాబుది దింపుడు కల్లెం ఆశ మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని యూీ పఏ కాకుంటే ఎన్డీయే ఇచ్చితీరుతుందన్నారు. టీపీఎఫ్ ఉపాధ్యక్షులు వేదకూమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన, సామాజిక ఉద్యమం తెలంగాణ ఉద్యమమన్నారు. ఉద్యమానికి ప్రజ లు నాయకత్వం వహిస్తున్నారన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ, తెలంగాణ కళాకారుడు రసమయి బాలకిషన్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు గైని గంగారాం, ఎ.కిషన్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కరుణాటి యాదగిరి, బీజేపీ నాయకులు బాపురెడ్డి, బీఎస్ పీ నాయకులు ఎడ్ల రాము, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్, జేఏసీ నాయకులు విఠల్‌రావు, భాస్కర్, లక్ష్మన్, బాబురాం, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకర్, ట్రెజరీ అధ్యక్షులు రాములు, వెయ్యి మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలి: ఆనం
సమ్మె విరమించాలని ఏపీఎన్జీవోలను కోరినట్టు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఏపీఎన్జీవోలు సమైక్యంపై స్పష్టమైన హామీ కోరుతున్నారని చెప్పారు. విభజన వల్ల వచ్చే సమస్యలను ముసాయిదా రూపంలో ఇవ్వాలని ఉద్యోగ సంఘాలను కోరామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంలో చర్చించి కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్నామ్నాయం గురించి ఆలోచించలేదని మంత్రి వెల్లడించారు. చర్చల్లో ఎస్మా ప్రస్తావన వచ్చిందని తెలిపారు. ఇది ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయని చెప్పారు. సహేతుక ముగింపు వచ్చే వరకు చర్చలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగులతో సమ్మెతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని ఏపీఎన్జీవోలకు విజ్ఞప్తి చేశారు. -
ఎపిఎన్జిఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం
-
ఎపిఎన్జిఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం
హైదరాబాద్: ఎపిఎన్జిఓ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో మంత్రి మండలి ఉపసంఘం ఎపిఎన్జిఓ నేతలతో చర్చలు జరిపింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మె విరమించేదిలేదని నేతలు చెప్పారు. చర్చలు ముగిసిన అనంతరం ఎపిఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయేది ఉద్యోగులేనని చెప్పారు. స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. -
సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులతో మంత్రవర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమైంది. విధులకు హాజరుకాకుండా సమ్మెను తీవ్రరూపంలోకి తీసుకువెళ్లిన ఉద్యోగులు సమ్మె విరమించాలని మంత్రి వర్గ ఉపసంఘం కోరనుంది. ఏపీఎన్జీవోలు ఎవరితోనైనా తాము చర్చలకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశమైంది. కాగా, సమావేశానికి ఏపీఎన్జీవోలు, రెవిన్యూ ఉద్యోగుల సంఘం గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళీ తదితరులు పాల్గొని ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని శుక్రవారం కూడా విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఏపీఎన్జీవోలు తమ వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వ్యాఖ్యానించింది. సమ్మె చేయడం వల్ల ఎవరికా లాభం కలుగుతోందని హైకోర్టు ఉద్యోగులను ప్రశ్నించింది. సమ్మె విరమించుకుంటారా లేదా స్పష్టంగా రేపటిలోగా చెప్పాలని ఏపీఎన్జీవో, సెక్రటేరియట్ ఉద్యోగులను హైకోర్టు ఆదేశించింది. సమ్మె పిటిషన్‌పై రేపు కూడా వాదనలు కొనసాగే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమ్మెతో సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతపడ్డాయి. ఏపీఎన్జీవోలు చేప్టటిన సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైన సంగతి తెసిందే. -
'సమ్మె విరమిస్తారా? కొనసాగిస్తారా? చెప్పండి'
ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఏపీఎన్జీవోలు తమ వాదనలు వినిపించారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సమ్మె చేయడం వల్ల ఎవరికా లాభం కలుగుతోందని హైకోర్టు ఉద్యోగులను ప్రశ్నించింది. సమ్మె విరమించుకుంటారా లేదా స్పష్టంగా రేపటిలోగా చెప్పాలని ఏపీఎన్జీవో, సెక్రటేరియట్ ఉద్యోగులను హైకోర్టు ఆదేశించింది. సమ్మె పిటిషన్‌పై రేపు కూడా వాదనలు కొనసాగే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమ్మెతో సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతపడ్డాయి. ఏపీఎన్జీవోలు చేప్టటిన సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైన సంగతి తెసిందే. -
ప్రభుత్వ ఉద్యోగులకు జవాబుదారి తప్పనిసరి: హైకోర్టు
ప్రజా సమస్యలపై ఏ వ్యవస్థ స్పందించనప్పుడు చర్యలకు ఆదేశించే అధికారం కోర్టులకు ఉందని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు చేపట్టిన సమ్మెపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా హైకోర్టు పై విధంగా స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగులున్నది ప్రజాసేవ చేయడానికే అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జవాబుదారితనంతోపాటు పారదర్శకత ముఖ్యమని పేర్కొంది. అయితే ఏపీఎన్జీవోలు చేస్తుంది సమ్మె కాదని, పోరాటమని ఆ సంఘం తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. అలాగే సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అయితే వారు కూడా సమ్మెలో పాల్గొంటున్నారని హైకోర్టుకు తెలిపారు. ఆ కేసు సంబంధించిన వాదనలు హైకోర్టులో కొనసాగుతున్నాయి. -
'తెలంగాణ నోట్ వస్తే ఎంపీలు రాజీనామా చేయాల్సిందే'
తెలంగాణపై కేబినెట్ నోట్ వస్తే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందేనని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కేబినేట్ నోట్ వస్తే కొంత మంది ఎంపీలు మాత్రమే రాజీనామా చేస్తామంటున్నారు, మిగిలిన ఎంపీలు, కేంద్రమంత్రుల నిర్ణయం ఏమిటి అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు అశోక్‌బాబుపై విధంగా స్పందించారు. ఇప్పటికీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీ నామాలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన తెలిపారు. జులై 30న సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమానికి సహకరిస్తున్న ప్రజలకు ఆ సందర్భంగా అశోక్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించాలని తెలంగాణ ఎమ్మెల్యేలను కోరతామన్నారు. -
చర్యలకు ఆదేశిస్తే నష్టపోయేది ప్రజలే
ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టుకు నివేదించిన మోహన్‌రెడ్డి అలా ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నించిన ధర్మాసనం విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా రాష్ట్రంలో ఆరులక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తీరాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని ఏపీఎన్జీవోల తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు ఎందుకు అలా భావిస్తున్నారు..? మేం ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని ఎందుకు అనుకుంటున్నారు..? సమ్మెలో పాల్గొనడం ఏమైనా తీవ్రమైన నేరమా..? మహా అయితే సమ్మె చేస్తున్న వారి వివరాలను వారి సర్వీసు రికార్డుల్లో పొందుపరచడం మినహా ప్రభుత్వం ఏం చేస్తుంది.?’ అని వ్యాఖ్యానించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి బుధవారం నాటి తన వాదనలను కొనసాగించారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టు తన అధికార పరిధిని, న్యాయ పరిధిని ఉపయోగించి ఫలానా విధంగా చర్యలు తీసుకుని తీరాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయగలదని అన్నారు. ఏపీఎన్జీవోల సమ్మెకు సంబంధించి అటువంటి అసాధారణ పరిస్థితులు ఏమీ లేవని, అందువల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు నివేదించారు. సివిల్ సర్వీస్ రూల్స్ ఆధారంగా పిటిషనర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని, ఎస్మా గురించి, ఇతర నిబంధనల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, కాబట్టి ఉద్యోగులపై చర్యలకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేలా పిటిషనర్‌ను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ప్రభుత్వం తను నిర్వర్తించాల్సిన పనిని నిర్వర్తించకపోతే అప్పుడా విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అయినా కూడా స్పందించకుంటే అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పారు. ప్రస్తుత కేసులో పిటిషనర్ అటువంటి చర్యలేవీ తీసుకోలేదని ఆయన తెలిపారు. కాబట్టి సమ్మె చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించజాలదని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఏపిఎన్జీఓల సమ్మె పై హైకోర్టులో వడీవేడిగా వాదనలు
-
'విడిపోదన్న సంకేతం వచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోదన్న సంకేతం వచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు చేయకుండా రాష్ట్రం విభజనను ఏవిధంగా అడ్డుకుంటారో నేతలు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20 న విజయవాడలో, 23న హిందూపురంలో, 29న వైజాగ్ లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడు లక్షల మంది ఉద్యమంలో పాల్గొంటున్న ఎలాంటి నష్టమూ చేయలేదన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రానికి నచ్చజెప్పాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందని అశోక్ బాబు తెలిపారు. ప్రజలు నమ్మకం పోతే ఎవరికీ రాజీకీయ భవిష్య్తత్తు ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజీనామాలు చేస్తారా..లేదా అనేది నేతలే నిర్ణయించుకోవాలన్నారు. 19న కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలు మూయించి వేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో సద్భావన సభ నిర్వహించే ఆలోచన లేదని, తమ సమ్మెపై ఎవరు పిలిచి మాట్లాడినా వారితో చర్చిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రజల ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా సమ్మె చేస్తున్నామని తెలిపారు. నందమూరి హరికృష్ణ యాత్ర చేస్తే తామ మద్దతు తెలుపుతామన్నారు. -
ఏపీఎన్జీవోల సమ్మైపై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: ఏపీఎన్జీవోల సమ్మెపై చేపట్టిన విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అంతకముందు ఏపీఎన్జీవోల సమ్మైపై ప్రభుత్వ వాదనలను ప్రభుత్వం మండిపడింది. మంత్రులు మధ్యవర్తిత్వం వహించకుండా సమ్మెపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేసింది. సమ్మైపై ఏరకమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడంలేదని ఘాటుగా ప్రశ్నించింది. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కాగా, ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని, సమయం ఇవ్వడానికి కుదరరదని తేల్చిచెప్పింది. తమ సమ్మెపై ఏపీఎన్జీవోలు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌కు చెల్లుబాటులేదని ఏపీఎన్జీవోలు హైకోర్టుకు విన్నవించారు. పిటిషన్ లో సరైన స్పష్టత లేనందున కొట్టివేయాలని విజ్ఙప్తి చేశారు. కావాలనుకుంటే తనంతట తానుగా కేసు చేపట్టాలనిఏపీఎన్జీవోలు కోర్టును కోరారు. సమ్మెపై ప్రభుత్వానికి ముందే నోటీసు ఇచ్చామని, సమ్మె కాలానికి ఎవరికీ జీ తాలు రాలేదన్నారు. దానిపై తాము ఇప్పటివరకూ ఎవరికీ ఫిర్యాదు చేయలేదని హైకోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీఎన్జీవోలు, apngo's, high court, హైకోర్టు, AP Government, ప్రభుత్వం -
ప్రభుత్వ వాదనలపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్: ఏపీఎన్జీవోల సమ్మైపై ప్రభుత్వ వాదనలను హైకోర్టు తప్పుబట్టింది. ఏపీఎన్జీవోల సమ్మెపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రులు మధ్యవర్తిత్వం వహించకుండా సమ్మెపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై హైకోర్టు మండిపడింది. . సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. సమ్మైపై ఇప్పటి వరకూ ఏ రకమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడంలేదని ఘాటుగా ప్రశ్నించింది. కాగా, ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని, సమయం ఇవ్వడానికి కుదరరదని తేల్చిచెప్పింది. సమ్మె చేస్తున్న ఉద్యోగోల స్థానంలో తక్షణం కొత్తవారిని నియమించాలని హైకోర్టు సూచించింది. అయితే నో వర్క్, నో పే అమలు చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏపీఎన్జీవోలతో చర్చలు జరుపుతామని ప్రభుత్వ తెలపగా.. ఏ చట్ట ప్రకారం ఏపీఎన్జీవోలతో చర్చలు జరుపుతారని హైకోర్టు ప్రశ్నించింది. తమ సమ్మెపై ఏపీఎన్జీవోలు వాదనలు వినిపిస్తున్నారు. ఈ పిటిషన్‌కు చెల్లుబాటులేదని ఏపీఎన్జీవోలు హైకోర్టుకు విన్నవించారు. పిటిషన్ లో సరైన స్పష్టత లేనందున కొట్టివేయాలని విజ్ఙప్తి చేశారు. కావాలనుకుంటే తనంతట తానుగా కేసు చేపట్టాలనిఏపీఎన్జీవోలు కోర్టును కోరారు. సమ్మెపై ప్రభుత్వానికి ముందే నోటీసు ఇచ్చామని, సమ్మె కాలానికి ఎవరికీ జీ తాలు రాలేదన్నారు. దానిపై తాము ఇప్పటివరకూ ఎవరికీ ఫిర్యాదు చేయలేదని హైకోర్టుకు తెలిపారు. -
'రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు'
హైదరాబాద్: సమైక్యాంధ్ర మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 20 తేదీన విజయవాడలో భారీ బహిరంగ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు అవసరం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అశోక్ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం సమావేశమైన ఏపీఎన్జీవోలు తమ భవిష్య కార్యచరణను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సీమాంధ్ర నేతలపై మండిపడ్డారు. ఈనెల 24న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఏపీఎన్జీవోలు ప్రకటించారు. 19, 20 తేదీల్లో బ్యాంకుల సహా ప్రభుత్వకార్యాలయాల ముట్టడించేదుకు సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 6నుంచి 8వరకూ లైట్లు ఆపి నిరసన కార్యక్రమాన్ని తెలుపుతామన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అవగాహన సదస్సులు, అనంతరం మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వారు తెలిపారు. -
ఈ నెల 24న రాష్ట్ర బంద్ కు ఏపీఎన్జీవోల పిలుపు
హైదరాబాద్:ఈనెల 24న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఏపీఎన్జీవోలు ప్రకటించారు. సోమవారం సమావేశమైన ఏపీఎన్జీవోలు తమ భవిష్య కార్యచరణను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సీమాంధ్ర నేతలపై మండిపడ్డారు. రాజీనామాలు అవసరం లేదని సీమాంధ్ర మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన తెలిపారు. 19, 20 తేదీల్లో బ్యాంకుల సహా ప్రభుత్వకార్యాలయాల ముట్టడించేదుకు సమాయత్తమవుతున్నట్లు తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 6నుంచి 8వరకూ లైట్లు ఆపి నిరసన కార్యక్రమాన్ని తెలుపుతామన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అవగాహన సదస్సులు, అనంతరం మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో ప్రయివేట్ ట్రావెల్స్ బంద్ నిలిపివేయాలని, 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేసి నిరసనను ముమ్మరం చేయాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించారు. ఈనెల 23 నుంచి 30వరకూ ప్రయివేటు విద్యాసంస్థలు మూసివేయాలని ఏపీఎన్జీవోలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తామని అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 20 తేదీన విజయవాడలో భారీ బహిరంగ నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సమ్మెపై హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఏపీఎన్జీవో కార్యాలయంలో వాడివేడిగా జరిగింది. -
రైల్ రోకో కార్యక్రమాలపై సమైక్యాంధ్ర జేఏసీ దృష్టి
హైదరాబాద్: రైల్ రోకో కార్యక్రమాలపై సమైక్యాంధ్ర జేఏసీ దృష్టి సారించనుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జేఏసీ సోమవారం ఏపీఎన్జీవో భనవ్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యచరణపై చర్చించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైల్ రోకో కార్యక్రమాల నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. అంతకుముందు ఉద్యోగుల సమ్మెపై హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగర శాఖ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల నాయకుల సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. హైకోర్టు తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా వచ్చినా, సమ్మె కొనసాగించాల్సిందేనని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయడ్డారు. తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చించారు. -
తీర్పు ఎలా ఉన్నా.. సమ్మె మరింత ఉధృతం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సమ్మెపై సోమవారం హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా, సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించి తీరాలని ఏపీఎన్జీవోలు నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగర శాఖ నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల నాయకుల సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. హైకోర్టు తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా వచ్చినా, సమ్మె కొనసాగించాల్సిందేనని సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయడ్డారు. తీర్పు సమ్మెకు వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో చర్చించారు. ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో మాట్లాడేందుకు తమకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబును ఏపీఎన్జీవో జిల్లా నేతలు నిలదీశారు. నేడు జేఏసీ భేటీ కీలకం: ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’లో భాగస్వామ్య సంఘాలతో కూడిన జేఏసీ సమావేశం సోమవారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరగనుంది. సమ్మె కొనసాగింపుపై భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ నిరవధిక సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ నిర్ణయించింది. కమిటీ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. కమిటీ చైర్మన్ సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్లు దామోదరావు, రాజేంద్రప్రసాద్, 13 జిల్లాలకు చెందిన కార్యవర్గ సభ్యులు భేటీలో పాల్గొన్నారు. సోమవారం జరగనున్న ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు: ఎన్ఎంయూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకొనే వరకు సమ్మె నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఎన్ఎంయూ సీమాంధ్ర నేతలు ప్రకటించారు. ఎన్ఎంయూ జోనల్ కార్యదర్శులు రమణారెడ్డి, చంద్రయ్య, మోహన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుతం ఉన్న అదనపు ప్రయోజనాలను కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీన ప్రతిపాదనపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఏపీఎన్జీవోలకు పోలీసుల నోటీసులు
హైదరాబాద్: ఎల్బి స్టేడియంలో ఈ నెల 7న నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు సంబంధించి ఏపీఎన్జీవోలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేటాయించిన సమయం కన్నా ఎక్కువ సమయం సభ నిర్వహించినట్లు ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఉద్యోగులనే కాకుండా ఇతరులను కూడా సభకు అనుమతించారన్న అభియోగం మోపారు. ఏపీఎన్జీవోలకు ఈ నోటీసులను సెంట్రల్ జోన్ పోలీసులు జారీచేశారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభలో సీమాంధ్ర ఉద్యోగులతోపాటు పలువురు కళాకారులు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాద్ వంటి కళాకారులను తొలుత సభకు పోలీసులు అనుమతించలేదు. ఆ తరువాత అనుమతించారు. -
కెసిఆర్‌ని వణికించిన APNGO: శైలజానాథ్
-
పశ్చిమలో విద్యార్థి గర్జన
సమైక్యాంధ్ర ఉద్యమం పశ్చిమగోదావరి జిల్లాలో మరింత ఉధృతంగా సాగుతోంది.సమైక్యాంధ్రకు మద్దతుగా ఏలూరు నగరంలోని అన్ని పాఠశాలల విద్యార్థులతో కలసి విద్యార్థి గర్జనను నిర్వహిస్తున్నారు. అలాగే అదే జిల్లాలోని కోవ్వూరులో ఉగ్ర గోదావరి లక్షజన గళ గర్జన ఏర్పాటు చేయనున్నారు. అలాగే తణుకు పట్టణంలో కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు చేపట్టిన ఆందోళనగానే కేబులు ప్రసారాలను నిలిపివేశారు. అయితే జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్ని డిపోలకే పరిమితమైనాయి. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మూసివేశారు. -
మా సభలకొచ్చిన డ్రైవర్లంత మంది లేరు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ గొప్పదేమీ కాదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన టీ ఉద్యోగుల గర్జనకు హాజరైన ఉద్యోగులను తీసుకొచ్చిన వాహనాల డ్రైవర్లంతమంది కూడా ఈ సభకు రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సభతో బ్రహ్మాండం బద్దలైందని ఎవరైనా అనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాక నగరానికి చేరుకున్న కేసీఆర్ సోమవారం పార్టీ నేత కే కే నివాసంలో టీఆర్ ఎస్, జేఏసీ, తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సేవ్ ఆంధ్రప్రదేశ్ వంటి సభల్ని తాము గతంలో లక్షలు, వేలు నిర్వహించామని చెప్పారు. ఉద్యోగుల గర్జన సభలకు వచ్చిన 5-6లక్షల మంది ఉద్యోగులను తీసుకువచ్చినంత మంది కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు హాజరుకాలేదని విమర్శించారు. ఆఫ్ట్రాల్ ఒక సభ పెట్టినవారు ఆ సందర్భంగా వ్యవహరించిన దుర్మార్గపు, జుగుప్సాకర, అసభ్యరీతిని చూసి సమాజం నవ్వుకోవడంతోపాటు జాలిపడుతోందన్నారు. 13 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా వ్యవహరించామని వాల్‌స్ట్రీట్, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియాతోపాటు జాతీయ మీడియాలు ఉట ంకించాయని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనలో కలిసిన పెద్దలతో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీన సమయంలో ఉన్న తెలంగాణను ప్రకటించాలని కోరుతూ ఆ పత్రాలు, వివరాలు అందజేసినట్లు చెప్పారు. ఎలాంటి ఆంక్షల్లేని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలనేదే తెలంగాణ ప్రజల, జేఏసీ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. 2009లో వలే మరోమారు తెలంగాణ అడ్డుకోవాలనే వారివి పగటికలలేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ఇప్పటికే లక్షల దూషణలు చేశారని వాటిని భరించినట్లే భవిష్యత్తులోనూ ఇంకో లక్ష తిట్లైనా భరిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలోవలే సీమాంధ్రలోనూ టీడీపీ డిపాజిట్లు కోల్పోవడం తప్పదన్నారు. అధికారంకోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు తెలంగాణలో ఒకమాట... సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విమర్శించారు. పీఆర్పీ ఏర్పాటు సమయంలో సామాజిక తెలంగాణను ప్రతి పాదింపచేసిన డాక్టర్ మిత్ర ఉచితంగా వేదిక దొరికిందని ఇష్టంవచ్చినట్లు మాట్లాడారని పార్టీ నేత నర్సయ్యగౌడ్ ధ్వజమెత్తారు. దాడి చేసినవారిపైగాక దాడికి గురైన వారిపై కేసులు పెట్టడం ఏమిటని ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. భేటీలో పార్టీ నేతలు కేకే, కడియం శ్రీహరి, వేణుగోపాలచారి, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్, జేఏసీ నేతలు కోదండరాం, విఠల్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ చేతగాని తనం వల్లే: మైసూరా
-
కృష్ణా జిల్లా బంద్‌కు ఏపీఎన్జీవోల పిలుపు
విజయవాడ : సమైక్యాంధ్రకు ఏపీ ఎన్జీవోలు రెండు రోజుల పాటు కృష్ణా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు పిలుపునివ్వటంతో అత్యవసర సేవలు మినహా సినిమా, వర్తక, వాణిజ్య, వ్యాపార , రవాణా రాకపోకలు బంద్ కానున్నాయి. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడ ఆటోనగర్‌లో చిన్నతరహా పరిశ్రమల వ్యాపారులు మంగళవారం భారీ భైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది వ్యాపారులు ఈ ర్యాలీలో పాల్గోన్నారు. ఆటోనగర్ నుంచి బెంజిసర్కిల్ వరకూ ర్యాలీ చేపట్టి బెంజి సర్కిల్లో కేసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దుతుగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో విజయవాడ హోరెత్తిపోయింది. ఆరు వారాల నుంచి సీమాంధ్ర స్తంభించిపోయినా కేంద్రంలో చలనం లేదని ఉద్యమకారులు మండిపడ్డారు. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజనపై ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. తెలంగాణా ఉద్యమం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే చేసిందని వారన్నారు. రాష్ట్రాన్ని విభజించబోమని ప్రకటన వచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతుందని చిన్నతరహా పరిశ్రమల వ్యాపారులు తేల్చి చెప్పారు. -
కాంగ్రెస్ చేతగాని తనం వల్లే: మైసూరా
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు అమానుషమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హాజరై తిరిగి స్వస్థలానికి బస్సులో పయనమై హయత్‌నగర్ వద్ద అంగతకులు జరిపిన రాళ్ల దాడిలో గాయపడి ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం మైసూరా రెడ్డి ప్రసంగిస్తూ... దేశంలో ఎవరు ఎక్కడైనా సమావేశాలు నిర్వమించుకోవచ్చని ఆన్నారు. ఏపీఎన్జీవో నేత సత్యనారాయణపై దాడిని ఆయన సందర్భంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని మైసూరారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆయనతోపాటు పలువురు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సత్యనారాయణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సమైక్యాంధ్ర మద్దతుగా సెప్టెంబర్ 7న ఏపీఎన్జీవోలు హైదరాబాద్ నగరంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించారు. ఆ సభను సీమాంధ్ర ప్రాంతం నుంచి వేలాది మంది హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ సభ ముగిసిన తరువాత శనివారం రాత్రి ఏపీఎన్జీవోలు బస్సుల్లో స్వస్థలాలకు బయలుదేరారు. అయితే నగర శివారు ప్రాంతమైన హయత్ నగర్ వద్ద సీమాంధ్రులు ప్రయాణిస్తున్న బస్సులపై ఆగంతకులు రాళ్ల వర్షం కురింపించారు. ఆ ఘటనలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్ని హయత్ నగర్‌లోని సన్రైస్ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం సత్యనారాయణను నగరంలోని ఆపోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. సత్యనారాయణ కాకినాడలోని వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
బాలరాజుకు పలువురి పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : ఏపీఎన్జీఓల దాడీలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఎస్ జేఏసీ కన్వీనర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. డ్యూటీ డాక్టర్ ద్వారా వివరాలు తెలుసుకొని, బాలరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి సహా ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావు యాదవ్ తదితరులు బాలరాజును పరామర్శించారు. దాడి సంఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ఉన్నత స్థాయి విచారణకు కృషి చేస్తానని మంత్రి అరుణ చెప్పారు. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన మంత్రి జానారెడ్డిని జేఏసీ నేతలు నిలదీశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని వారికి జానారెడ్డి హామీ ఇచ్చారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నందున సంయమనం పాటించాలని సూచించారు. టీఎస్ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా, ఆదిత్య ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థి ప్రశాంత్‌ను కూడా పలువురు నేతలు పరామర్శించారు. పోలీసుల తోపులాటలో నిజాం కాలేజీ హాస్టల్ బాల్కనీ నుంచి కిందపడడంతో ప్రశాంత్ చేయి విరిగిన విషయం తెలిసిందే. -
సభపై 7 కేసులు నమోదు
గజల్ శ్రీనివాస్‌ను లోపలికి అనుమతించటంపై ఫిర్యాదు దర్యాప్తు బాధ్యతలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు నిందితుల గుర్తింపునకు వీడియో ఫుటేజ్‌ల పరిశీలన సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీఓలు శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించినృ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంబంధించి స్థానిక సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో శని, ఆదివారాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. రెచ్చగొట్టేలా ప్రవర్తించటం, బెదిరించటం, తీవ్రంగా దాడి చేయటం, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద వీటిని నమోదు చేశారు. ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభకు అనుమతించటం, సభలో ఆయన ప్రసంగించడంపై అందిన ఫిర్యాదును జనరల్ డైరీలో నమోదు చేసిన పోలీసులు కేసు నమోదుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 7 కేసులను దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు బదిలీ చేశారు. సభలో పాల్గొనేందుకు బషీర్‌బాగ్ చౌరస్తా వైపు నుంచి నిజాం కాలేజీ హాస్టల్ మీదుగా స్టేడియం ‘జీ’ గేట్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి చేష్టలు వివాదాస్పదమయ్యాయి. నినాదాలు చేస్తున్న హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి అతడు రెచ్చగొట్టే సంజ్ఞ చేయడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. ఆ తరవాత ఒక్కసారిగా హాస్టల్ లోపల నుంచి రాళ్ల వర్షం కురిపించడంతో సభకు వెళ్తున్న పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదుతో వివాదాస్పదంగా సంజ్ఞలు చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సభ ప్రారంభమైన తరవాత వేదిక సమీపంలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేసిన తమపై కొందరు దాడి చేశారంటూ ఏఆర్ కానిస్టేబుళ్లు కయ్యాడ శ్రీనివాస్, శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదులతో మరో రెండు కేసుల్ని నమోదు చేశారు. అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్టు సందర్భంగా నిరసనకారులు ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అసెంబ్లీ ఎదురుగా తెలంగాణ న్యాయవాదుల్ని అరెస్టు చేస్తున్నప్పుడు నాలుగు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇచ్చిన ఫిర్యాదుతోపాటు సభకు వచ్చిన కొందరు తనపై దాడి చేశారంటూ ఓయూ జేఏసీ నేత కన్వీనర్ బాలరాజు యాదవ్ ఫిర్యాదు మేరకు మరో రెండు కేసులు రిజిస్టర్ చేశారు. ఈ ఏడు కేసుల్లో నిందితుల్ని గుర్తించడం కోసం స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియో టేపులను పరిశీలిస్తున్నారు. వీటిని విశ్లేషించిన తరువాత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గజల్ శ్రీనివాస్ సభలోకి ప్రవేశించిన తీరును కూడా వీడియో ఫుటేజ్‌ల ద్వారా గుర్తించాలని నిర్ణయించారు. కాగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ఎల్బీస్టేడియంలో నిర్వహించిన ఏపీఏన్జీవో నాయకులపై తెలంగాణ విద్యార్థి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సీమాంధ్రుల బస్సులపై దాడి ఘటనలో 13 మంది అరెస్ట్! ఇదిలా ఉండగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరై హైదరాబాద్ నుంచి తిరిగి వెళుతున్న సీమాంధ్రుల బస్సులపై దాడి ఘటనలో 13 మంది అనుమానితుల్ని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎపీఎన్జీవోల సభతో అపవిత్రమైంది
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఫోరం మండిపడింది. ఏపీఎన్జీవోలు నిర్వహించిన సభ వల్ల ఎల్బీ స్టేడియం అపవిత్రంగా మారిందంటూ ఆదివారం స్టేడియంలో పాలాభిషేకం నిర్వహించి శుద్ధి కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, శ్రీరంగారావు మాట్లాడుతూ ఏపీఎన్జీవోలు నిర్వహించిన సభలో 10 శాతం మాత్రమే ఉద్యోగులు ఉన్నారని, మిగతా వారిని కిరాయికి తీసుకువచ్చి సభను విజయవంతం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డీజీపీల అండదండలతోనే సీమాంధ్రులు తెలంగాణవాదులపై దాడులకు పాల్పడ్డారని, వీరికి తెలంగాణ ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారన్నారు. ఓయూ జేఏసీ నేత బాల్రాజ్యాదవ్పై జరిగిన దాడిని ఖండించిన జేఏసీ సభ్యులు.. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, తిరుపతివర్మ, బ్రహ్మానందరెడ్డి, జి. మోహన్‌రావులతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
వారంలో కేబినేట్ నోట్.. త్వరలో అసెంబ్లీలో తీర్మానం: షబ్బీర్ ఆలీ
'సేవ్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీఎన్జీఓలపై మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ మండిపడ్డారు. సభా వేదికపై పలువురు నాయకులు ఫోటోలు పెట్టుకున్నవారు హైదరాబాద్ నగరానికి పునాది వేసిన నాయకులను ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు. నిజాం, కుతుబ్ షాహీలను ఏపీఎన్జీఓలు ఎలా మరిచిపోతారని నిలదీశారు. ఏపీఎన్జీఓ నాయకులు ఎంత రెచ్చగొట్టినా.. తెలంగాణవాదులు రెచ్చిపోనందుకు నా సలాం అని షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ లో రక్షణ లేనిది సీమాంధ్రలుకు కాదు.. తెలంగాణ వాదులకేనని ఆయన అన్నారు. ఎపీఎన్జీఓలు ఎంత రెచ్చగొట్టినా.. తెలంగాణప్రాంత ప్రజలు సంయమనంతో వ్యవహరించినందుకు సలాం అని అన్నారు. హైదరాబాద్ లో సభలెన్ని పెట్టుకున్నా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరని షబ్బీర్ తెలిపారు. వారం రోజుల్లో కేబినేట్ నోట్ ప్రవేశపెడుతారని..త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని కేంద్రానికి తాము సూచించామని మీడియా సమావేశంలో వెల్లడించారు. -
ప్రభుత్వ డైరెక్షన్లోనే 'సేవ్ ఆంధ్రప్రదేశ్': బలరాం నాయక్
రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్లోనే ఏపీఎన్జీవోలు నిన్న నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ జరిగిందని కేంద్ర మంత్రి పి.బలరాం నాయక్ అభిప్రాయపడ్డారు. ఆదివారం వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో జరిగిన చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వికలాంగులకు ఆయన మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... సీమాంధ్రులతో కలిసి ఉండలేమని నిన్నటి సభతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. జై తెలంగాణ అంటేనే దాడులు చేస్తున్న మీతో ఎందుకు కలిసి ఉండాలని ఆయన సీమాంధ్రులను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత ప్రజలపై నిన్న దాడి జరిగిన టీ మంత్రులు ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మీరు అనుసరిస్తున్న వైఖరి వల్లనే గతంలో కూడా మద్రాస్ నుంచి వెళ్లగొట్టారని, ఆ సంగతిని గుర్తుంచుకోవాలని సీమాంధ్రులకు ఈసందర్బంగా పి.బలరాం నాయక్ హితవు పలికారు. -
రాజీనామాలంటూ హడావుడి వద్దు: సీఎం
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల డిమాండ్ నేపథ్యంలో రాజీనామాలనో, మరొకటనో హడావుడి పడొద్దని, రాజీనామాలు చేయొద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రులకు సూచించారు. రాష్ట్ర విభజన అంత సులభంకాదని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసినా దాన్ని అమలు చేయడం కేంద్రానికి సాధ్యం కాదని చెప్పారు. శనివారం పలువురు మంత్రులు క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలని ఏపీఎన్జీవో వేదిక డిమాండ్ చేసిన అంశంపై వారి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగానే తెలంగాణ అంశానికి సాంకేతికంగా అనేక చిక్కులు ఉన్నాయని, వాటిని పరిష్కరించడం ఎవరివల్లా అయ్యేదికాదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, టీజీ వెంకటేశ్, ఎరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజుతో పాటు ఎమ్మెల్యేలు జేసీ దివాకర్‌రెడ్డి, వీరశివారెడ్డిలు కూడా కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. -
పార్టీలు తోడైతేనే ఉద్యమానికి ఊపు!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర సమైక్యత కోసం సాహసోపేతంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ప్రజా సంఘాలను కచ్చితంగా అభినందిచాల్సిందే. ఈ సమస్యకు అంతిమ పరిష్కారం రాజకీయ ప్రక్రియే. కాబట్టి రాజకీయ పార్టీలు తమ నిర్ణయాలను మార్చుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా సమైక్యవాదంపై నిలబడి పోరాడుతున్న రాజకీయ పార్టీలను కలుపుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి శ్రమకు రాజకీయ పార్టీలు తోడైతే ఉద్యమం విజయవంతమవుతుంది’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం మరింత బలోపేతం కావాలంటే రాజకీయ పార్టీల భాగస్వామ్యం కచ్చితంగా అవసరమన్నారు. టీఆర్ఎస్ ఇదే వ్యూహాన్ని అమలు పరిచిందన్నారు. సమైక్య ఉద్యమంపై శనివారం ‘సాక్షి టీవీ’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రవీణ్ మాట్లాడారు. రాష్ట్ర సమైక్యత కోసం ఏపీఎన్జీవోలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే అత్యంత అరుదైనదన్నారు. అయితే, రాజకీయ పార్టీల విధానాలు, సిద్ధాంతాల్లో మార్పు తేకుండా ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఏపీఎన్జీవోల సభ పార్టీలపై ఒత్తిడి తెచ్చే దిశగా సాగుతుందని తాను భావించానన్నారు. కానీ, ఈ మహాసభలో ఆ ప్రయత్నం జరగలేదన్నారు. ఇప్పటికైనా సమైక్య ఉద్యమం మరింత ముందుకెళ్లాలంటే రాజకీయ పార్టీలన్నింటిపైనా ఆ దిశగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే సమైక్య గళాన్ని గట్టిగా వినిపిస్తున్న పార్టీలను కలుపుకెళ్లాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉంటుందన్నారు. ఉద్యమాలు ఎంతవరకూ చేయాలి.. ఎంతవరకూ రాజకీయంగా ముందుకెళ్లాలనే దానిపై టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిందని ప్రవీణ్ వివరించారు. బొత్సది బాధ్యతారాహిత్యం సమ్మె 30 రోజులేంటి, 365 రోజులు జరపడానికి సిద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడటం అతని బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ప్రవీణ్ దుయ్యబట్టారు. విభజన నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం కనుక.. ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన ఆ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఆ పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, అధికారంలో ఉన్న నేతలు రాజీనామా చేస్తే జాతీయ స్థాయిలో స్పందన రావడమే కాక విభజన ప్రక్రియ ఆగుతుందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా మంత్రులంతా రాజీనామా చేయాలని సూచించారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో నియోజకవర్గాల్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. బావోద్వేగాల ప్రాతిపదికగానే విభజించాలనుకుంటే ఇప్పటికే పంజాబ్ ప్రత్యేక దేశంగా మారేదని, ఎల్టీటీఈ కోరినట్లు శ్రీలంక ఎప్పుడో రెండుగా చీలిపోయేదని గుర్తుచేశారు. అవాస్తవ పునాదుల మీద తెలంగాణ ఉద్యమం నిర్మితమైందన్నారు. కేసీఆర్ అవాస్తవాలతో యువతను, తెలంగాణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించారని ప్రవీణ్ విమర్శించారు. -
‘సమైక్యత’ చాటిన సాంస్కృతిక కార్యక్రమాలు
‘ఇప్పటి దాకా కలసి ఉన్నాం... ఇకపైనా కలిసేఉందాం...’ అంటూ సమైక్య వాదాన్ని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు తమ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వినిపించారు. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో శనివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభావేదికపై ఈ కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. కడప జిల్లా కళాకారులు ఉర్దూ గజల్స్‌తో ఆకట్టుకున్నారు. ఎల్బీ శ్రీరాంను అనుకరిస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ఓ కళాకారిణి చేసిన మిమిక్రీ ఆద్యంతం నవ్వులు పూయించింది. అలాగే చంద్రబాబు, బాలకృష్ణలకు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ చేసిన హాస్య కార్యక్రమంతో సభకు విచ్చేసినవారి ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరిశాయి. చేయెత్తి జైకొట్టు తెలుగోడా... అంటూ సచివాలయ ఉద్యోగిని సత్యసులోచన బృందం ఆలపించిన పాటలు ఉత్సాహపరిచాయి. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల బృందం వినిపించిన ‘వెయ్యి నినాదాల సహస్రోత్తరం’తో సభలో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. ‘మాకొద్దు మాకొద్దు మీ నజరానా... హైదరాబాద్ అందరి ఖజానా’ అంటూ తమ గానంతో అనంతపురం ఉద్యోగుల జేఏసీ మహిళలు సమైక్యవాదాన్ని చాటారు. ప్రత్యేకంగా శ్రీనివాస్ గజల్స్ ప్రముఖ గాయకుడు శ్రీనివాస్ వినిపించిన గజల్స్‌తో సమైక్యవాదుల గుండెలు ఉప్పొంగాయి. విభజనతో నష్టాలు, కలసిఉంటే కలిగే సుఖసంతోషాలను మధ్యమధ్యలో ఆయన వివరించడం ఆకట్టుకుంది. ఇది ఆత్మీయ సదస్సు కాదు, తెలుగుతల్లి కోసం చేస్తున్న తపస్సు అని ఆయన పేర్కొన్నారు. సమైక్య ఉద్యమంపై శ్రీనివాస్ గజల్స్‌తో రూపొందించిన సీడీలను సభావేదికపై ఆవిష్కరించారు. సాంస్కృతిక వేదికపైకి రావాల్సిన ఉత్తరాంధ్ర కళాకారుడు ‘వంగపండు’ బృందాన్ని పోలీసులు సభలోకి అనుమతించకపోవడంతో ఉద్యోగులు కొంత నిరాశ చెందారు. -
సైఫాబాద్ ఠాణాలో ఫిర్యాదులు
సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీఎన్జీఓలు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ, సంబంధిత పరిణామాలపై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు శనివారం పలు ఫిర్యాదులు అందాయి. సభా వేదిక సమీపంలో జై తెలంగాణ నినాదాలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ కయ్యాడ శ్రీనివాస్‌గౌడ్ (పీసీ నం.2442)పై ఏఆర్ ఎస్సై మసూద్ పాషా ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా ప్రాకారానికి చెందిన శ్రీనివాస్ సిద్దిపేట ఏఆర్ సబ్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇతడితో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో కానిస్టేబుల్ శ్రీశైలం (పీసీ నం- 2275) కూడా సభ బందోబస్తులో పాల్గొన్నారు. సభ కొనసాగుతుండగా ఉన్నట్టుండి శ్రీనివాస్ జై తెలంగాణ నినాదాలు చేయడంతో అతడిపై కొందరు పోలీసులు దాడి చేశారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన శ్రీశైలం కూడా గాయపడ్డారు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లకు రవీంద్రభారతి చౌరస్తా వద్ద డ్యూటీ వేస్తే అక్కడికి కాకుండా ఎల్బీ స్టేడియంలో సభా ప్రాంగణం వద్దకు వెళ్ళారని, అక్కడ వారు విధుల్లోనే లేరని ఎస్సై పాషా ఫిర్యాదు చేశారు. జై తెలంగాణ అని నినాదాలు చేసినందుకు కానిస్టేబుల్‌పై దాడి చేశారంటూ టీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, జూపల్లి క్రిష్ణారావు, వినయ్‌భాస్కర్, సుధాకర్‌రెడ్డి, వివేక్, కేశవరావులు ఫిర్యాదు చేశారు. సైఫాబాద్ ఏసీపీ జగన్నాథరెడ్డి ప్రోద్బలంతోనే ఏఆర్ ఎస్సై ఇద్దరు కానిస్టేబుళ్లపై ఫిర్యాదు చేశారని హరీష్‌రావు ఆరోపించారు. మరోపక్క విధి నిర్వహణలో ఉన్న తమపై సీమాంధ్ర ప్రాంతంవారు అకారణంగా దాడి చేశారని, వారిపై చట్ట ప్రకారం చ ర్యలు తీసుకోవాలని కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీశైలం వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చారు. ఇలావుండగా జాతీయగీతాన్ని తప్పుగా ఆలపించారని పేర్కొంటూ న్యాయవాది బద్దం నర్సింహారెడ్డి గజల్ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. ఐజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభా ప్రాంగణంలోకి స్వయంగా తీసుకువెళ్ళడం గమనిస్తే చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని స్పష్టమైందని హరీష్‌రావు అన్నారు. -
‘సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ’ విజయవంతం
హైదరాబాద్‌లో కదం తొక్కిన ఉద్యోగులు హైదరాబాద్: రాష్ట్ర రాజధాని వేదికగా ఉద్యోగుల సమైక్య నినాదం మారుమోగింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ శనివారం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ఏపీఎన్జీవోలు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహన సదస్సు’ అనూహ్య విజయం సాధించింది. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలతో పాటు.. హైదరాబాద్ నగరం నుంచి కూడా సమైక్యవాదులు సభకు పోటెత్తారు. విభజన వద్దు.. సమైక్యమే ముద్దు.. అంటూ ఎలుగెత్తి నినదించారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని.. అన్ని రంగాల్లోనూ దెబ్బతింటామని ఆందోళన వ్యక్తంచేశారు. విభజనపై వెనక్కితగ్గే వరకు ఉద్యోగుల సమ్మె కొనసాగుతుందని స్పష్టంచేశారు. విభజన ప్రక్రియపై ముందుకెళితే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఒకవైపు తెలంగాణ జేఏసీ పిలుపుతో తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలోనూ బంద్ పాటించటం.. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సమైక్య సభను అడ్డుకునేందుకు ర్యాలీగా వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించటంతో ఓయూలో ఉద్రిక్తత తలెత్తటం.. ఇంకోవైపు సభకు తరలివస్తున్న ఉద్యోగులతో నిజాం కాలేజీ వద్ద కొందరు విద్యార్థులు ఘర్షణకు దిగటం వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్, మునిసిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. శుక్రవారమే కొందరు ఉద్యోగులు నగరానికి చేరుకోగా.. శనివారం ఉదయానికి రైళ్లు, బస్సుల్లో పెద్ద సంఖ్యలో వచ్చారు. సభకు వస్తున్న ఉద్యోగులను ఉదయం ఎల్బీ నగర్ వద్ద ఆందోళనకారులు అడ్డుకోవటంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎల్బీ స్టేడియంలోని సభా ప్రాంగణానికి ఉదయం 9 గంటల నుంచే ఉద్యోగుల రాక ప్రారంభమైంది. పోలీసులు గుర్తింపుకార్డులను పరిశీలించిన తర్వాతే ఉద్యోగులను స్టేడియం లోపలికి అనుమతించారు. ఉద్యోగులతో ఎల్బీ స్టేడియం పూర్తిగా నిండిపోగా ఇంకా ఎంతో మంది స్టేడియం వెలుపలే నిలిచిపోయారు. సభ ప్రారంభానికి ముందు ‘ఇప్పటి దాకా కలసి ఉన్నాం... ఇకపైనా క లిసేఉందాం...’, ‘మాకొద్దు మాకొద్దు మీ నజరానా... హైదరాబాద్ అందరి ఖజానా...’ అంటూ వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమైక్యవాదం వినిపించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైంది. సభకు అంతరాయం కలిగించటానికి ఒక వ్యక్తి వేదికపైకి చెప్పు విసరటం, ఒక పోలీస్ కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు చేయటం మినహా.. స్టేడియంలో సభ ప్రశాంతంగా సాగింది. ఓట్లేసి ఎన్నుకునేది విభజించటానికి కాదు... రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే కష్టనష్టాలు, సమైక్యంగా కొనసాగటం వల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరిస్తూ వక్తల ప్రసంగాలు సాగాయి. విభజన జరిగితే విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులే ఎక్కువగా నష్టపోతారని.. వారి కోసమే ఈ సభను నిర్వహించాం తప్ప ఎవరికో వ్యతిరేకంగానో, రాజకీయ లబ్ధి కోసమో కాదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు స్పష్టంచేశారు. రాజకీయ పార్టీలను, నాయకులను ఓట్లేసి ఎన్నుకునేది ప్రజలను పాలించడానికి కానీ, విభజించడానికి కాదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆమోదం లేనిదే విభజనపై కేంద్రం వెనక్కు వెళ్లలేకపోయినా.. ముందుకు మాత్రం వెళ్లలేదని స్పష్టంచేశారు. విభజనపై ముందుకు వెళితే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఎప్పుడు ఆగిపోతుందో, ఎటు వెళుతుందనే దానిపై ఇప్పుడే చెప్పలేమని.. ఈ నెల 16 తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఐదున్నర వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆర్టీసీ.. రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణం మూతపడుతుందని, సీమాంధ్ర 13 జిల్లాల్లోని 70 వేలకు పైగా ఉద్యోగులు రోడ్డున పడుతారని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన దిశగా కేంద్రం ముందుకు వె ళ్తే విద్యుత్ విషయంలో రాష్ట్రం అంధకారమవుతుందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి చేసి.. 54 శాతం విద్యుత్ తెలంగాణలో, 46 శాతం సీమాంధ్రలో వినియోగిస్తున్నారని, వ్యవసాయానికి 80 శాతం ఉచిత విద్యుత్ తెలంగాణలోనే ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందని డాక్టర్ మిత్ర పేర్కొన్నారు. ఊరు తగులబడుతుంటే ఎన్నికల్లో ఓట్ల కోసం చరిత్ర చెబుతూ బస్సు యాత్ర చేయడం ఏమిటని.. రాష్ట్ర విభజనకు పొరపాటుగా లేఖ ఇచ్చి ఉంటే ఆ లేఖను వెనక్కి తీసుకోవాలని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. మెడపై కత్తిపెట్టి జై తెలంగాణ అనాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, అనకపోతే విద్రోహులు అంటూ ముద్ర వేస్తున్నారని హిందూవాహిని నాయకురాలు సత్యవాణి ధ్వజమెత్తారు. సభ ఆఖరులో సమైక్య గీతాల సీడీని, సమైక్య శంఖారావం పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 3:20 గంటల పాటు సాగిన సభ.. సాయంత్రం 5:20 గంటలకు జాతీయ గీతాలాపనతో ముగిసింది. సాయంత్రం సభ ముగించుకుని తిరిగివెళ్తున్న ఉద్యోగుల బస్సులపై ఎల్బీనగర్, చింతల్‌కుంట, హస్తినాపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో పలు బస్సుల అద్దాలు పగలగా ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ‘కొమరం భీం’ ప్రవేశద్వారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహన’ సభా ప్రాంగణానికి పొట్టి శ్రీరాములు పేరుపెట్టారు. విశాల వేదికకు రెండు పేర్లు పెట్టారు. ఒకవైపు గురజాడ అప్పారావు సాంస్కృతిక వేదిక అని, మరోవైపు బూర్గుల రామకృష్ణారావు వేదిక అని నామకరణం చేశారు. ఆ ఇద్దరి చిత్రాలతో కూడిన హోర్డింగ్‌ను వేదికకు నేపథ్యంగా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం ప్రవేశద్వారాలకు కొమరం భీం, బెజవాడ గోపాలరెడ్డి పేర్లు పెట్టారు. సభికులు కూర్చునే వేదికలకు శ్రీకృష్ణ దేవరాయలు, సురవరం ప్రతాపరెడ్డి, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు. సీఎం పేరు ప్రస్తావనపై సభికుల్లో విస్మయం సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో కొందరు వక్తలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావన తీసుకురావటంపై సభికుల్లో విస్మయం వ్యక్తమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినా కిమ్మనని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో అర్థంకావటం లేదని సభకు వచ్చిన వారు బహిరంగంగా మాట్లాడుకోవటం కనిపించింది. తెలంగాణ తీర్మానం చేసిననాడే పదవికి రాజీనామా చేయకుండా.. పదవిని పట్టుకుని వేలాడుతున్న వ్యక్తిని పొగిడేలా మాట్లాడటం చూస్తుంటే అనుమానం కలుగుతోందని వారు వ్యాఖ్యానించటం గమనార్హం. ఓ వైపు తెలంగాణ రాష్ట్రం కోసం కేబినెట్ నోట్ తయారవుతుందంటూ సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి షిండే స్పష్టం చేసినా నోరు మెదపని ముఖ్యమంత్రిని వెనకేసుకురావటం చూస్తే కచ్చితంగా ఏదో జరుగుతోందన్న అనుమానాన్ని వారు వ్యక్తంచేశారు. వేదికపై ఎవరెవరున్నారంటే.. పి. అశోక్‌బాబు (ఏపీఎన్జీవో అధ్యక్షుడు), ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి (ప్రధాన కార్యదర్శి), సి.హెచ్.చంద్రశేఖర్‌రెడ్డి (ఆర్టీసీ, ఈయూ), పి.దామోదర్‌రావు (ఆర్టీసీ, ఈయూ), ఆర్.వి.వి.ఎస్.డి ప్రసాదరావు (ఆర్టీసీ, ఎన్ఎంయూ), పి.ఎన్. రమణారెడ్డి (ఆర్టీసీ, ఎన్ఎంయూ), కమలాకర్ (టీచర్స్ జేఏసీ), ప్రొఫెసర్ శ్రీకాంత్‌రెడ్డి (ఎస్వీ యూనివర్సిటీ), బి. వెంకటేశ్వరరావు (రెవెన్యూ), ఎ. వెంకటేశ్వరావు (పారిశ్రామికవేత్తల సంఘం), పి. మధుసూదన్‌రెడ్డి (సినీ నిర్మాత), మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి, కృష్ణయ్య (సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం), ఎం. వంశీకృష్ణ (జర్నలిస్టు), డాక్టర్. కె. రాజేంద్ర (డాక్టర్ల జేఏసీ), కె.శ్రీనివాసరెడ్డి (విశాలాంధ్ర మహాసభ), ఎం.జయకర్ (న్యాయవాది), ఎ.విజయ్‌కుమార్ (ఫ్యాప్సియా), కె. విజయ్‌కుమార్ (దళిత్ ఫోరం), కె. చిరంజీవిరెడ్డి (ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల సంఘం), పి.శ్రీనివాసరావు, ఎం. సత్యానందం (విద్యుత్ జేఏసీ), హరిప్రసాద్ (ఏపీజెన్కో), కుమార్‌చౌదరియాదవ్, ఎన్. శ్రీహరి (సమైక్య ఏపీ సంరక్షక పార్టీ), డేవిడ్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జేఏసీ), దినకర్ (సీఏ అసోసియేషన్), హేమలత (ఆలిండియా మహిళా సంఘం), కృష్ణయాదవ్ (విద్యార్థి జేఏసీ), కారెం శివాజీ (మాలమహానాడు), చలసాని శ్రీనివాసరావు (ఆంధ్ర మేధావుల సంఘం), కె.నాగరాజు (ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్), జంధ్యాల రవిశంకర్ (న్యాయవాది), సత్యవాణి (హిందూవాహిని), ప్రొఫెసర్ నర్సింహారావు (నాగార్జున యూనివర్సిటీ), ప్రొఫెసర్ శామ్యూల్ (పొలిటికల్ జేఏసీ), కృష్ణమోహన్ (మున్సిపల్ ఉద్యోగుల సంఘం), డాక్టర్ మిత్రా, పి.వి.వి. సత్యనారాయణ (ఏపీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు), గజల్ శ్రీనివాస్ (గాయకుడు), బాబూరావు (డిప్యూటీకలెక్టర్ల సంఘం), లక్ష్మణరెడ్డి (జనచైతన్య వేదిక), మణికుమార్ (గెజిటెడ్ అధికారుల సంఘం). -
విజయవంతంగా ముగిసిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ
-
సమైక్యవాదాన్ని బలంగా వినిపించాం: ఏపీఎన్జీవోలు
హైదరాబాద్: ఏపిఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సమైక్య సభ విజయవంతం అయిందని ఏపీఎన్జీవోలు పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో తాము సమైక్యవాదాన్ని బలంగా వినిపించామని చెప్పారు. తాము ఏర్పాటుచేసిన ఈ సభ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. విభనపై గత కొన్నిరోజులుగా సాగుతున్న సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. విభజన విషయమై టీఎన్జీవోలతో చర్చలు జరిపేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధమేనని చెప్పారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో సదస్సు నిర్వహిస్తే స్వాగతిస్తామని ఏపీఎన్జీవోలు స్పష్టం చేశారు. కాగా, ఏపి ఎన్జీఓల సమైక్య సభకు వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ బంద్ కూడా విజయవంతమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా ఒక పక్క తెలంగాణ బంద్, మరో పక్క సమైక్యాంధ్ర బహిరంగ సభ ప్రశాంతంగా జరిగిపోయాయి. పోలీసులకు టెన్షన్ తగ్గింది. బహిరంగ సభ మూడు గంటల 20 నిమిషాల సేపు సాగింది. ఉదయం 10 గంటల నుంచి స్టేడియం దగ్గర సందడి మొదలైంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
విజయవంతంగా ముగిసిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ
హైదరాబాద్: ఏపి ఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా ఒక పక్క తెలంగాణ బంద్, మరో పక్క సమైక్యాంధ్ర బహిరంగ సభ ప్రశాంతంగా జరిగిపోయాయి. పోలీసులకు టెన్షన్ తగ్గింది. బహిరంగ సభ మూడు గంటల 20 నిమిషాల సేపు సాగింది. ఉదయం 10 గంటల నుంచి స్టేడియం దగ్గర సందడి మొదలైంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా సభను ముగించారు. ఇది అంతం కాదు ఆరంభమని ఏపి ఎన్జిఓ నేతలు ప్రకటించారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సికింద్రాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా సభకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే వారిని స్టేడియం లోపలకు అనుమతించలేదు. వారు బయటే ఉండి నిరసన తెలిపారు. సభ ముగిసేవరకు వారు బయటే ఉన్నారు. అనుకున్న సమయానికి సభను జనగణమనతో ముగించారు. ఎటువంటి గొడవలకు తావులేకుండా మంచి వాతావరణంలో తెలంగాణ బంద్, సమైక్యాంధ్ర సభ జరగడం మంచి పరిణామంగా భావించవచ్చు. రెండు ప్రాంతాలవారి కార్యక్రమాలపై గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. -
ఎల్బీ స్టేడియంకు చేరుకుంటున్న ఉద్యోగులు
-
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
-
సమ్మె విరమించే ప్రసక్తే లేదు: అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ సమ్మె విరమించే ప్రసక్తి లేదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు శనివారం హైదరాబాద్‌లో స్ఫష్టం చేశారు. సమైక్యాంధ్రగానే ఉంచాలన్న ప్రజల అభిప్రాయాన్ని గౌరవించని పార్టీలకు శుభం కార్డు పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా వారి పక్షాన నిలబడి పోరాడే పార్టీలకు భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళ్లితే హైదరాబాద్ నగరంలో సమైక్య మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. తాము నిర్వహిస్తున్న సభను అడ్డుకుంటే తెలంగాణనే తట్టినట్లు అవుతుందని హెచ్చరించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. -
ఎల్బీ స్టేడియం ముట్టడికి యత్నం
-
తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా, పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ పిలుపుతో శనివారం తెలంగాణ జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. అర్థరాత్రి నుంచే తెలంగాణ వాదులు రోడ్లెక్కారు. బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు. ఇక తెలంగాణలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దాంతో బస్సులు లేక ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సందట్లో సడేమియాలా ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రాజధానిని కలిపే అన్నిదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
హైదరాబాద్ పరిణామాలపై కేంద్రం కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ఏపీఎన్జీవోలు శనివారం హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో సమైక్య సభ నిర్వహిస్తుండటం.. మరోవైపు దానికి ప్రతిగా అన్నట్లు తెలంగాణ జేఏసీ అదే రోజు తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వటం వంటి పరిణామాల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. శనివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకోగల పరిణామాల ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు చేపట్టే అవకాశముందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. -
ఎన్జీవోల సభ అనుమతి రద్దుకు హైకోర్టు నో
తెలంగాణ న్యాయవాదుల పిటిషన్ తిరస్కృతి సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు పోలీసులు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలన్న తెలంగాణ న్యాయవాదుల పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది. ఆ మేరకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సభ నిర్వహకులను ఆదేశించింది. సభ నిర్వహణవల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎటువంటి నష్టం చేకూర్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్.బి.స్టేడియంలో 7వ తేదీన ఏపీఎన్జీవోలు నిర్వహించతలపెట్టిన సభకు అనుమతినిస్తూ పోలీసులు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి, శుక్రవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించారు. ఏపీఎన్జీవోల సభను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గండ్రమోహనరావు న్యాయమూర్తిని కోరగా నిరాకరించారు. అయితే ప్రత్యక్ష ప్రసారాల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్‌జోన్ డీసీపీకి వినతిపత్రం ఇవ్వాలని మోహన్‌రావుకు స్పష్టం చేశారు. ఈ వినతిపత్రంపై 7వ తేదీన ఎన్జీవోల సభ ప్రారంభానికి ముందు నిర్ణయం వెలువరించాల్సి ఉంటుందని డీసీపీని న్యాయమూర్తి ఆదేశించారు. -
పోలీసు పహరాలో హైవేలు
సాక్షి నెట్వర్క్: ఏపీఎన్జీఓలు శనివారం హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ జేఏసీ నాయకులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల బంద్‌కు పిలుపునివ్వడంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యేందుకు ఉద్యోగులు విజయవాడ , కర్నూలు, మహబూబ్‌నగర్ వైపుల నుంచి వాహనాల్లో వస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటు హైదరాబాద్‌లో అటు హైదరాబాద్‌కు వచ్చే జాతీయ రహదారుల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం వంటి సుదూర నగరాలు, పట్టణాల నుంచి ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయలుదేరారు. వేల సంఖ్యలో ఉద్యోగులు రైళ్ల ద్వారా కూడా రాజధానికి చేరుకునే అవకాశాలున్న దృష్ట్యా బందోబస్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. రాష్ట్ర రాజధానిని ఆంధ్రా ప్రాంతంతో కలిపే జాతీయ రహదారితో పాటు, రెండు ప్రధాన రహదారులు నల్లగొండ జిల్లా గుండా వెళుతుండడంతో జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడ జాతీయ రహదారిపై ఏకంగా 64 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న ప్రతి గ్రామంలో ముగ్గురు పోలీసులతో పికెట్లు ఏర్పాటు చేశారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై వాడపల్లి కృష్ణా నది వంతెన వద్ద, హైదరాబాద్ -మాచర్ల రహదారిపై నాగార్జునసాగర్ కొత్త వంతెన వద్ద కూడా పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ హైవేలో హయత్‌నగర్ సమీపంలోనూ పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉత్కంఠ..డీజీపీ సమీక్ష: ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉత్కంఠ నెలకొంది. డీజీపీ వి.దినేశ్ రెడ్డి శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం హైకోర్టు వద్ద తెలంగాణ, సీమాంధ్ర లాయర్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పరస్పర దాడులకు సైతం దారితీయడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారిందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఉద్యోగుల బస్సుపై రాళ్ల దాడి : ఉద్యోగికి గాయాలు ఖమ్మం/పెనుబల్లి, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న సభకు ఆంధ్రప్రాంత ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సుపై శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాటు వద్ద రాళ్లదాడి జరిగింది. ఖమ్మంలో బాధితులు తెలిపిన వివరాలప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు బయలు దేరారు. సత్తుపల్లి, వి.ఎం.బంజర మధ్యలోని మండాలపాడు సమీపంలోని కల్వర్టు వద్ద రాత్రి 7 గంటల సమయంలో బస్సు నెమ్మదిగా వెళ్తుండగాముసుగులు వేసుకున్న గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బస్సు వెనుకభాగంలో అద్దం పగిలి పోయింది. చింతలపూడికి చెందిన ఉద్యోగి వెంకట్రావ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ బస్సు ఆపడంతో ఉద్యోగులు కిందకి దిగిచూసేసరికి దుండగులు పరారయ్యారు. దీనిపై ఉద్యోగులు వి.ఎం.బంజర పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో ఖమ్మం రోటరీనగర్ వద్ద బస్సులోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు నాగేశ్వరరావు, రాజబాబు విలేకరులతో మాట్లాడారు. -
సీమాంధ్ర సభకు హాజరు కావొద్దు: టీజేఎఫ్
సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్రకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులు.. ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభకు హాజరుకావద్దని పలువురు తెలంగాణ ఉద్యమకారులు విజ్ఞప్తి చేశారు. సీఎం , డీజీపీ ఇద్దరూ ఏపీఎన్జీవోల రూపంలో హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అత్యవసర వైద్యసేవలు మినహా తెలంగాణలో జనజీవనాన్ని, రహదారులను స్తంభింపచేయాలని పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ‘బంద్ విజయవంతంలో మన పాత్ర’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ రాజకీయ, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ ఏపీఎన్జీవోల సభకు అనుమతించడం హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించడానికేనని దుయ్యబట్టారు. బంద్ సందర్భంగా ప్రతిఘటన ఏదైనా ఎదురైతే... దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. సమావేశంలో ఈటెల రాజేందర్, స్వామిగౌడ్, మందకృష్ణమాదిగ, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, వేదకుమార్, అద్దంకి దయాకర్, విమలక్క, బాలరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తే ఊరుకోం : ప్రజాసంఘాల జేఏసీ ఏపీఎన్జీవోల సభలో సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజనవల్ల ఎదురయ్యే సమస్యలు, ఇతర అనుమానాలపై చర్చిస్తే తమకేమీ అభ్యంతరంలేదని, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం సహించబోమని తెలంగాణవాదులు స్పష్టం చేశారు. ‘శాంతియుతంగా విడిపోయి కలిసుందాం..’ నినాదంతో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు సంఘాలకు చెందిన తెలంగాణవాదులు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు ప్రసంగించారు. ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాలు సృష్టించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు లాంటివారు నీటి, ఉద్యోగ సమస్యలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ లాంటివారు చేసే బెందిరింపులను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. గజ్జెల కాంతం, సతీశ్ మాదిగ మాట్లాడుతూ..హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే ఇక్కడుండే తెలంగాణ-సీమాంధ్ర ప్రజల మధ్య భారత్-పాకిస్తాన్ తరహా సంబంధాలే ఉంటాయన్నారు. ఈనెల 24న ప్రజా తెలంగాణ సభ నిర్వహిస్తామని, మరోమారు చర్చలకు ఏపీఎన్జీవోలను ఆహ్వానిస్తామన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కార్యదర్శి కృష్ణయ్య, వైస్‌చైర్మన్ బెన్సన్లు మాట్లాడుతున్నప్పుడు... తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని, విభజనతో మీకొచ్చే ఇబ్బందేంటో చెప్పాలంటూ పలువురు విలేకరులు అడ్డుతగిలారు. వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. -
హైదరాబాద్ మాదంటే.. మాదే
'సేవ్ ఆంధ్రప్రదేశ్' నేపథ్యంలో.. ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు మాటకు మాట తూటాల్లా పేల్చుకుంటున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఇంకా ఉందని, అందువల్ల రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో సమావేశం పెట్టుకోడానికి తమకు పూర్తి హక్కు ఉందని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ యు. మురళీకృష్ణ వాదించారు. తాము సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ పెట్టుకున్న రోజునే వాళ్లు శాంతి ర్యాలీ పెట్టాలనుకోవడం సరికాదని, కావాలనుకుంటే అంతకంటే ఒకటి రెండు రోజుల తర్వాత, లేదా అది అవమానకరం అనుకుంటే ఒకటి రెండు రోజుల ముందే నిర్వహించుకోవచ్చు గానీ సరిగ్గా అదే రోజున ర్యాలీ పెట్టి, తమ వేదిక వద్దకే వస్తామని చెప్పడం అశాంతి సృష్టించడం తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. వాళ్లు అంటున్నట్లుగా తాము పక్కింట్లో వెళ్లి సమావేశం పెట్టుకోవట్లేదని, రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లోనే పెట్టుకుంటున్నామని చెప్పారు. సొంతిల్లు అనాలంటే నరేంద్రరావు కూడా ఆయన సొంత ఊరైన దేవరకొండలోనే సమావేశం పెట్టుకోవాలి తప్ప హైదరాబాద్ రావడానికి వీల్లేదని, ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల్లో తమవాళ్లను అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇది సరికాదని, తాము నిర్వహిస్తున్న సభ ఎవరికీ వ్యతిరేకం కాదని.. కేవలం అవగాహన సభ మాత్రమేనని వెల్లడించారు. దీనిపై తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం కన్వీనర్ నరేందర్‌రావు కూడా దీటుగా స్పందించారు. హైదరాబాద్ నగరంలో అందరినీ ఉండాలనే చెబుతున్నాం గానీ, ముమ్మాటికీ ఈ నగరంపై పెత్తనం మాత్రం తమదేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన భూమిపుత్రులదే ఇక్కడ పెత్తనమని కుండ బద్దలుకొట్టారు. కలిసుండాలనుకుంటున్న 13 జిల్లాల్లో ఎక్కడైనా కావాలంటే సభ నిర్వహించుకోవచ్చు గానీ.. పక్కింటికొచ్చి అక్కడ సభ పెట్టుకుంటామంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. వాళ్లు (ఏపీ ఎన్జీవోలు) సమావేశం నిర్వహించుకున్నంత మాత్రాన మిన్ను విరిగి మీద పడేది ఏమీ లేదని, ఇన్నాళ్లూ కొంతవరకు సంఘర్షణాత్మక వైఖరి ఉన్నా.. ఎందుకొచ్చిందని తాము ఊరుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రక్రియ ఎటూ ముందుకెళ్లేదే తప్ప వెనక్కి జరిగేది కాదని, ప్రత్యేకరాష్ట్రం సిద్ధించి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. -
సభను ఆపే సత్తా ఎవరికీ లేదు: అశోక్‌బాబు
-
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ హైకోర్టు అనుమతి
-
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్ : ఏపీ ఎన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ స్టేడియమ్లో రేపు జరిగే సమావేశానికి ఉద్యోగులు మాత్రమే హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. మరో వైపు ' సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చూడాలన్న తెలంగాణ న్యాయవాదుల విజ్ఞప్తిపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. మరోవైపు ఎల్బీ స్టేడియంలోని ఏర్పాట్లను ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ సభకు ఎంతమంది వస్తారన్న దానిపై అంచనా లేదన్నారు. అయితే ఎవరూ గుంపులు, గుంపులుగా రావద్దని ఆయన సూచించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సజావుగా జరిగేందుకు తెలంగాణ వాదులు సహకరించాలని అశోక్ బాబు కోరారు. సభను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముందని అశోక్ అన్నారు. -
ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె: ఏయూజేఏసీ
హైదరాబాద్ నగరంలో రేపు ఏపీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవ్ హైదరాబాద్ బహిరంగ సభకు హాజరయ్యేందుకు విశాఖపట్నంలోని ఏపీఎన్జీవో ఉద్యోగులు సమాయత్తమయ్యారు.దాదాపు మూడు వేలమందికిపైగా ఆ సభకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయులు,ఉద్యోగులు,కార్మికులు ఆ సభలో పాల్గొనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరితోపాటు సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీనామాలు చేయకుండా తత్సారం ప్రదర్శిస్తుండటం పట్ల విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్శిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఏయూ జేఏసీ శుక్రవారం ఇక్కడ తెలిపింది. అలాగే విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. -
కట్టెలు పట్టుకొని రోడ్డెక్కుతారు: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ : ‘‘ తెలంగాణ కోసం ఇప్పటికే 1100మంది బిడ్డలు బలిదానం చేశారు.. ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండదు.. ప్రతి ఒక్కరూ కట్టెలు పట్టుకొని రోడ్డెక్కుతారు’’ అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 7న ఏపీఎన్జీవోలు నిర్వహించతలపెట్టిన సమైక్య సభకు అనుమతిని వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఆ రోజు ఏం జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్రెడ్డిలే బాధ్యత వహించాలని చెప్పారు. నల్లగొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ జేఏసీ తలపెట్టిన శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతివ్వకుండా ఐదురోజులు ముందుగానే సమైక్య సభకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణను అడ్డుకునే వారిలో మొదటి ముద్దాయి సీఎం అని, ఆ తర్వాతి స్థానం చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. సీఎం తీరుతో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత మంత్రులు తెలంగాణకు బద్దవ్యతిరేకి అయిన సీఎం చుట్టూ తిరుగుతారా? లేక పదవులను వీడి ప్రజలతో కలిసి ఉద్యమిస్తారో తేల్చుకోవాలన్నారు. ఒకసారి యూటీ అని, మరోసారి సమైక్యాంధ్ర అంటూ చిరంజీవి మరో తెలంగాణ ద్రోహిగా మారారని దుయ్యబట్టారు. -
మళ్లీ చర్చలు జరిపాకే విభజన: పితాని సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల పెద్దలతో మళ్లీ చర్చలు జరిపాకే రాష్ట్ర విభజన అంశంపై ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేశామన్న కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యలు సీమాంధ్రలో ఆందోళనలను మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు. గురువారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ హడావుడిగా చేసిన ఏకగ్రీవ తీర్మానం సీమాంధ్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, అందుకే అక్కడ ఒక్కసారిగా ఉద్యమం ఎగసిందని తెలిపారు. ఈ పరిస్థితిని కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే పరిశీలిస్తున్నాయన్నారు. ఉద్యమాల తీవ్రత తగ్గి, ఇబ్బందులను కూడా తొలగించాకే విభజనపై ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని వివరించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలా? వద్దా? అన్నది కేంద్రం ఆలోచనలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఏపీఎన్జీవోల సభ వెనుక సీఎం కిరణ్ ప్రోత్సాహం ఉందనడం అవాస్తవమన్నారు. -
హైదరాబాద్‌ను యూటీగా ఒప్పుకోం: అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి అంగీకరించే ప్రసక్తే లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఎంఐఎం నేతలను ఆహ్వానించేందుకు గురువారం దారుస్సలాంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయానికి ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వచ్చారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీని కలిసి బహిరంగసభకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ, సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఏపీఎన్జీఓలు చేపట్టబోయే సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. బహిరంగ సభకు హాజరయ్యేదీ లేనిదీ తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కలిసి చర్చించి తెలియజేస్తామని చెప్పారు. -
ఏపీఎన్జీవోల సభ జరగనీయండి: డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సభకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణవాదులను కోరారు. విభజన విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించకుండా, విభజన వల్ల ఉద్యోగులకు వచ్చే సమస్యల పరిష్కారానికి మాత్రమే సభను వేదికగా ఉపయోగించుకోవాలని ఏపీ ఎన్జీవోలకు సూచించారు. టీఎన్జీవోల సభకు కూడా అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్జీవోలు, టీఎన్జీవోలతో ప్రభుత్వం మాట్లాడి చెరో తేదీని కేటాయిస్తే బాగుండేదన్నారు. హైదరాబాద్ మెట్రో అథారిటీ డెవలప్మెంట్ (హెచ్ఎండీఏ) పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, సీమాంధ్రకు ఒరిగేది కూడా ఏమీ ఉండదని అన్నారు. 10 జిల్లాల తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించిందని, ఈ ప్రక్రియలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కూడా భాగస్వాములను చేసిందని తెలిపారు. హైకమాండ్‌తో సీఎం ఏం చెప్పారో తనకు తెలియదని, అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, ఆయన వ్యవహారాన్ని హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. విభజన జరిగితే సీఎం కాంగ్రెస్‌ను వీడి, వేరే పార్టీలోకి వెళతారని తాను అనుకోవడంలేదన్నారు. రాష్ర్ట విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే ప్రమాదముందని అంగీకరించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటీకీ, ఒక్కోసారి రాజ్యాంగ ప్రక్రియను కొనసాగించాల్సి వస్తుందని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాకుండా అన్ని పార్టీల అభిప్రాయాల మేరకు ప్రజాస్వామ్యబద్దంగా విభజన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. విభజనపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, రేపు ఇంకేమి మాట్లాడతారోనని ఎద్దేవా చేశారు. -
‘సమైక్య సభ’ పై బంద్ బాణం
సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యంకాదు. హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే.. మేం ఢిల్లీలో తెలంగాణను అడ్డుకుంటాం. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. మా వాదాన్ని వినిపించడానికే సభ నిర్వహిస్తున్నాం. ప్రత్యేకవాదంలో బలముంటే.. ఎలాంటి ఆటంకాలూ కల్పించొద్దు. - ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తమ హక్కుల కోసం తెలంగాణ ప్రజలు సభలు పెట్టుకుంటామంటే ఎప్పుడూ అనుమతించలేదు. అదే ఏపీఎన్జీవోలు సమైక్యసభను పెట్టుకుంటామంటే నాలుగు రోజుల ముందుగానే అనుమతినిచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణను ఎలాగైనా అడ్డుకునేందుకు సీఎం చేస్తున్న కుట్రలకు నిరసనగానే బంద్‌కు పిలుపు ఇస్తున్నాం. ఏం జరిగినా సీఎందే బాధ్యత. - టీ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ఏపీఎన్జీవోలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభపై.. తెలంగాణ జేఏసీ ‘బంద్’ బాణం ప్రయోగించింది. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం (6వ తేదీ) అర్ధరాత్రి నుంచి శనివారం (7వ తేదీ) అర్ధరాత్రి దాకా 24 గంటల బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. బంద్‌లో భాగంగా విజయవాడ, కర్నూలు రహదారులను దిగ్బంధం చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. రహదారుల దిగ్బంధనంతో పాటు.. సీమాంధ్రులపై దాడులు చేసైనా సమైక్య సభను అడ్డుకుని తీరతామని తెలంగాణ, ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఎల్బీ స్టేడియం వరకూ యుద్ధభేరి పేరుతో ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని.. హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే ఢిల్లీలో తాము తెలంగాణను అడ్డుకుంటామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. తమ వాదాన్ని వినిపించడానికే సభ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికీ వ్యతిరేకంగా కాదని ఆయన హైదరాబాద్‌లో పునరుద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో సభకు ఏవైనా ఆటంకాలు తలపెడితే స్టేడియం బయటే సభను నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీఎన్జీవోల సభకు పోలీసులు నాలుగంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా ఇనుపకంచెలు, బారికేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి నిరసనకారులు నగరంలోకి రాకుండా శివార్లలో చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఉద్యోగుల వాహనాలను తెలంగాణవాదులు అడ్డుకోకుండా జాతీయ రహదారులపై పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీసులతో పాటు 11 కంపెనీల పారా మిలటరీ బలగాలు, 45 ప్లటూన్ల ఏపీఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని.. ఏదైనా పరిణామం జరిగితే దాని తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆవేదన, నిరసన వ్యక్తంచేయటానికి హక్కు ఉందన్నారు. ఏపీఎన్జీవోల సభకు 19 షరతులతో అనుమతిచ్చామని.. సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నిర్వాహకులదే బాధ్యతని స్పష్టంచేశారు. ‘ఈ సభను అడ్డుకుంటామని, జరగనివ్వబోమని అనేక ప్రకటనలు వెలువడుతున్నాయి. వారిని కోరేది ఒక్కటే.. ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు’ అని ఆయన చెప్పారు. -
`ఏపీఎన్జీవోల సభను అడ్డుకుంటామనడం అప్రజాస్వామికం`
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్య సభను అడ్డుకుంటామనడం అప్రజాస్వామికమని వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాగో.. బాగో.. లాంటి మాటలు మంచివికావని ఆయన అన్నారు. ఇలాంటి మాటల కారణంగానే రాష్ర్టంలో పరిస్థితి అదుపు తప్పిందని వసంత నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనలు తెలిపేందుకు తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు సిద్ధం కావడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించుకునేందుకు ఏపీ ఎన్జీవోలకు పోలీసు శాఖ ఇప్పటికే అనుమతించింది. ఉస్మానియా విద్యార్థి జేఏసీ, తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలకు మాత్రం అనుమతి సాధ్యం కాదని తేల్చిచెప్పింది. -
సభకు రాజకీయ నేతలొస్తే తప్పేంటి?: ఆశోక్‌బాబు
-
'ఆలస్యం చేస్తే అపోహలు పెరిగే అవకాశం'
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తే మరిన్ని అపోహలు పెరిగే ప్రమాదముందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు యూపీఏ సమన్వయ కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకున్న పక్షంలో..రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర జాప్యం చేస్తే ప్రజల్లో అపోహలు పెరిగే అవకాశముందన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభ అనేది పరిపాలనా అంశానికి సంబంధించినదన్నారు. ఆ విషయాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటారన్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన సీమాంధ్ర ఉద్యోగ జేఏసీ తలపెట్టిన సభకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, సభకు ర్యాలీలుగా రాకూడదని ఆంక్షలు కూడా విధించింది. సీమాంధ్రలు సభకు అనుమతిపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. -
సమైక్య సభపై స్పందించిన డిఎస్
-
అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించొద్దు: డీఎస్
రాష్ట్ర విభజనను సమస్యను జటిలం చేయొద్దని ఏపీఎన్జీవోలను పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు. సమస్యలు ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలని సూచించారు. తెలుగుజాతి సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఇరుప్రాంతాలపై ఉందన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించవద్దని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను కోరారు. ఏపీఎన్జీవోల అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి చర్చలు జరిపాలని డీఎస్ మంగళవారం సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగిపోయిందని అన్నారు. అన్నిస్థాయిల్లో చర్చలు జరిగాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుందని, దీనిపై వెనక్కి వెళ్లదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను ఆపాలనుకుంటే విఫలయత్నం అవుతుందన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను సీమాంధ్రులు అర్థం చేసుకోవాలని కోరారు. -
శాంతి ర్యాలీ అనుమతికి హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ నగరంలో ఈ నెల 7వ తేదీన టీఎన్జీవోలు చేపట్టనున్న శాంతి ర్యాలీకి ప్రభుత్వం అనుమతించకపోవడంపై న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ శ్రీరంగరావు రాష్ట్ర హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేపట్టనున్న భారీ బహిరంగ సభకు అనుమతించిన ప్రభుత్వం టీఎన్జీవోల ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని శ్రీరంగారావు కోర్టులో దాఖలు చేసిన పిటషన్‌లో పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం లేదా రేపు హైకోర్టులో ఆ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభను నిర్వహించనుంది. అందుకు అనుమతించాలని ఏపీఎన్జీవోల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అనుమతిని మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. అయితే అదే రోజు తెలంగాణ ప్రాంత ఎన్జీవోలు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు మాత్రం ప్రభుత్వం నిరాకరించింది. దాంతో టీఎన్జీవోలు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని శ్రీరంగారావు హైకోర్టును ఆశ్రయించారు. -
అనుమతిని రద్దు చేయాలి:టీ కాంగ్ నేతలు
-
‘7’న ఏమైనా ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో సమైక్య సభకు అనుమతివ్వడం ద్వారా హైదరాబాద్‌లో ఘర్షణలు సృష్టించేందుకు, ఆ సాకుతో తెలంగాణ ఏర్పాటును జాప్యం చేయించేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ధ్వజమెత్తారు. ఈ నెల 7వ తేదీన తెలంగాణ జేఏసీ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతించకుండా ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడం పూర్తిగా వివక్షేనన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కిరణ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ధోరణి హైదరాబాద్‌లో ఘర్షణలు రెచ్చగొట్టేలా ఉంది. ఏపీఎన్జీవోల సభకు అనుమతివ్వడం... సీఎం తన సభకు తానే అనుమతినిచ్చుకున్నట్టుగా ఉంది’’ అంటూ తూర్పారబట్టారు. కిరణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఏర్పాటును ఆపడం ఆయన తరం కాదన్నారు. ఆయన కుట్రకు తెలంగాణ ప్రజలు ఎదరొడ్డి నిలుస్తారన్నారు. 7వ తేదీన హైదరాబాద్‌లో ఎలాంటి పరిణామాలు తలెత్తినా దానికి సీఎంతో పాటు, తెలంగాణ మంత్రుల కూడా బాధ్యులవుతారని హెచ్చరించారు. బుధవారం మంత్రి జానారెడ్డిని, డీజీపీ వి.దినేశ్‌రెడ్డిని కలిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు అనుమతివ్వకపోయినా 7న శాంతి ర్యాలీ స్థానంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి తీరతామని ప్రకటించారు. ‘‘ఏ కార్యక్రమం నిర్వహించాలనేదీ గురువారం సమావేశమై నిర్ణయిస్తాం. దాన్ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉండాలి’’ అంటూ పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవోల సభ సందర్భంగా ఏదైనా జరిగితే డీజీపీ, సీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. ఒక శక్తి డీజీపీ, సీపీలను ఆడిస్తోంది: ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడం వెనుక డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మలను ఒక బలమైన శక్తి వెనక నుంచి ఆడిస్తోందని కోదండరాం ఆరోపించారు. ‘‘రాజకీయ ఒత్తిళ్ల వల్లే పోలీసులు ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిచ్చారు. హైదరాబాద్ విషయంలో రాజకీయ కుట్ర జరుగుతోంది. ప్రభుత్వమంతా ఒక వైపున ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తోంది. మా శాంతి ర్యాలీకి అనుమతివ్వకుండా ఏపీఎన్జీవో సభకు అనుమతివ్వడంపై డీజీపీని కలసి నిరసన తెలిపాం. పోలీసుల వివక్షపై ఆయనకు ఫిర్యాదు చేశాం. సకల జనుల సమ్మె సందర్భంగా మేం సాగర హారానికి అనుమతి కోరితే వేధించారు. ఆర్టీసీ సమ్మెకు డిపోల వద్దకు వెళ్తే అరెస్టు చేశారు. ఇప్పుడు మాత్రం ఏపీ ఎన్జీవోల సభకు ముందుగానే అనుమతివ్వడం తెలంగాణ వారిని అవమానించడమే. కిరణ్ చర్యలు హనుమంతుని కుప్పిగంతులే. అవి తెలంగాణ ప్రజల ఎదుట సాగబోవు. విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అంతకంటే అనర్థం ఉండబోదనేందుకు హిట్లర్, ముస్సోలినీలే ఉదాహరణ’’ అన్నారు. తెలంగాణ పౌరులుగా సొంత గడ్డపై ర్యాలీ నిర్వహించుకునే హక్కు కూడా తమకు లేదా? అని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవోల సభలో అసాంఘిక శక్తులను చేర్చి, అల్లర్లు సృష్టించి, తద్వారా ఇక్కడున్న వారికి భద్రత లేదనే అపోహ కల్పించే కుట్ర జరుగుతోందన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న వివిధ ప్రాంతాల వారి భయాందోళనలు పోగొట్టేందుకు తలపెట్టిన శాంతి ర్యాలీని అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు. అంతకుముందు జానారెడ్డి సచివాలయంలో తన చాంబర్లో తెలంగాణ జేఏసీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాగా, సమావేశంతో పేరుతో ఏపీ ఎన్జీవోలే శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, తెలంగాణ వారిపైకి నెట్టే అవకాశముందని తెలంగాణ జేఏసీల నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అందుకు పోలీసులు, కమిషనర్, డీజీపీ, సీఎంలదే బాధ్యతని హెచ్చరించారు. తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించి, ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడంపై ఐదు జేఏసీల నేతలు బుధవారం సీపీ అనురాగ్ శర్మను కలసి నిరసన తెలిపారు. కాగా, 7న హింసను ప్రేరేపించి, ఆ సాకుతో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగానో, మరోవిధంగానో ప్రకటించేలా చేసే కుట్ర జరుగుతోందని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు ఆరోపించారు. సీఎం, డీజీపీ, సీపీలే దీన్ని ముందుండి నడిపిస్తున్నారన్నారు. -
సభకు అనుమతి సరికాదు: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈ నెల 7న ఏపీఎన్జీవోల సభ నిర్వహణకు అనుమతించి, అదే రోజు తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీకి అనువుతించకపోవడం తెలంగాణ వారిని రెచ్చగొట్టడమే అవుతుందని కాంగ్రెస్ సీనియుర్ నాయుకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో, సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా ప్రభుత్వం ఈ సభకు అనుమతి ఇచ్చిందని, ఏపీ ఎన్జీవోల సభ సందర్భంగా ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలన్నారు. సమైక్యాంధ్రకోసం ఉద్యమం జరుగుతున్న విజయవాడ లేదా, గుంటూరులో ఏపీ ఎన్జీవోలు సభ పెట్టుకునే వీలుందన్నారు. ఉద్యోగుల సభకు హైదరాబాద్‌లో అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణవాదుల ర్యాలీకి అనుమతి ఇవ్వడం సముచితవుని, దీనిపై ముఖ్యమంత్రి దృష్టిని సారించాలని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుూటీ)గా చేయాలని చెబుతున్న వారు ప్రజాస్వామ్య పాలన ను కోరుకుంటున్నారో, అధికారుల పాలన కావాలనుకుంటున్నారో తేల్చి చెప్పాలన్నారు. హైదరాబాద్ మొత్తం అభివృద్ధి చేసింది నేనే అని చెప్పుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుుడు,.. హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ఏపీఎన్జీవోలు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు
ఏపీఎన్జీవోలు సభల పేరుతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతాంగా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ వేళ విభజిస్తే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల మీడియా కథనాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఈటెల పై విధంగా స్పందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీఎన్జీవోల సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను శనివారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఆ సభకు కిరణ్ సర్కార్ అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు టిఎన్జీవోలు నగరంలో చేపట్టనున్న శాంతి ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పట్ల తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబును ఎందుకు నిలదీయరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్న ఏపీఎన్జీవో నేతలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ఎందుకు నిలదీయడం లేదని మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు లేఖ ఇచ్చినా ఆయన్ను రాజీనామా చేయాల్సిందిగా ఎందుకు డిమాండ్ చేయడంలేదన్నారు. అన్ని పార్టీలు లేఖలిచ్చిన తరువాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని...ఇందులో తమ పార్టీ తప్పేముందన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం కొండ్రు మీడియాతో మాట్లాడుతూ కేవలం తమ పార్టీనే లక్ష్యంగా ఆందోళనలు చేస్తే ఊరుకునేది లేదని, ఇకపై తమ పార్టీ నేతల జోలికొచ్చినా, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫొటోలను తగలబెట్టినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇకపై మౌనంగా ఉండకుండా జనంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. -
'ఢిల్లీలో కదలిక వచ్చే రీతిలో హైదరాబాద్ సభ'
-
'ఢిల్లీలో కదలిక వచ్చే రీతిలో హైదరాబాద్ సభ'
హైదరాబాద్: ఢిల్లీలో కదలిక వచ్చే రీతిలో హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామని ఏపి ఎన్జిఓ నేతలు చెప్పారు. హైదరాబాద్‌లో సమైక్యవాదం ఉందని నిరూపిస్తామన్నారు. ఎన్జిఓ నేతలు ఈ నెల 7న ఛలో హైదరాబాద్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. 7న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహనా సదస్సు’ కేవలం 13 జిల్లాల సభ కాదని, రాష్ట్రంలోని 23 జిల్లాల సభ అని ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అదే రోజు తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపడతామని తెలంగాణ రాజకీయ జేఏసీ తెగేసి చెబుతుండటంతో పరిస్థితి ఎటు తిరిగి ఎటు వెళ్తుందోనన్న ఆందోళనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్ర పోలీసులకు ఏడో తేదీ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు ఒకేరోజు కార్యక్రమాలు చేపట్టడంతో టెన్షన్ నెలకొంది. -
నిన్నటి మిత్రులే.. నేటి శత్రువులు
సీమాంధ్రులకు పదోన్నతులు ఎలా ఇస్తారంటున్న టీ-ఉద్యోగులు ఉద్యోగులకు భద్రత కల్పిస్తామన్న మాటలన్నీ నీటి మూటలే అవమానించి పంపేసినా.. కిమ్మనని నేతలు, ఉద్యోగ నాయకులు ''రాష్ట్ర విభజన జరిగినా ఇక్కడి ఉద్యోగులకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. ఆప్షన్లు ఉంటాయి. ఉద్యోగులు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉండవచ్చు. ఉత్తరాఖండ్ విభజన సందర్భంగా అదే జరిగింది. సర్వీసు అంశాలు కాకుండా మరేదైనా ఉంటే చెప్పండి. కృత్రిమ సమస్యలు సృష్టించడం సరికాదు''... ఇవీ ఏపీఎన్జీవోల సమ్మె విషయంలో రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ శివరామిరెడ్డి సూపరింటెండెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించగా, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, మెడికల్ జేఏసీల ప్రతినిధులు ఆయన చాంబర్‌ను ముట్టడించారు. లోపలికి వెళ్లి శివరామిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ‘మీకన్నా ఎక్కువ సీనియారిటీ ఉన్న డాక్టర్ సువర్ణకు దక్కాల్సిన పోస్టులో ఎలా కొనసాగుతారు’ అంటూ ప్రశ్నించారు. వెంటనే ఉన్నతాధికారులను కలిసి ఉస్మానియా సూపరింటెండెంట్‌గా కొనసాగలేనని చెప్పాలని, లేకుంటే ఇప్పటికిప్పుడే వైద్య సేవలు నిలిపేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఆయనను సూపరింటెండెంట్ కుర్చీ నుంచి తప్పించి సువర్ణను కూర్చొబెట్టి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఉస్మానియా దంత వైద్య కళాశాలలోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికింకా రాష్ట్రం విడిపోలేదు. కనీసం దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. కేవలం కాంగ్రెస్ పార్టకి చెందిన నిర్ణాయక మండలి సీడబ్ల్యుసీ నుంచి తాము అంటే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖమేనని ఒక్క మాట వచ్చిందంతే. ఇంకా మాట్లాడితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్టు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోం శాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అది మరో 20 రోజుల్లో మంత్రివర్గం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో జరిగిన ప్రధానమైన పరిణామాలు ఇవే. అందువల్ల ఉద్యోగులకు వచ్చిన ముప్పేమీ లేదని, వాళ్లు ఎంచక్కా పనులు చేసుకోవచ్చని, పదోన్నతులు కూడా యథాతథంగా పొందొచ్చని అన్నట్లుగా హైకోర్టు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. కానీ, అప్పుడే విభజన జరిగిపోయినట్లు, తమకు రావాల్సిన పదోన్నతులు, ఉద్యోగాలను సీమాంధ్ర వాళ్లు తన్నుకెళ్తున్నట్లు భావించిన కొంతమంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సోమవారం నాడు ఇతరులను అవమానపరిచేలా ప్రవర్తించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వచ్చిన సూపరింటెండెంట్ ఉద్యోగంలో చేరిన వ్యక్తి వద్దకు గుంపుగా ఓ పాతిక మంది వెళ్లి, ఆ ఉద్యోగం చేయలేనంటూ ఉన్నతాధికారులకు చెప్పాలని బెదిరించారు. లేని పక్షంలో సహకరించేది లేదని హెచ్చరించారు. దాంతో చేయగలిగింది ఏమీ లేక.. తీవ్ర అవమాన భారంతో శివరామిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నది సీమాంధ్రుడా.. తెలంగాణ వాళ్లా అన్నది ప్రశ్న కాదు. ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్న ఒక వ్యక్తి వద్దకు వెళ్లి, నువ్వా సీట్లో కూర్చోడానికి వీల్లేదు, వెళ్లిపో అంటూ పాతికమంది వచ్చి బెదిరించి, అక్కడినుంచి పంపేస్తే.. ఆ వ్యక్తి ఎంత భయాందోళనలకు గురవుతారు.. ఎంత అవమాన భారంతో కుంగిపోతారు? సీమాంధ్ర ఉద్యోగుల రక్షణ బాధ్యత మాదీ అని ఎవరూ అడగకపోయినా తెగ ప్రకటిస్తున్న రాజకీయ నాయకులు.. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇలాంటి సంఘటనలకు ఏమని సమాధానం చెబుతారు? సీమాంధ్ర ఉద్యోగులతో తమకు ఎలాంటి వివాదాలు లేవని, వాళ్లు.. తాము అన్నదమ్ముల్లాంటి వాళ్లమేనని, తమ పోరాటం కేవలం ఆ ప్రాంత రాజకీయ నాయకులమీద మాత్రమేనని ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకుడు దేవీప్రసాదరావు లాంటి వాళ్లు ఈ సంఘటనలకు ఏం జవాబిస్తారు? ఉద్యోగ భద్రత అనేది ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఆయా యాజమాన్యాలు కల్పించే హక్కు. ఉన్నతాధికారులు ఏ స్థానంలో పనిచేయాలని ఆదేశిస్తే ఆ బాధ్యతలను నెరవేర్చాలి. అలాంటిది, ప్రభుత్వం అప్పజెప్పిన పని చేయడానికి వీల్లేదంటూ కొంతమంది వెళ్లి బెదిరించి, కుర్చీలోంచి లాగి పారేస్తే అవతలి వాళ్లు ఎలా భావిస్తారు? ఏపీ ఎన్జీవోలు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని చాలామంది చెబుతున్నారు. కానీ, గతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగినప్పుడు సాక్షాత్తు కోర్టులో ఎలాంటి సంఘటనలు జరిగాయో అందరికీ తెలుసు. న్యాయమూర్తుల మీద పుస్తకాలు విసిరేసిన సంఘటన కారణంగా ఓ సీనియర్ న్యాయమూర్తి తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేయడానికి సైతం సిద్ధపడిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. కానీ ఇప్పుడు ఏపీ ఎన్జీవోల సమ్మె విషయంలో అలాంటివి ఏమీ జరగట్లేదు. అయినా దాన్ని మాత్రం అక్రమం అంటున్నారు. అంటే.. ఏది అక్రమమో, ఏది సక్రమమో ఎలా తేలుస్తారు? ఏపీ ఎంప్లాయీస్ కాండక్ట్ రూల్స్‌లోని రూల్ (4) ప్రకారం ఉద్యోగులు సమ్మెచేయడం నిషేధం, రూల్ (5) ప్రకారం ఎలాంటి ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదు. అయినప్పటికీ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నార'ని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల తరఫున వాదించిన సత్యంరెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉందని కూడా ఆయన ధ్రువీకరించేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఉన్న ఆర్టికల్ 371(డి) ప్రకారం, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధి లాంటి విషయాల్లో అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంది. అయినా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సి వస్తే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? విభజనకు అనుకూలంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, దాన్ని అమలుచేయడానికి పాత రాష్ట్రాల అనుభవాలను బట్టి చూస్తే ఎంత లేదన్నా మూడు నాలుగేళ్లు పడుతుంది. పైగా రాజధానిగా ఉన్నప్రాంతం ప్రత్యేకంగా విడిపోవడం అంటూ ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడా లేదు. దీంతో అనేక సమస్యలు వస్తాయి. వీటన్నింటికీ పరిష్కారం చూపకముందే రాష్ట్ర ఏర్పాటు గురించిన ప్రకటనలను కేంద్ర మంత్రులు ఎడా పెడా ఇష్టారాజ్యంగా చేసి పారేస్తుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లకు ఆందోళన కలగకుండా ఏమవుతుంది? ఈ భేతాళ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలంటే విక్రమార్కుడు కత్తి పట్టుకుని మళ్లీ శ్మశానానికి బయల్దేరాల్సిందేనేమో!! -
చంద్రబాబు గుంట నక్క: కొండ్రు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ పెంపుడు కుక్కగా మారారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య విద్య మంత్రి కొండ్రు మురళీమోహన్ తీవ్రంగా స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజాప్రతినిధులను పెంపుడు కుక్కలంటావా? నువ్వే పెద్ద గుంట నక్కవు. నీ పక్కన మరికొన్ని గుంట నక్కలను పెట్టుకుని నిస్సిగ్గుగా మాట్లాడిస్తున్నావు. వాళ్లతోపాటు మరో ఐదువేలమంది కుక్కలను వెంట పెట్టుకుని యాత్ర చేస్తున్నావు’’ అని ధ్వజమెత్తారు. సోనియాగాంధీకి డబ్బు పిచ్చి పట్టిందంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘రెండెకరాల ఆసామివి రూ. 20 వేల కోట్లు సంపాదించుకున్నావు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని బతుకుతున్న నువ్వా మాట్లాడేది? నీకు నిజంగా ధైర్యముంటే, అవినీతికి పాల్పడలేదనుకుంటే నీ ఆస్తులపై సీబీఐ విచారణ వేయించుకో’’అని సవాల్ విసిరారు. ఉద్యమం చేస్తున్న ఏపీఎన్జీవోలు కూడా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి మంత్రి పదవుల రాజీనామాల వ్యవహారాన్ని ప్రస్తావించగా... కాంగ్రెస్‌లో ఉండటం ఇష్టంలేనివారే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. విభజన అనివార్యమైతే విశాఖను రాజధాని చేయాలన్నారు. -
33వ రోజూ ఆందోళనల హోరు
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం అవిశ్రాంతంగా కొనసాగుతోంది. సెలవులు, పండుగలు, ఇతర వ్యాపకాలేమీ లేకుండా అన్నివర్గాల ప్రజలు లక్ష్యసాధనలో మమేకం అవుతున్నారు. ఉద్యమస్ఫూర్తి ఎక్కడా తొణక్కుండా ఎన్జీవోలు, సమైక్యవాదులు కార్యాచరణలతో ముందుకుసాగుతున్నారు. 33వ రోజైన ఆదివారం జిల్లా వ్యాప్తంగా వినూత్న నిరసనలతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు అలుపెరగకుండా ఉద్యమాన్ని కొనసాగించాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో ఏడో రోజు రిలే నిరాహార దీక్షల్లో రెవెన్యూ, ఆర్టీసీ, నీటిపారుదల శాఖ, రిటైర్డు ఉద్యోగులు కూర్చున్నారు. ఈ దీక్షలకు మద్దతు పలికిన చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యత అంటూనే ప్రజలను మోసగించడం ప్రజాప్రతినిధులకే చెల్లుతోందన్నారు. ఈ విధానాలకు స్వస్తి పలకకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి పాత బస్టాండ్ వరకు రైల్వే సీజనల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో, ఫోర్‌మెన్ వర్కర్స్ యానియన్ ఆధ్వర్యంలో నగరంలో మోటార్ సెకిళ్ళ ర్యాలీలు నిర్వహించారు. భీమవరం ప్రకాశంచౌక్ వద్ద విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించి మానవహారంగా ఏర్పడ్డారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో జేఏసీ నాయకులు ముచ్చర్ల సంజయ్ నేతృత్వంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ సెంటర్లో నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న గెడ్డం బాబు, మాఘం వెంకటసుబ్బారావుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆచంటలో జేఏసీ ఆధ్వర్యంలో జరగుతున్న దీక్షలో నియోజకవర్గ పాత్రికేయులు పాల్గొన్నారు. పెనుగొండలో తాపీ పనివారు సోనియా, కేసీఆర్‌లకు సమాధులు కట్టి నిరసన తెలిపారు. యలమంచిలి మండలంలో ఉపాధ్యాయులు చేపట్టిన బైక్ ర్యాలీకి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు స్వాగతం పలికారు. చించినాడ, దొడ్డిపట్లలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్లో టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. పెదఅమిరం ఏసుక్రీస్తు సహవాస సంఘ చర్చి ఆధ్వర్యంలో 500 మంది విశ్వాసులు ర్యాలీ, రాస్తారాకో, మానవహార ం చేశారు. ఈ నిరసనలో పాతపాటి సర్రాజు, ఎమ్మెల్యే శివ పాల్గొన్నారు. ఆకివీడులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారాకో చేశారు. జంగారెడ్డిగూడెంలో వాక ర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ చేపట్టారు. కామవరపుకోటలో రోడ్‌పై జేఏసీ సభ్యులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. చింతలపూడిలో కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు, స్థానిక మార్కెట్ కమిటీ వద్ద నుంచి ఫైర్‌స్టేషన్ వరకు ర్యాలీ సాగింది. గోపాలపురంలో ఉపాధ్యాయులు 48 గంటల నిరవధిక నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. గోపాలపురం, నల్లజర్లలో టీడీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
జీతాలు వద్దు: విశాఖ ఎమ్మెల్యేల నిర్ణయం!
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఏపీఎన్జీవోలకు ప్రభుత్వం జీతాలను నిలిపివేసినందుకు నిరసనగా తమ వేతనాలను కూడా తీసుకోకూడదని పలువురు విశాఖ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, ద్రోణంరాజు శ్రీనివాస్, అవంతి శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు జీతాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. -
ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో 7న భారీబహిరంగ సభ
-
ఏదో ఒకటి తేల్చిచెప్పండి : ఏపీఎన్జీవో
సమైక్య సభకు అనుమతిపై పోలీసులకు ఏపీఎన్జీవోల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి వచ్చే నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తాము తలపెట్టిన సమైక్య సభకు అనుమతి ఇవ్వాలని, లేదంటే ఇవ్వలేమని తేల్చిచెప్పాలని ఎపీఎన్జీవోలు పోలీసులను కోరారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తదితరులు శుక్రవారం డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి మంజూరు చేస్తే శాంతిభద్రతల సమస్య తలత్తే అవకాశముందని పోలీస్ కమిషనర్ చెప్పారని ఏపీఎన్జీవో నేతలు వెల్లడించారు. ఉన్నతాధికారులకు నివేదించామని, రెండు మూడు రోజుల్లో చెబుతామని హామీ ఇచ్చారని వారు చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి సభకు అనుమతిపై మాట్లాడటానికి ప్రయత్నించామని, అయితే ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయామని ఏపీఎన్జీవో నేతలు తెలిపారు. -
జగన్‌తో నడిచేందుకు జనం సిద్ధం: గోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ ఆర్యోగంగా ఉండటం ప్రజలకు అవసరమని, ఆరోగ్యం క్షీణిస్తున్నందున నిరాహార దీక్ష విరమించాలని ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు గోపాలరెడ్డి శుక్రవారం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలసి నడవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ఆరోగ్యం దెబ్బతింటే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రజానాయకుడు ముద్ద ముట్టకుండా దీక్ష చేస్తుంటే ప్రభుత్వం స్పందించి దీక్ష విరమింపజేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఎవరి ఆత్మగౌరవం కోసం చంద్రబాబు యాత్ర: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ఎవరి ఆత్మగౌరవం తగ్గిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర తలపెట్టారని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా యాత్ర ప్రారంభిస్తే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని శుక్రవారం ఆయన ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ హెచ్చరించారు. చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పాదయాత్ర సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇచ్చానని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రలో ఆత్మ గౌరవ యాత్ర ప్రారంభానికి ముందే సమైక్యవాదంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. నెల రోజులుగా సీమాంధ్రలో జనం రోడ్లమీదకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో యాత్రలు చేస్తే వారు భరించే పరిస్థితుల్లో లేరని అన్నారు. -
తోకే కుక్కను ఊపితే?
మామూలుగా అయితే కుక్క.. తోకను ఊపుతుంది. కానీ, తోకే కుక్కను ఊపే పరిస్థితి వస్తే..? సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితి ఇప్పుడు సరిగ్గా ఇలాగే తయారైంది. ఇన్నాళ్లూ తమకు ఫలానా చోట పోస్టింగు కావాలనో.. ప్రమోషన్ ఇప్పించాలనో, ఏదో ఒక పనిమీద రాజకీయ నాయకుల వద్దకు ఉద్యోగులు వెళ్లడం, వాళ్లను ప్రాధేయపడటం సర్వసాధారణంగా జరిగే విషయం. నాయకులు కుదిరితే పని చేయడం, లేనిపక్షంలో వాళ్లను పదే పదే వెంట పడొద్దంటూ ఒక్కోసారి కసురుకోవడం కూడా మనం ఇన్నాళ్లూ చూస్తూనే వచ్చాం. కానీ ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ఉద్యోగ నాయకులు ఒక్కసారిగా నాయకుల మీద మండిపడుతున్నారు. రాష్ట్రం మండిపోతుంటే ఇంకా మీరెందుకు పట్టించుకోవట్లేదంటూ నిలదీస్తున్నారు. నాయకులు వాళ్లకు సమాధానం చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక మౌనంగా మిగిలిపోతున్నారు. రాష్ట్ర విభజనకు తాము అనుకూలంగానే ఉన్నామని, త్వరలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సరిగ్గా నెల రోజుల క్రితం ఏ ముహూర్తంలో ప్రకటించారో గానీ, అప్పటి నుంచి సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అన్ని వర్గాల వాళ్లు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చి కనీ వినీ ఎరగని స్థాయిలో ఉద్యమం నడిపిస్తున్నారు. మొదట్లో, ఏముందిలే.. నాలుగు రోజులు గడిస్తే వాళ్లే ఊరుకుంటారని నాయకులు ఈ ఉద్యమాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. నాయకత్వం లేని ఉద్యమం ఎన్నాళ్లో సాగదని భావించారు. అందుకే దీని మీద పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా ఎంపీలు, కేంద్రమంత్రులు సీమాంధ్ర ఉద్యమం విషయంలో వ్యవహరించిన తీరు చాలా విమర్శలకు దారితీసింది. కానీ రోజులు గడిచేకొద్దీ వాళ్లకు పరిస్థితి క్రమంగా అర్థం కావడం మొదలైంది. కానీ అప్పటికే చెయ్యి జారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసేసుకున్నామని, ఈ విషయంలో యూటర్న్ తీసుకునే ప్రసక్తి లేదని అధిష్ఠానం వాళ్లకు స్పష్టం చేసింది. పార్టీ పెద్దలకు ఏమైనా చెబుదామన్నా వాళ్లు వినిపించుకోవట్లేదు. తప్పనిసరిగా విభజనకు అంగీకరించాల్సిందేనని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, ఇతర వర్గాలకు చెబుదామంటే, కనీసం మాట కూడా మాట్లాడనిచ్చేలా లేరు. దీంతో ఏం చేయాలో తెలియక మాట్లాడకుండా ఊరుకున్నారు. కానీ ఈ మౌనాన్ని భరించేందుకు మాత్రం సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఏమాత్రం సిద్ధంగా లేరు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే, కేంద్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని వాళ్లంతా తీవ్రంగా మండిపడుతున్నారు. కేవలం పదవులు పట్టుకుని వేలాడటం తప్ప ఈ విషయంలో అసలు చేసిందేంటని నిలదీశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో సరిగ్గా ఇదే జరిగింది. కేంద్ర మంత్రులు, ఎంపీల మీద ఏపీ ఎన్జీవో నాయకులు, విద్యార్థి నాయకులు ఒక రకంగా విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ అసలేం చేస్తున్నారని నిలదీశారు. కేంద్ర మంత్రులు కె. చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, పనబాక లక్ష్మి, కావూరి సాంబశివరావు, ఎం.ఎం. పళ్లంరాజు, జె.డి. శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు కేవీపీ రామచంద్రారావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవిల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ పాల్గొన్నారు. ఉద్యోగుల తరఫున ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు దాదాపు 30 మంది వివిధ సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాజీనామాలు చేయకుండా జనంలో తిరగగలమనుకుంటున్నారా? రాజీనామాలు చేసి జనంలోకి రండి.. మిమ్మల్ని గెలిపించే పూచీ మాది అని కూడా నాయకులకు ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు. చిరంజీవి, కావూరి, కోట్ల, పనబాక.. ఇలా ప్రతి ఒక్కరినీ ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు నిలబెట్టి కడిగేశారు. దాంతో నాయకులంతా తాము కూడా రాజీనామాలకు సిద్ధమేనని చెప్పినా.. వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదని, చెయ్యాలంటే రెండు మూడు రోజుల్లోనే రాజీనామాలు చేసేస్తామని వాళ్లకు నచ్చజెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఏమీ చేయలేక మెత్తగానే వ్యవహరించిన ఈ నాయకులు, రేపు ఆందోళనలు చల్లారి, కొత్త రాష్ట్రం ఏర్పడినా లేక ఒకే రాష్ట్రంగా ఉన్నా కూడా.. తమ విషయంలో ఎలా వ్యవహరిస్తారోనన్న అనుమానాలు కూడా ఉద్యోగ వర్గాల్లో లేకపోలేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉద్యోగులు ఆందోళనలు చేసి, నాయకులను నిలదీసినా, అప్పట్లో ప్రధానంగా జేఏసీ అనే ఒక వేదిక ఉండటం, టీఆర్ఎస్ కూడా అందులో ప్రధాన పాత్ర పోషించడంతో ఉద్యోగ వర్గాల మీద పెద్దగా కక్షసాధింపు చర్యల్లాంటివి ఏమీ జరగలేదు. పైపెచ్చు, స్వామిగౌడ్ లాంటి వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు కూడా దక్కాయి. కానీ ఈసారి ఉద్యమంలో అలా జరిగే అవకాశం కనిపించట్లేదు. ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రస్తుతానికి ఎలా చూస్తున్నా.. తర్వాతి కాలంలో నాయకులు వీళ్ల విషయంలో ఎలా వ్యవహరిస్తారోనన్నది అనుమానమే. అప్పుడు మళ్లీ కుక్కే తోకను ఊపుతుందన్న మాట!! -
సంయుక్త ఉద్యమ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు పూర్తి మద్దతు ఉంటుందని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు హామీ ఇచ్చారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ‘‘రాజీనామాలతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే పార్టీకి, ప్రభుత్వ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటే సీమాంధ్రుల మనోభావాలను కేంద్రానికి వెల్లడించడం కష్టమవుతుందన్నారు. కాబట్టి మరికొంత సమయం వేచిచూద్దామన్నారు’’ అని వెల్లడించారు. ఉద్యమంలో రాజకీయ నేతలు, ఉద్యమ శక్తులు కలిసి పని చేసేందుకు వీలుగా కమిటీ ఏర్పాటు చేద్దామని మంత్రులు ప్రతిపాదించగా అంగీకారం తెలిపామన్నారు. త్వరలోనే ఇరు పక్షాలతో కమిటీ వేసి భావి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. తమ ఉద్యమంలో మంత్రులు కలిసి వస్తామని చెప్పడం శుభపరిణామమని, దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. గురువారం మధ్యాహ్నం పార్లమెంటు హాల్లో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఏపీ ఎన్జీవోలు సమావేశమయ్యారు. పలు అంశాలపై మూడు గంటల పాటు చర్చించారు. ఆ వెంటనే వారంతా మరోమారు ఏపీభవన్లోనూ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేవీపీ రామచంద్రరావు పాల్గొన్న ఈ భేటీలోనూ మంత్రులు, ఎంపీల రాజీనామాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని మేమంతా గట్టిగా డిమాండ్ చేశాం. రాజీనామాలు చేయనంత మాత్రాన తమకు ఒరిగేదేమీ లేదని మంత్రలు, ఎంపీలు అన్నారు. ఆరు నెలల్లో పోయే పదవుల కోసం పాకులాడబోమని, ఉద్యమాన్ని ఉద్యోగులు ముందుకు తీసుకెళ్తామంటే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం అవుతుందంటే ఇప్పుడే రాజీనామాలు ఇస్తామన్నారు. కానీ అలా చేస్తే సీమాంధ్రలో ఉద్యమ పరిస్థితిని, వాస్తవాలను కేంద్రానికి చెప్పే వీలుండదని చెప్పారు. ఉద్యమ స్వరూపాన్ని వివరించి, విభజన నిర్ణయాన్ని రద్దు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు’’ అని ఆయన వివరించారు. ‘రాజకీయ నాయకులు, ఉద్యమ శక్తులు కలిసి నడుద్దాం. ప్రజాప్రతినిధుల తరఫున ఇద్దరు, ఉద్యోగుల నుంచి కొందరితో కమిటీ వేసుకుని ముందుకెళ్దాం’ అని సూచించారన్నారు. ఆ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఇరుపక్షాల నేతలతో కలిసి కమిటీ వేసి కార్యాచరణపై చర్చించుకుంటామన్నారు. ఉద్యోగ సంఘాలు ఆంటోనీ కమిటీ ముందుకు వెళ్లడంపై చర్చ జరిగిందని, కానీ అందుకు తాము అంగీకరించలేదని అన్నారు. హైదరాబాద్ సభకు మంత్రుల మద్దతు సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మంత్రులు, ఎంపీలు మద్దతిస్తామన్నారని అశోక్‌బాబు తెలిపారు. వీలును బట్టి అందులో పాల్గొనేందుకు కూడా సిద్ధమని వారు చెప్పారని, తమ హాజరుపై రాజకీయ దుమారం రేగుతుందనుకుంటే తమ ప్రతినిధులను పంపుతామన్నారని చెప్పారు. ‘సభ నిర్వహణలో ఏర్పడుతున్న అడ్డం కులను వారి దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి ఇప్పిస్తామని వారు చెప్పారు’ అన్నారు. వెనక్కు రాకున్నా ముందుకు పోదు ప్రస్తుత ఢిల్లీ పరిస్థితులు, పార్టీల అభిప్రాయాలను చూస్తుంటే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు వెళ్లలేకున్నా ప్రక్రియను మాత్రం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని స్పష్టమైందని అశోక్‌బాబు అన్నారు. ‘‘విభజనతో సీమాంధ్రలో తలెత్తే పలు అంశాలను కేంద్రం విస్మరించిందని, వాటికి పరిష్కారం చూపకపోవడం సరికాదని బీజేపీ, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, జేడీ(యూ) అభిప్రాయపడ్డాయి’’ అన్నా రు. విభజన సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తెలంగాణ ప్రక్రియపై ఒక్క అడుగూ ముందుకు వేయలేదన్న నమ్మకం తమకు కలిగిందన్నారు. -
సీమాంధ్ర కేంద్రమంత్రులపై ఏపీ ఎన్జీవోలు ఆగ్రహం
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఏపీ ఎన్జీవోల సంఘం డిమాండ్ చేసింది. ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు గురువారం న్యూఢిల్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులతో సమావేశమైయ్యారు. అనంతరం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎన్జీవోల సంఘం నాయకులు ప్రసంగించారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు వ్యవహారిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే కేంద్రం తప్పక దిగివస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం వారు సమైక్య రాష్ట్రం కోసం గట్టి పోరాటం చేయాలని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు మాట్లాడటం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం నాయకులు ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. -
అన్యాయం జరగనివ్వం : ప్రధాని
ఏపీఎన్జీవో, ఇతర సంఘాల నేతలతో ప్రధాని ఏ ప్రాంతానికీ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందన్న మన్మోహన్సింగ్ విభజనతో ఎదురయ్యే సమస్యలు విన్నవించిన సంఘాల ప్రతినిధులు ప్రధాని దృష్టికి హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు అప్పుడే ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారంటూ వివరణ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని వినతి ప్రధాని నుంచి ఎలాంటి హామీ లభించలేదన్న అశోక్‌బాబు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో ఎదురయ్యే సమస్యలను పరిశీలించి ఏ ప్రాంతానికీ ఎలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అంగీకరించారు. పార్టీ పరంగా తీసుకొన్న నిర్ణయాన్ని మార్చుకోలేకపోయినా ప్రభుత్వ పరంగా ఏ వర్గానికీ, ప్రాంతానికీ అన్యాయం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఏపీఎన్జీవోలు, టీచర్లు, ఆర్టీసీ, మునిసిపల్ ఉద్యోగ సంఘాలు, విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలోని కార్యాలయంలో ప్రధానితో సమావేశమయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రాన్ని విభజిస్తే కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలకు ఎదురయ్యే సమస్యలను, ఇబ్బందులను వారాయనకు వివరించారు. తెలంగాణ నిర్ణయం వెలువడిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై హింసాయుత దాడులు ప్రారంభమైన విషయాన్ని మన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ స్థాయిలో ప్రక్రియ ప్రారంభం కాకముందే తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, తమ సంఘాల సమావేశాలను నిర్వహించుకునే స్వేచ్ఛను కూడా కాలరాస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం పూర్తిగా రాజకీయవేత్తలు తమ స్వార్థం కోసం సృష్టించి, ప్రజలను రెచ్చగొట్టి చేసిందేనని ఆరోపించారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల కంటే అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతం ఎంతో ఎక్కువగా అభిదృద్ధి చెందిందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విస్పష్టంగా తేల్చిచెప్పిన తర్వాత కూడా సెంటిమెంట్ పేరుతో తొలి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేస్తారని వారు ప్రధానిని ప్రశ్నించా రు. రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడకుండా తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించి రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడినప్పుడు ఆంధ్ర ఉద్యోగులకు ఎదురైన సీనియారిటీ, పింఛను వంటి తీవ్రమైన సమస్యల పరిష్కారానికి 15 ఏళ్లకు పైగా సమయం పట్టడాన్ని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. విభజన నిర్ణయాన్ని అమలు చేస్తే వేలాదిమంది ప్రభుత్వోద్యోగులు తమ ఆస్తులను, హైదరాబాద్‌తో పెంచుకున్న అనుబంధాన్ని వదులుకొని వెళ్లిపోవాల్సి వస్తుందని తెలిపారు. సమ్మె విరమించి చర్చించమన్నారు: అశోక్‌బాబు రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించే విషయంలో ప్రధాని మన్మోహన్సింగ్ ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పా రు. ప్రధానితో సమావేశానంతరం ఆయన విజయ్‌చౌక్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆందోళనలు విరమించి కమిటీతో చర్చించాలని ప్రధాని సూచించి నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా, టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్న విషయం ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని, మీకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రధానితో పాటు వివిధ జాతీయ రాజకీయ పార్టీల నాయకులను కూడా కలుసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరామన్నారు. సోమ, మంగళవారాల్లో బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ, జనతాదళ్(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్, అన్నాడీఎంకే నేత తంబిదురై, తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ, సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్‌యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం నేత సీతారాం యేచూరి, డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు తదితరులకు సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజాందోళనను వివరించామని అశోక్‌బాబు తెలిపారు. ఆంటోనీ కమిటీతో భేటీ అయ్యే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించదలచిన భారీ ర్యాలీకి హాజరుకావాల్సిందిగా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలను, కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జె.డి.శీలం, ఎంపీలు కనుమూరి బాపిరాజు, జి.వి.హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, బొత్స ఝాన్సీ ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. -
సమ్మె చట్టబద్ధమా..? కాదా..?
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరంలు చేస్తున్న సమ్మె చట్టబద్ధమా..? కాదా..? అన్న విషయాన్ని మాత్రమే తాము తేలుస్తామని, రాజకీయపరమైన అంశాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులు సమాజంలో భాగమని, రాజ్యాంగ విధులను నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపింది. సమ్మెకు సంబంధించి పూర్తి వివరాలతో శుక్రవారం నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరంలను మరోసారి ఆదేశించిన హైకోర్టు, విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గతవారం విచారించి, ఎన్జీవోలకు, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరంలకు నోటీసులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, సోమవారం దానిని మరోసారి విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. నాలుగైదు రోజుల గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీఎన్జీవోల తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి తెలిపారు. గతవారం కూడా ఇలానే చెప్పారు కదా... అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్జీవో నాయకులు అందుబాటులో లేరని, ఈ విషయం తెలియని జూనియర్ న్యాయవాది, కోర్టుకు ఆ విధంగా చెప్పి ఉండవచ్చునని మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో మరో సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ జోక్యం చేసుకుంటూ... ఎక్సైజ్ ఉద్యోగులు ఈ కేసులో ప్రతివాదిగా చేరాలని భావిస్తున్నారని, అందువల్ల ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు తమకు అనుమతినివ్వాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. ‘‘కౌంటర్లు లేకుండా ఈ కేసులను ఎలా విచారించాలి..? శాంతిభద్రతల పరిరక్షణమే మాకు ముఖ్యం. రాజకీయపరమైన అంశాలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. చట్టబద్ధమైన కారణాలు ఉంటే తప్ప విధులకు ఆటంకం కలిగించడానికి వీల్లేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయాలన్నింటినీ తేల్చే ముందు అసలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడంలో పిటిషనర్ ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని మోహన్‌రెడ్డి కోరారు. ‘‘సమ్మె చట్టబద్ధమా..? కాదా..? అన్న విషయమే మాకు ముఖ్యం. వారు చేస్తున్న సమ్మె సరైందేనని తేలితే అది చట్టబద్ధమైందని చెబుతాం. సరైంది కాకుంటే సమ్మె చట్ట వ్యతిరేకమని తేలుస్తాం. మాకు సెంటిమెంట్లు, భావోద్వేగాలు మాకు ముఖ్యం కాదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని, ఒకవేళ దాఖలు చేయకుంటే కేసును విచారిస్తూ వెళతామని తేల్చి చెప్పింది. అన్ని చర్యలూ తీసుకుంటున్నాం: ప్రభుత్వం ఏపీఎన్జీవోల సమ్మెవల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని, అత్యవసర సేవలకు, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపింది. సమ్మె నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలన్న ధర్మాసనం ఆదేశాల మేరకు సాధారణ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీ జి.కృష్ణవేణి కౌంటర్ దాఖలు చేశారు. బదిలీలు, పదోన్నతులు, సీనియారిటీ వ్యవహారాల్లో అనిశ్చితి, 10వ పీఆర్సీ, మధ్యంతర భృతి, నగదురహిత ఆరోగ్యకార్డులు, రాష్ట్ర విభజన ప్రక్రియను నిలుపుదల చేయడం తదితర అంశాలపై ఏపీఎన్జీవో, సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నోటీసులు ఇచ్చాయని తెలిపారు. మొత్తం పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని, ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం రెండుసార్లు చర్చలు జరిపిందని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఆమె కోర్టును కోరారు. -
సీమాంధ్ర ఉద్యోగుల ఢిల్లీ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ఏపీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 25న ఢిల్లీ యాత్రకు సమాయత్తమవుతున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లటానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవటానికి సహకారం కోరటం ఈ యాత్ర లక్ష్యంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే అనర్థాలను వివరించటంతో పాటు శ్రీకృష్ణ కమిటీ నివేదిక మీద పార్లమెంటులో చర్చించాలని అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేయనున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఆంటోనీ కమిటీతోనూ భేటీ కావాలని నిర్ణయించింది. అయితే ఈ భేటీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నారు. ఢిల్లీ వెళ్లే బృందంలో అన్ని ప్రధాన సంఘాల నాయకులకు ప్రతినిధి బృందంలో చోటు కల్పించనున్నారు. ఉద్యోగుల రక్తదానం : రాష్ట్రం సమైక్యంగానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు గురువారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరంలోని ఎంజేఎం ఆస్పత్రి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఉద్యోగ ఫోరం అధ్యక్షుడు యూ మురళీకృష్ణ, కార్యదర్శి కేవీ కృష్ణయ్యలు తెలిపారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం వాయిదా వేయాలని సీఎంకు వినతి ఎక్కడ నుంచి అయినా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకొనే విధానం అమలును వాయిదా వేయాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సీమాంధ్ర ఉద్యోగుల ప్రతినిధి బృందం గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. నూతన విధానాన్ని ఈ నెల 25 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. సీమాంధ్రలో ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున అమలును వాయిదా వేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారని భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. రెండు దరఖాస్తుల్నీ పరిశీలిస్తున్నాం: డీసీపీ కమలాసన్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో సభ, చలో ఎల్బీ స్టేడియం కార్యక్రమాలకు సంబంధించి ఏపీ ఎన్జీవోలు, ఓయూ జాక్ నుంచి గురువారం అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని మధ్యమండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు ముందు నుంచే అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని, వీటితో పాటు నగరంలో శాంతి భద్రతల అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే వీటికి అనుమతించడంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 7న హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తాం వచ్చే నెల 7న హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని సీమాంధ్ర ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. సభకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీఎన్జీవో ప్రతినిధి బృందం గురువారం డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసింది. పోలీసులు వినాయక మండపాల బందోబస్తులో నిమగ్నమై ఉంటారని, అందువల్ల సెప్టెంబర్ 7న సభకు అనుమతి ఇవ్వటం సాధ్యం కాదని, అయినా ఉన్నతాధికారులకు నివేదించామని డీసీపీ చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వస్తే వెంటనే సమాచారం అందిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. -
సమైక్యాంధ్ర సభను అడ్డుకుంటాం: తెలంగాణ విద్యార్థి జేఏసీ
సాక్షి,హైదరాబాద్: సమైక్యాంధ్ర పేరుతో ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో బహిరంగసభ ఏర్పాటు చేస్తే అడ్డుకుని తీరుతామని తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. జాక్ చైర్మన్ పిడమర్తి రవి, కన్వీనర్ బాలరాజు, అధ్యక్షుడు మర్రి అనిల్‌కుమార్ గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తులను కాదని హైదరాబాద్‌లో సమైక్య సభలు నిర్వహించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ప్రకటించింది. కాగా, హరికృష్ణ రాజీనామాకు నిరసనగా ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని విద్యార్థి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అదే రోజు ‘తెలంగాణ విద్యార్థి ప్రజా యుద్ధభేరి’ సీమాంధ్ర ఉద్యోగులు వచ్చేనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య సభను అడ్డుకుంటామని, అదే రోజును ‘తెలంగాణ విద్యార్థి ప్రజాయుద్ధభేరి’ పేరిట బహిరంగ సభ పెడతామని ఓయూ జేఏసీ నాయకులు భాస్కర్, అంబేద్కర్ తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు. -
సీఎంతో భేటీ అయిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్‌రెడ్డితో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు గురువారం సమావేశమైయ్యారు. సీమాంధ్రలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను ఆయనకు వివరించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26,27,28 తేదీల్లో ఢిల్లీ వెళ్తామని అశోక్ బాబు తెలిపారు. ఢిల్లీలో జాతీయ నేతలను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతామని పేర్కొన్నారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను వివరిస్తామన్నారు. గతంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించాలని కోరతమన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను కోరినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఏపీ ఎన్జీవోలు తాము హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ భారీ సంఖ్యలోనే సీమాంధ్ర ప్రాంత వాసులు ఉన్నారని, వాళ్ల ప్రయోజనాలను సైతం కాపాడాలని అంటున్నారు. ఇప్పటివరకు విద్యుత్ సౌధ, జలసౌధ లాంటి ప్రాంతాల్లో ఏపీ ఎన్జీవోలు - టీఎన్జీవోల మధ్య పలు సందర్భాల్లో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. -
ఏపీఎన్జీవోలు- ఓయూ జేఏసీ నేతల పోటాపోటీ నిరసనలు
ఏపీ ఎన్జీవోలు, ఓయూ జేఏసీ నేతలు పోటాపోటీ నిరసనలకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ ఏడో తేదీన ఎల్బీ స్టేడియంలో భారీగా సమైక్యాంధ్ర సభ నిర్వహించాలని ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు నిర్ణయించారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే.. అదే రోజున అదే ఎల్బీ స్టేడియం వేదిగా మరో భారీ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ సిద్ధమవుతోంది. చలో ఎల్బీ స్టేడియం కార్యక్రమాన్ని ఈనెల ఏడో తేదీన నిర్వహిస్తామని, అందుకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ సెంట్రల్ జోన్ డీసీపీని కలిసింది. ఆరోజు తాము శాంతి ర్యాలీ నిర్వహించి ఎల్బీ స్టేడియానికి వెళ్తామని ఓయూ జేఏసీ నాయకులు డీసీపీకి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఏపీ ఎన్జీవోలు తాము హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ భారీ సంఖ్యలోనే సీమాంధ్ర ప్రాంత వాసులు ఉన్నారని, వాళ్ల ప్రయోజనాలను సైతం కాపాడాలని అంటున్నారు. ఇప్పటివరకు విద్యుత్ సౌధ, జలసౌధ లాంటి ప్రాంతాల్లో ఏపీ ఎన్జీవోలు - టీఎన్జీవోల మధ్య పలు సందర్భాల్లో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కానీ, నేరుగా ఇలా బహిరంగ సభలలో కూడా పోటాపోటీగా వ్యవహరించడం మాత్రం ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు తొలిసారిగా అలాంటి దృశ్యం కూడా ఆవిష్కృతం అవుతుందో.. లేదా పోలీసులు ఎవరో ఒకరికి అనుమతి నిరాకరించి అడ్డుకుంటారో చూడాల్సిందే.