ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె: ఏయూజేఏసీ | AUJAC indefinite strike on september 11th | Sakshi
Sakshi News home page

ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె: ఏయూజేఏసీ

Published Fri, Sep 6 2013 8:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

AUJAC indefinite strike on september 11th

హైదరాబాద్ నగరంలో రేపు ఏపీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవ్ హైదరాబాద్ బహిరంగ సభకు హాజరయ్యేందుకు విశాఖపట్నంలోని ఏపీఎన్జీవో ఉద్యోగులు సమాయత్తమయ్యారు.దాదాపు మూడు వేలమందికిపైగా ఆ సభకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయులు,ఉద్యోగులు,కార్మికులు ఆ సభలో పాల్గొనున్నారు.

 

కాగా ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరితోపాటు సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీనామాలు చేయకుండా తత్సారం ప్రదర్శిస్తుండటం పట్ల విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్శిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఏయూ జేఏసీ శుక్రవారం ఇక్కడ తెలిపింది. అలాగే విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement