ఎల్బి స్టేడియంలో ఈ నెల 7న నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు సంబంధించి ఏపీఎన్జీవోలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: ఎల్బి స్టేడియంలో ఈ నెల 7న నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు సంబంధించి ఏపీఎన్జీవోలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేటాయించిన సమయం కన్నా ఎక్కువ సమయం సభ నిర్వహించినట్లు ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఉద్యోగులనే కాకుండా ఇతరులను కూడా సభకు అనుమతించారన్న అభియోగం మోపారు. ఏపీఎన్జీవోలకు ఈ నోటీసులను సెంట్రల్ జోన్ పోలీసులు జారీచేశారు.
'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభలో సీమాంధ్ర ఉద్యోగులతోపాటు పలువురు కళాకారులు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాద్ వంటి కళాకారులను తొలుత సభకు పోలీసులు అనుమతించలేదు. ఆ తరువాత అనుమతించారు.