save andhra pradesh
-
భారీఎత్తున సేవ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహణ
అమలాపురం, న్యూస్‌లైన్ : అమలాపురం బాలయోగి స్టేడియంలో ఈనెల 22న నిర్వహిస్తున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను లక్షమంది సమీకరణతో భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టు జేఏసీ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం ప్రకటిం చారు. బాలయోగి ఘాట్‌లో సభ ఏర్పాట్లను ఆయన బు ధవారం కోనసీమ జేఏసీ నాయకులతో కలిసి పరిశీలించా రు. హైదరాబాద్ నుంచి వచ్చిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పార్టీ అధ్యక్షుడు కుమార్‌చౌదరి ఆయన వెంట ఉన్నారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేం ద్ర మంత్రులు 18న జరిగే మంత్రుల బృందం సమావేశం లో సమైక్యాంధ్ర మినహా మరేమీ వద్దని స్పష్టం చేయాలని కుమార్‌చౌదరి డిమాండ్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ పోస్టర్లను కోనసీమ జేఏసీ అధ్యక్షుడు వీఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు ఆవిష్కరించారు. కోనసీమ జేఏసీ సలహాదారుడు నక్కా చిట్టిబాబు, నాయకులు కె.సత్తిబాబు, బాపిరాజు, మంత్రిప్రగడ వేణుగోపాల్, అన్యం రాంబాబు, కె.రామకృష్ణారావు, కుంచే స్వర్ణలత, సబ్ రిజిస్ట్రార్ ఎం.సత్యనారాయణరాజు, డాక్టర్ ఏవీఆర్ దైవకృప పాల్గొన్నారు. -
ఢిల్లీ పెద్దలకు,జాతీయ మీడియాకు కోటి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఎస్ఎంఎస్లు
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం 58వ రోజైన గురువారం కూడా ఉవ్వెత్తున సాగింది. విభజన నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి దీక్షల్లో ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలతోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఏలూరులో ఎన్జీవోలు గాంధీగిరీ కార్యక్రమం చేపట్టారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు రోడ్లపై పూజా సామగ్రి విక్రయింటారు. వచ్చీపోయేవారి బూట్లకు పాలిష్ చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై ర్యాలీ చేపట్టిన వికలాంగులు ఏలూరు చేరుకున్నారు. వారికి వైఎస్సార్ సీపీ నాయకుడు గుడిదేశి శ్రీనివాస్, టీడీపీ నాయకుడు మా గంటి బాబు స్వాగతం పలికారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని రాసిన ఎస్ఎంఎస్లను ఢిల్లీ పెద్దలకు, జాతీయ మీడియూకు పంపించే కార్యక్రమాన్ని ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో చేపట్టారు. తెలంగాణ వాదులకు మంచిబుద్ధిని, రాష్ట్రానికి శాంతిని ప్రసాందించాలని కోరుతూ ఎన్జీవోలు ఏలూరు బుద్ధుని పార్కులో వేడుకున్నారు. భీమవరంలో ఎన్జీవోలు సోనియా, దిగ్విజయ్‌సింగ్, షిండే దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి ప్రకాశం చౌక్‌లో దహనం చేశారు. బీవీరాజు విద్యాసంస్థల ఆధ్వర్యంలో పలువురు కళ్లకు గంతలు కట్టుకుని రిలే దీక్ష చేశారు. ఉపాధ్యాయులు జాతీయ రహదారిని దిగ్బంధించి యోగాసనాలు వేసి నిరసన తెలి పారు. ఉండి సెంటర్లో ఉపాధ్యాయులు, ఎన్జీవోలు అల్లూరి, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ వేషధారణలో మానవహారం నిర్మించి నిరసన తెలి పారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరులో భూపతిరాజు రామకృష్ణంరాజు, పి.రాజశేఖర్‌బాబు అనేవారు వేకువజామున 3:15 గంటల నుంచి 36 గంటల దీక్ష చేపట్టారు. ఆకివీడులో సిద్ధాపురం రైతులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షల్లో పాల్గొన్న నాలుగో తరగతి ఉద్యోగులకు దాతల సహకారంతో సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పాలకొల్లు మండలం దిగమర్రులో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. యలమంచిలి మండలం కలగంపూడి వద్ద 214 జాతీయ రహదారిపై జిట్స్ కళాశాల వ్యవసాయ విద్యార్థులు మానవహారం ఏర్పా టు చేశారు. పోడూరులో పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో చేయగా, రావిపాడులో ఉపాధ్యాయులు పాదయాత్ర చేపట్టారు. ఆచంటలో మేళతాళాలు, బుట్టబొమ్మలతో ర్యాలీ నిర్వహించారు. నరసాపురం బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యారుునులు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. కోర్టు సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు న్యాయశాఖ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్లో వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ ఉద్యోగులు వంటావార్పు చేశారు. నాన్ పొలిటికల్ జేఏసీ శిబిరంలో మాజీ మహిళా కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు కూర్చున్నారు. ఉపాధ్యాయులు తాలూకాఫీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొవ్వూరులో గౌతమి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది దీక్షలో చేపట్టారు. జూనియర్ కళాశాల వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మవరం, కుమారదేవం, వేములూరు, మలకపల్లి, కొవ్వూరు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. బుట్టాయగూడెంలో ఉపాధ్యారుునులు రోడ్లు ఊడ్చి విభజన నిర్ణయంపై నిరసన తెలిపారు. చాగల్లులో వడ్రంగి పనివారు రోడ్డుపైనే వృత్తి పనులు చేసి నిరసన తెలిపారు. ఆర్ అండ్ బీ రోడ్డుపై కోలాటం వేసి వాలీబాల్ ఆడారు. -
ఏపీఎన్జీవోలకు పోలీసుల నోటీసులు
హైదరాబాద్: ఎల్బి స్టేడియంలో ఈ నెల 7న నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు సంబంధించి ఏపీఎన్జీవోలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేటాయించిన సమయం కన్నా ఎక్కువ సమయం సభ నిర్వహించినట్లు ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఉద్యోగులనే కాకుండా ఇతరులను కూడా సభకు అనుమతించారన్న అభియోగం మోపారు. ఏపీఎన్జీవోలకు ఈ నోటీసులను సెంట్రల్ జోన్ పోలీసులు జారీచేశారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభలో సీమాంధ్ర ఉద్యోగులతోపాటు పలువురు కళాకారులు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాద్ వంటి కళాకారులను తొలుత సభకు పోలీసులు అనుమతించలేదు. ఆ తరువాత అనుమతించారు. -
కలిసుండడం ఎలా సాధ్యం?
కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజలపై దాడులు చేస్తూనే సమైక్యంగా ఉందామంటున్నారని, ఇది ఎలా సాధ్యమవుతుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి అన్నారు. కరీంనగర్లో సహచర మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలసి ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘జై తెలంగాణ’ అంటూ నినదించిన పోలీస్ కానిస్టేబుల్‌పైన, విద్యార్థులపైన సీమాంధ్ర నేతల, ప్రజలు దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. వందలమంది ఒక్కరినే కిందపడేసి దారుణంగా దాడి చేయడం అమానుషమన్నారు. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండడం వల్లనే హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సభ విజయవంతం అయిందన్నారు. దీన్ని సాకుగా చూపి మిలియన్ మార్చ్ పేరుతో మరో సభ పెట్టాలనుకోవడం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే అవుతుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్తామని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఇచ్చిన మాటకు తిరుగులేదని, ఎవరెన్ని కుట్రలు చేసినా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు కావడం ఖాయమన్నారు. -
కర్ణుడు, మారీచుడు, శల్యుడు.. రాజకీయ నేతలపై సత్యవాణి ధ్వజం
మెడపై కత్తిపెట్టి జై తెలంగాణ అనమంటున్నారు.. అనకపోతే విద్రోహులుగా చూస్తున్నారు కేసీఆర్ తమ్ముడూ.. బతుకమ్మను కూడా ఒక ప్రాంత చట్రంలో ఇరికించింది మీ కూతురు కాదా? కర్రీ సెంటర్ అంటే నీకు అంత చులకన భావమా? నువ్వు మీ భార్య చేతి కూర తినవా? సాక్షి, హైదరాబాద్: మెడపై కత్తిపెట్టి జై తెలంగాణ అనాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, అనకపోతే విద్రోహులు అంటూ ముద్ర వేస్తున్నారని హిందూవాహిని నాయకురాలు సత్యవాణి పేర్కొన్నారు. అందరికీ అమ్మ అయిన బతుకమ్మను కూడా మీ కూతురు ఒక ప్రాంత చట్రంలో ఇరికించడం తెలంగాణ సంస్కృతా? అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణలోని తల్లులు, సోదరులు, సోదరీమణులు ప్రేమ, ఆప్యాయతలు కనబరుస్తారని కానీ విద్యావంతులు, వివేకం ఉన్న పార్లమెంట్ సభ్యులైన తమరు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సదస్సులో ఆమె ప్రసంగం ఉద్యోగులను విశేషంగా ఆకట్టుకుంది. రాజకీయ ప్రతినిధులను మూడు రకాలుగా విభజించి కర్ణుడు, మారీచుడు, శల్యునితో పోల్చారు. ‘‘ప్రధానమంత్రికి అన్నీ ఉన్నా డైనమిజం లేదు. అధికారంలో ఉండి ఏం లాభం? ప్రజలకు న్యాయం చేయనప్పుడు..? పదవి ఇచ్చారు కదా అని కర్ణుని మాదిరిగా మౌనంగా ఉంటే ఎలా? ఇంత ఆందోళన జరుగుతున్నా మౌనం వీడకుంటే ఎలా? కేంద్ర మంత్రులు, ఎంపీలు మారీచుల్లా మారారు. మరొకరు శల్యుడిలా శల్యసారథ్యం చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఆనాటి మహాభారత సంగ్రామానికీ ఈనాటి సమైక్యాంధ్ర సంగ్రామానికి చాలా పోలికలు కనబడుతున్నాయి. ఆనాడు కౌరవులు హస్తినలో సూది మొన మోపేంత జాగా కూడా ఇవ్వమని ప్రకటిస్తే పాండవులు వెళ్లి ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు. నగరాన్ని చూడ్డానికొచ్చిన దుర్యోధనుడు మయసభను, భవనాలను చూసి అసూయ పడి అహంకారంతో కురుక్షేత్రానికి కాలుదువ్వాడు. ఇప్పుడూ రాష్ట్రంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. టిఫిన్ సెంటర్లు, కర్రీపాయింట్ పెట్టుకోండని వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు? కేసీఆర్.. మీ భార్య చేసిన కూరలు తినకుండానే బతుకుతున్నావా? టిఫిన్ సెంటర్లు, కర్రీపాయింట్లు నీకంత తేలిగ్గా కనబడుతున్నాయా తమ్ముడూ? ఒక్కసారి ఆలోచించుకో! కోదండరాముడి పేరు పెట్టుకున్న కోదండరాం.. దయచేసి పిల్లల్లో విద్వేష భావాలు రెచ్చగొట్టొద్దు’’ అని సత్యవాణి అన్నారు. ‘‘అవసరమైతే మీరు 15 ఏళ్లు పాలించుకోండి.. కానీ రాష్ట్రాన్ని విడగొట్టవద్దు’’ అని కోరారు. శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తాను వారికి నివేదిక ఇస్తూ ‘‘మహాభారతంలో శ్రీకృష్ణుని రాయబారం ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ రాయబారం నడుస్తోందని అన్నాను. జస్టిస్ శ్రీకృష్ణ స్పందిస్తూ ‘ఆ శ్రీకృష్ణ రాయబారం ఫెయిల్ అయింది. ఈ శ్రీకృష్ణ కమిటీ రాయబారం ఫెయిల్ కాదు అని అనుకుంటున్నా’ అని చెప్పారు. కానీ ఆ రాయబారం కూడా ఫెయిల్ అయింది’’ అని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీని ప్రధాని కావద్దని అన్నందుకే ఆమె కక్ష కట్టినట్లు ఉందని వ్యాఖ్యానించారు. -
ఒక్కటే లక్ష్యం.. ముమ్మరంగా ఉద్యమం
సాక్షి: ఒక్కటే లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించడం.. 39రోజులుగా విరామం లేకుండా ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజ శనివారం సమైక్య పోరాటాన్ని పతాకస్థాయిలో చేపట్టింది. హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో శనివారం ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సంఘీభావంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రదర్శనలు మిన్నంటాయి. హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడులకు నిరసనగా వాడవాడలా నిరసనలు చేపట్టారు. చెప్పులు కుట్టి, భిక్షాటన చేసి.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి, చెప్పులు కుట్టి నిరసన వ్యక్తం చేశారు. పాతపట్నంలో మానవహారం, టెక్కలిలో విద్యార్థుల పిరమిడ్ ప్రదర్శన, పలాసలో వైశ్యుల ర్యాలీ జరిగింది. విజయనగరం జిల్లా గరివిడిలో ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాగర్జనను 10 వేల మందికిపైగా సమైక్యవాదులు హోరెత్తించారు. గజపతినగరంలో విశ్వబ్రాహ్మణులు శాంతి ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలో వైద్య ఉద్యోగులు ధర్నా, మున్సిపల్ ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోలా గురువులు ఆధ్వర్యంలో సమైక్యవాదులు సముద్రంలో పడవలపై నిరసన చేపట్టారు. ఏయూలో దీక్షలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్)ను శనివారం ముట్టడించారు. ఈ నెల 10లోగా జీసీఏస్, రిఫైనరీ, గెయిల్ ఉత్పత్తి కేంద్రాల్లో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయకపోతే 11న మూడింటినీ ముట్టడించి కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఉప్పలగుప్తంలో మేకలు, గొర్రెలతో రాస్తారోకో చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఆటంకం కలిగిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మునిసిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో నాలుగు గంటల అనంతరం వారంతా ట్యాంక్ దిగి వచ్చారు. ఏపీఎన్జీవోలకు సంఘీభావంగా పలుచోట్ల బంద్ నిర్వహించారు. విజయవాడలో దుర్గ గుడి ఉద్యోగులు శాంతి హోమం నిర్వహించారు. పొక్లెయిన్ యజమానులు మానవహారం నిర్మించారు. గెజిటెడ్ అధికారులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి రోడ్లపై వంటవార్పు నిర్వహించారు. మంగళగిరిలో రిలేదీక్షలు చేస్తున్న పద్మశాలీ సంఘాలకు పట్టణ ప్రజలు సంఘీభావం తెలిపారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన ఉద్యోగులు, న్యాయవాదులు, సాక్షర భారత్ కోఆర్డినేటర్లు గుండ్లకమ్మ నదిలో నిలబడి నిరసన ప్రదర్శన చేపట్టారు. చీరాలలో న్యాయవాదులు నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఉలవపాడులో ఆర్యవైశ్య సంఘం ర్యాలీ చేపట్టింది. సింగరాయకొండలో యూటీఎఫ్ ర్యాలీ, మానవహారం జరిగాయి. సమరయోధుడి దీక్ష భగ్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గండిపాళెంలో స్వాతంత్య్ర సమరయోధుడు అంకయ్య చౌదరి చేపట్టిన ఆమరణదీక్షను శనివారం పోలీసులు భగ్నం చేశారు. చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో తెలుగుతల్లికి పాలాభిషేకం చేశారు. పలమనేరులో ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్డుపై పాఠాలు చెప్పారు. వైఎస్సార్ జిల్లా కడపలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో డీసీఎంస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోట నరసింహారావు, బీకోడూరు మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి చేపట్టిన ఆమరణదీక్షలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. హైదరాబాద్‌లో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా రాజంపేట, జమ్మలమడుగులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉరితాళ్లు వేసుకుని నిరసన అనంతపురంలో లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఉరితాళ్లు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో దళిత గర్జన హోరెత్తింది. రొద్దంలో వృద్ధులు రిలే దీక్షలు చేపట్టారు. ఉరవకొండలో ముస్లింలు భారీ ర్యాలీ, రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి నిరసనగా ఎస్కేయూలో విద్యార్థులు, ఉద్యోగులు రాస్తారోకో చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన పొదుపు లక్ష్మీ గ్రూపు మహిళలు రాస్తారోకో చేశారు. ఎమ్మిగనూరులో సకల జనుల సింహగర్జనను విశేష స్పందన లభించింది. కాగా, సమైక్య సభకు సీమాంధ్ర ఉద్యోగులు వెళ్తున్న వాహనాలపై రాళ్లతో దాడులు చేయడం వంటి దృశ్యాలను టీవీల్లో చూస్తూ ఉద్వేగానికి గురై శనివారం గుండెపోటుతో ఆరుగురు మరణించారు. -
సికింద్రాబాద్ లోనే మిలియన్ మార్చ్: అశోక్‌బాబు
రాష్ట్ర విభజనపై కేంద్రం పునరాలోచన చేయని పక్షంలో సికింద్రాబాద్ లోనే తాము మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. ఏపి ఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. విభజన సమస్య రాజకీయ నాయకులకు మాత్రమే సంబంధించింది కాదని చెప్పారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్టీసీ... ఇలా అన్ని వర్గాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అత్యున్నత విద్యా అవకాశాలు ఉన్న హైదరాబాద్‌ను ఎలా వదులుకుంటామని ఆయన అడిగారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. 50 ఏళ్లు భార్యభర్తల్లా తెలంగాణ సీమాంధ్ర కలిసి ఉన్నాయి. వారిద్దరికి పుట్టిన కొడుకే హైదరాబాద్. ప్రతిఫలం చేతికందే సమయంలో కొడుకు నా వాడే అంటే తండ్రి పరిస్థితేంటీ? అని ప్రశ్నించారు. రాష్ట్రం కలిసుండాలా? విడిపోవాలా? నిర్ణయించేది రాజకీయ నాయకులు కాదని, ప్రజలేనన్నారు. 50ఏళ్లుగా హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకొని ఇప్పుడు అర్థాంతరంగా వెళ్లమంటే ఎక్కడకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. సీడబ్లూసీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాఅభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లిన పార్టీలకు మనుగడ ఉండదనే విషయం గతంలో ఎన్నో పరిణామాలు నిరూపించాయని ఆశోక్‌బాబు వివరించారు. సమ్మె ఎంతకాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 108 రోజులు సమ్మె చేశామని గుర్తు చేశారు. తాము ఢిల్లీ వెళ్లినప్పుడు ఎంపిలను ఎన్నో రకాలుగా వేడుకున్నట్లు తెలిపారు. పదవులకు రాజీనామా చేయండి, మిమ్మల్ని మేం గెలిపించుకుంటామని చెప్పామన్నారు. మీరు రాజీనామా చేయకపోతే ఉద్యమం ఉధృతమవుతుందని కూడా చెప్పినట్లు తెలిపారు. ప్రజల అంగీకారంలేకుండా రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని కొన్ని జాతీయ పార్టీల నేతలు చెప్పారన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. ప్రజలు ఎన్నుకొన్న నాయకులు పాలించడానికే తప్ప, విభజించడానికి కాదన్నారు. అయిదారు పార్టీల నిర్ణయంతో రాష్ట్రాన్ని విభజించలేరని పేర్కొన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని ఉద్యోగులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో గొప్ప నేతలు చెప్పిన విషయాలను వక్రీకరిస్తున్నారన్నారు. ఇష్టం లేకుంటే విడిపోవచ్చంటూ కొత్త వాదన తెరమీదికి తెస్తున్నారని, ఇది నిజం కాదన్నారు. స్టేడియం లోపల ఎంత మంది ఉన్నారో బయట కూడా అంతే సంఖ్యలో ఉన్నారని చెప్పారు. తాము తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని అశోక్ బాబు స్సష్టం చేశారు. ఏడు లక్షల మంది ఉద్యోగులు ఉద్యమంలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని 50లక్షల మంది సెటిలర్లలో మూడు ప్రాంతాల వారున్నారని చెప్పారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంకంటే ఎక్కువగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ప్రైవేట్ ఉద్యోగులను సభకు అనుమతించని పోలీసులు
హైదరాబాద్: ఎపి ఎన్జీఓలు ఎల్బి స్టేడియంలో నిర్వహించే 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులను తప్ప ఇతరులు ఎవరినీ అనుమతించడంలేదు. కేవలం గుర్తింపు కార్డులు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన కళాకారులను కూడా స్టేడియం లోపలకు అనుమతించలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు నగరంలోని ప్రవేట్ ఉద్యోగులు ముఖ్యంగా సాప్ట్వేర్ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అయితే పోలీసులు వారిని స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో వారు బయటే నిలబడి నిరసన తెలుపుతున్నారు. వేల మంది జనం స్టేడియం బయట మానవహారంగా ఏర్పడి నినాదాలు చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. స్టేడియం లోపల, బయట సమైక్యాంధ్ర నినాదాల హోరు కొనసాగుతోంది. బహిరంగ సభలో పాటలు పాడేందుకు వచ్చిన గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాద్‌లను కూడా తొలుత లోపలకు అనుమతించలేదు. తాను విఐపి పాస్‌తో వచ్చానని గజల్ శ్రీనివాస్ తెలిపారు. బి గేట్ ద్వారా రమ్మన్నారని, తాను అటువైపు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సమైక్యవాదాన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వినిపించడానికి వచ్చినట్లు వంగపండు ప్రసాద్ తెలిపారు. తనని పోలీసులు ఎల్బి స్టేడియం లోపలకు అనుమతించలేదని చెప్పారు. అయితే ఆ తరువాత గజల్ శ్రీనివాస్‌ను లోపలకు అనుమతించారు. ప్రైవేటు ఉద్యోగులు మాత్రం స్టేడియం బయటే ఉండి నినాదాలు చేస్తున్నారు. తమను లోపలకు అనుమతించకపోయినా తాము సభ ముగిసే వరకు తాము బయటే ఉండి మద్దతు తెలుపుతామని చెప్పారు. -
ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె: ఏయూజేఏసీ
హైదరాబాద్ నగరంలో రేపు ఏపీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవ్ హైదరాబాద్ బహిరంగ సభకు హాజరయ్యేందుకు విశాఖపట్నంలోని ఏపీఎన్జీవో ఉద్యోగులు సమాయత్తమయ్యారు.దాదాపు మూడు వేలమందికిపైగా ఆ సభకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయులు,ఉద్యోగులు,కార్మికులు ఆ సభలో పాల్గొనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరితోపాటు సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీనామాలు చేయకుండా తత్సారం ప్రదర్శిస్తుండటం పట్ల విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్శిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఏయూ జేఏసీ శుక్రవారం ఇక్కడ తెలిపింది. అలాగే విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. -
`ఏపీఎన్జీవోల సభను అడ్డుకుంటామనడం అప్రజాస్వామికం`
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్య సభను అడ్డుకుంటామనడం అప్రజాస్వామికమని వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాగో.. బాగో.. లాంటి మాటలు మంచివికావని ఆయన అన్నారు. ఇలాంటి మాటల కారణంగానే రాష్ర్టంలో పరిస్థితి అదుపు తప్పిందని వసంత నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనలు తెలిపేందుకు తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు సిద్ధం కావడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించుకునేందుకు ఏపీ ఎన్జీవోలకు పోలీసు శాఖ ఇప్పటికే అనుమతించింది. ఉస్మానియా విద్యార్థి జేఏసీ, తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలకు మాత్రం అనుమతి సాధ్యం కాదని తేల్చిచెప్పింది.