భారీఎత్తున సేవ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహణ
Published Thu, Nov 14 2013 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
అమలాపురం, న్యూస్‌లైన్ : అమలాపురం బాలయోగి స్టేడియంలో ఈనెల 22న నిర్వహిస్తున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను లక్షమంది సమీకరణతో భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టు జేఏసీ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం ప్రకటిం చారు. బాలయోగి ఘాట్‌లో సభ ఏర్పాట్లను ఆయన బు ధవారం కోనసీమ జేఏసీ నాయకులతో కలిసి పరిశీలించా రు. హైదరాబాద్ నుంచి వచ్చిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పార్టీ అధ్యక్షుడు కుమార్‌చౌదరి ఆయన వెంట ఉన్నారు.
ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేం ద్ర మంత్రులు 18న జరిగే మంత్రుల బృందం సమావేశం లో సమైక్యాంధ్ర మినహా మరేమీ వద్దని స్పష్టం చేయాలని కుమార్‌చౌదరి డిమాండ్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ పోస్టర్లను కోనసీమ జేఏసీ అధ్యక్షుడు వీఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు ఆవిష్కరించారు. కోనసీమ జేఏసీ సలహాదారుడు నక్కా చిట్టిబాబు, నాయకులు కె.సత్తిబాబు, బాపిరాజు, మంత్రిప్రగడ వేణుగోపాల్, అన్యం రాంబాబు, కె.రామకృష్ణారావు, కుంచే స్వర్ణలత, సబ్ రిజిస్ట్రార్ ఎం.సత్యనారాయణరాజు, డాక్టర్ ఏవీఆర్ దైవకృప పాల్గొన్నారు.
Advertisement
Advertisement