ఏపీ మంత్రి వర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమావేశాలపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి ముగ్గురు మంత్రులు గైర్హాజరవడం అసంతృప్తిని కలిగించిందని జేఏసీ నేతలు తెలిపారు.
69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సమావేశంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీన్ని 2013 జులై 1 నుంచి అమలు చేయాలని విఙప్తి చేశాయి. అంతేకాకుండా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.