రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్య సభను అడ్డుకుంటామనడం అప్రజాస్వామికమని వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు.
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్య సభను అడ్డుకుంటామనడం అప్రజాస్వామికమని వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాగో.. బాగో.. లాంటి మాటలు మంచివికావని ఆయన అన్నారు. ఇలాంటి మాటల కారణంగానే రాష్ర్టంలో పరిస్థితి అదుపు తప్పిందని వసంత నాగేశ్వరరావు తెలిపారు.
ఈ నేపథ్యంలో నిరసనలు తెలిపేందుకు తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు సిద్ధం కావడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. 7వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో సభ నిర్వహించుకునేందుకు ఏపీ ఎన్జీవోలకు పోలీసు శాఖ ఇప్పటికే అనుమతించింది. ఉస్మానియా విద్యార్థి జేఏసీ, తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలకు మాత్రం అనుమతి సాధ్యం కాదని తేల్చిచెప్పింది.