vasantha nageswara rao
-
బెస్ట్ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం 9 నెలల పరి పాలనా కాలంలోనే సమర్థవంతమైన సీఎంగా ప్రజల మన్ననలు పొందారు. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సీఎం జగన్ పాలనా తీరులను నిశితంగా పరిశీలించటం, సంతృప్తిని వ్యక్తం చేయటం శుభపరిణామం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ పరిపాలనా అడుగులకు వేగం పెంచటం మనకు తెలిసిందే. గత ప్రభుత్వం ఖర్చు చేసిన అనవసరపు ఆర్థిక దుబారాను పూర్తిగా తగ్గించారు. రీటెండరింగ్ విధానం ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 1,800 కోట్లు ఆదా చేశారు. ఆర్థికస్థితి మెరుగుకు మద్యం అమ్మకాలలో ప్రభుత్వ ఫాలసీ తీసుకు వచ్చారు. ఏ నవరత్నాలను నమ్మి ప్రజలు ఓట్లేశారో... ఆ నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 80 శాతం హామీలను అమలు చేశారు. రైతుల బుణాల మాఫీ, అమ్మఒడి, ఇంగ్లీషు విద్య, నాడు నేడు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఉద్యోగాల కల్పన, ప్రభుత్వంలోకి ఆర్టీసి ఉద్యోగుల విలీనం, ఆశావర్కర్ల, అంగన్వాడీల జీతాలు పెంపు, ఆటోడ్రెవర్లకు, న్యాయవాదులకు ఆర్థిక వెసులుబాటు, 25 లక్షల ఇళ్ళ జాగాలు, అన్ని కులాల వారికి కార్పోరేషన్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను లేకుండా చేశారు. ఒకవైపు పలుమార్లు ఢిల్లీలోని ప్రధాని మోదీ, అమిత్‌షాలతో రాష్ట్రఆర్థిక స్థితిగతులపై విన్నపాలు ఇస్తునే, విభజన హామీలు, పోలవరం నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాల సాధనలో వెనుకడుగు వేయటం లేదు. ఇలాంటి ప్రభుత్వ అనుకూల వైఖరి నేప«థ్యంలో మరోమారు జగన్ సంస్థాగత తీర్పు కొరకు ప్రజల వద్దకు వచ్చారు. ఇక్కడొక సందర్భాన్ని అందరూ గుర్తుకు తెచ్చుకోవాలి. భుత్వం రిజర్వేషన్లను పెంపు చేసిన నేపధ్యంలో ఢిల్లీ, హైకోర్టుల ఆదేశాల మేరకు ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపును వెనక్కితీసుకొని సంస్థాగత ఎన్నికలకు రెడీ అయ్యారు. చంద్రబాబు 34 శాతంగా ఉన్న బీసీల రిజర్వేషన్లను జగన్ 24 శాతానికి తగ్గించారని మీడియాలో విమర్శ చేస్తే, ముఖ్యమంత్రి జగన్ తగ్గిన 10 శాతం పార్టీ పరంగా ఇచ్చేలా పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. నాలుక కరుచుకొని తానూ పార్టీ పరంగా బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించారు సంస్థాగత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోలేక పోయిన మంత్రులు అటు నుంచి అటే రాజ్‌భవన్‌కు వెళ్ళి తమ మంత్రి పదవులకు రాజీనామాలు ఇవ్వాలని సూత్రప్రాయంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి జగనొక్కరే. ఎమ్మెల్యేలను మళ్ళీ అసెంబ్లీ టికెట్లు ఆశించవద్దు అనీ తేల్చి చెప్పారు. ఇలాంటి గట్స్ ఉన్న నిర్ణయాలు తీసుకోవటంలో బహుశా ఆయనకే పేటెంట్æరైట్స్ ఉన్నాయనీ భావించొచ్చు. జగన్ తీసుకుంటున్న స్తూర్తిదాయకమైన రాజకీయ నిర్ణయాలను నేను ఎప్పడూ చూసి ఉండలేదు. రాష్ట్రంలో జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్, నేదురుమిల్లి, వైఎస్సార్ రోశయ్య, నల్లారి, ఇలా ఉద్దండుల పాలనలను చూశాను. వారి పాలనల్లో నా వంతు భాద్యతలనూ నెరవేర్చాను. మరెందరో కేంద్ర మంత్రులతో, రాష్ట్రమంత్రులతో సావాసం చేశాను. ప్రజలకు ఏం కావాలో, ఏం కోరుకుంటారో, బాగా ఎరిగిన జగన్ తన పాలనంతా ప్రజాసంక్షేమం బాటనే పట్టించారు. పైగా ప్రజలు కూడా పరిపాలకుల నుండి సంతృప్తికరమైన పాలనను పూర్తి స్థాయిలో పొందలేదు. అందువల్ల సీఎం జగన్ కాలయాపన లేకుండా తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాల పట్ల ప్రజలు తమ ఆమోదాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారనే అందరం ఒప్పుకోవాలి. వసంత నాగేశ్వరరావు (వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, మొబైల్ : 99494 11779) -
‘ఆయన ఇంటికి ఎవరూ వెళ్లరు’
సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమపై మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. మూడు రాజధానులకు మద్దతు తెలిపినందుకు దేవినేని ఉమ.. వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌పై విమర్శలు గుప్పించారు. వీటిపై సోమవారం ఆయన స్పందిస్తూ.. అన్నయ్య పేరు చెప్పుకుని బతికే ఆయన కృష్ణ ప్రసాద్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం అన్నయ్య పేరు చెప్పుకుని రాజకీయంగా ఎదిగి.. నేడు అన్నయ్య కూతుర్లను సరిగ్గా చూసుకోలేని అసమర్థుడని విమర్శించారు. ప్రజల సొమ్ముతో బతికే అతనికి నీతినిజాయితీలు లేవని.. అందుకే ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అతని ఇంటికి వెళ్లరని ఎద్దేవా చేశారు. ‘నువ్వు ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేశావు.. మరి నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విలువ ఎంత? ఎందుకని నువ్వు ఆస్తి వివరాలు ప్రకటించడం లేదు?’ అంటూ ఆయన వరుస ప్రశ్నలు సంధించారు. ‘పోలవరంలో నువ్వు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. త్వరలోనే నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం. డబ్బులు ఉంటే ఇబ్బంది అవుతుంది అని తెలిసి వజ్రాలు కొని దాచుకుంటున్నావు. నువ్వు ఎంత నీతిమంతుడివో నీ ఇంట్లో సూట్‌కేస్ తెరిస్తే అర్థమవుతుంది. దాదాపు సగం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి సొమ్ము మొత్తం వజ్రాల రూపంలో మీ ఇంట్లోనే ఉంది’ అని వసంత నాగేశ్వరరావు విమర్శించారు.(ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి) -
అందుకు హైద్రాబాదే ఉదాహరణ : మాజీ హోం మంత్రి
సాక్షి, విజయవాడ : అధికారంలో ఉన్న టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా పదిహేను నెలలుగా అర్ధశిరోముండన దీక్ష చేపట్టిన దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ గురువారం దీక్ష విరమించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో దీక్ష విరమించి, ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సి ఉందని, హైదరాబాద్ అనుభవమే అందుకు ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా హైద్రాబాద్‌కే పరిమితమైన సంగతి గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూడా అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో రాజధాని కట్టకుండా కేవలం గ్రాఫిక్స్‌తో కాలం గడిపాడని ఎద్దేవా చేశారు. గత ఉద్యమాలని, ఇతర రాష్ట్రాల వికేంద్రీకరణని చూసి సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, పరిపాలనా వికేంద్రీకరణను సమర్ధించకపోగా, టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రాజధాని వెళ్లిపోతోందంటూ గ్లోబెల్ ప్రచారం చేస్తూ, రాజకీయ దురుద్దేశంతో మంచి పనికి అడ్డుతగలాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు. -
చైతన్యానికి చిరునామా..నందిగామా
సాక్షి, నందిగామ : రాజకీయ చైతన్యం కల్గిన ప్రాంతం నందిగామ నియోజకవర్గం. 1955లో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం నాలుగు మండలాలతో దేశంలోని అత్యంత రద్దీ రహదారుల్లో రెండో స్థానం ఆక్రమించిన 65వ నెంబరు జాతీయ రహదారి ఈ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల మీదుగా వెళ్తుంది. ముఖ్యంగా నందిగామ, కంచికచర్ల పట్టణాలు ఈ రహదారి పక్కనే విస్తరించి ఉన్నాయి. తొలిసారి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు ఈ నియోజకవర్గానికి చెందిన వాడే కావడం విశేషం. దేశంలోని జీవనదుల్లో ఒకటైన కృష్ణా నది చందర్లపాడు, కంచికచర్ల మండలాల మీదుగానే తూర్పునకు సాగిపోతుంది. దీనికితోడు నందిగామ, వీరులపాడు మండలాల మీదుగా మున్నేరు, వైరా ఏరు, కట్టెలేరు వంటి ఉప నదులు ప్రవహిస్తాయి. చుట్టూ నీరు ఉన్నప్పటికీ నేటికీ మంచినీరందని గ్రామాలు అనేకం ఉన్నాయి. నందిగామ పట్టణంలో కూడా ఈ సమస్య అధికం. ఇక పారిశ్రామిక పరంగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి వసంత నాగేశ్వరరావు హోం మంత్రి పదవిని అలంకరించారు. అదేవిధంగా రాజకీయ కురు వృద్ధుడిగా పేరుపొందిన ముక్కపాటి వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా, దేవినేని వెంకట రమణ ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అత్యధిక పంచాయతీలు నందిగామ నియోజకవర్గంలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మొత్తం నాలుగు మండలాలున్నాయి. నందిగామ మండల పరిధిలోని 13 గ్రామాలు మాత్రమే నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 10 గ్రామాలు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొత్తం నందిగామ మండలంలో 23 గ్రామ పంచాయతీలు, కంచికచర్ల మండలంలో 16, వీరులపాడు మండలంలో 24, చందర్లపాడు మండలంలో 18 పంచాయతీలున్నాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 71 గ్రామ పంచాయతీలు, ఓ నగర పంచాయతీ ఉన్నాయి. జీవన శైలి నందిగామ నియోజకవర్గంలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. మెట్ట ప్రాంతం కావడంతో పత్తి, మిర్చి, అపరాలు, సుబాబుల్, వరి, మొక్కజొన్న వంటివి అధికంగా సాగు చేస్తారు. దీనికితోడు పాడి పరిశ్రమపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. ఎన్నికల సమయం మినహా మిగిలిన సమయంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నందిగామకు పడమర వైపు దేశంలోని జీవ నదుల్లో ఒకటిగా ఉన్న కృష్ణా నది ప్రవహిస్తోంది. ఉత్తరాన జగ్గయ్యపేట నియోజకవర్గం, తూర్పున తెలంగాణ రాష్ట్ర సరిహద్దు, దక్షిణాన మైలవరం నియోజకవర్గం ఉన్నాయి. అధిక శాతం నిరుపేదలే నియోజకవర్గంలో అధిక శాతం నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలే. వ్యాపారాలు చేసే వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. సంపన్నుల శాతం అతి తక్కువ. నిరుద్యోగులు అధికం. పారిశ్రామికంగా కూడా నియోజకవర్గం ఎటువంటి వృద్ధి సాధించకపోవడంతో జీవనశైలిలో పెద్దగా మార్పులు కనపడటం లేదు. నందిగామకు ప్రత్యేక స్థానం ఎన్నికలు జరిగిన తొలి ఏడాదిలోనే ఇక్కడి నుంచి సీపీఐ తరపున బరిలో నిలిచిన పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఘన విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సైతం విజయం ఆయననే వరించింది. 1955 నుంచి ఇప్పటివరకు మొత్తం 14 సార్లు (బై ఎలక్షన్‌తో కలిపి) ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల ద్వారా విజయం సాధించిన వారిలో మొత్తం ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. వీరిలో వసంత నాగేశ్వరరావు ఏకంగా హోం మినిష్టర్‌గా పనిచేయడం గమనార్హం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు నందిగామకు చెందిన వారే. మహిళలే కింగ్ మేకర్లు నందిగామ నియోజకవర్గంలో మహిళల ఓట్లే అత్యంత కీలకం, వారు ఎవరికి ఓటు వేస్తే వారినే విజయలక్ష్మి వరిస్తుంది. నియోజకవర్గంలో మహిళ ఓటర్లే అధికంగా ఉండటంతోపాటు జనాభా పరంగా కూడా వారే అధికం కావడమే కాకండా ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా వీరి శాతమే అధికంగా ఉంటోంది. దీంతో వీరు ఎవరి వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ, సంబంధిత అభ్యర్థి ఎమ్మెల్యే కావడం ఖాయం. దాదాపుగా మొత్తం జనాభా 2,54,734 కాగా వీరిలో 1,28,531 మహిళా ఓటర్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో 65 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ జరుగుతుంది. ఓటు వేసే వారిలో మహిళల సంఖ్యే అధికంగా ఉంటోంది. నాడు కంచుకోట! పదకొండు పర్యాయాలపాటు జనరల్ కేటగిరీలో ఉన్న నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీలకు రిజర్వు చేశారు. దీంతో 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు విజయం సాధించారు. అయితే ఎన్నికలు పూర్తయిన నెల రోజులకే ఆయన మృతిచెందారు. దీంతో ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గెలుపొందారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్ట లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచినా, డిపాజిట్లు కూడా దక్కలేదు. నందిగామ నియోజకవర్గం మొత్తం జనాభా : 2,54,734 పురుషులు : 1,26,203 మహిళలు : 1,28,531 నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య : 1,93,712 పురుషులు : 95,279 మహిళలు : 98,426 థర్డ్ జెండర్ : 7 విస్తీర్ణం(చదరపు కిలోమీటర్లలో : 718 రెవెన్యూ గ్రామాలు : 81 గ్రామ పంచాయతీలు : 69 -
‘దేవినేని నీచరాజకీయాలు చేస్తున్నారు’
-
‘వ్యక్తిగత చనువుతోనే ఆయనతో రాజకీయాలు మాట్లాడాను’
సాక్షి, అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ హోంమంత్రి, వైఎస్సార్సీపీ నేత వసంత నాగేశ్వరరావు విమర్శించారు. వ్యక్తిగత పరిచయంతోనే గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావుతో రాజకీయాలు మాట్లాడానని, అంతే కానీ ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదన్నారు. అధికార బలంతో బెదిరించి గుంటుపల్లి ఈఓ చేత నాపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావు మా సొంత గ్రామంలో పనిచేశారు. ఆయనతో నాకు చాలా చనువు ఉంది. గుంటుపల్లిలో వైఎస్సార్సీపీ బ్యానర్లను, జెండాలను ఏకపక్షంగా తొలగిస్తున్నారని గ్రామస్తుల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో ఈఓ నర్సింహారావు అక్కడే ఉన్నట్లు తెలియడంతో ఆయనకు ఫోన్ చేశా. పాత పరిచయం ఉండటంతో రాజకీయాలు మాట్లాడాను. అదే చనువుతో ఆయన కుటుంబం, పిల్లల గురించి అడిగాను. దానిని ఇంత నీచంగా చిత్రీకరిస్తారా? నోను ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు కాల్ రికార్డింగ్‌ను వక్రీకరించారు. నా అనుమతి లేకుండా కాల్ రికార్డు చేయడం ఎంత వరకు సమంజసం‘ అని వసంత నాగేశ్వరరావు ప్రశ్నించారు. మైలవరం నియోజక వర్గంలో వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజామద్దతు దేవినేని తట్టుకోలేకనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ జెండాలు తీయించడం, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని మండి పడ్డారు. మంత్రి దేవినేని అవినీతిని తన కుమారుడు కృష్ణ ప్రసాద్ ప్రజల్లో ఎండగడుతున్నారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో బ్యానర్ల విషయంపై మాట్లాడటానికి ఫోన్ చేసిన నాగేశ్వరరావు, ఈవోని బెదిరించాడని టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నాగేశ్వరరావుపై కేసు కూడా పెట్టారు. -
హత్యారాజకీయాలు,ఆర్థిక నేరాలు చేసింది నీవే
-
రంగా హత్య వెనుక దేవినేని ఉమా హస్తం
కంచికచర్ల(నందిగామ): వంగవీటి మోహన్ రంగా హత్యకేసులో మొదటి ముద్దాయి దేవినేని కుటుంబమేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరంలోని తన స్వగృహంలో వసంత శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి దేవినేని ఉమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత అన్న వెంకటరమణ అయ్యప్పమాలలో ఉండి వంగవీటి మోహన్‌రంగాను హత్య చేశాడని, ఆ హత్య వెనుకాల ఉమామహేశ్వరరావు హస్తముందని ఆయన అన్నారు. నిత్యం అబద్ధాలాడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పట్టిసీమ పేరుతో తన అనుచరులతో కలిచి కోట్లు దోచుకున్న ఘనత ఉమామహేశ్వరరావుదేనని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధికోసం సొంత అన్న దేవినేని వెంకటరమణ భార్యను మానసిక ఒత్తిడికి గురిచేసి ఆమె మరణానికి కారణమయ్యాడని, ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడని దేవినేని ఉమాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అంతేగాక ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన కుమారుడు వసంత కృష్ణప్రసాద్(కేపీ) టీడీపీలో ఉండగా నాలుగేళ్లపాటు ఉమా కలిసి ఉన్నాడని, ఇప్పుడు కేపీ పార్టీ మారిన తర్వాత విమర్శలు చేయడం సబబు కాదన్నారు. తాను చిన్నతనం నుంచే రాజకీయాల్లో ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి అవినీతి, మచ్చ లేకుండా ప్రజలతో మమేకమై ఉన్నానన్నారు. ఏడాదిలో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుతుందని, మైలవరంలో దేవినేని ఉమాను ఓడించేందుకు తమ వంతు కృషిచేస్తామని వసంత పేర్కొన్నారు. సమావేశంలో మాగంటి వెంకటరామారావు, అబ్బూరి మల్లేశ్వరరావు, తదితరులున్నారు. -
దేవినేని ఉమ చిత్తుగా ఓడిపోవడానికి రెడీగా ఉండు..
సాక్షి, నందిగామ: ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...‘దేవినేని ఉమ నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. హత్యా రాజకీయాలు, ఆర్థిక నేరాలు చేసింది నీవే. వంగవీటి మోహనరంగా హత్యకేసులో మీ అన్న దేవినేని వెంకట రమణ ముద్దాయి కాదా?. నీ గురించి నీ అన్న గురించి ప్రజలకు తెలుసు. 2019 ఎన్నికలలో మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. నీ వదిన ప్రణీతను చంపి నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. జలవనరుల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నదేవినేని ఉమా కనీసం తన ప్రాంత ప్రజలకు సాగునీటిని కూడా అందించలేకపోతున్నారు. ’ అంటూ ధ్వజమెత్తారు. -
నటుడు శివాజీ దీక్ష విరమించాలి
గుంటూరు : ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నటుడు శివాజీ దీక్ష విరమించాలని మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు కోరారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, అందుకు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన దీక్ష సోమవారానికి రెండోరోజుకు చేరింది. -
హత్యకేసులో ‘వసంత’ తనయుడి అరెస్టు
నందిగామ, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుడు పొదిల రవి హత్య కేసులో కుట్రదారునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్‌ను శుక్రవారం వేకువజామున పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణప్రసాద్, పొదిల రవి కుటుంబాల మధ్య ఆస్తులకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. వసంత నాగేశ్వరరావు మేనల్లుడు మద్దాలి హనుమంతరావు (చిన్నపుల్లయ్య) రెండేళ్ల కిందట హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పుల్లయ్య భార్య, బావమరిది రవి, మరికొందరిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రవిని 2013 జూన్ 12న కోనాయపాలెం వద్ద కొందరు హత్య చేశారు. ఈ ఘటనపై చందర్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవగా, ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు కృష్ణప్రసాద్ సూత్రధారి అని కేసులో ఒకటి, రెండు నిందితులుగా ఉన్న సాంబ, మంగలి బాబు విచారణ సందర్భంగా చెప్పారు. తన భర్త హత్యకు కృష్ణప్రసాద్ కారణమని పేర్కొంటూ పొదిల రవి భార్య మాధవి రెండు నెలల కిందట జిల్లా ఎస్పీకి అర్జీ అందజేసింది. దీనిపై జగ్గయ్యపేట మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం కూడా ఇచ్చింది. ఎస్పీ ఆదేశాల మేరకు దీనిపై నందిగామ డీఎస్పీ విచారణ జరిపారు. ఆయన ఆదేశాల మేరకు నందిగామ రూరల్ సీఐ రామ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం కృష్ణప్రసాద్‌ను అరెస్టు చేశారు. అనంతరం నందిగామ కోర్టులో హాజరుపరిచారు. టీడీపీ నేతల ధర్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగంగానే వసంత కృష్ణప్రసాద్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేశారని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తంగిరాల ప్రభాకరరావు, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపించారు. ఈ సంఘటనను నిరసిస్తూ వారు ధర్నా చేశారు. వైఎస్సార్ సీపీకి వసంత రాజీనామా తన కుమారుడి అరెస్టుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపిస్తూ మాజీ మంత్రి, పార్టీ నాయకుడు వసంత నాగేశ్వరరావు శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. -
రైతు పక్షపాతి వైఎస్ : వసంత
నందిగామ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి రైతులకు చేసినంత మేలు ఏ పాలకుడు చరిత్రలో చేయలేదని, ఆయన అమలు చేసిన పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు దోహదపడతాయని హోంశాఖ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వసంత నాగేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఓట్ల కోసం మాట్లాడుతారని, రాజనీతిజ్ఞులు రేపటి సమాజం కోసం ఆలోచిస్తారని, అలా రేపటి సమాజం కోసం ఆలోచించిన వ్యక్తే వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు ఓట్ల కోసం గతంలో వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తానుకూడా అమలు చేస్తానని పదేపదే చెబుతున్నారన్నారని, అయితే తొమ్మిదేళ్ల పాలనలో ఆయన చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.కర్నాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మిస్తుంటే చూస్తూ ఊరుకున్న చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్ వలనే రుణమాఫీ.... దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి కేంద్రంలో ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్, చిదంబరంలను ఒప్పించి రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలు తెచ్చి రైతులకు రుణమాఫీ వర్తించేలా చేశారన్నారు. ఆయన కుమారుడు జననేత జగన్మోహనరెడ్డి వైఎస్ ఆశయాల సాధన కోసం స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని వసంత కోరారు. -
అప్పుడు సీమాంధ్ర నేతలెవ్వరు మాట్లాడలేదే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక సమైక్య పార్టీ పెట్టడంలో అర్థం లేదని జై ఆంధ్ర ఉద్యమ నేత, మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత 20 రోజుల వరకు సీమాంధ్ర నేతలెవ్వరూ మాట్లాడలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అటు విద్యార్థులు, ఇటు ఎన్జీవోలు సమైక్య ఉద్యమం చేశారని, ఆ తర్వాతే నేతలు రంగంలోకి దిగి ఢిల్లీలో ఉద్యమం మొదలు పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమం ఏర్పడకముందే జై ఆంధ్ర ఉద్యమం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర సమైక్యానికి ప్రతీకగా ఓ పార్టీ పెట్టేందుకు కిరణ్ సంకల్పించారు. ఆ క్రమంలో లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పలువురు ఎంపీలు ఆదివారం మాదాపూర్‌లో కిరణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులలో కొత్త పార్టీ రావాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. అలాగే సోమవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సిఎం కిరణ్ సమావేశమైయ్యారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజులలో సీఎం కిరణ్ కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారని సమాచారం. అదికాక గతేడాది జులై 30న సీడబ్య్లుసీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో సీమాంధ్ర నేతలు ఎవ్వరు సీడబ్య్లసి నిర్ణయంపై ప్రతిఘటించలేదు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దాంతో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులలో కదలిక వచ్చిన సంగతి తెలిసిందే. -
`ఏపీఎన్జీవోల సభను అడ్డుకుంటామనడం అప్రజాస్వామికం`
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్య సభను అడ్డుకుంటామనడం అప్రజాస్వామికమని వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాగో.. బాగో.. లాంటి మాటలు మంచివికావని ఆయన అన్నారు. ఇలాంటి మాటల కారణంగానే రాష్ర్టంలో పరిస్థితి అదుపు తప్పిందని వసంత నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనలు తెలిపేందుకు తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు సిద్ధం కావడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించుకునేందుకు ఏపీ ఎన్జీవోలకు పోలీసు శాఖ ఇప్పటికే అనుమతించింది. ఉస్మానియా విద్యార్థి జేఏసీ, తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలకు మాత్రం అనుమతి సాధ్యం కాదని తేల్చిచెప్పింది.