సాక్షి, విజయవాడ : అధికారంలో ఉన్న టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా పదిహేను నెలలుగా అర్ధశిరోముండన దీక్ష చేపట్టిన దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ గురువారం దీక్ష విరమించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో దీక్ష విరమించి, ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సి ఉందని, హైదరాబాద్ అనుభవమే అందుకు ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా హైద్రాబాద్‌కే పరిమితమైన సంగతి గుర్తు చేశారు.
అలాగే ఇప్పుడు కూడా అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో రాజధాని కట్టకుండా కేవలం గ్రాఫిక్స్‌తో కాలం గడిపాడని ఎద్దేవా చేశారు. గత ఉద్యమాలని, ఇతర రాష్ట్రాల వికేంద్రీకరణని చూసి సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, పరిపాలనా వికేంద్రీకరణను సమర్ధించకపోగా, టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రాజధాని వెళ్లిపోతోందంటూ గ్లోబెల్ ప్రచారం చేస్తూ, రాజకీయ దురుద్దేశంతో మంచి పనికి అడ్డుతగలాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment