former home minister
-
అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ మరో కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన బీజేపీ అగ్రనాయకులను తప్పుడు కేసులో ఇరికించేందకు కుట్ర పన్నారనే అభియోగాలతో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్సీపీ– ఎస్పీ)పై సీబీఐ బుధవారం తాజాగా కేసు నమోదు చేసింది. 2020లో ఈ కుట్ర జరిగిందని తెలిపింది. 2020లో ప్రతిపక్షంలో ఉన్నపుడు దేవేంద్ర ఫడ్నవీస్ అప్పటి స్పీకర్‌కు ఒక పెన్‌డ్రైవ్‌ను అందజేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్.. అనిల్ దేశ్‌ముఖ్, ఇతరులతో కలిసి బీజేపీ నాయకుడు గిరీష్ మహజన్ (ప్రస్తుతం మంత్రి)ని ఇరికించడానికి ప్రయతి్నంచినట్లుగా పెన్డ్రైవ్లోని వీడియోల్లో ఉన్నట్లు సీబీఐ చెబుతోంది. పండిత్ చవాన్ ప్రముఖ బీజేపీ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పలు కుట్రలకు తెరతీసినట్లు ఈ వీడియోల్లో స్పష్టం ఉందని ప్రాథమిక విచారణలో గిరీష్ మహజన్‌తో సహా నలుగురు ఎమ్మెల్యేలు.. సీబీఐకి తెలిపారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం. సాక్షులను చిత్రహింసలు పెట్టడం, నగదు చెల్లింపులు, దర్యాప్తు అధికారులకు సూచనలు ఇవ్వడం.. ఇలా పక్కా పథకరచన చేశాడని ఆరోపించారు. డీసీపీ పూరి్ణమ గైక్వాడ్, ఏసీపీ సుష్మా చవాన్లతో కలిసి సాక్షుల వాంగ్మూలను, ఆధారాలను మార్చేశాడని పేర్కొన్నారు. తాజా ఎఫ్ఐఆర్లో సీబీఐ అనిల్ దేశ్ముఖ్తో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్, పూర్ణిమ, సుష్మ, న్యాయవాది విజయ్ పాటిల్‌లను నిందితులుగా పేర్కొంది. అవినీతి ఆరోపణలపై అనిల్ దేశ్‌ముఖ్ ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఈడీ కేసు కూడా నమోదైంది. ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ బెంబేలెత్తిపోయి తనపై నిరాధార కేసును నమోదు చేయించారని అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును చూసి.. కాళ్ల కింద నేల కదులుతోందని గ్రహించి ఫడ్నవీస్ ఇలాంటి కుట్రలకు దిగారని ఆరోపించారు. -
బ్రిటన్ విపక్షనేత రేసులో మాజీ మంత్రి ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్ విపక్షనేత పదవి కోసం భారతీయ మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్ పోటీపడుతున్నారు. తన సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో రిషి సునాక్ తన విపక్ష నేత పదవి నుంచి నవంబర్ రెండోతేదీన వైదొలగనున్నారు. దీంతో పార్టీని మళ్లీని విజయయంత్రంగా మారుస్తానంటూ 52 ఏళ్ల ప్రీతీపటేల్ ఆదివారం తన అభ్యరి్థత్వాన్ని ప్రకటించారు. మాజీ మంత్రులు జేమ్స్ క్లెవర్లీ, టామ్ టగెన్డాట్, మెల్ స్టైడ్, రాబర్ట్ జెన్రిక్లతో ఆమె పోటీపడనున్నారు. -
రూ.100 కోట్ల వసూళ్ల కేసులో మాజీ మంత్రికి ఊరట
ముంబై: నెలకి రూ.100 కోట్లు వసూళ్లకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరుపై స్టే పొడగించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది బాంబే హైకోర్టు. దీంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది. డిసెంబర్ 12న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు జస్టిస్ ఎంఎస్ కర్నిక్ బెయిల్ మంజూరు చేశారు. అయితే, సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు 10 రోజుల సమయం కావాలని సీబీఐ కోరింది. దీంతో ఆయన విడుదల వాయిదా పడింది. గత వారం సీబీఐ అభ్యర్థన మేరకు డిసెంబర్ 27 వరకు బెయిల్‌పై స్టే విధించింది బాంబే హైకోర్టు. సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం శీతాకాల సెలవుల్లో ఉంది. దీంతో కేసు విచారణ 2023, జనవరిలోనే జరగనుంది. దీంతో మరోసారి స్టే పొడిగించాలని కోరింది దర్యాప్తు సంస్థ. కానీ అందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్‌పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించిన క్రమంలో మాజీ మంత్రి దేశ్‌ముఖ్ బుధవారం జైలు నుంచి విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇదీ కేసు.. అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసులో గతేడాది నవంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో గత అక్టోబర్‌లోనే బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో స్పెషల్ కోర్టు ఆయనకి బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం ఎన్సీపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు .. క్షణాల్లోనే షాక్! -
అనిల్ దేశ్‌ముఖ్‌కు షాక్.. ఈ నెల 12 వరకు ఈడీ కస్టడి
ముంబై: వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రికి ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడికీ ఈ నెల 12 వరకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 1న మనీలాండరింగ్ కేసులలో అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. అయితే శనివారం పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు అనిల్ దేశ్‌ముఖ్ కస్టడీని పొడగించడానికి నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడికి పంపించిన విషయం తెలిసిందే. కాగా, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నెలకు రూ.100 కోట్ల వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యం నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే. చదవండి: UP: సెంట్రల్ జైలులో ఖైదీల వీరంగం -
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్
ముంబై: వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 12 గంటల సేపు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అర్ధరాత్రి దాటాక ఆయనని అరెస్ట్ చేశారు. దేశ్‌ముఖ్‌ను మంగళవారం ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి పి.బి.జాదవ్ ఆయనకు నవంబర్ 6 వరకు కస్టడీ విధించారు. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నెలకు రూ.100 కోట్ల వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యంగా నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే. (చదవండి: రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ) -
అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు గురువారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్‌దేశ్‌ముఖ్ దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హోంమంత్రిగా ఉన్న సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ ముంబైలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్æ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘ఆరోపణలను చూస్తే వీటిపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయడమే మంచిదని భావిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవాలనుకోవడం లేదంది. ‘ఒక సీనియర్ మంత్రిపై ఒక సీనియర్ పోలీసు అధికారి చేసిన తీవ్రమైన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయడం సరైనదే’ అని పేర్కొంది. మౌఖికంగా, ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశించడం సరికాదని అనిల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలపై, మంత్రి వాదన వినకుండానే బొంబాయి హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. ‘ప్రస్తుతం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నేతృత్వంలో నడుస్తోంది. ఆ నియామకానికి సంబంధించిన పిటిషన్ కూడా ఇదే కోర్టులో విచారణలో ఉంది’ అని సిబల్ వివరించారు. -
అందుకు హైద్రాబాదే ఉదాహరణ : మాజీ హోం మంత్రి
సాక్షి, విజయవాడ : అధికారంలో ఉన్న టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా పదిహేను నెలలుగా అర్ధశిరోముండన దీక్ష చేపట్టిన దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ గురువారం దీక్ష విరమించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో దీక్ష విరమించి, ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సి ఉందని, హైదరాబాద్ అనుభవమే అందుకు ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా హైద్రాబాద్‌కే పరిమితమైన సంగతి గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూడా అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో రాజధాని కట్టకుండా కేవలం గ్రాఫిక్స్‌తో కాలం గడిపాడని ఎద్దేవా చేశారు. గత ఉద్యమాలని, ఇతర రాష్ట్రాల వికేంద్రీకరణని చూసి సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, పరిపాలనా వికేంద్రీకరణను సమర్ధించకపోగా, టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రాజధాని వెళ్లిపోతోందంటూ గ్లోబెల్ ప్రచారం చేస్తూ, రాజకీయ దురుద్దేశంతో మంచి పనికి అడ్డుతగలాలనుకోవడం మంచిది కాదని హితవు పలికారు. -
‘కేసీఆర్ గాలి మాటలు మానుకోవాలి’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాలి మాటలు మానుకోవాలని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చి జాతీయ హోదా రాకుండా కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. తాము లక్ష కోట్లు ఇచ్చామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇవ్వలేదని అంటున్నారని, అసలు లెక్కలు ఏమిటో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఆదాయంలో రాష్ట్రం నంబర్ వన్ అంటున్న కేసీఆర్.. మరి అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అమర వీరుల పునాదులపై టీఆర్ఎస్ అధికారం చెలాయిస్తోందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతుంటే నిరుద్యోగులను కొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర కోరుతుంటే రైతులకు బేడీలు వేస్తున్నారని చెప్పారు. -
'రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది'
మొయినాబాద్ (రంగారెడ్డి): వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి.. అష్టకష్టాలు పడి పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరల్లేవు.. చేసిన అప్పులు పెరిగిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటోందని మాజీ హోంమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండల పరిధిలోని అమ్డాపూర్‌లో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు నేదునూరు గణేష్‌రెడ్డి కుటుంబ సభ్యులను సోమవారం ఆమె పరామర్శించారు. మృతుడి తల్లిదండ్రులు రాములమ్మ, జంగారెడ్డి, భార్య వరలక్ష్మిలతో మాట్లాడి జరిగిన ఘటనా వివరాలు తెలుసుకున్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేమని.. ఆత్మస్తైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీలో సరైన స్పష్టత లేదన్నారు. రైతులు పండించిన పూలు, కూరగాయలను మార్కెట్లో విక్రయించేందుకు వెళ్తే సరైన మద్దతు ధర రావడం లేదన్నారు. మార్కెట్లో జరిగే అవినీతి, అక్రమాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం వల్ల అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు. -
మరపురాని నేత మాధవరెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి మరణించి నేటికి పదిహేను సంవత్సరాలు పూర్త యింది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో, తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషించిన మాధవరెడ్డి నక్సలైట్ల దాడిలో కన్నుమూసి అప్పుడే్చ 15 సంవత్సరాలు అయిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. 1981లో సర్పంచ్‌గా, తదుపరి పంచాయతీ సమితి అధ్యక్షు నిగా 1985, 89, 94, 99లలో వరుసగా భువనగిరి శాసనసభ్యుడిగా వ్యవహరించిన మాధవరెడ్డి 1994 నుంచి 1996 వరకు ైవైద్య ఆరోగ్యశాఖామంత్రిగా, 1996-99లో హోంశాఖ మంత్రిగా, 1999-2000 సంవత్సరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించారు. చెరగని చిరునవ్వుతో, పరిచయం ఉన్నవారు ఎన్నిరోజుల తర్వాత అయినా కనబడితే పదవులు, హోదాలు పక్కనబెట్టి పేరుపేరునా ఆత్మీయంగా పలకరించడం ఆయన ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా స్వీయ క్రమశిక్షణతో పార్టీలో కీలక స్థానంలో పనిచేస్తూ యావత్ పార్టీ నేతల, కార్యకర్తల అభిమానాన్ని చూరగొన్నారు. సామాన్య కార్యకర్తలు, ప్రజల విన్న పాలు తీర్చడంలో అందరికంటే ముం దుండేవారు. హోంశాఖపై మాధవ రెడ్డిగారు వేసిన ముద్ర చెరిగిపోనిది. జైళ్లలో సదుపాయాలు, నూతన పోలీ స్స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణం, పోలీ సులు, ఉద్యోగుల జీతాల పెంపుదల, స్టేషనరీకి, ఇతర సదుపాయాలకు, పోలీసుల సంక్షేమానికి కావలసిన బడ్జెట్ కోసం ఆయన ఎప్పుడూ శ్రద్ధ వహించేవారు. పోలీసుశాఖ సంక్షేమం ప్రాతిపదికన బడ్జెట్‌ను తీర్చిదిద్దాలని స్వయంగా అధికారులను కోరేవారు. హోంశాఖతోపాటు సినిమాటోగ్రఫీ శాఖను కూడా నిర్వహించిన మాధవరెడ్డి సినీ పరిశ్రమాభి వృద్ధిపై దృష్టి పెట్టి ఆ శాఖలో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు.సినీ కార్మికుల ఇళ్లు, ఫిలిం ఛాం బర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ భవన నిర్మాణానికి ఆయన కృషి చేశారు. ఏ శాఖ కార్యకలాపాలమీదైనా సరే పూర్తి వివరాలు తెలుసుకుని మరీ చర్యలు చేపట్టే వారు. ఆయా శాఖల్లో ముఖ్యంగా చిన్న స్థాయి ఉద్యోగుల సంక్షేమానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతిపక్షాలతో ఆయన ఎంతో స్నేహభావంతో ఉండేవారు. స్వప క్షంలో వైరివర్గం ఎంతగా కవ్వించినా సహనంతో వ్యవహరించేవారు. ‘‘ఎన్నికలలో ఎటువంటి రాజకీయా లు ఉన్నా ఓట్లు వేయడం అయిపో గానే అందరూ కలసి ఉండాలే’’ అనేవారాయన. అందుకే భువనగిరిలో జరిగే ఎన్నికలలో ఏ పార్టీ వారైనా మాధవరెడ్డి పోటీ చేసే నియోజకవర్గంలో పార్టీల జెండాలు పక్కనబెట్టి ఆయనకే ఓట్లేసేవారు. ఆయన నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ ప్రతి పక్ష పార్టీలను వేధించిన, బాధపెట్టిన సందర్భాలు మచ్చుకైనా కనబడవు. అందుకే భువనగిరిలో ఆయన హయాంలో ఎక్కడా కూడా రాజకీయ ఘర్ష ణలు జరగలేదు. హోంశాఖ మంత్రిగా ఆయన పూర్తి గా శాఖ పట్ల నిబద్ధతతో వ్యవహరించారు. ప్రజా స్వామిక పంథాలోనే హక్కులు సాధించుకోవాలి, ప్రగతిశీల పోరాటాలు నిర్మించాలనే దృక్పథం ఆయనది. ప్రతిపక్ష పార్టీనేతగా అనేక వామపక్ష పార్టీలతో ఆయన కలసిపనిచేసేవారు. నక్సలైట్లు ఆయనను లక్ష్యంగా పెట్టుకుని వధించిన ఘటన, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకించి భువనగిరి ప్రజలను, ఆయన అభిమానులను తీవ్రంగా కదిలించివేసింది. మాధవరెడ్డి పగనూ, ప్రతీకారాన్నీ కోరుకున్న వారు కాదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజంతోపాటు తీవ్ర వాద చర్యలను కూడా అదుపుచేస్తే తప్ప రాష్ట్రం బాగుండదని, రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలు అదు పులో ఉండాలని బలంగా విశ్వసించారు. ఆయన హత్యానంతరం పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా వెల్లువెత్తిన నిరసన, ఆందోళన ప్రజల్లో ఆయన పట్ల ఉన్న అభిమానానికి ప్రతీక. ఆయన మరణించినా వర్తమాన రాజకీయాలపై ఆయన వేసిన ముద్రను మాత్రం చెరిపివేయలేము. ఒక్కటి మాత్రం నిజం, ఆయన బ్రతికుంటే తెలంగాణ రాజకీయ స్వరూపం చాలా భిన్నంగా ఉండేది. (నేడు ఎలిమినేటి మాధవరెడ్డి 15వ వర్ధంతి) కాలేరు సురేష్ కన్వీనర్, మాధవరెడ్డి స్మారక సమితి. మొబైల్: 9866174474