
ముంబై: వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రికి ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడికీ ఈ నెల 12 వరకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 1న మనీలాండరింగ్ కేసులలో అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు.
అయితే శనివారం పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు అనిల్ దేశ్‌ముఖ్ కస్టడీని పొడగించడానికి నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడికి పంపించిన విషయం తెలిసిందే. కాగా, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నెలకు రూ.100 కోట్ల వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యం నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment