Anil Deshmukh
-
Maharashtra: అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి.. మాజీ మంత్రి తలకు గాయాలు
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో అనిల్ దేశ్‌ముఖ్‌కు తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనను నాగ్‌పూర్ పోలీసులు ధృవీకరించారు. నాగ్‌పూర్‌లోని కటోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.అనిల్ దేశ్‌ముఖ్ కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ కటోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. కుమారుడి తరఫున అనిల్ ప్రచారానికి వెళ్లారు. కటోల్ జలల్ఖేడా రోడ్డులో తన కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని ఎన్సీపీ- ఎస్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. గాయపడిన అనిల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నాగ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) హర్ష్ పొద్దార్ ఈ ఘటనను ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్‌పై ఉన్నారు. 2021లో అవినీతి ఆరోపణలతో అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నవంబర్ 2021లో అనిల్ అరెస్టయ్యారు. డిసెంబర్ 2022లో బెయిల్‌పై విడుదలయ్యారు.#BREAKING 🚨 | Former Home Minister Anil Deshmukh was injured in a stone-pelting attack on Katol-Jalalkheda Road after a rally. His vehicle was damaged, and he received emergency treatment.#AnilDeshmukh #AttackonAnilDeshmukh #Katoljalalkhedaroad #attack pic.twitter.com/5WxQrMxGU0— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 18, 2024Credits: Lokmat Times Nagpur288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్‌తో కూడిన ఎన్సీపీల మహాయుతి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షమైన శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తోంది.ఇది కూడా చదవండి: మోదీజీ.. సవాల్ చేస్తున్నా కమిటీని పంపండి!: సీఎం రేవంత్ -
అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ మరో కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన బీజేపీ అగ్రనాయకులను తప్పుడు కేసులో ఇరికించేందకు కుట్ర పన్నారనే అభియోగాలతో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్సీపీ– ఎస్పీ)పై సీబీఐ బుధవారం తాజాగా కేసు నమోదు చేసింది. 2020లో ఈ కుట్ర జరిగిందని తెలిపింది. 2020లో ప్రతిపక్షంలో ఉన్నపుడు దేవేంద్ర ఫడ్నవీస్ అప్పటి స్పీకర్‌కు ఒక పెన్‌డ్రైవ్‌ను అందజేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్.. అనిల్ దేశ్‌ముఖ్, ఇతరులతో కలిసి బీజేపీ నాయకుడు గిరీష్ మహజన్ (ప్రస్తుతం మంత్రి)ని ఇరికించడానికి ప్రయతి్నంచినట్లుగా పెన్డ్రైవ్లోని వీడియోల్లో ఉన్నట్లు సీబీఐ చెబుతోంది. పండిత్ చవాన్ ప్రముఖ బీజేపీ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పలు కుట్రలకు తెరతీసినట్లు ఈ వీడియోల్లో స్పష్టం ఉందని ప్రాథమిక విచారణలో గిరీష్ మహజన్‌తో సహా నలుగురు ఎమ్మెల్యేలు.. సీబీఐకి తెలిపారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం. సాక్షులను చిత్రహింసలు పెట్టడం, నగదు చెల్లింపులు, దర్యాప్తు అధికారులకు సూచనలు ఇవ్వడం.. ఇలా పక్కా పథకరచన చేశాడని ఆరోపించారు. డీసీపీ పూరి్ణమ గైక్వాడ్, ఏసీపీ సుష్మా చవాన్లతో కలిసి సాక్షుల వాంగ్మూలను, ఆధారాలను మార్చేశాడని పేర్కొన్నారు. తాజా ఎఫ్ఐఆర్లో సీబీఐ అనిల్ దేశ్ముఖ్తో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్, పూర్ణిమ, సుష్మ, న్యాయవాది విజయ్ పాటిల్‌లను నిందితులుగా పేర్కొంది. అవినీతి ఆరోపణలపై అనిల్ దేశ్‌ముఖ్ ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఈడీ కేసు కూడా నమోదైంది. ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ బెంబేలెత్తిపోయి తనపై నిరాధార కేసును నమోదు చేయించారని అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును చూసి.. కాళ్ల కింద నేల కదులుతోందని గ్రహించి ఫడ్నవీస్ ఇలాంటి కుట్రలకు దిగారని ఆరోపించారు. -
ఏడాదికి పైగా జైలు శిక్ష అనంతరం.. మహారాష్ట్ర మాజీ మంత్రికి ఊరట
ఏడాదికిపైగా జైలు శిక్ష అనుభవించిన మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కి భారీ ఊరట లభించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన ఆయనకు పార్టీ నాయకులు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ఏడాదికిపైగా జైలు శిక్ష అనుభవించి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బుధవారంమే విడుదలయ్యారు. దేశ్ముఖ కోసం జైలు వెలుపల పలువురు నాయకులు పెద్ద ఎత్తున వేచి ఉన్నారు. దేశ్‌ముఖ్ నాయక్ తన మద్దతుదారులు, పార్టీ ఎంపీ శరద్ పవార్ కుమార్తె సుప్రియాతో కలసి టాప్ లెస్ జీపులో సిద్ధి వినాయాకుని ఆలయానికి బయల్దేరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.."సస్పెండ్ అయ్యిన అధికారి సచిన్ వాజ్ కోరిక మేరకు తనను ఏడాదికిపైగా జైలులో ఉంచారని అన్నారు. తాను ఏ నేరం చేయకుండానే జైలులో ఉన్నానని చెప్పారు. చివరకు కోర్టు నుంచి నాకు న్యాయం జరిగింది. దేశంలో కొత్త పరిపాలనపై నాకు నమ్మకం ఉంది. అలాగే రాజ్యంగంపై కూడా నమ్మకం ఉంది అని" అన్నారు. కాగా దేశ్‌ముఖ్‌ను మొదట మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయ్యారు ఆ తర్వాత బెయిలపై నవంబర్ వరకు బయట ఉన్నారు. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నవంబర్ 2021లో అరెస్టు చేసింది. అంతేగాదు దేశ్‌ముఖ్ రాష్ట్ర హోంమంత్రి పదవిని దుర్వినియోగం చేశారని, కొంతమంది పోలీసు అధికారుల ద్వారా ముంబైలో వివిధ బార్ల నుంచి రూ. 4.7 కోట్లు వసూలు చేశారని సీబీఐ అవినీతి కేసు దాఖలు చేయడంతో ఆయన జైల్లో ఉన్నాడు. ఐతే దేశ్ముక్కి బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి సమయం కోరడంతో న్యాయమూర్తి 10 రోజుల పాటు ఆర్డర్‌ని స్థభింపజేశారు. దీంతో సీబీఐ అత్యున్నత న్యాయస్తానంలో అప్పీలు చేసింది. కానీ శీతాకాలం సెలవుల కారణంగా జనవరిలో అప్పీలును విచారించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా దేశ్‌ముఖ్ వైద్యపరమైన కారణాలతో పాటు లొసుగులను పేర్కొంటూ బెయిల్ కోసం అప్పీల్ చేశారు. అంతేగాదు హైకోర్టు సస్సెండ్ చేసిన పోలీసు అధికారి సచిన్ వాజ్ వాంగ్మూలం మినహా, బార్ యజమానుల నుంచి డబ్బు వసూలు చేశారని చెప్పడాని సీబీఐ వద్ద మరే ఆధారం లేదని హైకోర్టు పేర్కొంటూ దేశ్‌ముఖ్‌కి బెయిల్ మంజూరు చేసింది. (చదవండి: తుపాకీని లోడ్ చేయలేక హైరానా పడ్డ పోలీసు: కంగుతిన్న అధికారి) -
రూ.100 కోట్ల వసూళ్ల కేసులో మాజీ మంత్రికి ఊరట
ముంబై: నెలకి రూ.100 కోట్లు వసూళ్లకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరుపై స్టే పొడగించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది బాంబే హైకోర్టు. దీంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది. డిసెంబర్ 12న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు జస్టిస్ ఎంఎస్ కర్నిక్ బెయిల్ మంజూరు చేశారు. అయితే, సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు 10 రోజుల సమయం కావాలని సీబీఐ కోరింది. దీంతో ఆయన విడుదల వాయిదా పడింది. గత వారం సీబీఐ అభ్యర్థన మేరకు డిసెంబర్ 27 వరకు బెయిల్‌పై స్టే విధించింది బాంబే హైకోర్టు. సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం శీతాకాల సెలవుల్లో ఉంది. దీంతో కేసు విచారణ 2023, జనవరిలోనే జరగనుంది. దీంతో మరోసారి స్టే పొడిగించాలని కోరింది దర్యాప్తు సంస్థ. కానీ అందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్‌పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించిన క్రమంలో మాజీ మంత్రి దేశ్‌ముఖ్ బుధవారం జైలు నుంచి విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇదీ కేసు.. అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసులో గతేడాది నవంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో గత అక్టోబర్‌లోనే బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో స్పెషల్ కోర్టు ఆయనకి బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం ఎన్సీపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు .. క్షణాల్లోనే షాక్! -
మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిల్ మంజూరు.. అంతలోనే
ముంబై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది. అలాగే సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. అయితే బెయిల్ మంజూరు చేసిన కొద్ది క్షణాలకే ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సమయం కావాలని సీబీఐ హైకోర్టును కోరింది. దీనిపై స్పందించిన హైకోర్టు జస్టిస్ కార్నిక్.. అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్ ఆర్డర్‌పై 10 రోజులపాటు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యను దేశ్‌ముఖ్ తరఫున న్యాయవాదులు అనికేత్ నికమ్, ఇంద్రపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. బెయిల్ ఉత్తర్వులు ఏడు రోజుల్లో అమల్లోకి వచ్చేలా చూడాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే తన ఆర్డర్‌ను సవాల్ చేసుకోవాలంటూ జస్టిస్ పేర్కొన్నారు. కాగా 71 ఏళ్ల దేశ్‌ముఖ్‌కు అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి 100 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసులో గతేడాది నవంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుంది. అవినీతి ఆరోపణలపై సీబీఐ, మనీలాండరింగ్ కేసులో ఈడీ రెండూ దేశ్‌ముఖ్‌పై దర్యాప్తు చేస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో గత అక్టోబర్‌లోనే బాంబే హైకోర్టు బెయిల్ మంజురు చేసింది. సీబీఐ కేసు కేసులో స్పెషల్ కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం ఎన్సీపీ నేత హైకోర్టును ఆశ్రయించాడు. దేశ్‌ముఖ్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సీబీఐ అభ్యర్థనతో మళ్లీ స్టే విధించింది. చదవండి: బస్సుల్లో ఉమ్మివేస్తే జరిమానా.. ఆ అధికారం కండక్టర్‌కే -
ఎట్టకేలకు మాజీ మంత్రికి బెయిల్, కానీ..
ముంబై: మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు మంగళవారం(ఇవాళ) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తులపై ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది బాంబే హైకోర్టు. అయితే.. ఈ ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ఈడీ కోరింది. దీంతో.. సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు ఈడీకి వీలుగా బెయిల్ ఆర్డర్ అక్టోబర్ 13 నుంచి అమల్లోకి వస్తుందని హైకోర్టు పేర్కొంది. అయితే.. బెయిల్ లభించినప్పటికీ ఆయన బయటకు రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఏప్రిల్‌లో సీబీఐ ఆయనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. 2019-21 మధ్య హోం మంత్రి పదవిలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందటి ఏడాది నవంబర్‌లో మనీల్యాండరింగ్ ఆరోపణలతో అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఏడాది మొదట్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థన తిరస్కరణకు గురైంది. 72 ఏళ్ల అనిల్ దేశ్‌ముఖ్ వయసు, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తొలుత హైకోర్టు ఈ అభ్యర్థనలపై స్పందించకపోవడంతో.. సుప్రీంకు వెళ్లారు ఆయన తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. ఆరు నెలలుగా విచారణకు సైతం స్వీకరించకుండా అభ్యర్థ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచినందుకు సుప్రీం కోర్టు.. బాంబే హైకోర్టును మందలించింది. అధికారం అండతో.. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి అక్రమంగా రూ.4.7 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు అనిల్ దేశ్‌ముఖ్‌పై ఉన్నాయి. ఈ మేరకు ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ ఇచ్చిన వాంగ్మూలంతో సీబీఐ, అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి కేసును నమోదు చేయగా.. ఆ వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. -
ఎన్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, ముంబై: విధాన పరిషత్ ఎన్నికలకు ముందు ఎన్సీపీ నాయకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లకు విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముంబై హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లు కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. ఈ హైకోర్టు తీర్పుతో ఎన్సీపీకి గట్టి దెబ్బతగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్
రాజ్యసభ ఎన్నికల విషయంలో మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి షాక్ తగిలింది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్‌లకు రాజ్యసభ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించింది ముంబై కోర్టు. ఈ మేరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఈ ఇద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్(PMLA)యాక్ట్ ప్రకారం వేర్వేరు కేసుల్లో ఈ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి దేశ్‌ముఖ్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా.. కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ మాత్రం అనారోగ్యకారణంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం(జూన్ 10న) రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమను అనుమతించాలని, ఒక్కరోజు ఎస్కార్ట్‌తో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూర్ చేయాలని ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. బుధవారం ఈ పిటిషన్‌కు సంబంధించి సుదీర్థ వాదనలు జరిగాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. జైల్లో ఉన్న వాళ్లకు ఓటు వేసే హక్కు ఉండదని వాదించారు ఈడీ తరపు న్యాయవాదులు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ఎస్ రోకడే.. బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 2017లో మనీల్యాండరింగ్ కేసులో శిక్ష అనుభవించిన ఆనాటి కేబినెట్ మంత్రి చగ్గన్ భుజ్‌బల్.. కోర్టు అనుమతి ద్వారా అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓటు వేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు దేశ్‌ముఖ్ తరపు న్యాయవాది. అయితే ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. మంత్రిగా ఉన్న సమయంలో వివిధ పబ్‌ల నుంచి పోలీసుల ద్వారా నాలుగున్నర కోట్ల రూపాయలు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగానూ నవంబర్ 2021లో ఆయన అరెస్ట్ అయ్యారు. అలాగే మహారాష్ట్ర మైనార్టీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మేరకు ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసింది. -
‘ముందు జైల్లో పెట్టేది తిను.. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం’
ముంబై: అవినీతి కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే తను ఇంట్లో వండిన భోజనాన్ని జైల్లోకి తెప్పించుకునేందుకు చేసిన కోర్టును అభ్యర్థించారు. కానీ ప్రత్యేక కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. "ముందు నువ్వు జైల్లో పెట్టే తిండి తిను.. ఒక వేళ నీకు సరిపడకుంటే అప్పుడు పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది. అనిల్ దేశ్‌ముఖ్‌కు 71 ఏళ్ల కావడంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మంచం కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని మాత్రం కోర్టు అంగీకరించింది. మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి దేశ్‌ముఖ్‌ను నవంబర్ 1న అరెస్టు చేశారు. ముంబైలోని తమ కార్యాలయంలో 12 గంటల పాటు విచారించిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్‌పై అవినీతి కేసు నమోదు చేసిన తర్వాత ఏజెన్సీ అతనిపై దర్యాప్తు ప్రారంభించింది. దేశ్‌ముఖ్ హోం మంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేశారని, తొలగించబడిన పోలీసు అధికారి సచిన్ వాజ్ సహాయంతో నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి ₹ 4.70 కోట్లు వసూలు చేశారని ఏజెన్సీ వాదిస్తోంది. కాగా, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ ఏడాది ప్రారంభంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. చదవండి: కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా.. -
అనిల్ దేశ్‌ముఖ్‌కు షాక్.. ఈ నెల 12 వరకు ఈడీ కస్టడి
ముంబై: వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రికి ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడికీ ఈ నెల 12 వరకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 1న మనీలాండరింగ్ కేసులలో అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. అయితే శనివారం పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు అనిల్ దేశ్‌ముఖ్ కస్టడీని పొడగించడానికి నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడికి పంపించిన విషయం తెలిసిందే. కాగా, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నెలకు రూ.100 కోట్ల వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యం నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే. చదవండి: UP: సెంట్రల్ జైలులో ఖైదీల వీరంగం -
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్
ముంబై: వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 12 గంటల సేపు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అర్ధరాత్రి దాటాక ఆయనని అరెస్ట్ చేశారు. దేశ్‌ముఖ్‌ను మంగళవారం ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి పి.బి.జాదవ్ ఆయనకు నవంబర్ 6 వరకు కస్టడీ విధించారు. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నెలకు రూ.100 కోట్ల వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యంగా నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే. (చదవండి: రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ) -
దేశ్‌ముఖ్, పరబ్‌లకు 40 కోట్లు ఇచ్చారు
ముంబై: బదిలీ ఉత్తర్వులను నిలిపివేసేందుకు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు 10 మంది డీసీపీలు కలసి రూ. 40 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్ బీర్ సింగ్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవడానికి ఈ సొమ్ములు ముట్టజెప్పినట్టుగా వాజే ఈడీతో చెప్పారు. దేశ్‌ముఖ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్‌లపై నమోదైన కేసుకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీటులో వాజే చేసిన ఆరోపణల్ని ప్రస్తావించారు. జులై 2020లో ముంబైలో 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ పరమ్ బీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులపై అప్పటి హోంమంత్రి దేశ్‌ముఖ్, రవాణా మంత్రి పరబ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని వాజే పేర్కొన్నారు. -
అనిల్ దేశ్‌ముఖ్‌కు షాక్: రూ. 4 కోట్లు విలువైన ఆస్తుల జప్తు
ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో భాగాంగా అనిల్ దేశ్‌ముఖ్‌కు సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను శుక్రవారం ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో జప్తు చేసిన ఆస్తుల విలువు సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చిన అభిప్రాయపడుతున్నారు. అనిల్ దేశ్‌ముఖ్ ఈడీ దర్యాప్తుకు హాజరు కాకుండా ఇప్పటికే మూడు సమన్లు తప్పించుకున్నారు. అతని కుమారుడు హృషికేశ్, భార్యకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ వారు కూడా దర్యాప్తుకు నిరాకరించారు. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ ఆరోపణలు మేరకు అనిల్ దేశ్‌ముఖ్‌పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్ తన పదవీకి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. ఈడీ అన్యాయంగా అనిల్‌పై కేసు నమోదు చేసిందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలో అనిల్ దేశ్‌ముఖ్, ఈడీ బలవంతపు చర్యల నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
మనీలాండరింగ్ కేసు: మాజీ పోలీసు అధికారికి ఈడీ సమన్లు..
ముంబై: మహరాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై మనీలాండరింగ్ వివాదంలో గతంలోనే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇదే కేసులో ఈడీ ముంబై మాజీ పోలీసు అధికారి పరమ్‌బీర్ సింగ్‌కు సమన్లను జారీ చేసింది. కాగా, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు పబ్‌లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పరమ్ బీర్ సింగ్ మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రెకు రాసిన లేఖ అప్పట్లో పెద్ద దుమారాన్నిరేపింది. దీంతో గత మార్చిలో అనిల్ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదయ్యింది. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. బాంబె హైకోర్ట్ ఆదేశాల ప్రకారం, పరమ్ బీర్ సింగ్‌పై కూడా మనీలాండరింగ్ కేసుతో ఆరోపణల నేపథ్యంలో సమన్లు జారీచేశామని తెలిపింది. ఇప్పడికే ఈడీ నోటిసులను జారీ చేసి వారం గడిచింది. అయితే, అనారోగ్యం కారణంగా మరికొంత సమయం కావాలని పరమ్ బీర్ సింగ్ కోరినట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే, బాంబె కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బలమైన ఆధారాలు లభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అలాగే ముంబై, నాగపూర్‌లో అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో, బంధువులు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. అదే విధంగా ఆయన వ్యక్తిగత సహాయకుడి నివాసంలోనూ సోదాలు నిర్వహించామని సీబీఐ అధికారులు తెలిపారు. -
మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఈడీ షాక్..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సహాయకులిద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్ పీఏ, వ్యక్తిగత కార్యదర్శిని అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆయన నివాసంలో సోదాలు జరిపారు. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ ఆరోపణలు మేరకు అనిల్ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈడీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మనీ లాండరింగ్ చట్టం కింద అనిల్ దేశ్‌ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పాండే, పీఏ కుందన్ షిండేలను అరెస్ట్ చేసి.. 9గంటల పాటు ప్రశ్నించాము. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లోని సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ కార్యాలయంలో వీరిద్దరిని విచారిస్తున్నాము. కానీ వారు సహకరించడం లేదని’’ తెలిపారు. చదవండి: అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ -
అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎస్ సిపీ) నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆయన భారీగా ముడుపులు డిమాండ్ చేసినట్లు ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అనిల్ దేశ్‌ముఖ్‌పై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడితో పాటు గుర్తు తెలియని వ్యక్తులపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బలమైన ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ముంబై, నాగపూర్‌లో అనిల్ దేశ్‌ముఖ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆయన వ్యక్తిగత సహాయకుడి నివాసంలోనూ సోదాలు జరిపారు. చదవండి: ప్రాణవాయువును అడ్డుకుంటే ఉరి తీస్తాం! -
సీబీఐ విచారణకు మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్
-
అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు గురువారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్‌దేశ్‌ముఖ్ దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హోంమంత్రిగా ఉన్న సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ ముంబైలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్æ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘ఆరోపణలను చూస్తే వీటిపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయడమే మంచిదని భావిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవాలనుకోవడం లేదంది. ‘ఒక సీనియర్ మంత్రిపై ఒక సీనియర్ పోలీసు అధికారి చేసిన తీవ్రమైన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయడం సరైనదే’ అని పేర్కొంది. మౌఖికంగా, ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశించడం సరికాదని అనిల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలపై, మంత్రి వాదన వినకుండానే బొంబాయి హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. ‘ప్రస్తుతం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నేతృత్వంలో నడుస్తోంది. ఆ నియామకానికి సంబంధించిన పిటిషన్ కూడా ఇదే కోర్టులో విచారణలో ఉంది’ అని సిబల్ వివరించారు. -
2 కోట్లు ఇవ్వు.. పవార్‌ను మేనేజ్ చేస్తాను!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రిపై పోలీస్ అధికారి పరమ్‌బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తనకు తిరిగి పోస్టింగ్ ఇచ్చేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేశారని సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే ఆరోపించారు. మరో మంత్రి అనిల్ పరబ్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలంటూ ఒత్తిడి చేశారని కూడా పేర్కొన్నారు. ఈమేరకు ఆరోపణలతో స్వయంగా రాసిన లేఖను బుధవారం ఎన్ఐఏ కోర్టుకు హాజరైన సమయంలో అందజేసేందుకు యత్నించగా జడ్జీ నిరాకరించారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేయాలని ప్రయత్నించారని వాజే ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, పవార్‌ను ఒప్పించే పూచీ తనదని అప్పటి హోం మంత్రి దేశ్‌ముఖ్..అందుకు గాను రూ.2 కోట్లు ఇవ్వాలని షరతు పెట్టారని తెలిపారు. అంత డబ్బు ఇవ్వలేనని అశక్తత వ్యక్తం చేయగా తరువాత ఇవ్వాలని దేశ్‌ముఖ్ కోరారన్నారు. సయిఫీ బుర్హానీ అప్లిఫ్ట్మెంట్ ట్రస్ట్ కేసు విచారణను మూసివేసేందుకు రూ.50 కోట్లు ఆ ట్రస్టు సభ్యుల నుంచి వసూలు చేయాలని టార్గెట్ పెట్టగా అటువంటి పనులను చేయలేనని తప్పుకున్నట్లు పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలున్న 50 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని మరో మంత్రి అనిల్ పరబ్ తనను కోరారని తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను రవాణా శాఖ మంత్రి పరబ్ ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముంబై ఉన్న సుమారు 650 బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.3 లక్షల నుంచి రూ.3.5లక్షల వరకు వసూలు చేయాలని మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని అప్పటి పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌కు కూడా తెలిపానన్నారు. రాష్ట్రంలోని గుట్కా, పొగాకు అక్రమ వ్యాపారుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ కేబినెట్లో సీనియర్ మంత్రి సన్నిహితుడినంటూ దర్శన్ ఘోడావత్ అనే వ్యక్తి సంప్రదించగా నిరాకరించినట్లు తెలిపారు. చదవండి: సంచలనం: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా పరంబీర్ ఆదేశాల మేరకే వాజేకు పోస్టింగ్ సస్పెండైన వివాదాస్పద పోలీస్ అధికారి సచిన్ వాజేను గత ఏడాది జూన్‌లో అప్పటి పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆదేశాల మేరకే క్రైం ఇంటెలిజెంట్ యూనిట్(సీఐయూ)లోకి తిరిగి తీసుకున్నట్లు ముంబై పోలీస్ శాఖ మహారాష్ట్ర హోం శాఖకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ విషయంలో అప్పటి జాయింట్ పోలీస్ కమిషనర్(క్రైం) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపింది. విధి నిర్వహణలో సచిన్ వాజే నేరుగా అప్పటి పోలీస్ కమిషనర్ పరంబీర్కే నేరుగా రిపోర్టు చేసేవారని తెలిపింది. కీలక కేసులపై జరిగే మంత్రివర్గ స్థాయిలో జరిగే సమావేశాల్లో సీపీతోపాటు పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి బదులుగా అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉన్న వాజే పాల్గొనేవారని వివరించింది. కీలక కేసుల విచారణలో పోలీస్ కమిషనర్ పరంబీర్‌సింగ్ సూచనల మేరకు వాజే నిర్ణయాలు తీసుకునే వారని వెల్లడించింది. వాజేను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల కేసులో ముంబై పోలీస్ మాజీ అధికారి సచిన్ వాజేను విచారించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. అనిల్ దేశ్‌ముఖ్ అవినీతికి పాల్పడ్డారంటూ ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక అంద జేయాలన్న ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. పరంబీర్ సింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేయడంతోపాటు ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న వాజేను ప్రశ్నించేందుకు అనుమతి వ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి పీఆర్ సిత్రే సీబీఐకి అనుమతించడంతోపాటు వాజే కస్టడీని ఈనెల 9వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. చదవండి: ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు -
ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేసిన అనంతరం ట్విటర్లో స్పందించారు. సాధువులను హత్య చేసి.. స్త్రీలను వేధించి, హింసించేవారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అనిల్ దేశ్ముఖ్నుద్దేశించి హెచ్చరించారు. అంతేకాదు ముందు ముందు ఏం జరుగనుందో చూస్తూ ఉండు అంటూ ఫైర్ బ్రాండ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో తన ఆఫీసుపై దాడి, కూల్చివేత విషయాలను గుర్తు చేస్తూ చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే శివసేన, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో కంగనా వ్యాఖ్యలు మరోసారి అగ్గి రాజేశాయి. (సంచలనం: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా) కాగా ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ హోంమంత్రి దేశ్‌ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనిల్ దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. जो साधुओं की हत्या और स्त्री का अपमान करे उसका पतन निश्चित है #AnilDesmukh यह तो सिर्फ़ शुरुआत है, आगे आगे देखो होता है क्या #UddhavThackeray https://t.co/cvEZsjUxSc — Kangana Ranaut (@KanganaTeam) April 5, 2021 -
‘మహా’ ముడుపులపై సీబీఐ
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై పదిహేను రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని బొంబే హైకోర్టు ఆదేశించింది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం కోసం స్వతంత్ర ఏజన్సీతో విచారణ అవసరమని తెలిపింది. మొత్తం మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక క్రిమినల్ రిట్పిటీషన్పై కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో ఒక పిల్‌ను సింగ్ దాఖలు చేయగా, మిగిలిన పిల్స్‌ను ఒక లాయర్, ఒక టీచర్ దాఖలు చేశారు. క్రిమినల్ రిట్‌ను లాయర్ జయశ్రీ వేశారు. ఈనెల 25న దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సీబీఐ విచారణ జరపాలని సింగ్ పిల్ దాఖలు చేశారు. సచిన్ వాజే సహా పలువురు పోలీసులను మామూళ్లు వసూలు చేయాలని అనిల్ ఆదేశించినట్లు సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను దేశ్‌ముఖ్ తోసిపుచ్చారు. మహా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ పిల్‌ను తిరస్కరించాలని కోరారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కానందున సీబీఐ విచారణ సాధ్యం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. మంగళవారం నుంచి సీబీఐ విచారణ షురూ! విచారణకు మంగళవారం సీబీఐ బృందం ముంబైకి వచ్చి విచారణ ప్రక్రియ ఆరంభించనుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో తమకు అధికారిక ఆదే శాలు అందిన అనంతరం లీగల్ అభిప్రాయం తీసు కొని సీబీఐ విచారణ ఆరంభిస్తుంది. కానీ ఈ కేసు లో కోర్టు కేవలం 15 రోజుల సమయం ఇవ్వడంతో వీలయినంత తొందరగా విచారణ ఆరంభించాలని సీబీఐ భావిస్తుందని అధికారులు చెప్పారు. ముంబై రాగానే కోర్టు ఆదేశాలను, ఫిర్యాదు కాపీలను, ఇతర డాక్యుమెంట్లను సీబీఐ సమీకరించనుంది. అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా తనపై మాజీ పోలీస్ కమిషనర్ సింగ్ చేసిన ఆరోపణలను సీబీఐతో విచారించాలని బొంబై హైకోర్టు నిర్ణయించడంతో మహారాష్ట్ర హోంమంత్రి అనీల్ దేశ్‌ముఖ్ ఆ పదవికి రాజీనామా చేశారు. అనీల్ తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్‌కు పంపినట్లు ఎన్సీపీకి చెందిన మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అనీల్ సైతం తన లేఖ కాపీని ట్విట్టర్లో ఉంచారు. కోర్టు ఆదేశానంతరం అనీల్ ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను కలిసి పదవి నుంచి దిగిపోవాలని భావిస్తున్నట్లు చెప్పారని మాలిక్ తెలిపారు. పవార్ అంగీకారంతో అనీల్ రాజీనామాను ఉద్దవ్‌కు అందజేసినట్లు తెలిపారు. నూతన హోంమంత్రిగా ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్ నియమితులయ్యారు. అనిల్æ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో దిలీప్‌ను సీఎం నియమించారు. -
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా
-
సంచలనం: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు కీలక మలుపు తిరిగింది. మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. అతడిపై ముంబై మాజీ సీపీ పరమ్‌బీర్ సింగ్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదై కోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. పార్టీ ఆదేశాల మేరకు అనిల్ దేశ్‌ముఖ్ తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్ ఠాక్రేకు పంపించారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తీరుపై ముఖ్యమంత్రికి పరమ్‌వీర్ సింగ్ ఫిర్యాదు చేశారు. పేలుడు పదార్థాల కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను మంత్రి వాడుకున్నారని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పురమాయించారంటూ పరంబీర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అనిల్ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారని, నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ పదేపదే మంత్రి అనిల్ కోరినట్లు తెలిపారు. రూ.100 కోట్ల ఫండ్ కలెక్ట్ ఎలా చేయాలో కూడా సచిన్ వాజేకు చెప్పినట్లు పరమ్‌బీర్ సింగ్ లేఖలో తెలిపారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఇంకా ఆమోదించలేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజీనామాకు అంగీకారం తెలపడంతోనే అనిల్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. చదవండి: వాజే టార్గెట్ వంద కోట్లు -
‘ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు.. చట్టానికి అతీతులా?’
ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరంవీర్ సింగ్‌పై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. సీబీఐ విచారణ కోరుతున్నారు మీరు చట్టానికి అతీతులా’’ అని ప్రశ్నించింది. అనిల్ దేశ్‌ముఖపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ పరంవీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు ‘‘ మీరు ఓ పోలీసు కమిషనర్. మీ కోసం చట్టాన్ని పక్కకు పెట్టాలా. మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసులు చట్టానికి అతీతులా.. మాకు ఏ చట్టాలు వర్తించవని మీ అభిప్రాయమా’’ అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాక ‘‘పోలీసు డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉండి.. 30 ఏళ్లకు పైగా ఈ నగరానికి సేవలందించిన మీలాంటి ఓ వ్యక్తి వద్ద నుంచి ఇలాంటి కఠిన నిజాలు వెలువడటం శోచనీయం. అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని మీరు కోరుతున్నారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలాంటి విచారణ జరపలేం అనే విషయం మీకు తెలియదా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు. నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అది మీ బాధ్యత కాదా’’ అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు కలిగిన వాహనం కలకలం కేసుకు సంబంధించి పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్ పరంవీర్ సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ మహారాష్ట్ర హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరంవీర్ సింగ్ అనిల్ దేశ్‌ముఖ్ బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాలయు వసూలు చేయాలని వజేకు టార్గెట్ విధించాడని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో ఆరోపించాడు. ఇందుకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. చదవండి: వాజే టార్గెట్ వంద కోట్లు -
యాక్సిడెంటల్ హోం మినిస్టర్
ముంబై/నాగపూర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కి అనూహ్యంగా ఆ పదవి లభించిందని, ఆయన యాక్సిడెంటల్ హోం మినిస్టర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. పార్టీ పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్సీపీ నేతలు జయంత్‌పాటిల్, దిలీప్ వాల్సే హోం మంత్రి పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయని కారణంగానే, అనిల్‌దేశ్‌ముఖ్‌కు అవకాశం లభించిందని రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వలో నష్ట నివారణ యంత్రాంగం సరిగా లేదని రౌత్ పేర్కొన్నారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలను ఎదుర్కొనే విషయంలో ఈ విషయం రుజువైందన్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అహ్మదాబాద్‌లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలపై రెండు పార్టీలు స్పందించాయి. దీనిపై మీడియా ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. అన్ని విషయాలు వెల్లడించలేమని వ్యాఖ్యానించారు. కాగా, కావాలనే షా అలా మాట్లాడారని, గందరగోళం సృష్టించాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, బీజేపీ పద్ధతే అదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పదవీ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఆ విచారణలో అన్ని వాస్తవాలు బయటకి వస్తాయన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరానన్నారు. -
అత్యంత తీవ్రమైన ఆరోపణలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆ రాష్ట్ర మాజీ పోలీసు చీఫ్ పరమబీర్ సింగ్ తన పిటిషన్లో చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే ఆ పిటిషన్‌ను విచారించడానికి మాత్రం నిరాకరించింది. బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని పరమ్‌బీర్‌కు సూచించింది. అనిల్ దేశ్ ముఖ్ అవినీతిపై సంచలన ఆరోపణలు చేసిన పరమ్‌బీర్ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ విచారణ చేపట్టడానికి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ రెడ్డిలతో కూడిన బెంచ్ నిరాకరించింది. పరమ్‌బీర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించిన కోర్టు బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది. అయితే పరమ్‌బీర్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, దీనిని తీవ్రమైన అంశంగానే పరిగణించాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలని పరమ్‌బీర్ అనుకుంటే హైకోర్టుకే వెళ్లాలని, ఈ తరహా కేసుల్ని హైకోర్టులే చూస్తాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వివిధ వ్యాపార సంస్థల నుంచి నెలకి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారి సచిన్ వాజేకి హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ లక్ష్యంగా నిర్ణయించారని ముంబై పోలీసు మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయరు
ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ తప్పుడు ఆరోపణలు చేశారని, అందువల్ల అనిల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌ల నుంచి నెలకు కనీసం రూ. 100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ పోలీసులను ఆదేశించారని పరమ్‌వీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఏ రోజైతే అనిల్ దేశ్‌ముఖ్ పోలీసులను అలా ఆదేశించారని పరమ్‌వీర్ సింగ్ ఆరోపించారో.. ఆ రోజు అనిల్ దేశ్‌ముఖ్ నిజానికి నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శరద్ పవార్ వివరించారు. కరోనా సోకడంతో అనిల్ దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాగపూర్‌లో చికిత్స పొందారని, ఫిబ్రవరి 27 వరకు హోం క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. అందువల్ల, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని సోమవారం పవార్ స్పష్టం చేశారు. పరమ్‌వీర్ ఆరోపణలు నిజమే అయితే.. రూ. 100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ సచిన్ వాజేకు ఫిబ్రవరి మధ్యలో ఆదేశాలిస్తే.. ఆ విషయాన్ని నెల తరువాత పరమ్‌వీర్ ఎందుకు వెల్లడించారని, ముందే ఎందుకు సీఎంకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మరోవైపు, ఆ సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఉన్నారన్న వాదనను బీజేపీ తోసిపుచ్చింది. ఫిబ్రవరి 15న ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారంటూ ఒక వీడియోను విడుదల చేసింది. దీనిపై అనిల్‌దేశ్‌ముఖ్ స్పందిస్తూ.. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో కొద్ది సేపు మీడియాతో మాట్లాడిన వీడియోను బీజేపీ చూపుతోందన్నారు. కాగా, పరమ్‌వీర్ ఆరోపణలతో మహారాష్ట్ర హోం శాఖ ప్రతిష్ట దెబ్బతిన్నదని శివసేన వ్యాఖ్యానించింది. అయితే, ఒక్క అధికారి చేసిన ఆరోపణలతో ప్రభుత్వమేమీ కూలిపోదని, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ముప్పేమీ లేదంది. -
100 కోట్ల ఆరోపణలపై దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సోమవారం లోక్‌సభ దద్దరిల్లింది. హోంమంత్రిపై ముంబై పోలీస్ కమిషనర్‌గా పని చేసిన వ్యక్తి అవినీతి ఆరోపణలు చేయడం చాలా తీవ్రమైన విషయమని, వెంటనే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాలని బీజేపీ డిమాండ్ చేసింది. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌లు తదితరాల నుంచి ప్రతీ నెల రూ.100 కోట్లు వసూలు చేయాలని ముంబై పోలీసు అధికారులకు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్వయంగా ఆదేశాలిచ్చారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను జీరో అవర్‌లో, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య బీజేపీ సభ్యుడు మనోజ్ కోటక్ లేవనెత్తారు. ఈ విషయంలో ఇంతవరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఎలాంటి స్పందన రాలేదని, తక్షణమే ఆయన ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘ఇది చాలా సీరియస్ అంశం. హోం మంత్రే కాదు. మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయాలి. సీబీఐతో సమగ్రంగా విచారణ జరపాలి’ అన్నారు. దీన్ని రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశంగా చూడకూడదని బీజేపీ సభ్యుడు రాకేశ్ సింగ్ పేర్కొన్నారు. ముంబై నుంచే రూ. 100 కోట్లు అయితే, మొత్తం రాష్ట్రం నుంచి ఎంత వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. అనిల్ దేశ్‌ముఖ్ అవినీతిపై ఆరోపణలు రావడం ఇదే ప్రథమం కాదని, గతంలో డీజీపీ స్థాయి అధికారి ఆయనపై ఆరోపణలు చేశారని బీజేపీ సభ్యుడు కపిల్ పాటిల్ పేర్కొన్నారు. శరద్ పవార్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొన్న మహారాష్ట్ర సీనియర్ నేత.. ఆ వెంటనే మాట మార్చారన్నారు. ‘వాస్తవాలు బయటపడ్తాయని భయపడ్డారా?’ అని ప్రశ్నించారు. శివసేన ఎంపీ వినాయక రౌత్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిర పర్చేందుకు కేంద్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత రవ్నీత్ సింగ్ బిట్టు ఆరోపించారు. సచిన్ వాజే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం ఫడ్నవీస్‌ను ఉద్ధవ్ ఠాక్రే కోరారని స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా తెలిపారు. అయితే, సీఎం ఆ అభ్యర్థనను తోసిపుచ్చారన్నారు. జీరో అవర్‌ను అధికార పక్షం రిగ్గింగ్ చేస్తోందని ఎన్సీపీ సభ్యురాలు సుప్రియ సూలే విమర్శించారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలి సుప్రీంలో పరమ్‌వీర్ పిటిషన్ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే, తనను ముంబై పోలీస్ కమిషనర్ పోస్ట్ నుంచి బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. ‘అనిల్ దేశ్‌ముఖ్ 2021 ఫిబ్రవరి లో సచిన్ వాజే(ముంబై క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్), సంజయ్ పాటిల్(ఏసీపీ, ముంబై సోషల్ సర్వీస్ బ్రాంచ్)లను పిలిపించుకుని ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్‌లు, ఇతర మార్గాల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని ఆదేశించారు’ అని పిటిషన్లో పరమ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటింముందు పేలుడు పదార్థాలతో దర్శనమిచ్చిన వాహనం వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ కేసులో రోజుకో పరిణామంతో, బీజేపీ, శివసేనల మాటల యుద్ధం వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణం తరువాత మరింత ముదురుతోంది. తాజాగా తన బదిలీని వ్యతిరేకిస్తూ ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమబీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను హోం గార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లో దాఖలు చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరపాలని ఈ సందర్భంగా ఆయనడిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసేందుకు తనపై బదిలీ వేటు వేశారని ఆరోపించారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలు నాశనం చేయకముందే. తన ఆరోపణలపై హోంమంత్రిపై న్యాయమైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ తనకు రక్షణకు కల్పించాల్సిందిగా కోరారు. (వాజే టార్గెట్ వంద కోట్లు) మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 17 న సింగ్‌ను బదిలీ చేసి, మహారాష్ట్ర డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి హేమంత్ నాగ్రేల్ను కొత్తగా నియమించింది. దీంతో హోమ్ గార్డ్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పరమ్‌బీర్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు కమిషనర్ బాధ్యతలనుంచి తొలగించిన అనంతరం సింగ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఒక లేఖ రాశారు. హిరేన్ మృతి కేసులో ఎన్ఐఏ అదుపులో ఉన్న సచిన్ వాజే, ఇతర పోలీసు అధికారులను రూ .100 కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కోరినట్లు ఈ లేఖలో ఆరోపించారు. ముంబైలోని బార్స్ , రెస్టారెంట్ల నుండి నెలవారీ రూ .50 కోట్ల నుండి 60 కోట్ల వరకు వసూలు చేయాలని కోరారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను దేశ్‌ముఖ్ ఖండించారు. హోంమంత్రి రాజీనామా చేసే ప్రసక్తేలేదు : శరద్ పవార్ అటు పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్రంగా ఖండించారు. దేశ్‌ముఖ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అనిల్ దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 5నుండి 15 వరకు ఆసుపత్రిలో ఉన్నారు, ఫిబ్రవరి 15 నుండి 27 వరకు అతను నాగ్‌పూర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను, రికార్డులన్నింటినీ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో అందించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ్‌ముఖ్ రాజీనామాకు సంబంధించి సేన నుండి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై బీజేపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. రాజ్యసభలో బీజేపీ ఎంపీలు ఇదే అంశంపై చర్చ చేయాలని డిమాండ్ చేయగా, లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. కాగా ఫిబ్రవరి 25 న అంబానీ నివాసం వెలుపల పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని ఉంచడంలో వాజే ఆరోపించిన పాత్రను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
అనిల్ దేశ్‌ముఖ్‌పై నేడు నిర్ణయం
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్‌వీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి నష్టనివారణ చర్యల కోసం ఎన్సీపీ అధినేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రంగంలోకి దిగారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ‘మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ)’పై ఈ ఆరోపణలు ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని పవార్ ఆదివారం పేర్కొన్నారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రభుత్వంలో కొనసాగించే విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం నిర్ణయం తీసుకుంటారన్నారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పవార్ అంగీకరించారు. ఆ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై సీఎం ఠాక్రేతో మాట్లాడానన్నారు. పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి జూలియొ రిబీరరో సహకారం తీసుకుంటే బావుంటుందని భావిస్తున్నానన్నారు. దేశ్‌ముఖ్‌కు సంబంధించి తాము సోమవారం వరకు నిర్ణయం తీసుకుంటామని, నిర్ణయం తీసుకునేముందు, ఆ ఆరోపణలకు సంబంధించి ఆయన వాదన కూడా వినాల్సి ఉంటుందని పవార్ వ్యాఖ్యానించారు. దేశ్‌ముఖ్‌ను హోంమంత్రి పదవి నుంచి తప్పించనున్నారన్న వార్తల నేపథ్యంలో పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముంబైలోని హోటళ్లు, బార్లు, పబ్స్, రెస్టారెంట్లు, హుక్కా పార్లర్లు.. తదితరాల నుంచి నెలకు కనీసం రూ. 100 కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి దేశ్‌ముఖ్ పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టారని పరమ్‌వీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, సీనియర్ పోలీస్ అధికారి సచిన్ వాజేను మళ్లీ పోలీస్ విభాగంలోకి తీసుకోవడంలో సీఎం ఠాక్రేకు కానీ, హోంమంత్రి దేశ్‌ముఖ్‌కు కానీ సంబంధం లేదని శరద్ పవార్ తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై రాజకీయ జోక్యం పెరిగిందని పరమ్‌వీర్ సింగ్ తనకు గతంలో ఫిర్యాదు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు సాగబోవని పవార్ స్పష్టం చేశారు. మరోవైపు, హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయని శివసేన నేత సంజయ్‌రౌత్ వ్యాఖ్యానించారు. మహా వికాస్ అఘాడీ మిత్రపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందన్నారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించాలని, దేశ్‌ముఖ్‌ను ప్రభుత్వంలో కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని అదే పార్టీ నేత సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యానించారు. దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఆరోపణల తీవ్రత దృష్ట్యా అనిల్ దేశ్‌ముఖ్‌పై వేటు తప్పకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై మిత్ర పక్షాల మధ్య విబేధాలు వచ్చే అవకాశాలు న్నాయనుకుంటున్నాయి. అయితే, అనిల్‌దేశ్‌ముఖ్ రాజీనామా చేయబోరని ఎన్సీపీ స్పష్టం చేసింది. పవార్‌తో చర్చించిన తరువాత ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ ఈ వ్యాఖ్య చేశారు. -
వాజే టార్గెట్ వంద కోట్లు
-
వాజే టార్గెట్ వంద కోట్లు
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలోని శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్‌సింగ్ ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎనిమిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పేలుడు పదార్థాల కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను మంత్రి వాడుకున్నారని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పురమాయించారంటూ పరంబీర్ బాంబు పేల్చారు. ఈ సొమ్మును సీఎం ఠాక్రే పేరిట జమ చేయాలన్నారని చెప్పారు. అనిల్ అవినీతి కార్యకలాపాల గురించి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఉపముఖ్యమంత్రి అజిత్‌లకు తెలిపానని పరంబీర్ పేర్కొన్నారు. ‘మంత్రి అనిల్ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ ఆయన్ను పదేపదే మంత్రి కోరారు. రూ.100 కోట్ల ఫండ్ కలెక్ట్ ఎలా చేయాలో కూడా సచిన్ వాజేకు చెప్పారు. ముంబైలో 1750 బార్లు, రెస్టారెంట్లు, తదితరాలున్నాయి. ఒక్కో బార్, రెస్టారెంటు నుంచి రూ.2–3 లక్షలు వసూలు చేస్తే నెలకు రూ.40 నుంచి రూ.50 కోట్లు సులభంగా జమ అవుతాయి. ఇతర వనరుల ద్వారా మిగతా మొత్తం అందేలా చూడాలని మంత్రి కోరారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పలాండే తదితరులు అక్కడే ఉన్నారు’ అని ఆ లేఖలో పరంబీర్ సింగ్ పేర్కొన్నారు. తనతోపాటు సీనియర్ అధికారులకు తెలియకుండా ఇలా వారిని నివాసానికి పిలిపించుకోవడం, డబ్బులు వసూళ్లు చేసేందుకు టార్గెట్ ఇవ్వడం చేస్తుండేవారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనేక కేసుల విచారణలో ఆయన జోక్యం చేసుకునేవారని ఆరోపించారు. అదేవిధంగా అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి కార్యకలాపాలు అనేకం పోలీసు అధికారుల దృష్టికి కూడా వచ్చాయన్నారు. ముంబైలో ఆత్మహత్య చేసుకున్న దాద్రానగర్ హవేలీ ఎంపీ మెహన్ దేల్కర్ తన సూసైడ్ నోట్లో అక్కడి అధికారుల తీరుపై పలు ఆరోపణలు చేసినప్పటికీ ఆ కేసును కూడా ముంబై పోలీసులకే అప్పగిస్తూ హోం మంత్రి నిర్ణయం తీసుకోవడాన్ని పరంబీర్ సింగ్ తప్పుబట్టారు. ముకేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో వాహనం పట్టుబడటం, వ్యాపారి మన్సుఖ్ అనుమానాస్పద మృతి, పోలీస్ ఇన్స్పెక్టర్ వాజే అరెస్టు పరిణామాల నేపథ్యంలో పరంబీర్‌ను అప్రాధాన్యంగా భావించే హోంగార్డుల విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మంత్రి దేశ్‌ముఖ్ ఏమన్నారు? అవినీతి విషయం ఫిబ్రవరిలోనే తెలిసిన పరంబీర్‌సింగ్ ఇప్పటి వరకు మౌనంగా ఎందుకు ఉన్నారంటూ మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఆయనపై పరువు నష్టం కేసు వేస్తానని తెలిపారు. తనను తాను కాపాడుకునేందుకే పరంబీర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘వాహనం కేసు, మన్సుఖ్ హత్య కేసులతో వాజేకు సంబంధాలున్నట్లు ఇప్పటికే రుజువైంది. ఇక మిగిలింది పరంబీర్. ఇవన్నీ చివరికి ఆయనకే చుట్టుకుంటాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది కదా’అని పేర్కొన్నారు. -
అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అందుకే తనని బదిలీ చేశాం’
ముంబై: గత కొద్దిరోజులుగా నగరంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు తీవ్రమైన తప్పిదాలు చేశారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చి.. వారిని బాధ్యులను బదిలీ చేశామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. అంతేకాకుండా ఎన్ఐఏ కేసులో సచిన్ వజేపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్ధేశంతో పలువురిపై బదిలీ వేటు వేశామని స్పష్టం చేశారు. దక్షిణముంబైలోని ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు లభించడం, వ్యాపారవేత్త హిరానీ మరణించడం, పోలీస్ అధికారి సచిన్ వజే అరెస్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై వార్తల్లో నిలిచింది. అయితే పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్ పరం వీర్‌సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ బుధవారం హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా ముంబై కమిషనర్‌గా హేమంత్ నాగ్రలే నియమితులయ్యారు. దీంతో హోం మంత్రి బదిలీపై ఓ ఛానెల్‌తో మాట్లాడారు. ఆయా కేసులపై ఏటీఎస్, ఎన్ఐఏ దర్యాప్తు నిష్పక్షపాతం గా జరుపుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏటీఎస్, ఎన్ఐఏ విచారణలో కొన్ని విషయాలు బయటపడటమూ బదిలీలకు కారణమని హోం మంత్రి స్పష్టంచేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. చదవండి: ముంబై పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు -
వైరల్ : 11 ఏళ్లపాటు సేవలు.. జాగిలానికి ఘనంగా వీడ్కోలు
ముంబై : పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన స్నిఫర్ డాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 11 ఏళ్లపాటు విశేష సేవలందించిన జాగిలానికి నాసిక్ పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. 'స్నిఫర్ స్పైక్' సేవలను ప్రశంసిస్తూ గులాబీలు,బెలూన్స్‌తో డెకరేట్ చేసిన పోలీసు వాహనంపై దాన్ని ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సైతం స్పైక్ సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. 'స్నిఫర్ జాగిలం(కుక్క) మాత్రమే కాదు, పోలీసు కుటుంబంలో తను కూడా భాగమయ్యాడు. దేశం పట్ల అతడు అందించిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను' అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ స్పిఫర్ స్పైక్ గత 11 సంవత్సరాలుగా విధి నిర్వహాణలో ఎన్నో పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని విచ్ఛిన్నం చేయడంలో చురుకైన పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో నాసిక్ పోలీసులు స్పిఫర్ సేవలను గుర్తుచేస్తూ దానికి వీడ్కోలు పలికారు. ఇక చిన్నవయసు నుంచే స్పిఫర్ జాతికి చెందిన జాగిలాలకు అధికారులు శిక్షణ ఇప్పిస్తారు. వీటిని ఎక్కువగా తుపాకీలు, మాదక ద్రవ్యాలు, బాంబులు వంటి వాటిని గుర్తించడానికి వాడతారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటాయి. విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ -19 కణాలను గుర్తించే అంశంపై జాగిలాలకు శిక్షణ ఇవ్వాలని పలు దేశాలు భావిస్తున్నాయి. మనిషి చెమట, మూత్రాన్ని వాసనను పసిగట్టి వారికి కరోనా కణాలు ఉన్నాయో లేదో గుర్తించేలా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాయి. మన దేశంలో ఇప్పటికే ఇందుకు అనుగుణంగా ఢిల్లీలోని ఓ క్యాంప్‌లో ప్రత్యేకంగా ఎనిమిది కుక్కలకు శిక్షణ ఇస్తున్నట్లు ఆర్మీ డాగ్ ట్రైనర్ కల్నల్ సురేందర్ సైని అన్నారు. ముఖ్యంగా కాకర్ స్పానియల్స్, లాబ్రడార్స్ జాతులకు చెందిన కుక్కలను వీటి కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చదవండి : (వైరల్: మీకెంత ధైర్యం.. నన్నే ఫాలో అవుతారా?) (ఆ బిల్లు పెట్రోల్ బంక్‌లో ఇచ్చింది కాదు!) -
సచిన్ ట్వీట్: మహారాష్ట్ర సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై : రైతు దీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్స్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, గాయని లతా మంగేష్కర్తో పాటు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖులు చేసిన ట్వీట్స్‌పై దర్యాప్తు జరుతామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే విధమైన ట్వీట్స్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని, దీనిపై మహారాష్ట్ర ఇంటిలిజెన్స్ సంస్థలు దర్యాప్తు జరుపుతామని సోమవారం అనిల్ ప్రకటించారు. వరుస ట్వీట్స్ వెనుక కేంద్ర ప్రభుత్వ లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హోంమంత్రి ప్రకటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ట్వీట్స్ చేశారు. వీరిలో పాప్ సింగర్ రిహానే, పర్యవరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్, మియా ఖలిఫా వంటి వారు ఉన్నారు. భారత్‌లో రైతులు జరుపుతున్న ఉద్యమానికి తాము సంఘీభావం తెలుపుతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారి మద్దతును ఖండిస్తూ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, అక్షయ్‌కుమార్ వంటి వారు ట్వీట్ చేశారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఇతరులకులేదని, తమ దేశ సమస్యలను తాము పరిష్కరించుకోగలమని ముక్తకంఠంతో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఈ పరిణామం దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేంద్రానికి మద్దతు ప్రకటించడాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వర్గం వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలతో సహా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, రాజ్ ఠాక్రే సైతం ఖండించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒత్తిడితోనే సచిన్, లతా మంగేష్కర్ వంటి వారు ఈ ట్వీట్స్ చేశారని పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. -
అనాథకు హోం మినిస్టర్ ‘కన్యాదానం’
ముంబై: తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది ఆడపిల్ల అనాథగా పుట్టకూడదు అని. ఆడపిల్ల అనే కాదు అసలు అనాథలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు. ఎంత పేదరికం అనుభవించినా సరే తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి బతకాలని కోరుకుంటారు. మరి ముఖ్యంగా వివాహ సమయంలో నా అనే వారు వెంటలేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఓ వికలాంగ అనాథ యువతి వివాహ వేడుకకు హాజరు కావడమే కాక సదరు యువతి తరఫున కన్యాదాన కార్యక్రమం జరిపించారు. దాంతో అనిల్ దంపతులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జనాలు. మీరు చేసిన పని ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అంటూ అభినందిస్తున్నారు. అలానే వరుడి తరఫున తండ్రి బాద్యతలు నిర్వహించిన నాగ్‌పూర్ కలెక్టర్ దంపతులపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. (చదవండి: పేగుబంధం 'అన్వేషణ') వివరాలు.. ఆదివారం నాగ్‌పూర్ జిల్లాలోని ఒక అనాథ ఆశ్రమంలో చెవిటి యువతి(23) వివాహం మరో అనాథ యువకుడి(27)తో జరిగింది. ఈ వేడుకకు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దంపతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వధువు తరఫున కన్యాదానం చేశారు హోం మంత్రి దంపతులు. ఇక నాగ్‌పూర్ కలెక్టర్ రవీంద్ర ఠాక్రే వరుడి తరఫున తండ్రి బాధ్యతలు నిర్వహించారు. ఓ ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారి పెళ్లి పెద్దలుగా వ్యవహరించి వివాహ తంతు జరిపించడంతో ఆ యువ జంట ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరో విశేషం ఏంటంటే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యి.. నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇక సదరు యువతిని 23 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాలోని ఓ అనాథాశ్రమం నిర్వహాకులు ఆమెని తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. ఇక వరుడుని కూడా రెండేళ్ల వయసులో థానే జిల్లాలోని డొంబివాలి టౌన్షిప్లో వదిలేసి వేళ్లారు అతడి తల్లిదండ్రులు. -
అర్నాబ్‌కు భద్రత కల్పించండి : గవర్నర్
సాక్షి, ముంబై : ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి పోలీసులు పలు ఆరోపణలు చేశారు. తనపై జైలు అధికారులు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను సైతం కలవడానికి అనుమతి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల ద్వారా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్‌కోశ్యారీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌పై రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముక్‌కు ఫోన్ చేశారు. వెంటనే అర్నాబ్‌కు తగిన భద్రతను కల్పించాలని కోరారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో అర్నాబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం కేసు ఉన్న దశలో తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే తమను సంప్రదించే ముందు అలీబాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా న్యాయస్థానం అర్నాబ్‌కు సూచించింది. దీనిపై నాలుగు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. రిపబ్లిక్ టీవీ సెట్స్‌లోపని చేసిన వేతనాలు చెల్లించనందుకు 2018లో ఆర్కిటెక్ట్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి గోస్వామి మరో ఇద్దరిని నవంబర్ 4న ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురినీ నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. గోస్వామి అరెస్టును ఖండిస్తూ పలువురు కేంద్ర మంత్రులు అధికార మహా వికాస్ఆఘాడీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. -
సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..?
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ది హత్యా? ఆత్మహత్యా ? ఎప్పటికి తేలుతుందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సీబీఐని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ కొనసాగిస్తున్న విచారణపై ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని అన్నారు. శుక్రవారం మంత్రి దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు సరైన దిశగా విచారణ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేతుల్లోకి ఈ కేసు వెళ్లిందన్నారు. వీలైనంత త్వరగా సీబీఐ అసలు నిజాలను రాబట్టాలన్నారు. ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టి 45 రోజులు గడిచినా ముందుకు అడుగు పడలేదని మంత్రి దేశ్‌ముఖ్ తెలిపారు. (సుశాంత్ కేసులో మరో మలుపు) -
కంగనపై విచారణ జరుపుతాం!
ముంబై: ప్రముఖ నటి కంగన రనౌత్ డ్రగ్స్ వాడతారంటూ అధ్యయన్ సుమన్ చేసిన ఆరోపణలపై ముంబై పోలీసులు విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోం మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ చెప్పారు. నటుడు శేఖర్ సుమన్ కొడుకు అధ్యయన్ గతంలో కంగనతో రిలేషన్షిప్లో ఉన్నట్లు ఒక ఇంటర్వూ్యలో చెప్పారు. ఆ సమయంలో ఆమె డ్రగ్స్ వాడేవారన్నారు. తాజాగా ముంబై ప్రభుత్వానికి కంగనకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ ఆరోపణలపై విచారణ ఆరంభించడం గమనార్హం. మంగళవారం అసెంబ్లీలో శివసేన ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని లేవనెత్తారని, దీనిపై విచారణ జరుపుతామని అనీల్ అన్నారు. నటి బంగ్లాకు నోటీసులు బాంద్రాలోని కంగన రనౌత్‌కు చెందిన బంగ్లాకు బృహత్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అంటించారు. తమ అనుమతుల్లేకుండా బిల్డింగ్‌లో అనేక మార్పులు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. దాదాపు డజనుకుపైగా ఇలాంటి అక్రమ మార్పులు జరిగాయని, ఉదాహరణకు టాయిలెట్‌కు చెందిన స్థలంలో ఆఫీసు కేబిన్ కట్టారని, మెట్ల వద్ద కొత్త టాయిలెట్లను నిర్మించారని బీఎంసీ అధికారులు తెలిపారు. నోటీసులు అందుకునేందుకు ఇంట్లో ఎవరూ లేనందున బిల్డింగ్‌కు అతికించినట్లు చెప్పారు. 24 గంటల్లో వీటికి కంగన స్పందించాలన్నారు. పూర్తిగా సహకరిస్తా! డ్రగ్స్ వాడకంపై జరిపే విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని కంగన చెప్పారు. విచారణ కోసం తన రక్త నమూనాలను తీసుకోవచ్చన్నారు. మాదకద్రవ్యాల సరఫరాదారులతో తనకు సంబంధాలున్నట్లు భావిస్తే తన కాల్ రికార్డులను విచారించవచ్చని చెప్పారు. వేటిలోనైనా తన తప్పుందని తేలితే ముంబైని శాశ్వతంగా వీడిపోతానన్నారు. తన బంగ్లాలో అక్రమ నిర్మాణాలపై ఇచ్చిన నోటీసుకు ఆమె తన లాయర్ ద్వారా సమాధానం తెలిపారు. బీఎంసీ అధికారులు అక్రమంగా భవనంలోకి చొరబడ్డారని, వారివన్నీ నిరాధార ఆరోపణలన్నారు. -
మరో వివాదంలో కంగనా
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు వింటే వివాదాలే మొదట గుర్తుకొస్తాయి. తరచూ అందరి మీద నోరుపారేసుకునే ఆమె ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోనూ(పీఓకే), అధికార సంకీర్ణ సర్కార్‌ని తాలిబన్లతోనూ పోలుస్తూ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కంగనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబై సురక్షితం కాదని భావిస్తే ఈ నగరంలో ఉండే హక్కు ఆమెకు లేదన్నారు. నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో కంగనా ముంబై పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని వరస ట్వీట్లు చేశారు. మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులే ప్రమాదకారులని, వారిపై తనకు విశ్వాసం లేదని కామెంట్లు ఉంచారు. ఈ ట్వీట్ చుట్టూ మొదలైన వివాదం పెద్దదైంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్టీ పత్రిక సామ్నాలో కంగనాపై విమర్శలు గుప్పిస్తూ వ్యాసం రాశారు. ముంబై పోలీసులంటే గౌరవం లేని ఆమె నగరంలో అడుగు పెట్టవద్దన్నారు. ఆమె ముంబైకి వస్తే అది పోలీసులకే అవమానకరమన్నారు. ముంబై వస్తా .. ఆపే దమ్ముందా ? సంజయ్ రాసిన ఆర్టికల్తో కంగనా మరింతగా చెలరేగిపోయారు. ముంబై ఒక పాక్ ఆక్రమిత కశ్మీర్ అని ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో తన సొంత ఇంట్లో ఉంటున్న కంగనా..ముంబై రావద్దంటూ కొందరు తనని హెచ్చరిస్తున్నారని అందుకే నగరానికి రావాలని నిర్ణయించుకున్నానన్నారు. ‘‘9న ముంబైకి వస్తున్నాను. దమ్ముంటే అడ్డుకోండి’’అంటూ ట్వీట్ చేశారు. పోలీసుల్ని అవమానించడం దారుణం కంగనా వ్యాఖ్యల్ని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తప్పు పట్టారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో పోలీసులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తూ ఉంటే కంగనా వారిని టార్గెట్ చేయడం దారుణమన్నారు. ముంబైలో భద్రత కరువైందని ఆమె అనుకుంటే నగరంలో నివసించే హక్కు కూడా లేదన్నారు. దీనికి కంగనా స్పందిస్తూ తన ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని, ప్రభుత్వం తాలిబన్లని తలపిస్తోందని దాడికి దిగారు. -
సుశాంత్ మరణం: హోంమంత్రి వ్యాఖ్యలు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ విచారణ అవసరం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. ఈ కేసును ముంబై పోలీసులు సమర్ధంగా దర్యాప్తు చేధిస్తారని అన్నారు. సుశాంత్ విషాదాంతం కేసులో వ్యాపార శత్రుత్వ కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. సుశాంత్ రాజ్పుట్ జూన్ 14న ముంబైలో తన బాంద్రా అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఆత్మహత్యగా పేర్కొనగా ప్రాథమిక దర్యాప్తులో బాలీవుడ్ యువనటుడు కుంగుబాటుకు లోనై చికిత్స పొందుతున్నారని వెల్లడైంది. కాగా, సుశాంత్ ఎలాంటి పరిస్ధితిలో తీవ్ర నిర్ణయం తీసుకున్నారో, ఎంతటి ఒత్తిడికి గురయ్యారో నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సీబీఐ విచారణ ద్వారా ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. చదవండి : ‘సుశాంత్‌ది ఆత్మహత్య కాదు..’ -
రాత్రిపూట అంబేడ్కర్ నివాసంపై దాడి
సాక్షి, ముంబై: రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గృహంలో గుర్తు తెలియన దుండగులు ప్రవేశించి దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ముంబైలోని అంబేడ్కర్ గృహం రాజ్‌గృహలో మంగళవారి రాత్రి గుర్తు తెలియని దుండగులు లోనికి చొరబడ్డారు. చెట్ల కుండీలను పగలగొడుతూ, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేస్తూ తోట, వరండాలో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దర్యాప్తుకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు నేడు (బుధవారం) నిరసన చేపట్టనున్నారు. అంబేడ్కర్ వారసులు ప్రకాశ్ అంబేడ్కర్, భీమ్రావ్ అంబేడ్కర్ ఈ దాడి గురించి స్పందిస్తూ ప్రజలు సహనం పాటించాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారని ఎవరూ రాజ్‌గృహ దగ్గర గుమిగూడవద్దని విజ్ఞప్తి చేశారు. (అంబేడ్కర్ పత్రికకు వందేళ్లు) చదవండి: కుల నిర్మూలనతోనే భవిష్యత్తు -
లాక్డౌన్ ఎఫెక్ట్ : 27,446 మంది అరెస్ట్
ముంబై : అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నమహారాష్ట్రలో.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. లాక్డౌన్ అమలైనప్పటి నుంచి ఇప్పటివరకు నిబంధనలు అతిక్రమించిన 27,446 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం ప్రకటించారు. అంతేకాకుండా నిబంధనలు పాటించనందున 83,970 వాహనాలను సీజ్ చేశామని దీని ద్వారా దాదాపు 8,41,32,461 రూపాయలను వసూలు చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ అమలుచేసే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా దాదాపు 277 పోలీసులు గాయపడినట్లు చెప్పారు. (కోవిడ్ కట్టడికి కర్ణాటక కీలక నిర్ణయం) As many as 1,33,730 offences have been regd. u/s 188 of IPC since the lockdown leading to 27,446 arrests & seizure of 83,970 vehicles. ₹8,41,32,461 have been collected in fines from offenders. — ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) June 22, 2020 పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నవారిని నిశితంగా గమనిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పోలీసు వర్గాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ముంబై, థానే, పూణే, నాసిక్, నాగ్‌పూర్, మాలెగావ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులు వైరస్ బారిన పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతూ.. ) -
'పటాసులు కాల్చండి.. డ్రమ్స్ వాయించండి'
నాగ్‌పూర్ : మిడతల దాడిని ఎదుర్కొనేందుకు ప్రజలు పటాసులు కాల్చాల్సిందిగా, డ్రమ్ములను వాయించాల్సిందిగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం కతోల్‌లో మిడతల దాడి పరిస్థితిపై మంత్రి సమీక్ష చేపట్టారు. రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఎప్పుడైతే మిడతలు దాడి చేస్తాయో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పటాకులు కాల్చడం, టైర్లను కాల్చడం, డ్రమ్ములను వాయించడం వంటి చర్యలతో మిడతలను పారద్రోలాలన్నారు.(మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!) అంతకముందు మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి దాదా భూషే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 శాతం మిడతలను వ్యవసాయ విభాగం నిర్మూలించిందన్నారు. రసాయనాలు స్ప్రే చేసేందుకు అగ్నిమాపక యంత్రాలను వినియోగించినట్లు తెలిపారు. మిడతల ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఉచితంగా రసాయనాలు, పురుగుమందులను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.పాకిస్తాన్ నుంచి దేశంలోకి ప్రవేశించిన మిడతలు గాలి ద్వారా తమ దిశను మార్చుకుంటున్నాయి. రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలో పెద్ద ఎత్తున పంటపొలాల మీద పడి పంటను నాశనం చేస్తున్నాయి. ఒక్కో గుంపులో వేల నుంచి లక్ష సంఖ్యలో ఉండే మిడతల దండు వల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కోట్లాదిమంది వినియోగించే ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఫలాలను మిడతల దండు స్వాహా చేస్తాయి. (మధ్యప్రదేశ్ వైపు మిడతల దండు!) -
వంటమనిషి వల్ల.. వంద మందికి కరోనా
ముంబై : దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అధికారుల దగ్గరనుంచి సామాన్య ప్రజానికం వరకు ఎవరినీ వదలట్లేదు. తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులో 77 మంది ఖైదీలకు కోవిడ్ సోకిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. అంతేకాకుండా జైలులోని 26 మంది పోలీస్ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం ప్రకటించారు. దీంతో మొత్తంగా ఆర్థర్ జైలులో 100కి కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం వీరందరిని క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మిగతా ఖైదీలకు కరోనా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏడేళ్ల కన్నా తక్కువ జైలు శిక్షపడిన సుమారు 5వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. మిగతా ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని, తెలిపారు. (101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు ) 77 inmates & 26 police personnel at Mumbai's Arthur Road prison have tested positive for #COVID19. They will be sent to Saint George's hospital for treatment: Anil Deshmukh, Maharashtra Home Minister pic.twitter.com/0IAzpOd4Yz — ANI (@ANI) May 7, 2020 జైలులో వంటమనిషికి కరోనా సోకిందని, ఇతని నుంచే మిగతా వారికి కరోనా సోకినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 800 మంది సామర్థ్యం ఉన్నమాత్రమే ఆర్థర్ రోడ్ జైలులో ప్రస్తుతం 2,700 మంది ఖైదీలు ఉన్నట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 1362 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 52,952 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు
-
101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు
ముంబై: మహారాష్ట్రలో గతవారం పాల్గాడ్ జిల్లాలో చోటుచేసుకున్న మూకహత్యకు సంబంధించి ఇప్పటివరకు 101మందిని అరెస్ట్ చేశామని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దినేష్‌ముఖ్ బుధవారం తెలిపారు. ఈ మూకహత్యను బీజేపీ నేతలు మతకల్లోలానికి చెందినదిగా ఆరోపణలు చేయటాన్ని ఆయన ఖండించారు. హత్యకేసులో భాగంగా అరెస్ట్‌చేసిన 101 మందిలో ఒక్కరు కూడా ముస్లిం కాదని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులు ఈ మూకహత్యకు మతం రంగు పులమడం సరికాదన్నారు. (మూకహత్య: ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా ఫోన్) ఇక భయంకరమైన కారోనా వైరస్‌ను అరికట్టాలంటే ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కొంతమంది కరోనా వైరస్ విస్తరిస్తున్న ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని ఆయన హితవు పలికారు. పాల్గాడ్ జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం గుండా కారులో సూరత్ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతులను చిక్నే మహరాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్‌గిరి మహరాజ్(35), వారి డ్రైవర్ నీలేశ్ తెల్గాడే(30)గా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆ గ్రామస్తులు వారిపై కూడా దాడికి తెగపడ్డారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య) -
సీఎం జగన్‌ను కలిసిన ‘మహా’ అధికారుల బృందం
-
‘దిశ చట్టం’ అద్భుతం: అనిల్ దేశ్‌ముఖ్
సాక్షి, అమరావతి: చిన్నారులు,మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, అధికారులను ఆయన అభినందించారు. సచివాలయం సీఎస్ సమావేశం మందిరంలో గురువారం దిశ బిల్లుపై జరిగిన సమావేశంలో అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. దిశ లాంటి బిల్లును మహారాష్ట్రలో కూడా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ’దిశ’ బిల్లు తెచ్చిన రెండు మాసాల్లోనే ప్రత్యేకంగా ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను కూడా ప్రారంభించడం అభినందనీయమన్నారు. దిశ చట్టంపై సమగ్ర అధ్యయనం చేయడంతో పాటు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. (దిశ.. కొత్త దశ) దేశంలోనే మొదటిసారిగా.. దేశంలోనే మొదటిసారిగా చిన్నారులు,మహిళలపై జరుగుతున్న నేరాల అదుపునకు ‘దిశ బిల్లు’ను తీసుకువచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దిశ బిల్లు అమలుకు ప్రభుత్వం రూ. 87 కోట్లు ఇప్పటికే కేటాయించిందని వెల్లడించారు. 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు. ప్రత్యేక కంట్రోల్ రూం, వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లకు దిశ క్రైమ్ డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ ను స్నేహపూర్వక మహిళా పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతామని సుచరిత పేర్కొన్నారు. (‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ ) చారిత్రాత్మకమైన బిల్లు.. బాలికలు, మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ బిల్లు’ను చారిత్రాత్మకమైన బిల్లుగా మహిళా శిశు,సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అభివర్ణించారు. 2020 ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వనిత తెలిపారు. కసరత్తు చేసిన తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన తర్వాతే ‘దిశ బిల్లు’ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. ఈ బిల్లు అమలులో భాగంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ‘దిశ చట్టం’ అమలుకు ప్రత్యేకంగా ఇద్దరు మహిళా అధికారులను నియమించామని ఆమె చెప్పారు. -
సీఎం జగన్‌ను కలిసిన ‘మహా’ అధికారుల బృందం
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ’చట్టం గురించి అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అధికారుల బృందం సీఎం జగన్‌ను కలిసి దిశా చట్టం గురించి అడిగి తెలుసుకుంది. (చదవండి :మహారాష్ట్రలో దిశ చట్టం!) ఈ సందర్భంగా సీఎం జగన్ ఆ బృందానికి దిశ చట్టం గురించి వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన బృందంలో మహారాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, డీజీపీ సుబోత్ కుమార్, అదనపు సీఎస్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపిక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మహారాష్ట్రలో దిశ చట్టం!
ముంబై: అత్యాచార దోషులకు తక్కువ సమయంలో శిక్ష విధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే అంశం పరిశీలిస్తామని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం చెప్పారు. త్వరలోనే తాను ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి దిశ చట్టం గురించి లోతుగా తెలుసుకుంటానని చెప్పారు. ఈ చట్టం ప్రకారం మహిళలపై అఘాయిత్యాలు జరిగిన మూడు వారాల్లోనే దోషికి శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వార్ధాలో మహిళకు నిప్పు పెట్టిన కేసుపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపి త్వరలోనే దోషికి శిక్ష పడేలా చేస్తామని అనిల్ అన్నారు. నాగ్‌పడా ప్రాంతంలో కొందరు పోలీసుల అనుమతి లేకుండానే సీఏఏపై నిరసనలు చేస్తున్నారని చెప్పారు. సీఏఏ వల్ల పౌరసత్వం పోదని వారికి వివరించామని చెప్పారు. (‘దిశ’ ఆఫీసర్ ఎవరో తెలుసా?) -
జడ్జి లోయా మరణంపై తిరిగి దర్యాప్తు
ముంబై: స్పెషల్ సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మరణంపై తిరిగి దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం విలేకరులతో వెల్లడించారు. లోయా మరణానికి సంబంధించిన కేసును తిరిగి దర్యాప్తు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని కొంతమంది తనను కలిసి కోరుతున్నారన్నారు. అవసరమైతే ఈ కేసును తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు. లోయా కుటుంబసభ్యులు మిమ్మల్ని కలుస్తున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. దానిని వెల్లడించడానికి తాను ఇష్టపడటం లేదన్నారు. గుజరాత్‌కు చెందిన సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారించిన లోయా.. 2014 డిసెంబర్ 1న నాగ్‌పూర్‌లో గుండెపోటుతో మరణించారు. -
ఎన్సీపీకే పెద్ద పీట
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు శాఖల్ని కేటాయించారు. ముఖ్యమైన శాఖలెన్నో సంకీర్ణ భాగస్వామ్య పక్షం ఎన్సీపీకే దక్కాయి. శాఖల కేటాయింపులో మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన మూడు రోజులకి కానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. మహారాష్ట ఉప ముఖ్యమంత్రి, సీనియర్ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖ, ఆయన పార్టీ సహచరుడు అనిల్ దేశ్‌ముఖ్‌కు హోంశాఖని కేటాయించినట్టు ఆదివారం ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన తరఫున తొలిసారిగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రేకి పర్యావరణం, పర్యాటకం, ప్రొటోకాల్ వ్యవహారాల శాఖ దక్కింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరాత్‌కు రెవెన్యూ, అశోక్ చవాన్‌కు ప్రజాపనుల శాఖలు దక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ధనుంజయ్ ముండే, జితేంద్ర అవ్హాద్‌లకు వరసగా సామాజిక న్యాయశాఖ, గృహనిర్మాణ శాఖలు కేటాయించారు. దీంతో ఎన్సీపీకే కీలక శాఖలు దక్కినట్టయింది. ఇక ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సాధారణ పరిపాలన, ఐటీ, న్యాయశాఖల్ని తన వద్ద ఉంచుకున్నారు. శివసేనకు చెందిన ఏక్నాథ్ షిందేకు పట్టణాభివృద్ధి శాఖ కట్టబెట్టారు. ప్రభుత్వం పంపిన ఈ శాఖలకి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. కాంగ్రెస్‌లో అసంతృప్తి శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌లో అసంతృప్తి మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరాత్ కారణమని కొందరు నేతలు నిందిస్తున్నారు. ఎన్సీపీతో పోలిస్తే అప్రాధాన్య శాఖలు కేటాయించారని అంటున్నారు. మరికొందరు సంకీర్ణ భాగస్వామ్య పక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ అధ్యక్షుడు పవార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, గృహనిర్మాణం, రవాణా శాఖల్లో కనీసం రెండయినా కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టినా శివసేన, ఎన్సీపీ తిరస్కరించడంతో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి రాజుకుంటోంది. కాగా, శివసేన పార్టీని వీడడం లేదని మంత్రి అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం సీఎంతో సమావేశమైన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తాను శివసేనతోనే కొనసాగుతానన్నారు. -
వచ్చే నెల నుంచి ఆహారభద్రత పథకం
ముంబై: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల ఒకటి నుంచి ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం ఇక్కడ ప్రకటించారు. రాష్ట్ర జనాభా 11 కోట్లలో దాదాపు ఏడు కోట్ల మందికి ప్రయోజనం కలిగించే ఈ సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నవీముంబైలో లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆహారభద్రత పథకం అమలు వల్ల నిరుపేదలకు కిలో జొన్నలు లేదా మొక్కజొన్నలను రూపాయికి, కిలో గోధుమలు రూ.రెండుకు, బియ్యం మూడు రూపాయలకే సరఫరా చేస్తారు. ఈ పథకాన్ని కేంద్రం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) ఆరు కోట్ల మందికి వర్తింప జేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం తన సొంత నిధులతో దారిద్య్రరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్న మరో 1.77 కోట్ల మందిని సైతం లబ్ధిదారులుగా చేర్చింది. రాష్ట్రంలో 5.75 కోట్ల మంది ఏపీఎల్ జాబితాలో ఉండగా, వీరిలో వార్షికాదాయం రూ.44 వేల లోపు ఉన్న వారికి మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వార్షికాదాయం రూ.59 వేలు ఉన్నా పథకానికి అర్హులేనని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ 1.77 కోట్ల మంది కిలో బియ్యాన్ని రూ.9.60 చొప్పున, కిలో గోధుమలను రూ.7.20 చొప్పున సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఐదు కేజీల చొప్పున గోధుమలు, బియ్యం, జొన్నలు, మొక్కజొన్నలు పంపిణీ చేస్తారు. -
26న ఆహార భద్రత పథకం ప్రారంభం
సాక్షి, ముంబై: పేదల సౌకర్యార్థం కేంద్రం ప్రవేశపెట్టిన ఆహార భద్రత పథకం ఈ నెల 26న రాష్ట్రంలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఆ రోజు ఆయా జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రులు అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 11.23 కోట్ల జనాభాలో దాదాపు ఏడు కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుటుంబ ఆర్థిక ఆదాయాన్నిబట్టి దారిద్య్ర రేఖకు దిగువ, కేసరి (ఆరెంజ్) రంగు, అన్నపూర్ణ, తెలుపు రంగు ఇలా వర్గాలను బట్టి వేర్వేరు రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే వీటికి బదులుగా ఇప్పుడు కేవలం దారిద్య్ర రేఖకు దిగువ, ఎగువ ఇలా రెండు వర్గాలుగా విభజించారు. కుటుంబ పెద్దగా పురుషుడికి బదులుగా మహిళ పేరును నమోదు చేస్తున్నారు. ఆమె ఫొటో, బార్‌కోడ్‌తో కూడిన ఆధునిక రేషన్ కార్డు త్వరలో అధికారులు పంపిణీ చేయనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు ప్రతినెలా 35 కేజీల ధాన్యం పంపిణీ చేయనున్నారు. ఇతరులకు రేషన్ కార్డుపై నమోదైన కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ధాన్యం పంపిణీ ఉంటుంది. గోధుమలు కేజీ రూ. రెండు, బియ్యం కేజీ రూ.మూడు, జొన్నలు, మొక్కజొన్నలు, ఇతర దినుసులు కేజీ రూపాయి చొప్పున లబ్ధిదారులకు అందుతాయని దేశ్‌ముఖ్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజున కేవలం పది మందిని ఎంపిక చేసి పథకాన్ని తాత్కాలికంగా ప్రారంభిస్తామని, ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. -
నకిలీ రేషన్ కార్డుల పై బార్కోడ్ కొరడా!
సాక్షి, ముంబై: నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘బార్కోడ్ రేషన్ కార్డులు’ జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అసెంబ్లీలో ప్రకటించారు. నకిలీ రేషన్ కార్డుల అంశాన్ని ఎమ్మెల్యేలు అశోక్ పవార్, రమేశ్‌రావ్ థోరత్, బాలానంద్‌గావ్కర్, విజయ్ శివతారే లేవనెత్తారు. దీనిపై అనిల్ దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... రాష్ట్రంలో 54,06,867 నకిలీ రేషన్ కార్డులున్నాయన్నారు. వీటిని జారీ చేయడంలో, గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 252 మంది రేషనింగ్ అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మరో 62 మందిపై చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కొందరు అధికారులు బంగ్లాదేశీయులకు కూడా రేషన్ కార్డులు అందజేశారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలాఉండగా నకిలీ రేషన్ కార్డుదారులకు ఎంత మేర ధాన్యం పంపిణీ జరిగిందని ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే ప్రశ్నించారు. దీనిపై దేశ్‌ముఖ్ సమాధానమిస్తూ... 2005-2013 వరకు నకిలీ రేషన్ కార్డులను ఏరివేసే కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఇందులో పట్టుబడిన వేలాది నకిలీ రేషన్ కార్డులను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ నకిలీ కార్డుల ద్వారా ఎంతమేర ధాన్యం అర్హులకు అందకుండాపోయిందనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. బంగ్లాదేశీయులకు రేషన్ కార్డులు జారీచేయడాన్ని పూర్తిగా నిలిపివే శామని, ప్రస్తుతం బార్కోడ్ విదానాన్ని అమలుచేసే ప్రక్రియ ప్రారంభమైందని, పనులు దాదాపు 90 శాతం పూర్తికావచ్చాయని సభకు తెలిపారు. ఈ బార్కోడ్ ఆధారంగా నకిలీ రేషన్ ఏదైనా ఉంటే వెంటనే గుర్తించే అవకాశముంటుందని చెప్పారు. రద్దుచేసిన రేషన్‌కార్డులపై విభాగ స్థాయిలో విచారణ ప్రారంభించామని, తుది నివేదికను ఆరు నెలల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఆహార భద్రత పథకం ఈ నెలాఖరు వరకు అమలవుతుందని, నిజమైన లబ్ధిదారులకు ఇదెంతో ఉపయోగపడనుందన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గిస్తాం: అజిత్‌పవార్ రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న అన్ని విద్యుదుత్పత్తి కంపెనీల చార్జీలు తగ్గిస్తామని విద్యుత్‌శాఖ మంత్రి అజిత్‌పవార్ బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. విద్యుత్ చార్జీలపై ప్రభుత్వం రాణే కమిటి నియమించిందని, ఈ కమిటీ నుంచి నివేదిక రాగానే చార్జీలు తగ్గిస్తామన్నారు. ఇదే అంశంపై చర్చించాలని ప్రతిపక్ష నాయకులు మంగళవారం పట్టుబట్టారు. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది. ప్రతిపక్ష నాయకులు శాంతించకపోవడంతో చివరకు సభను బుధవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. బుధవారం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే మళ్లీ ఇదే అంశం చర్చకు వచ్చింది. దీనిపై పవార్ పై విధంగా స్పంధించారు. సచిన్, సీఎన్ఆర్కు సభ శుభాకాంక్షలు.. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు ఎంపికైన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావుకు రాష్ట్ర అసెంబ్లీ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ విషయమై సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆమోదించిన సభలోని సభ్యులందరూ పార్టీలకతీతంగా బల్లలను తరిచి సచిన్, రావుకు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ రాష్ట్రానికేకాక యావత్ దేశానికి పేరు తెచ్చారని, ఆయన అద్భుత ప్రదర్శన ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను నమోదు చేసిందని పలువురు సభికులు ఈ సందర్భంగా కొనియాడారు. సచిన్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ఆయనకు సముచితమైన గౌరవాన్ని కల్పించిందని చవాన్ పేర్కొన్నారు. రావుకు కొల్హాపూర్‌తో దగ్గరి సంబంధాలున్నాయని, ఆయనకు మరాఠీ కూడా మాట్లాడడం వచ్చని, మరాఠీ నాటకాలంటే ఆయనకు ఎంతో ఇష్టమన్నారు. ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే, శివసేన నేత సుభాష్ దేశాయ్, ఎమ్మెన్నెస్ నేత బాలానంద గావ్కర్ తదితరులు సచిన్, రావులను ప్రశంసల్లో ముంచెత్తారు. -
డిసెంబర్ నుంచి ‘ఆహార భద్రత’
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టదలచిన ‘ఆహార భద్రత’ పథకాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్టు ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్న ఈ పథకాన్ని ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రారంభించారు. పేదల ఆకలిని తీర్చి వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకే ఈ ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్రంలోని డీఎఫ్ కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 76 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 45 శాతం మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారని అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా ప్రతి వ్యక్తికీ అయిదు కిలోల ధాన్యాన్ని అందించనున్నారు. గర్భిణులకు ఉచితంగా ఆహారం సరఫరా చేయనున్నారు. ప్రతి నెలా 388 టన్నుల ధాన్యం సరఫరా... ఆహారభద్రత పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు ప్రతి నెలా సుమారు 388 టన్నుల ధాన్యం అవసరం కానుంది. దీనికిగాను ప్రతి నెలా సుమారు రూ. 800 కోట్లు అవసరమవుతాయి. ఈ పథకం అమలుచేసేందుకు అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించనుందని, దీంతో రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ పథకం అమలులో భాగంగా కేవలం ధాన్యం నిలువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సుమారు రూ. రెండు వేల కోట్ల వ్యయంతో గోడౌన్ల నిర్మాణం చేపట్టింది. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలోని రేషన్‌షాపుల కంప్యూటరీకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. కాగా రాష్ట్రంలో తెలుపు, కేసరీ (ఆరెంజ్), పసుపు రంగు ఇలా మూడు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలో తొలగించి ఉన్నత, మధ్యతరగతి (ప్రాధాన్యం, ప్రాధాన్యంలేని) ఇలా రెండు రకాల కార్డులు మాత్రమే జారీ చేయనున్నారు. ముఖ్యంగా బార్కోడ్లతో ఉండే రేషనింగ్ కార్డు రూపొందిస్తారు. అదే విధంగా కొత్త నియమాల ప్రకారం కుటుంబ పెద్దగా గృహిణి పేరుతో రేషన్ కార్డు జారీ చేయనున్నారు. అనంతరం పాత రేషన్ కార్డులన్నింటినీ రద్దు చేయనున్నట్టు తెలిపారు.