ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై పదిహేను రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని బొంబే హైకోర్టు ఆదేశించింది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం కోసం స్వతంత్ర ఏజన్సీతో విచారణ అవసరమని తెలిపింది. మొత్తం మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక క్రిమినల్ రిట్‌పిటీషన్‌పై కోర్టు తీర్పు వెలువరించింది.
ఇందులో ఒక పిల్‌ను సింగ్ దాఖలు చేయగా, మిగిలిన పిల్స్‌ను ఒక లాయర్, ఒక టీచర్ దాఖలు చేశారు. క్రిమినల్ రిట్‌ను లాయర్ జయశ్రీ వేశారు. ఈనెల 25న దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సీబీఐ విచారణ జరపాలని సింగ్ పిల్ దాఖలు చేశారు. సచిన్ వాజే సహా పలువురు పోలీసులను మామూళ్లు వసూలు చేయాలని అనిల్ ఆదేశించినట్లు సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను దేశ్‌ముఖ్ తోసిపుచ్చారు. మహా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ పిల్‌ను తిరస్కరించాలని కోరారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు కానందున సీబీఐ విచారణ సాధ్యం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
మంగళవారం నుంచి సీబీఐ విచారణ షురూ!
విచారణకు మంగళవారం సీబీఐ బృందం ముంబైకి వచ్చి విచారణ ప్రక్రియ ఆరంభించనుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో తమకు అధికారిక ఆదే శాలు అందిన అనంతరం లీగల్ అభిప్రాయం తీసు కొని సీబీఐ విచారణ ఆరంభిస్తుంది. కానీ ఈ కేసు లో కోర్టు కేవలం 15 రోజుల సమయం ఇవ్వడంతో వీలయినంత తొందరగా విచారణ ఆరంభించాలని సీబీఐ భావిస్తుందని అధికారులు చెప్పారు. ముంబై రాగానే కోర్టు ఆదేశాలను, ఫిర్యాదు కాపీలను, ఇతర డాక్యుమెంట్లను సీబీఐ సమీకరించనుంది.
అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా
తనపై మాజీ పోలీస్ కమిషనర్ సింగ్ చేసిన ఆరోపణలను సీబీఐతో విచారించాలని బొంబై హైకోర్టు నిర్ణయించడంతో మహారాష్ట్ర హోంమంత్రి అనీల్ దేశ్‌ముఖ్ ఆ పదవికి రాజీనామా చేశారు. అనీల్ తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్‌కు పంపినట్లు ఎన్‌సీపీకి చెందిన మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అనీల్ సైతం తన లేఖ కాపీని ట్విట్టర్‌లో ఉంచారు. కోర్టు ఆదేశానంతరం అనీల్ ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌ను కలిసి పదవి నుంచి దిగిపోవాలని భావిస్తున్నట్లు చెప్పారని మాలిక్ తెలిపారు. పవార్ అంగీకారంతో అనీల్ రాజీనామాను ఉద్దవ్‌కు అందజేసినట్లు తెలిపారు. నూతన హోంమంత్రిగా ఎన్‌సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్ నియమితులయ్యారు. అనిల్æ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో దిలీప్‌ను సీఎం నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment