జడ్జి లోయా మరణంపై తిరిగి దర్యాప్తు | Fresh Probe in Judge Loya Death Case | Sakshi
Sakshi News home page

జడ్జి లోయా మరణంపై తిరిగి దర్యాప్తు

Published Fri, Jan 10 2020 8:23 AM | Last Updated on Fri, Jan 10 2020 8:35 AM

Fresh Probe in Judge Loya Death Case - Sakshi

బీహెచ్‌ లోయా (ఫైల్‌ ఫొటో)

ముంబై: స్పెషల్‌ సీబీఐ జడ్జి బీహెచ్‌ లోయా మరణంపై తిరిగి దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ గురువారం విలేకరులతో వెల్లడించారు. లోయా మరణానికి సంబంధించిన కేసును తిరిగి దర్యాప్తు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని కొంతమంది తనను కలిసి కోరుతున్నారన్నారు. అవసరమైతే ఈ కేసును తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు. లోయా కుటుంబసభ్యులు మిమ్మల్ని కలుస్తున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. దానిని వెల్లడించడానికి తాను ఇష్టపడటం లేదన్నారు. గుజరాత్‌కు చెందిన సోహ్రాబుద్దీన్‌ షేక్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసును విచారించిన లోయా.. 2014 డిసెంబర్‌ 1న నాగ్‌పూర్‌లో గుండెపోటుతో మరణించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement