Justice Loya
-
జడ్జి లోయా మరణంపై తిరిగి దర్యాప్తు
ముంబై: స్పెషల్ సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మరణంపై తిరిగి దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం విలేకరులతో వెల్లడించారు. లోయా మరణానికి సంబంధించిన కేసును తిరిగి దర్యాప్తు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని కొంతమంది తనను కలిసి కోరుతున్నారన్నారు. అవసరమైతే ఈ కేసును తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు. లోయా కుటుంబసభ్యులు మిమ్మల్ని కలుస్తున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. దానిని వెల్లడించడానికి తాను ఇష్టపడటం లేదన్నారు. గుజరాత్‌కు చెందిన సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారించిన లోయా.. 2014 డిసెంబర్ 1న నాగ్‌పూర్‌లో గుండెపోటుతో మరణించారు. -
‘ఎవరూ చంపలేదు.. వాళ్లే చనిపోయారు’
సాక్షి, న్యూఢిల్లీ: పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నిందితులందరూ నిర్దోషులేనని స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. సొహ్రాబుద్దీన్, అతడి ఎన్కౌంటర్ కేసుతో సంబంధమున్న వారిని ఎవరూ చంపలేదని వారే చనిపోయారని ట్విటర్లో వ్యాఖ్యానించారు. ‘ఎవరూ చంపబడలేదు. హరేన్ పాండ్యా, తులసీరామ్ ప్రజాపతి, జస్టిస్ లోయా, ప్రకాశ్ తొంబ్రే, శ్రీకాంత్ ఖండాల్కర్, కౌసర్ బీ, సోహ్రాబుద్దీన్ షేక్.. వారికి వారే చనిపోయార’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. (నిందితులంతా నిర్దోషులే) సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను విచారించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను 2010లో అరెస్ట్ చేశారు. 2014 డిసెంబర్లో ఈ కేసు నుంచి ఆయన బయటపడ్డారు. ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మూడేళ్ల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. NO ONE KILLED... Haren Pandya. Tulsiram Prajapati. Justice Loya. Prakash Thombre. Shrikant Khandalkar. Kauser Bi. Sohrabuddin Shiekh. THEY JUST DIED. — Rahul Gandhi (@RahulGandhi) 22 December 2018 -
‘లోయా కేసుపై ఆశలు సజీవం’
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయ మరణం చుట్టూ అల్లుకున్న రాజకీయ దుమారం నేపథ్యంలో ఆయన మరణంపై వాస్తవాలు వెలుగుచూస్తాయనే ఆశ మిగిలిఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. జస్టిస్ లోయాది సహజమరణమేనని దీనిపై స్వతంత్ర విచారణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం ఆయన మృతిపై దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుతో ఇక ఆశలు ఆవిరైపోయాయని లోయా కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘లోయా కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నా.. అయితే ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయని వారికి చెబుతున్నా..లక్షలాది భారతీయులు వాస్తవాలను చూస్తా’రని రాహుల్ ట్వీట్ చేశారు. జస్టిస్ లోయాను మరిచిపోయేందుకు భారత్ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. జస్టిస్ లోయా కేసుపై సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో గురువారం కూడా రాహుల్ బీజేపీ, అమిత్ షాలను టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు. ఏదో ఒకరోజు బీజేపీ చీఫ్‌ను వాస్తవం వెంటాడుతుందని వ్యాఖ్యానించారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో గతంలో అమిత్ షా నిందితుడిగా ఉన్న క్రమంలో ఈ కేసును డీల్ చేస్తున్న సీబీఐ న్యాయమూర్తి జస్టిస్ లోయా మరణించడంపై దుమారం రేగింది. -
‘ఈ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు’
-
‘ఈ తీర్పు రాహుల్ గాంధీకి చెంపపెట్టు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనవసరంగా ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ లోయ మృతి కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జస్టిస్ లోయ కేసును రాజకీయం చేయాలని చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. మీకు రాజకీయంగా ఉన్న, వ్యక్తిగతంగా ఉన్నా అవి బయట చూసుకోండి తప్ప, ఇక్కడ కాదని కోర్టు చెప్పిన విషయాల్ని గుర్తుచేశారు. ఈ తీర్పు అమిత్ షాపై ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు లాంటిది అన్నారు. లోయ కేసు పిటిషన్ల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు మానుకుని బీజేపీకి, అమిత్ షాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జస్టిస్ లోయ మృతి కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి ఇదేమీ కొత్త కాదంటూ మండిపడ్డారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ లౌకిక వాదం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా చేశారు. మోదీని తిట్టడానికే వామపక్షాలు ఐదు రోజుల సభలు పెట్టుకుందని లక్ష్మణ్ విమర్శించారు. -
లోయా మృతిపై దురుద్దేశంతోనే పిటీషన్లు : సుప్రీం
న్యూఢిల్లీ : జడ్జి బీహెచ్ లోయా మరణంపై ప్రత్యేక విచారణ కమిటీ(సిట్)ను ఏర్పాటు చేసి స్వతంత్ర విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సందర్భంగా ’రిట్ పిటిషన్లలో లోయా మరణంపై సిట్ విచారణ ఎందుకు జరిపించాలో సరైన వివరణ లేదని, లోయా సహజంగానే మరణించారు’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సొంత లాభం కోసం దురుద్దేశంతోనే ఈ పిటిషన్లను దాఖలు చేశారని దీపక్ మిశ్రా, డీవై చంద్రచూడ్, ఖన్విల్కర్‌ల ధర్మాసనం మండిపడింది. లోయా మరణానికి ముందు జరిగిన సంఘటనలు నిజమైనవి కావని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కాగా, ఈ మధ్యకాలంలో కాంట్రావర్సీలో చిక్కుకున్న కేసు ఇదే. రాజకీయాల పరంగానే కాకుండా, ఉన్నతమైన న్యాయవ్యవస్థలో సైతం చీలికలు తీసుకొచ్చింది ఈ కేసే. 2014 డిసెంబర్లో జస్టిస్ లోయా మరణించారు. అప్పటికి ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) న్యాయస్థానంలో సొహ్రబుద్దీన్ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తుది తీర్పు మరికొద్ది రోజుల్లో వెలువడుతుందనగా లోయా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయారు. లోయా మృతిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు న్యాయమూర్తులు భూషణ్ గవాయ్, సునీల్ షుక్రేలు ఆయనది సహజమరణమేనని తీర్పు చెప్పారు. అయితే, 2017 నవంబర్‌లో లోయా కుటుంబసభ్యులు ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ సమయంలో నిజానిజాలు బయటకు రాలేదని వ్యాఖ్యానించారు. లోయా మరణం తర్వాత కేవలం నెల రోజుల్లోనే సోహ్రబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షాను సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల అయ్యారు. దీంతో లోయా హత్యపై ప్రతిపక్ష పార్టీలు గళమెత్తాయి. లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ డిమాండ్ చేశాయి.