ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో అనిల్ దేశ్‌ముఖ్‌కు తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనను నాగ్‌పూర్ పోలీసులు ధృవీకరించారు. నాగ్‌పూర్‌లోని కటోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అనిల్ దేశ్‌ముఖ్ కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ కటోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. కుమారుడి తరఫున అనిల్ ప్రచారానికి వెళ్లారు. కటోల్ జలల్‌ఖేడా రోడ్డులో తన కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని ఎన్‌సీపీ- ఎస్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. గాయపడిన అనిల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నాగ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) హర్ష్ పొద్దార్ ఈ ఘటనను ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్‌పై ఉన్నారు. 2021లో అవినీతి ఆరోపణలతో అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నవంబర్ 2021లో అనిల్ అరెస్టయ్యారు. డిసెంబర్ 2022లో బెయిల్‌పై విడుదలయ్యారు.
#BREAKING 🚨 | Former Home Minister Anil Deshmukh was injured in a stone-pelting attack on Katol-Jalalkheda Road after a rally. His vehicle was damaged, and he received emergency treatment.#AnilDeshmukh #AttackonAnilDeshmukh #Katoljalalkhedaroad #attack pic.twitter.com/5WxQrMxGU0
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 18, 2024
Credits: Lokmat Times Nagpur
288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్‌తో కూడిన ఎన్‌సీపీల మహాయుతి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షమైన శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్పీ), కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: మోదీజీ.. సవాల్ చేస్తున్నా కమిటీని పంపండి!: సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment