ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. దీంతో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఎన్నికల్లో 132 సీట్లను గెలుపొందడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర పగ్గాలు చేపట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విజయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కీలక పాత్ర పోషించారు.
నిపుణులు విశ్లేషించిన వివరాల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ 18 మంది బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయగా, వారిలో 17 మంది విజయం సాధించారు. అకోలా వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఒక్క బీజేపీ అభ్యర్థి విజయ్ అగర్వాల్ మాత్రమే ఓటమి చవిచూశారు. విజయ్ అగర్వాల్ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సాజిద్ ఖాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ విధంగా చూస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థుల విజయం కోసం చేసిన ప్రచారంలో 95% స్ట్రైక్ రేట్‌ను దక్కించుకున్నారు.
ఇదేవిధంగా సీఎం యోగి.. మహాయుతి కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన ఐదుగురు అభ్యర్ధుల కోసం కూడా ప్రచారం చేశారు. ఆయన మొత్తంగా మహాయుతికి చెందిన 23 మంది అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. వీరిలో 20 మంది గెలిచారు. ఈ 20 మంది అభ్యర్థుల్లో 17 మంది బీజేపీ అభ్యర్థులు. ముగ్గురు విఫలమైన అభ్యర్థుల్లో శివసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. మహారాష్ట్రలో సీఎం యోగి స్ట్రైక్ రేట్‌పై పోస్టర్లు కూడా వెలిశాయి.
ఇది కూడా చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు తీపికబురు
Comments
Please login to add a commentAdd a comment