ముంబై : అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నమహారాష్ట్రలో.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. లాక్‌డౌన్ అమలైనప్పటి నుంచి ఇప్పటివరకు నిబంధనలు అతిక్రమించిన 27,446 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం ప్రకటించారు. అంతేకాకుండా నిబంధనలు పాటించనందున 83,970 వాహనాలను సీజ్ చేశామని దీని ద్వారా దాదాపు 8,41,32,461 రూపాయలను వసూలు చేసినట్లు తెలిపారు. లాక్‌డౌన్ అమలుచేసే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా దాదాపు 277 పోలీసులు గాయపడినట్లు చెప్పారు. (కోవిడ్ కట్టడికి కర్ణాటక కీలక నిర్ణయం)
As many as 1,33,730 offences have been regd. u/s 188 of IPC since the lockdown leading to 27,446 arrests & seizure of 83,970 vehicles.
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) June 22, 2020
₹8,41,32,461 have been collected in fines from offenders.
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నవారిని నిశితంగా గమనిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పోలీసు వర్గాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ముంబై, థానే, పూణే, నాసిక్, నాగ్‌పూర్, మాలెగావ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులు వైరస్ బారిన పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతూ.. )
Comments
Please login to add a commentAdd a comment