అనిల్ దేశ్‌ముఖ్
ముంబై: అత్యాచార దోషులకు తక్కువ సమయంలో శిక్ష విధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే అంశం పరిశీలిస్తామని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం చెప్పారు. త్వరలోనే తాను ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి దిశ చట్టం గురించి లోతుగా తెలుసుకుంటానని చెప్పారు. ఈ చట్టం ప్రకారం మహిళలపై అఘాయిత్యాలు జరిగిన మూడు వారాల్లోనే దోషికి శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వార్ధాలో మహిళకు నిప్పు పెట్టిన కేసుపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపి త్వరలోనే దోషికి శిక్ష పడేలా చేస్తామని అనిల్ అన్నారు. నాగ్‌పడా ప్రాంతంలో కొందరు పోలీసుల అనుమతి లేకుండానే సీఏఏపై నిరసనలు చేస్తున్నారని చెప్పారు. సీఏఏ వల్ల పౌరసత్వం పోదని వారికి వివరించామని చెప్పారు. (‘దిశ’ ఆఫీసర్ ఎవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment