
ముంబై: అవినీతి కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే తను ఇంట్లో వండిన భోజనాన్ని జైల్లోకి తెప్పించుకునేందుకు చేసిన కోర్టును అభ్యర్థించారు. కానీ ప్రత్యేక కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. "ముందు నువ్వు జైల్లో పెట్టే తిండి తిను.. ఒక వేళ నీకు సరిపడకుంటే అప్పుడు పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది.
అనిల్ దేశ్‌ముఖ్‌కు 71 ఏళ్ల కావడంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మంచం కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని మాత్రం కోర్టు అంగీకరించింది. మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి దేశ్‌ముఖ్‌ను నవంబర్ 1న అరెస్టు చేశారు. ముంబైలోని తమ కార్యాలయంలో 12 గంటల పాటు విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్‌పై అవినీతి కేసు నమోదు చేసిన తర్వాత ఏజెన్సీ అతనిపై దర్యాప్తు ప్రారంభించింది.
దేశ్‌ముఖ్ హోం మంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేశారని, తొలగించబడిన పోలీసు అధికారి సచిన్ వాజ్ సహాయంతో నగరంలోని బార్‌లు, రెస్టారెంట్ల నుంచి ₹ 4.70 కోట్లు వసూలు చేశారని ఏజెన్సీ వాదిస్తోంది. కాగా, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ ఏడాది ప్రారంభంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు.
చదవండి: కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా..
Comments
Please login to add a commentAdd a comment