ముంబై: మహరాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై మనీలాండరింగ్ వివాదంలో గతంలోనే ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇదే కేసులో ఈడీ ముంబై మాజీ పోలీసు అధికారి పరమ్‌బీర్ సింగ్‌కు సమన్లను జారీ చేసింది. కాగా, అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు పబ్‌లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
పరమ్ బీర్ సింగ్ మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రెకు రాసిన లేఖ అప్పట్లో పెద్ద దుమారాన్నిరేపింది. దీంతో గత మార్చిలో అనిల్ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదయ్యింది. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. బాంబె హైకోర్ట్ ఆదేశాల ప్రకారం, పరమ్ బీర్ సింగ్‌పై కూడా మనీలాండరింగ్ కేసుతో ఆరోపణల నేపథ్యంలో సమన్లు జారీచేశామని తెలిపింది. ఇప్పడికే ఈడీ నోటిసులను జారీ చేసి వారం గడిచింది. అయితే, అనారోగ్యం కారణంగా మరికొంత సమయం కావాలని పరమ్ బీర్ సింగ్ కోరినట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే, బాంబె కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి బలమైన ఆధారాలు లభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అలాగే ముంబై, నాగపూర్‌లో అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో, బంధువులు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. అదే విధంగా ఆయన వ్యక్తిగత సహాయకుడి నివాసంలోనూ సోదాలు నిర్వహించామని సీబీఐ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment