
సాక్షి, ముంబై: విధాన పరిషత్ ఎన్నికలకు ముందు ఎన్సీపీ నాయకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లకు విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముంబై హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లు కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. ఈ హైకోర్టు తీర్పుతో ఎన్సీపీకి గట్టి దెబ్బతగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment