MLC polls`
-
ఎన్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, ముంబై: విధాన పరిషత్ ఎన్నికలకు ముందు ఎన్సీపీ నాయకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లకు విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముంబై హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లు కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. ఈ హైకోర్టు తీర్పుతో ఎన్సీపీకి గట్టి దెబ్బతగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇక్కడ మండలి కాక.. అక్కడ కెవ్వుకేక..!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల్లో టెన్షన్ తీవ్రమవుతోంది. అధిక ఓట్లు సాధించి విజయం దరిచేరేందుకు అభ్యర్థులు వ్యయప్రయాసలు పడుతుండగా.. నిర్ణయాన్ని వెల్లడించే ఓటర్లు మాత్రం విహారయాత్రల్లో మునిగితేలుతున్నారు. ఓటేసే వరకు సభ్యులు గాడితప్పకుండా ఉండేందుకు అభ్యర్థులు ఏకంగా క్యాంపులు ఏర్పాటుచేసి వారికి పూర్తిస్థాయిలో ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లు విహార యాత్రలు సాగిస్తూ.. విందు, వినోదాల్లో ఉబ్బితబ్బిపోతున్నారు. అక్కడి అనుభూతుల్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ స్నేహితులతో పంచుకుంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు ఎంపీటీసీలు మైసూర్ ప్యాలెస్‌ను సందర్శించారు. అనంతరం అక్కడ దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయగా.. క్షణాల్లో వైరల్ అయ్యాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా