ముంబై : పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన స్నిఫర్ డాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 11 ఏళ్లపాటు విశేష సేవలందించిన జాగిలానికి నాసిక్ పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. 'స్నిఫర్ స్పైక్' సేవలను ప్రశంసిస్తూ గులాబీలు,బెలూన్స్‌తో డెకరేట్ చేసిన పోలీసు వాహనంపై దాన్ని ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సైతం స్పైక్ సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు.
'స్నిఫర్ జాగిలం(కుక్క) మాత్రమే కాదు, పోలీసు కుటుంబంలో తను కూడా భాగమయ్యాడు. దేశం పట్ల అతడు అందించిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ స్పిఫర్ స్పైక్ గత 11 సంవత్సరాలుగా విధి నిర్వహాణలో ఎన్నో పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని విచ్ఛిన్నం చేయడంలో చురుకైన పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో నాసిక్ పోలీసులు స్పిఫర్ సేవలను గుర్తుచేస్తూ దానికి వీడ్కోలు పలికారు.
ఇక చిన్నవయసు నుంచే స్పిఫర్ జాతికి చెందిన జాగిలాలకు అధికారులు శిక్షణ ఇప్పిస్తారు. వీటిని ఎక్కువగా తుపాకీలు, మాదక ద్రవ్యాలు, బాంబులు వంటి వాటిని గుర్తించడానికి వాడతారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటాయి. విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ -19 కణాలను గుర్తించే అంశంపై జాగిలాలకు శిక్షణ ఇవ్వాలని పలు దేశాలు భావిస్తున్నాయి. మనిషి చెమట, మూత్రాన్ని వాసనను పసిగట్టి వారికి కరోనా కణాలు ఉన్నాయో లేదో గుర్తించేలా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నాయి. మన దేశంలో ఇప్పటికే ఇందుకు అనుగుణంగా ఢిల్లీలోని ఓ క్యాంప్‌లో ప్రత్యేకంగా ఎనిమిది కుక్కలకు శిక్షణ ఇస్తున్నట్లు ఆర్మీ డాగ్ ట్రైనర్ కల్నల్ సురేందర్ సైని అన్నారు. ముఖ్యంగా కాకర్ స్పానియల్స్, లాబ్రడార్స్ జాతులకు చెందిన కుక్కలను వీటి కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
చదవండి : (వైరల్: మీకెంత ధైర్యం.. నన్నే ఫాలో అవుతారా?)
(ఆ బిల్లు పెట్రోల్ బంక్‌లో ఇచ్చింది కాదు!)
Comments
Please login to add a commentAdd a comment