ముంబై: ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్‌సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు గురువారం మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఆయనపై ఈమేరకు క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. సీఎం ఠాక్రే ఈ మేరకు చర్యలకు అనుమతిచ్చినట్లు తెలిపింది.
పరంబీర్ విధి నిర్వహణలో పలు అవకతవకలకు పాల్పడటంతోపాటు అనధికారికంగా విధులకు గైర్హాజరైనట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర హోంగార్డ్ విభాగానికి చీఫ్‌గా నియమితులైన సింగ్ గత ఆరు నెలలుగా విధులకు హాజరుకాలేదని పేర్కొంది. ఆయనకు ఇచ్చిన సెలవు గడువు ఆగస్ట్ 29వ తేదీతో ముగిసినా విధులకు రాలేదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
చదవండి: (ఒమిక్రాన్ వచ్చేసింది.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ..)
Comments
Please login to add a commentAdd a comment