Government of Maharashtra
-
Pune Porsche car crash: మైనర్ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు
పుణే: పోర్షే కారు దుర్ఘటనలో మైనర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)కి చెందిన ఇద్దరు జడ్జిలను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. విధానపరమైన లోపాలు, దుష్ప్రవర్తన, నిబంధనలు పాటించకపోవ డంవంటి ఆరోపణలపై ఎల్.ఎన్.దన్వాడే, కవితా థోరట్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీ డీ) దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేసిన ట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి ని యామకాన్ని రద్దు చేసింది. పుణేలోని కళ్యా ణి నగర్ ప్రాంతంలో ఓ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారు నడిపి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. అప్పటి జేజేబీ జడ్జిలు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ షరతులలో రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని ఉంది. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్ రికార్డు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా సౌనిక్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి నితిన్ కరీర్ పదవీ విరమణ అనంతరం సుజాతా సౌనిక్‌కు బాధ్యతలు అప్పగించారు. దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సౌనిక్ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1987 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాత మరో ఏడాది పాటు పదవిలో ఉంటారు. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కొన్నేళ్ల క్రితం ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
భారత్‌కు శివాజీ ఆయుధం
ముంబై–లండన్: ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన ఆయుధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకురానుంది. 17వ శతాబ్దంలో శివాజీ వాడిన పులిగోళ్లు ఆకారంలో ఉండే ఆయుధాన్ని వెనక్కి తీసుకురావడానికి లండన్‌లోని విక్టోరియా అల్బర్ట్ మ్యూజియం, మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఇనుముతో తయారు చేసిన అత్యంత పదునైన వాఘ్ నఖ్ (పులి గోళ్లు) ఆయుధాన్ని శివాజీ ఎక్కువగా వాడేవారు. ఆ ఆయుధాన్ని చేత్తో పట్టుకొని మహారాజా శివాజీ కదనరంగంలో స్వైరవిహారం చేస్తూ ఉంటే శత్రువులు గడగ డలాడిపోయేవారు. బీజాపూర్ సేనా నాయ కుడు అఫ్జల్ ఖాన్‌ను శివాజీ ఈ పులిగోళ్ల ఆయుధంతో చంపాడని చరిత్ర చెబుతోంది. తెల్లదొరల పాలనా కాలంలో 1818లో ఈస్ట్ ఇండియాకు చెందిన అధికారి జేమ్స్ గ్రాండ్ డఫ్ పులి గోళ్ల ఆయుధాల సెట్‌ను విక్టోరియా అల్బర్ట్ మ్యూజియానికి ఇచ్చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శివాజీ వాడిన ఆయుధం మన దేశానికి రానుంది. ఛత్రపతి శివాజీ పట్టాభి షిక్తుడై అక్టోబర్ 3నాటికి 350 ఏళ్లు పూర్తి కానున్నాయి. అదే రోజు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు. -
రైతుల పాదయాత్రకు దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్
రైతుల పాదయాత్రకు దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్ -
ఈ నెల 14 నుంచి అన్నా హజారే నిరాహారదీక్ష
పుణే: మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే ప్రకటించారు. సూపర్మార్కెట్లు, కిరాణా కొట్లలో వైన్ అమ్మకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తున్న అన్నాహజారే ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్దవ్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రప్రజలు కోరుతున్నారని ఆయన లేఖలో వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో 14 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. -
బలవంతపు వసూళ్లు: పరంబీర్ సింగ్ సస్పెన్షన్
ముంబై: ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్‌సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు గురువారం మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఆయనపై ఈమేరకు క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. సీఎం ఠాక్రే ఈ మేరకు చర్యలకు అనుమతిచ్చినట్లు తెలిపింది. పరంబీర్ విధి నిర్వహణలో పలు అవకతవకలకు పాల్పడటంతోపాటు అనధికారికంగా విధులకు గైర్హాజరైనట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర హోంగార్డ్ విభాగానికి చీఫ్‌గా నియమితులైన సింగ్ గత ఆరు నెలలుగా విధులకు హాజరుకాలేదని పేర్కొంది. ఆయనకు ఇచ్చిన సెలవు గడువు ఆగస్ట్ 29వ తేదీతో ముగిసినా విధులకు రాలేదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: (ఒమిక్రాన్ వచ్చేసింది.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ..) -
కులగణనలో ఓబీసీలను చేర్చొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులగణన–2021లో వెనకబడిన వర్గాలను చేర్చొద్దని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఓబీసీల వివరాల్లో కచి్చతత్వం లేదని తెలిపింది. 2021 కులగణనలో ఎస్సీ, ఎస్టీల లెక్కలను మాత్రమే సేకరించి, ఇతర కులాలను మినహాయించాలనేది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని తెలిపింది. రాష్ట్రంలో ఓబీసీల కులగణన కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పరిగణనలోకి తీసుకోవద్దంటూ కేంద్ర సామాజిక సాధికారత శాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ మేరకు పేర్కొంది. జనవరి 7, 2020న జారీ చేసిన నోటిఫికేషన్లో 2021 కులగణనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలను మాత్రమే చేర్చామని కేంద్రం తెలిపింది. 2021 కులగణనలో గ్రామీణ భారతంలోని వెనకబడిన వర్గాల సామాజిక–ఆర్థిక డాటాను పొందుపరచాలని సెన్సస్ విభాగానికి ఆదేశాలు ఇవ్వొద్దని, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 8లో పొందుపరిచిన విధాన నిర్ణయంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. ఓబీసీల కులగణన చేపట్టడానికి రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్‌కు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ఆదేశాలు లేవని తెలిపింది. కులగణనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులను హైకోర్టులు, సుప్రీంకోర్టు గతంలో కొట్టివేశాయని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం వద్ద ఉన్న మహారాష్ట్రలోని ఓబీసీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 90 రోజుల పరిమితి అమల్లోకి.. పిటిషన్ దాఖలుపై సడలింపు తీసేయాలని సుప్రీంకోర్టు నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్లు దాఖలు చేయడానికి గతంలో ఇచ్చిన సడలింపు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అక్టోబరు 1 నుంచి పిటిషన్ దాఖలుకు 90 రోజుల కాలపరిమితి అమల్లోకి వస్తుందని తెలిపింది. కరోనా నేపథ్యంలో సుమోటోగా ఇచి్చన సడలింపులు నిలిపివేయాలని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ నిర్ణయించింది. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు పేర్కొంది. మూడో వేవ్ పొంచి ఉందంటూ ఈ ఏడాది చివరి వరకూ సడలింపు ఇవ్వాలన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘మీరు నిరాశపడకండి. మూడో వేవ్‌ను ఆహ్వానించకండి’’ అని న్యాయవాదులనుద్దేశించి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. హైకోర్టుల తీర్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడానికి 90 రోజుల కాల పరిమితి అమల్లోకి తీసుకురావాలంటూ ఈ ఏడాది మార్చి 8న అటార్నీ జనరల్ కోర్టును కోరిన విషయం విదితమే. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశి్చమబెంగాల్ ఎన్నికలకు సంబంధించి దాఖలు చేసే పిటిషన్లకు కాలపరిమితి విధించాలని ఎన్నికల కమిషన్ కోరింది. లేదంటే రాబోయే ఎన్నికలకు ఈవీఎం, వీవీప్యాట్లు తిరిగి ఉపయోగించలేని పరిస్థితి వస్తుందని పేర్కొంది. -
హైదరాబాద్‌కు ఆదిపురుష్
‘ఆదిపురుష్’ హైదరాబాద్‌కు షిఫ్ట్ కానున్నాడు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో కృతీ సనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ ఇటీవల ముంబయ్‌లో ముగిసింది. మూడో షెడ్యూల్‌ను కూడా అక్కడే చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ‘ఆదిపురుష్’ తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రదర్శకుడు ఓం రౌత్. ఇప్పటికే షూటింగ్‌కి కావాల్సిన ఏర్పాట్లు, సెట్ వర్క్ పనులు ఓ కొలిక్కి వచ్చాయట. అంతేకాదు.. ఈ కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 15న ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ 45 రోజులకు పైగా కొనసాగుతుందని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదలకానుంది. -
రిజర్వేషన్లు: 50% పరిమితి ఎలా వచ్చింది?
న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. మరాఠా సామాజిక వర్గానికి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. దీంతో మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వపు హక్కును ఇది ఉల్లఘింస్తోందని పేర్కొంది. 50% పరిమితి ఎలా వచ్చింది? 1979లో నాటి జనతా ప్రభుత్వం బిహార్‌కు చెందిన ఎంపీ బీపీ మండల్ నేతృత్వంలో రెండో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1980లో ఆ కమిషన్ నివేదిక వెలువరించింది. ఇతర వెనుకబడిన వర్గాలకు 27%.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు 22.5%, మొత్తంగా 49.5% రిజర్వేషన్లు కల్పించాలని ఆ కమిషన్ సిఫారసు చేసింది. దాదాపు దశాబ్దం అనంతరం ఈ కమిటీ సిఫారసులను అమలు చేస్తూ, ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఇందిర సాహ్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవకాశాల్లో అందరికీ సమానత్వం కల్పిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హామీ ఉల్లంఘనకు గురైందని వాదించారు. వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు కులాన్ని ప్రాతిపదికగా తీసుకోవద్దన్నారు. రిజర్వేషన్లతో ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగుల సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. దాంతో, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. అనంతరం విచారణ కొనసాగింది. ఆ తరువాత, 1992 నవంబర్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను సమర్ధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. వెనుకబాటుతనాన్ని గుర్తించే ఉపకరణంగా కులాన్ని పరిగణించడాన్ని కోర్టు సమర్థించింది. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించడం సరైనదేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల హక్కులకు పరిమితి ఏర్పడింది. రిజర్వేషన్లు 50% పరిమితికి కచ్చితంగా లోబడే ఉండాలని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఓబీసీల్లోని సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించినవారు ఈ రిజర్వేషన్లకు అనర్హులని పేర్కొంది. అయితే, రిజర్వేషన్ల పరిమితి 50 శాతమే ఎందుకన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూ, వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు 11 ఇండికేటర్లను తీర్పులో పేర్కొంది. దేశంలో వెనుకబడిన వర్గాల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే, వారికి కల్పించిన 27% రిజర్వేషన్లు తక్కువేనన్న వాదన ఈ తీర్పు అనంతరం తెరపైకి వచ్చింది. నిజానికి, రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సహకరించే ప్రత్యేక నిబంధనలను రాష్ట్రాలు రూపొందించే ప్రక్రియను అడ్డుకునే అంశాలేవీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 లేదా ఆర్టికల్ 29 క్లాజ్ 2లో కానీ లేవు’అని పేర్కొన్నారు. చదవండి: Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్ చెల్లదు -
Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్ చెల్లదు
న్యూఢిల్లీ: మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వపు హక్కును ఇది ఉల్లఘింస్తోందని పేర్కొంది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సర్వోన్నత న్యాయస్థానం 1992లో ఇచ్చిన మండల్ తీర్పు (ఇందిరా సాహ్నీ కేసులో)ను పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ పరిమితిని పునఃసమీక్షించడానికి విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. రిజర్వేషన్లపై పరిమితి సబబేనని పలుమార్లు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తుచేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఏకగ్రీవంగా అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ కోటాను కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లు సభ్యులుగా ఉన్నారు. మరాఠాలకు ప్రత్యేక కోటాతో 50 శాతాన్ని దాటేసి.. రిజర్వేషన్లు చాలా ఎక్కువ అవుతున్నాయనేది పిటిషనర్ల ప్రధాన అభ్యంతరం. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ 2018 నవంబరు 30న మహారాష్ట్రలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్ల చట్టాన్ని చేసింది. బాంబే హైకోర్టు 2019 జూన్‌లో ఈ చట్టాన్ని సమర్థించింది. అయితే 16 శాతం కోటా సమర్థనీయం కాదని.. ఉద్యోగాల్లో 12 శాతం, విద్యాసంస్థల ప్రవేశాల్లో 13 శాతం సరిపోతుందని తేల్చింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. సరైన భూమిక లేదు ఎంసీ గైక్వాడ్ కమిషన్ సిఫారసుల ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించింది. అయితే మరాఠాలకు ప్రత్యేక కోటాను ఇవ్వడానికి అవసరమైన అసాధారణ పరిస్థితులేమిటో గైక్వాడ్ కమిషన్ ఎత్తిచూపలేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటపుడు రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని అతిక్రమించడానికి సరైన భూమిక లేనట్లేనని పేర్కొంది. మహారాష్ట్ర తెచ్చిన చట్టం సమానత్వానికి భంగకరమని తెలిపింది. అయితే ఈ చట్టం ఆధారంగా మరాఠాలకు (2020 సెప్టెంబర్‌లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించే వరకు) మెడికల్ పీజీల్లో కేటాయించిన సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జరిపిన నియామకాలకు బుధవారం వెలువరించిన తీర్పుతో ఎలాంటి విఘాతం కలగకూడదని తెలిపింది. అంటే లబ్ధిదారులకు ఇబ్బంది ఉండదు, వారి ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు చెల్లుబాటు అవుతాయి. ఇకపై మాత్రం మరాఠాలకు కోటా ఉండదు. రాష్ట్రాలకు కొత్త కులాలను చేర్చే అధికారం లేదు పార్లమెంటు చేసిన 102వ రాజ్యాంగ సవరణ పర్యవసానంగా... సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్తగా ఏ కులాన్నైనా చేర్చే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘రాష్ట్రాలు అలాంటి కులాలను గుర్తించి కేంద్రానికి సిఫారసు మాత్రమే చేయగలవు. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రపతి మాత్రమే ఏ కులాన్నైనా ఎస్ఈబీసీ జాబితాలో చేర్చగలరు. నోటిఫై చేయగలరు’ అని పేర్కొంది. 102వ సవరణ రాజ్యాంగబద్ధతను అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఈ సవరణ సమాఖ్య వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని పేర్కొంది. కొత్త ఎస్ఈబీసీ కులాల జాబితాను నోటిఫై చేయాలని... అప్పటిదాకా పాత జాబితానే అమలులో ఉంటుందని పేర్కొంది. 2018లో చేసిన 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338బి, 342ఏ ఆర్టికల్స్‌ను చేర్చారు. ‘338బి’లో జాతీయ బీసీ కమిషన్ నిర్మాణం, విధులు, అధికారాలను నిర్వచించారు. ‘342ఏ’లో ఏదైనా కులాన్ని ఎస్ఈబీసీ జాబితాలో చేర్చడానికి (నోటిఫై చేయడానికి) రాష్ట్రపతికి ఉన్న అధికారాలను, ఎస్ఈబీసీ జాబితాను మార్చడానికి పార్లమెంటుకున్న అధికారాలను వివరించారు. పలు రాష్ట్రాలు పరిమితిని సడలించాలని కోరినా... రిజర్వేషన్లపై పరిమితిని పునఃసమీక్షించాల్సిన అవసరంపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ ఇదివరకే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 50 శాతం పరిమితిని సడలించాలని, తమ రాష్ట్రాల్లో ఆయా సామాజికవర్గాల సంఖ్య ఆధారంగా కొన్ని కులాలకు, వర్గాలకు రిజర్వేషన్లను కల్పించుకునే వెసులుబాటు తమకు ఉండాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించవచ్చని, మరాఠాలకు కోటా సబబేనని, రాజ్యాంగబద్ధమని కేంద్ర ప్రభుత్వం కూడా వాదించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘మీరు సూచిస్తున్నట్లుగా 50 శాతం పరిమితి లేకపోతే సమానత్వమనే భావనకు విలువేముంది? మేమది చూడాలి. దీనిపై మీరేమంటారు? ఇలా పరిమితి దాటి రిజర్వేషన్లు కల్పిస్తే ఫలితంగా తలెత్తే అసమానతల మాటేమిటి? రిజర్వేషన్లను ఇంకా ఎన్ని తరాలు కొనసాగిస్తారు? అని ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. మొత్తానికి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పరిమితిని విధిస్తూ 1992లో సుప్రీంకోర్టు వెలువరించిన మండల్ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని బుధవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని మార్చాలంటే సమానత్వపు భావనపై నిర్మితమైన సమాజం కాకుండా... కుల పాలిత సమాజం అయ్యుండాలి. ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటితే అది తీవ్ర విపరిమాణాలకు దారితీసే చర్యే అవుతుంది. ఆపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రిజర్వేషన్లను తగ్గించడం దుస్సాధ్యమవుతుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో పొందుపర్చిన సమానత్వపు హక్కును మహారాష్ట్ర చట్టం (ఎంఎస్‌ఈబీసీ యాక్ట్–2018) విస్పష్టంగా ఉల్లంఘిస్తోంది. అసాధారణ పరిస్థితులు లేకుండా 50 శాతం పరిమితిని దాటడం ఆర్టికల్ 14, ఆర్టికల్ 16ల ఉల్లంఘనే కాబట్టి రాజ్యాంగబద్ధం కాదు 102వ రాజ్యాంగ సవరణ.. తమ ప్రాదేశిక పరిధిలోని వెనుకబడిన తరగతులను గుర్తించి, వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసివేసింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 366 (26సి), 342ఏ చేర్చడంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలను (ఎస్ఈబీసీ) గుర్తించే, నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి ఒక్కడికి మాత్రమే దఖలు పడింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ అధికారం రాష్ట్రపతికే ఉన్నట్లుగా భావించాలి. ఎస్ఈబీసీ జాబితాలో ఏవైనా కులాలను చేర్చాలన్నా, తొలగించాలన్నా... ప్రస్తుత ఉన్న వ్యవస్థల ద్వారా లేదా చట్టబద్ధమైన కమిషన్ల ద్వారా రాష్ట్రాలు ఆ మేరకు రాష్ట్రపతికి సూచనలు మాత్రమే చేయగలవు. వెనుకబడిన తరగతులను గుర్తించే, వర్గీకరించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తొలగించిన ఆర్టికల్ 342ఏ సమాఖ్య వ్యవస్థకు భంగకరం కాదు. ప్రతికూల ప్రభావం చూపదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదు 3–2 మెజారిటీ తీర్పులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రం జోక్యం చేసుకోవాలి మరాఠాల రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో కలుగజేసుకోవాలి. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, షాబానో వంటి కేసుల విషయంలో చూపించిన వేగాన్ని ఇందులోనూ చూపించాలి. మరాఠాల కోటాపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. మహారాష్ట్ర ప్రజలు సహనం కోల్పోకుండా శాంతియుతంగా వ్యవహరించాలి – ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలి విద్య, ఉద్యోగాల్లో మరాఠాల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయానికి శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎంపీ గైక్వాడ్ కమిషన్ నివేదిక విషయంలో న్యాయస్థానాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ప్రభుత్వం తరపున న్యాయవాదులు సమర్థంగా వాదనలు వినిపించలేకపోయారు. కోర్టు నిర్ణయం మాకు అసంతృప్తి కలిగించింది – దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర మాజీ సీఎం -
మహారాష్ట్రలో 15 రోజుల పాటు సెమీ లాక్డౌన్
-
మహారాష్ట్రలో 15 రోజుల పాటు సెమీ లాక్డౌన్
సాక్షి, ముంబై: కరోనా కేసులు అత్యంత భారీగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్ర సర్కారు సెమీ లాక్డౌన్ ప్రకటించింది. దాదాపు లాక్డౌన్ తరహాలో 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపింది. నిత్యావసరాలు, అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. కరోనాతో మరోసారి యుద్ధం మొదలైందని.. అయితే లాక్డౌన్ కాకుండా ‘బ్రేక్ ది చైన్’ పేరుతో ఆంక్షలను అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. కరోనా విలయ తాండవం చేస్తోందని.. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యంకాదని, అందుకే మరోసారి కఠిన ఆంక్షల అమలుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇందుకు అందరి సహకారం అవసరమని కోరారు. ఆంక్షలతో ఇబ్బందిపడే రంగాల వారికి, పేదలకు సాయం అందజేస్తామని ప్రకటించారు. కేసులు భారీగా పెరిగిపోవడంతో.. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో సగం దాకా ఆ ఒక్క రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో పరిస్థితి అదుపు తప్పుతున్న పరిస్థితిలో మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తారన్న అంచనాలు వెలువడినా.. కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలుతో సెమీ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బుధవారం (14న) రాత్రి ఎనిమిది గంటల నుంచి ‘బ్రేక్ ది చైన్’ పేరుతో కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. సొంతూళ్లకు వెళ్లేందుకు మంగళవారం ముంబైలోని ఎల్టీటీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వలసజీవులు కరోనా వ్యాప్తి చైన్‌ను తెంచేందుకు మే ఒకటో తేదీ ఉదయం వరకు 15 రోజులపాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని స్పష్టం చేశారు. మినహాయింపు ఉన్నవి తప్ప అన్నిరకాల ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసేయాలని ప్రకటించారు. జనం గుమిగూడే అన్నిరకాల ఫంక్షన్లు, కార్యక్రమాలపై నిషేధం ఉంటుందని చెప్పారు. ప్రజారవాణా, లోకల్ రైలు సేవలు కొనసాగుతాయని.. కానీ అవి అత్యవసర సేవలు అందించే వారికి మాత్రమేనని స్పష్టం చేశారు. రాత్రి కర్ఫ్యూ పూర్తిస్థాయిలో ఉంటుందని.. పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అత్యవసర సేవల కోసం మాత్రం బయటికి రావొచ్చని సూచించారు. హోటళ్లు కొనసాగించవచ్చని.. అయితే పార్శిల్ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. పేదలకు సాయం ‘బ్రేక్ ది చైన్’ ఆంక్షలతో ఇబ్బంది పడే పేదలను ఆదుకునేందుకు రూ.5,476 కోట్లతో ప్యాకేజీని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. పేదలు తిండి కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు.. రూ.10కి అందించే శివ భోజన్ ను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ లబి్ధదారులకు మూడు కిలోల చొప్పున గోధుమలు, రెండు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందిస్తామన్నారు. వివిధ పథకాల కింద వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, విడోలకు అందే పెన్షన్లకు సంబంధించి రెండు నెలల సొమ్మును అడ్వాన్స్‌గా ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే రిజిస్టర్డ్ కార్మికులకు, లైసెన్సుడ్ ఆటో డ్రైవర్లకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రిజిస్టర్డ్ వీధి వ్యాపారులకు రూ.2,500 చొప్పున అందజేస్తామన్నారు. పలు పథకాల కింద లబి్ధపొందే పేదలకు, ఆదివాసీలకు రూ.2 వేల చొప్పున ఆరి్థక సాయం చేస్తామని ప్రకటించారు. ఆక్సిజన్‌కు తీవ్ర కొరత గతేడాది కరోనా పరీక్షల కేంద్రాలు తక్కువగా ఉండేవని, ఇప్పుడు 523కి పెంచామని ఉద్ధవ్ థాకరే చెప్పారు. రోజూ 85 వేల నుంచి లక్షా 25 వేల వరకు టెస్టులు చేస్తున్నామని, కోవిడ్ సెంటర్లను కూడా నాలుగు వేలకు పెంచామని తెలిపారు. మహారాష్ట్రలో 1,200 టన్నుల ఆక్సిజన్ తయారవుతోందని, వినియోగం 950 టన్నుల వరకు పెరిగిందని వివరించారు. అయితే కరోనా రోగుల సంఖ్య భారీగా పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో సేవలకు, ఆక్సిజన్‌కు, రెమిడెసివిర్ ఔషధానికి కొరత ఏర్పడుతోందన్నారు. వెంటనే వైమానిక దళ విమానాల్లో ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని కేంద్రాన్ని కోరినట్టుతెలిపారు. నర్సులు, డాక్టర్లకు తీవ్ర కొరత ఉందని.. రిటైర్డ్ డాక్టర్లు, నర్సులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక్కరోజే 60,212 కేసులు.. 281 మరణాలు మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 60,212 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 35,19,208కి చేరింది. ఒక్కరోజే 281 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 58,526కు పెరిగింది. ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 16 వేలకుపైగా పాజిటివ్ కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 5.93 లక్షల మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
నేటి నుంచి టీకా బంద్
-
కేంద్రం, ‘మహా’ వ్యాక్సిన్ వార్
న్యూఢిల్లీ/ముంబై: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారు మధ్య వివాదం ముదురుతోంది. ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో 5 లక్షల కరోనా టీకా డోసులు వృథా అయ్యాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను పూర్తి సమాచారం సేకరించానని, మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద 23 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ డోసులు మరో ఐదారు రోజులకు సరిపోతాయని అన్నారు. 5 లక్షల డోసులను వృథా చేయడం సామాన్యమైన విషయం కాదని జవదేకర్ ఆక్షేపించారు. సరైన ప్రణాళిక ఉంటే డోసులు వృథా అయ్యే పరిస్థితే ఉండేది కాదన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకే అధికంగా టీకాలను అందజేస్తున్నామని గుర్తుచేశారు. మహారాష్ట్రకు తక్కువ టీకాలిస్తున్నారు కరోనా వ్యాక్సిన్ల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంపై వివక్ష చూపుతోందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రకు తక్కువ టీకాలు ఇవ్వడానికి గల కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అధికంగా టీకాలు సరఫరా చేస్తున్నారని విమర్శించారు. గురువారం ఉత్తరప్రదేశ్‌కు 48 లక్షల డోసులు, మధ్యప్రదేశ్‌కు 40 లక్షల డోసులు, గుజరాత్‌కు 30 లక్షల డోసులు, హరియాణాకు 24 లక్షల డోసులు ఇవ్వగా, మహారాష్ట్రకు కేవలం 7.5 లక్షల డోసులు ఇచ్చారని తప్పుపట్టారు. మహారాష్ట్రకు తక్కువ టీకా డోసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. నేటి నుంచి టీకా బంద్ ముంబైలో కరోనా టీకా నిల్వలు దాదాపు నిండుకున్నాయని నగర మేయర్ కిశోరీ పెడ్నేకర్ చెప్పారు. శుక్రవారం నుంచి టీకా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి టీకా డోసులు వస్తేనే కరోనా వ్యాక్సినేషన్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సరిపడా వ్యాక్సిన్లు అంద డం లేదని, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె వ్యాఖ్యానించారు. టీకా తొలి డోసు తీసుకున్నవారికి రెండో డోసు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికైనా టీకాలు సరఫరా చేయకపోతే రెండో డోసు ఇవ్వలేమని అన్నారు. కరోనా టీకా పంపిణీలో వివక్ష లేదు వ్యాక్సిన్ల పంపిణీ విషయంలో రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతున్నారంటూ వెల్లువెత్తుతున్న విమర్శలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తిప్పికొట్టారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న మహారాష్ట్ర, రాజస్తాన్‌లకు అధికంగా కరోనా టీకాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాలకు టీకాల పంపిణీలో ఎలాంటి వివక్ష లేదని వెల్లడించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9.1 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 2.4 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయన్నారు. -
అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు గురువారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్‌దేశ్‌ముఖ్ దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హోంమంత్రిగా ఉన్న సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ ముంబైలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్æ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘ఆరోపణలను చూస్తే వీటిపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయడమే మంచిదని భావిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవాలనుకోవడం లేదంది. ‘ఒక సీనియర్ మంత్రిపై ఒక సీనియర్ పోలీసు అధికారి చేసిన తీవ్రమైన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయడం సరైనదే’ అని పేర్కొంది. మౌఖికంగా, ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశించడం సరికాదని అనిల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలపై, మంత్రి వాదన వినకుండానే బొంబాయి హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. ‘ప్రస్తుతం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నేతృత్వంలో నడుస్తోంది. ఆ నియామకానికి సంబంధించిన పిటిషన్ కూడా ఇదే కోర్టులో విచారణలో ఉంది’ అని సిబల్ వివరించారు. -
Night Curfew: మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ
సాక్షి ముంబై: మహారాష్ట్రలో 27వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలుకానున్న నైట్ కర్ఫ్యూకు సంబంధించిన మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు వరకూ ఉండనుంది. అయితే అత్యవసర సేవలను ఇందులోనుంచి మినహాయించారు. మరోవైపు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. మాస్క్ లేకుండా తిరిగితే రూ. 500, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 1000, కర్ఫూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడితే రూ. 1000 జరిమానా వసూలు చేయనున్నారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 15వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. మార్గదర్శకాల వివరాలు... ► రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ► కర్ఫ్యూ సమయంలో బీచ్‌లు, ఉద్యానవనాలు, సార్వజనిక ప్రాంతాలు మూసేయనున్నారు. ► కర్ఫ్యూ సమయంలో అయిదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడరాదు. ► బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేయరాదు. ► ముఖానికి మాస్క్, కనీసం ఆరు అడుగుల దూరం (సోషల్ డిస్టిన్స్). చేతులను తరచు సానిటైజ్ చేసుకోవాలి. ► మాస్క్ లేకుంటే రూ 500 జరిమానా ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసి నియమాను ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానాను వసూలు చేయనున్నారు. ► కర్ఫ్యూ సమయంలో సినిమా హాళ్లు, హోటళ్లు, మల్టిప్లెక్స్, బార్లు అన్ని మూసి ఉండనున్నాయి. అయితే హోటళ్లు హోం డెలివరి చేసుకోవచ్చు. ► వివాహానికి 50 మందికి అవకాశం. ► అంత్యక్రియలకు 20 మంది మించకూడదు. ► ధార్మిక స్థలాలలో భౌతిక దూరం పాటించేలా ఆయా ధార్మిక స్థలాల ట్రస్టులు చూడాలి. అదేవిదంగా ఆన్లైన్ దర్శనం కల్పించాలి. అన్ని నియమాలతోనే ధార్మిక స్థలాల్లోకి అనుమతించాలి. ► కొన్ని ఆంక్షలతో ప్రజా రవాణా కొనసాగుతుంది. ► ప్రైవేట్ సంస్థలు (ఆరోగ్య, అత్యవసర సేవలు మినహా) 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యేలా చూడాలి. -
వీవీ ఆరోగ్యంపై వాస్తవ నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత వరవరరావు(వీవీ) ఆరోగ్యపరిస్థితిపై దాపరికం లేకుండా వాస్తవ నివేదికను వెంటనే తమకు అందజేయాలని ఆయన కుటుంబసభ్యులు సోమవా రం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గత వారం రోజుల్లో ఆయన్ను తలోజా జైలు నుంచి వివిధ ఆస్పత్రులకు తరలించి కేవలం కరోనా పాజిటివ్ మాత్రమే వచ్చిందని తెలిపారన్నారు. నానావతి ఆస్పత్రిలో చేర్చక ముందే ఆయన తలకు కుట్లుపడ్డాయని అక్కడి వైద్యులు గుర్తించారని వీవీ భార్య హేమలత, కుమార్తెలు సహజ, అనల, పవన పేర్కొన్నారు. వీవీ తనంతట తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నందున సహకరించేందుకు కుటుంబసభ్యులలో ఒకరిని అనుమతించాలని కోరారు. -
బాబ్లీ’లో పోలీసులపై దాడి కేసులో బాబుకు ఊరట
సాక్షి, ముంబై/హైదరాబాద్: మహారాష్ట్రలో 2010 జులై 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్య అక్కడి పోలీసులపై దాడి చేశారని, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసుల్లో తనకిచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)ను ఉపసంహరించాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అనుమతించింది. నేరారోపణలు నిర్ధారణ అయ్యేంత వరకు వ్యక్తిగత హాజరు నుంచి కూడా చంద్రబాబుకు కోర్టు మినహాయింపునిచ్చింది. అయితే, ఇన్ని రోజులు కోర్టుకు హాజరు కానందుకు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. వారెంట్ ఉపసంహరణ కోసం చంద్రబాబు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) అభయ్ శిఖరే హాజరయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నామంటూ అప్పట్లో చంద్రబాబు మహారాష్ట్రకు వెళ్లి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. 2010 జులై 16వ తేదీన బాబ్లీ వద్ద నిర్వహించిన ఆందోళనకు సంబంధించిన నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను తరువాత పోలీసులు రద్దు చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అనంతరం ధర్మబాదులోని ఐఐటిలో ఉంచిన చంద్రబాబు తదితరుల భద్రతతోపాటు శాంతిభద్రతల దృష్ట్యా ఔరంగాబాదు సెంట్రల్ జైలుకు తరలించేందుకు జులై 20న ప్రయత్నించగా ఉదయం తొమ్మిది గంటల నుంచి 10 గంటల మద్య పోలీసులపై దాడులు, ప్రభుత్వ పనులకు ఆటంకం తదితర సంఘటనలకు సంబంధించి కొత్త సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులోనే నాన్‌బెయిలబుల్ వారంట్‌ను కోర్టు జారీ చేసింది. -
పావనీ.. ప్రెజెంట్ సార్.. యామినీ.. ప్రెజెంట్ సార్!
ఏడాదిలో ముప్పై రోజులకు పైగా బాలికలు స్కూలుకు రాకపోవడంపై పరిశీలన జరిపించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కారణం ‘రుతుక్రమం’ అని గుర్తించింది. వారి హాజరు శాతాన్ని పెంచేందుకు ‘అస్మిత’ అనే పథకాన్ని మార్చి ఎనిమిది నుంచి అమలుచేయబోతోంది. ఆ పథకంలో మీరూ పాలుపంచుకోవచ్చు. ఓ అనాథ బిడ్డను ఏడాది పాటు దత్తత తీసుకున్నాం అనుకోండి. దానర్థం.. ఒక ఏడాదిపాటు ఆ బిడ్డ పోషణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఒక విద్యార్థిని దత్తత తీసుకుంటే వారి చదువుకు ఏడాదికయ్యే ఖర్చును స్పాన్సర్ చెయ్యడం. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫార్ములాను బాలికలలో ‘రుతుక్రమ పరిశుభ్రత’ కోసం అనుసరించబోతోంది. ప్రతి నెలా ‘పరీక్షా సమయమే’! గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే.. అమ్మాయిల సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది. వారిలోనూ కనీసం ఐదవ తరగతైనా పూర్తి చేసే అమ్మాయిలు మరీ తక్కువ. అసలు వాళ్లు అక్కడి వరకు రావడమే పెద్ద విజయం అన్నట్లు ఉంటాయి బాలికలకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు. ఐదవ తరగతిని కూడా దాటుకుని ఎనిమిది, తొమ్మిది క్లాసులకొచ్చేటప్పటికి వారి హాజరు శాతం మరింత పడిపోతోంది. ఏడాదిలో ముప్పై రోజులకు పైగా ఆ తరగతి బాలికలు స్కూలుకు రాలేకపోతున్నారు! ఈ పరిస్థితిపై పరిశీలన జరిపించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కారణం ‘రుతుక్రమం’ అని గుర్తించింది. మనసు బడిలో.. మనిషి ఇంట్లో.. పరిశుభ్రమైన పద్ధతుల్లో నెలనెలా రుతుక్రమాన్ని దాటుకుని రావడం గ్రామాల్లోని విద్యార్థినులకు ఒక సమస్యగా పరిణమిస్తోంది. డబ్బు పెట్టి ప్యాడ్స్ కొని వాడలేరు. దాంతో నెలకు నాలుగు రోజులు వారిని ఇంట్లోనే ఉంచేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ పరిస్థితిని గుర్తించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే ఓ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రుతుక్రమ పరిశుభ్రత గురించి తెలియజెప్పి ఊరుకుంటే సరిపోదు, అంతకు మించిన సహకారం బాలికలకు ఉండాలని భావించారు. ఫలితమే.. ‘అస్మిత’ ప్రోగ్రామ్. ప్రభుత్వమే ‘ప్యాడ్మాన్’ అయింది! గ్రామాల్లో అల్పాదాయ వర్గాల బాలికలకు ఏడాదికి దాదాపుగా 183 రూపాయలు రుతుక్రమ పరిశుభ్రత కోసం ఖర్చు చేయడం కష్టమైన పని. అందుకని ప్రభుత్వమే నామమాత్రపు ధరకు ప్యాడ్లను అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ‘అస్మిత’ అనే పేరుతో ఒక పోర్టల్ ప్రారంభించబోతోంది. అందులో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల పేర్లు, వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థినుల పేర్లు ఉంటాయి. వారందరికీ అస్మిత కార్డు ఇస్తారు. ఆ కార్డు ఉన్న అందరికీ ప్రతి నెలా... ఎనిమిది శానిటరీ ప్యాడ్స్ ఉన్న ప్యాకెట్‌ను ఐదు రూపాయలకే అందిస్తారు. వీటి పంపిణీ బాధ్యతను స్థానిక స్వయం సహాయక గ్రూపులు తీసుకుంటాయి. ప్యాడ్ల తయారీకి పాతిక నుంచి ముప్పై రూపాయలవుతుంది. ఐదు రూపాయలు పోగా మిగిలిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. మనమూ ప్యాడ్మాన్ కావచ్చు! గ్రామీణ బాలికలకు సహాయం చేయాలనుకునే వాళ్లు ఆన్లైన్లో అస్మిత పోర్టల్‌లోకి వెళ్లి ఒక బాలికకు ఒక ఏడాదికి అయ్యే ఖర్చు 183 రూపాయలను విరాళంగా ఇవ్వవచ్చు. ఈ స్కీమ్‌ని మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో మనం అరుణాచలం మురుగనాథమ్ సేవల్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్ర దర్శక నిర్మాతలకు ప్రేరణనిచ్చిన నిజజీవితపు ప్యాడ్‌మ్యాన్ అరుణాచలం మురుగనాథమ్.. బాలికలలో రుతుక్రమ బిడియాన్ని పోగొట్టి, వారు చదువులో వెనుకబడకుండా తోడ్పాటునివ్వగలిగారు. – మంజీర -
ఒక్క తూటాతో చిరుత హతం!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని థూలే జిల్లాలో బీభత్సం సృష్టించిన మ్యానీటర్‌ను హైదరాబాదీ హంటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ మట్టుబెట్టారు. రెండు నెలల పాటు జనావాసాలపై దాడులు చేసిన ఈ ఆడ చిరుత ఏడుగురిని చంపడంతో పాటు మరో ఎనిమిది మందిని తీవ్రంగా గాయపరిచింది. ఆ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆహ్వానం మేరకు షఫత్ అలీ ఖాన్ అతికష్టమ్మీద శనివారం రాత్రి దాని ఆచూకీ కనిపెట్టగలిగారు. ఆకలి, ఆగ్రహంతో ఉన్న ఆ చిరుత దాడికి ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి చంపినట్లు అలీ ఖాన్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ఆహారం కోసం బయటకు వచ్చి... మహారాష్ట్రలోని థూలే జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో అనేక చిరుత పులులు ఉంటున్నాయి. చాలీవ్ గావ్ పరిసరాల్లో నివసించే ఓ ఆడ చిరుతకు అడవిలో ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆహారాన్ని వెతుక్కుంటూ మూడు నెలల క్రితం చాలీవ్ గావ్ పరిసరాల్లోకి వచ్చింది. తొలినాళ్లల్లో అక్కడి పొలాల్లో ఉండే అడవి పందుల్ని చంపి తినేది. ఆపై గ్రామంలోకి ప్రవేశించి కుక్కలు, మేకలు, పశువులు.. ఆపై మనుషులపైనా దాడులు చేయడం మొదలెట్టింది. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో... మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత ఈ చిరుతను మత్తు మందు ఇవ్వడం (ట్రాంక్వలైజింగ్) ద్వారా పట్టుకోవాలని భావించింది. 15 గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆడ చిరుతను పట్టుకోవడానికి ఏడు ట్రాంక్వలైజింగ్ బృందాలు 20 రోజుల పాటు తీవ్రంగా శ్రమించాయి. అయినా ఫలితం లేక ఆ రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ హైదరాబాద్‌కు చెందిన షఫత్ అలీఖాన్‌ను ఆహ్వా నించారు. దేశవ్యాప్తంగా 23 మ్యానీటర్ల, మదపు టేనుగుల్ని చంపిన అనుభవం ఉన్న అలీఖాన్ ఈ మ్యానీటర్ కోసం ఈ నెల 4న రంగంలోకి దిగారు. మత్తు మందిచ్చే ఆస్కారం లేక... రాత్రి వేళల్లో గ్రామాలపై దాడి చేసి, పగటిపూట సమీపంలోని అటవీ ప్రాంతంలో దాక్కునే ఈ మ్యానీటర్పై సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసిన అలీఖాన్ శనివారం ఉదయం వర్కేడ్ గ్రామ పరిసరాల్లో చిరుత కదలికల్ని గుర్తించారు. దాదాపు 12 గంటల వెదుకులాట తర్వాత రాత్రి 10.15కి మ్యానీటర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన అలీఖాన్ ‘ఆ మ్యానీటర్‌ను ట్రాంక్వలైజ్ చేయాలనే ఉద్దేశంతోనే సెర్చ్ ఆపరేషన్ చేశాం. అయితే రాత్రి వేళ హఠాత్తుగా తారసపడిన చిరుత దాడికి యత్నించింది. ఈ నేపథ్యంలో కాల్చిన తొలి తూటాకే నేలకొరిగింది’అని అన్నారు. -
ఒప్పందంతో బాధ్యత పెరిగింది
అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం తో నీటిపారుదల విభాగం బాధ్యత మరింత పెరిగిందని ఆ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చె ప్పారు. ఒప్పంద స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఇక్కడి ఐడీసీ కార్యాలయంలో కాళేశ్వరంతో పాటు కరీంగనర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బాల్క సుమన్, బి.వినోద్, ఎంఎల్ఏలు పుట్ట మధు, విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, కార్యదర్శి వికస్రాజ్, సీఈలు ఎన్.వెంకటేశ్వర్లు, బి.హరిరామ్, అనిల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే హాజరయ్యారు. బ్యారేజీల దగ్గర క్యాంపులను ఏర్పాటు చేసి పనులు ఆరంభించాలని వర్కింగ్ ఏజెన్సీలను మంత్రి కోరారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు చేపట్టిన ప్యాకేజీ-6, 8 లకు చెందిన పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని 2017 జూలై చివరి నాటికి, ప్యాకేజీ 10, 11, 12 పంప్‌హౌస్‌లను 2017 సెప్టెంబర్ నాటికి, ప్యాకేజీ 20 పంప్‌హౌస్ నిర్మాణాన్ని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. నెలాఖరుకు డ్రై రన్... ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా ఉన్న వేమునూరు, గంగాధర, మేడారం పంప్‌హౌస్‌ల డ్రై రన్‌ను ఈ నెలాఖరులో చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 5న వెట్ రన్ ఆరంభించేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. ఎల్లంపల్లిలో మిగిలి పోయిన 920 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన సేకరించాలని, ఇది పూర్తయితే 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు కింద సేకరించిన 1600 ఎకరాలను గ్రామస్తులకు తిరిగే ఇచ్చే అంశాన్ని సైతం సమీక్షలో చర్చించిన మంత్రి... ఇందులో 117 ఎకరాలు లింక్ కెనాల్ కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, కొడిమ్యాల మండలాల్లో వీలైనంత త్వరగా భూసేకరణ చేయాలని సూచించారు. -
కాంగ్రెస్‌ది నీచపు రాజకీయం: సుమన్
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాల కోసం తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోనున్న ఒప్పందంపై కాంగ్రెస్ మతిలేకుండా విమర్శలు చేస్తోందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఉమ్మడి ఏపీలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిందని, ఇప్పుడు డ్రామాలు ఆడుతూ నీచరాజకీయానికి పాల్పడుతోందని సోమవారం ఇక్కడ సుమాన్ విమర్శించారు. -
నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత
► గోదావరిలోకి పెరగనున్న నీటి ప్రవాహం ► త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో విడుదల భైంసా : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలుకా బాబ్లీ గ్రామం వద్ద నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అర్ధరాత్రి తెరవనున్నారు. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచి నీటిని వదలనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది నీటి సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రకు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గేట్లను పైకి ఎత్తనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గోదావరి నది ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలో అడుగీడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు వరకు ఈ నది ప్రవాహం ఉంటుంది. గోదావరి నదిలో వర్షపు నీరు.. వర్షాలు లేక గతేడాది ఎస్సారెస్పీలో నీరు చేరలేదు. పుష్కరాల సమయంలో గేట్లు ఎత్తడంతో ఆ నీరు బాసర వరకు చేరింది. వర్షాలు లేక గోదావరి నదిలో తవ్విన ఇసుక గుంతల్లోనే ప్రాజెక్టు నీరు ఇంకిపోయింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మంజీర ఉపనదితో వచ్చే నీరు బాసర వద్ద నిలిచి ఉంది. పక్షం రోజుల వరకు బాసర వద్ద పుణ్యస్నానాలకు కూడా నీరు కనిపించలేదు. గోదావరి నదిలో బావులు తవ్వి ఆలయానికి, గ్రామానికి, ట్రిపుల్ఐటీ విద్యార్థులకు నీటిని పంపించారు. జూన్ మొదటి వారం నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి జలకళ వచ్చింది. బాసర గోదావరి నదిలో స్నానఘట్టాల వద్ద వర్షపునీరు చేరింది. రైలు, బస్సు వంతెనల నుంచి నదిలో నీరు కనిపిస్తోంది. గతేడాది నుంచి ఎడారిలా కనిపించిన గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎస్సారెస్పీకి నీరు.. ఇక వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తనున్నారు. నీరంతా ఎస్సారెస్పీలోకి చేరనుంది. పైగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరంతా గోదావరి నదిగుండా ఎస్సారెస్పీకి చేరనుంది. ప్రాజెక్టు 14 గేట్లు పైకి ఎత్తి ఉంచడంతో సహజ నది నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదు. గోదావరి నది ప్రవహిస్తే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలతో నీరంది పంటలు పండుతాయి. నీరులేక గతేడాది రెండు జిల్లాలోనూ పంటపొలాలన్నీ బీడుభూములుగా మారిపోయాయి. ఈ యేడాది వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వచ్చే నీటితో ఎత్తిపోతల పథకాలు పనిచేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల రైతులు వరి పంటలువేసేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు. రైతుల ఆశలు.. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీరు అందుతుంది. తీవ్ర వర్షాభావంతో ఈ రైతులంతా గతేడాది నష్టపోయారు. ఈ యేడు వాతావరణ సూచనలతో వర్షాలు కురుస్తాయని ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో ఎలాగైనా ప్రాజెక్టు నిండుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కురుస్తున్న వర్షాలకుతోడు వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎస్సారెస్పీలో నీరు చేరితే తాగు, సాగునీటి ఇబ్బందులు దూరం కానున్నాయి. -
‘గోవధపై నిషేధమే.. కానీ బీఫ్ తినొచ్చు’
ముంబై: మహారాష్ట్రలో నిషేధం ఉన్నందున గోవధ తప్పని.. అదే సమయంలో బీఫ్ తినడం తప్పుకాదని శుక్రవారం ముంబై హైకోర్టు శుక్రవారం విచిత్రమైన వ్యాఖ్యలు చేసింది. బీఫ్ అమ్మకాన్ని, గోవధను సంవత్సరం క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అన్ని మతాలు, కులాలు కలసి ఉన్న ముంబై మహానగరంలో ‘ఆహారం’పై నిషేధం విధించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. -
70 కోట్ల స్థలం 1.75 లక్షలకే
ముంబై: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి రూ. 70 కోట్ల విలువైన భూమిని రూ. 1.75 లక్షలకే మహారాష్ట్ర ప్రభుత్వం అప్పగించినట్లు వెల్లడైంది. సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గలీ కోరిన మీదట ముంబై సబర్బన్ కలెక్టర్ ఆఫీసు సంబంధిత పత్రాలను అందజేసింది. వీటి ప్రకారం ప్రభుత్వం ఖరీదైన 2వేల చదరపు మీటర్ల స్థలాన్ని చదరపు మీటరుకు రూ. 87.50 చొప్పున రూ. 1.75 లక్షలకు డ్యాన్స్ అకాడెమీ కోసం హేమకు అప్పగించినట్లు తేలింది. దీన్ని కలెక్టర్ కూడా ధ్రువీకరించారు. -
మరో కోనసీమగా ఉత్తర తెలంగాణ
♦ గోదావరి జలాలతో ఐదు జిల్లాలు సస్యశ్యామలం ♦ రైతు దుఃఖానికి గోదావరి జలాలే పరిష్కారం ♦ అందుకే ‘మహా’ ఒప్పందం ♦ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్/జగదేవ్‌పూర్/గజ్వేల్:తెలంగాణ రైతుల దుఃఖానికి, ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారం గోదావరి జలాలతోనే సాధ్యమవుతుందని అందుకే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భవిష్యత్‌లో ఉత్తర తెలంగాణ జిల్లాలు మరో కోనసీమగా మారనున్నాయని చెప్పారు. బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో 61 మంది రైతు కుటుంబాలతో కలసి సహ పంక్తి భోజనం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున రూ.2.73 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే, సీఎం దత్తత గ్రామమైన జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్లు, కుంటల అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గజ్వేల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, అన్నదాతలు ఆధైర్యపడవద్దని, భవిష్యత్తులో గోదావరి జలాలు రానున్నాయని, మంచిరోజులు వస్తాయని మంత్రి భరోసా కల్పించారు. జిల్లాలో ఆరు లక్షల ఎకరాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని, హల్దీ ప్రాజెక్ ద్వారా నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్‌ను నింపుతామన్నారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరిని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆరు దశాబ్దాల కల సాకారం ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంతో సాకారమైందని మంత్రి పేర్కొన్నారు. 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ల మధ్య జరిగిన ఒప్పందం విషయంలో ప్రాజెక్టు ఎత్తు అంశాలపై కిరణ్ కుమార్‌రెడ్డి అస్పష్టతతో కూడిన లేఖను రాసి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ప్రజలకు గోల్డెన్ డే ‘తెలంగాణ సస్యశ్యామలం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రతో నీళ్ల ఒప్పందం చేసుకుంటే కాంగ్రెసోళ్లు బ్లాక్‌డే అంటూ ప్రచారం చేస్తుండ్రు.. కానీ ఆ ఒప్పందం కాంగ్రెసోళ్లకే బ్లాక్ డే.. తెలంగాణ ప్రజలకు గోల్డెన్ డే’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇంతటి కరువు కాటకాల్లో 1,450 టీఎంసీల నీటిని మన ప్రాజెక్టులకు మలుపుకుంటే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. కేంద్రమంత్రులు ఉమాభారతి, గోయల్ తెలంగాణను చూసి నేర్చుకోవాలని హితవు పలికారన్నారు. మైనార్టీలకు 80శాతం సబ్సిడీపై రుణాలు మైనార్టీల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసిన తమ ప్రభుత్వం ఈసారి మరిన్ని నిధులు పెంచడానికి కృషి చేస్తోన్నట్టు మంత్రి హరీశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా మైనార్టీలకు రూ.3 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రకటిస్తే.. కేవలం తెలంగాణలోని మైనార్టీల కోసం సీఎం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ప్రకటించారని చెప్పారు. ఇది మైనార్టీల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తుందన్నారు. -
ప్రాజెక్టుల ఎత్తు తగ్గిస్తే తీరని అన్యాయం: గుత్తా
నల్లగొండ: గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిం చేందుకు మహారాష్ర్ట ప్రభుత్వంతో చేసుకుం టున్న ఒప్పందం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను సంప్రదిస్తే బాగుండేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తుమ్మడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించారన్నారు. దీంతో మహారాష్ట్ర పరిధిలో కేవలం1,800 ఎకరాలు సాగుకు యోగ్యం కాని భూమి మాత్రమే ముం పునకు గురవుతుందన్నారు. ప్రస్తుతం మహారా ష్ట్ర విజ్ఞప్తుల మేరకు ప్రాజెక్టుల ఎత్తు తగ్గించేం దుకు తెలంగాణ అంగీకరించినట్లు తెలుస్తోందన్నారు. దీని వల్ల ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోకి ప్రతిపాదించిన మేరకు గోదావరి నీళ్లు వచ్చే అవకాశం ఉండదన్నారు. -
‘కరువు’పై కదలరేం?
కోతలు పూర్తవుతున్నా అతీగతీ లేని కరువు మండలాల ప్రకటన ♦ సమయం మించిపోతున్నా మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారు ♦ కేంద్ర బృందాలు కోతలయ్యాక వస్తే ఏం లాభం? ♦ కేంద్ర సాయం తగ్గే అవకాశం ఉందంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. పంటలు పండక, అప్పులు తీర్చలేక రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. గతేడాది మాదిరే ఈసారి కూడా ఆలస్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి వద్దకు కరువు మండలాల నివేదిక వెళ్లినా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. కరువు కొలమానాలన్నింటినీ లెక్కలోకి తీసుకొని మొదటగా 66 మండలాల్లోనే కరువు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ విమర్శలు రావడంతో కొలమానాలను సడలించి వాటి సంఖ్య మరింత పెంచేలా నివేదిక తయారుచేశారు. ఎన్ని మండలాలను ప్రకటించాలనే అంశంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. ఆలస్యమైతే ఆర్థిక సాయంపై ప్రభావం రాష్ట్రంలో ఖరీఫ్ పంటల కాలం సెప్టెంబర్‌తో ముగిసింది. ప్రస్తుతం అనేక పంటలు పూర్తవగా కొన్ని చివరి దశలో ఉన్నాయి. పత్తి తీయడం దాదాపు సగం పూర్తయింది. మినుములు, పెసలు, జొన్న, మొక్కజొన్న కోతలు పూర్తయ్యాయి. వరి, కంది, కొంత భాగం పత్తి మాత్రమే చేలల్లో ఉన్నాయి. కనీసం ఈ పరిస్థితుల్లోనైనా కేంద్ర బృందం వచ్చి పంటలను పరిశీలిస్తే గానీ నష్టం అంచనా వేయడానికి అవకాశం ఉండదు. కరువు మండలాలు ప్రకటించాక దాదాపు నెలన్నరకు గానీ కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉండదు. కానీ పంటలన్నీ చేతికొచ్చాక కేంద్రం బృందం పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తుందన్నది ప్రశ్న. ఆలస్యమైతే కేంద్రం నుంచి అందే సాయం సగానికి సగం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. నెల కిందటే ప్రకటించిన పలు రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు నెల రోజుల కిందటే కరువును ప్రకటించి కేంద్రానికి నివేదిక పంపాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్ర బృందం రాక కోసం ఎదురుచూడకుండా రైతులకు ఆర్థిక సాయం ప్రకటించాయి. ఒడిశాలో 30 జిల్లాలుంటే 12 జిల్లాలను ఆ రాష్ట్రం కరువుగా ప్రకటించి రైతులకు రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం 28 జిల్లాల్లో 98 తాలుకాలను కరువుగా ప్రకటించి రైతులకు రూ.200 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా 35 జిల్లాలను కరువుగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 14,708 గ్రామాలను కరువుగా ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ కూడా కరువు ప్రాంతాలను ప్రకటించింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణం కరువు మండలాలు ప్రకటించి ఆర్థిక సాయం అందించాలని ఆయన పేర్కొన్నారు. -
సంజయ్‌దత్‌కు ‘ఫర్లాఫ్’పై దర్యాప్తు
ముంబై: ప్రముఖ హీరో, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి సంజయ్‌దత్‌కు పదేపదే ఫర్లాఫ్ (తాత్కాలిక సెలవులాంటిది) మంజూరు చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. జైలు అధికారులు సంజయ్‌దత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న సమాచారం మేరకు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జైళ్లశాఖ డీఐజీని ఆదేశించింది. ‘‘ఫర్లాఫ్ కోసం నలుగురైదుగురు దరఖాస్తు చేయగా అందులో సంజయ్‌దత్‌కు మాత్రమే పదే పదే ఇస్తున్నారు. ఏ చట్టం ప్రకారం ఇది జరుగుతుందో, చట్టంలో ఈ వెసులుబాటు ఉంటే మిగతావారికి ఎందుకు వర్తించడంలేదో తెలుసుకోవాల్సి ఉంది’’ అని రాష్ర్ట హోం శాఖ మంత్రి రామ్ షిండే చెప్పారు. సంజయ్‌దత్ బుధవారం ఎరవాడ జైలునుంచి 14 రోజుల ఫర్లాఫ్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. -
‘మహా’ సర్కారులోకి శివసేన!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన చేరికకు మార్గం సుగమం అవుతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో శివసేనను కూడా చేర్చుకోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణకు ఈ సందర్భంగా ఆమోదం లభించినట్లు సమాచారం. డిసెంబర్ 8 నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు జరిగే విస్తరణలో శివసేనకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి శనివారం చెప్పడం తాజా పరిణామాలను సూచిస్తోంది. విస్తరణ ఈ నెల 25 నుంచి 30 మధ్య ఉంటుందన్నారు. స్నేహం కొనసాగుతుంది: ఫడ్నవిస్ శివసేనతో త్వరలోనే ఓ అంగీకారానికి వస్తామని ఫడ్నవిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. శివసేన ఎప్పటికీ బీజేపీ మిత్రపక్షమేనని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని హిందూస్థాన్ టైమ్స్ ఢిల్లీలో నిర్వహించిన నాయకత్వ సదస్సులోపేర్కొన్నారు. శివసేనతో చర్చలు సరైన దిశలో నడుస్తున్నాయని చెప్పారు. -
రబీ అంతేనా..?
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలపాటు (జూన్ 30 నుంచి అక్టోబరు 29) బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తుంది. దీంతో నీటి రాకకు అంతరాయం తొలగి గోదారమ్మ గలగలలు పరవశింపజేస్తాయని మన రైతులు ఆశించారు. ఆ ఆశలు అడియాసలే అయ్యాయి. వానలు లేక, వరదలు రాక శ్రీరాంసాగర్ కళా విహీనమైంది. ప్రాజెక్టు నీటి నిలువ 90.31 టీఎంసీల నుంచి 24 టీఎంసీలకు పడిపోయింది. బుధవారం బాబ్లీ గేట్లు మూసివేయనుండడంతో రబీ సాగు ప్రశ్నా ర్థకంగా మారనుంది. తెలంగాణలోని ఆరు జిల్లాలలోని 18.66 లక్షల ఎకరాలపై ఈ ప్రభావం పడనుంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ మరింతగా బోసిపోనుం ది. ఈ ప్రాజెక్టు కింద ఆధారపడిన ఆరు జిల్లా ల ఆయకట్టు రైతులు రబీ సాగుకు దూరం కానున్నారు. గతేడాది ఇదే సమయంలో ఎస్ఆర్ఎస్పీ నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,068 అడుగులే ఉంది. గతేడాది 90.31టీఎంసీల నీరు నిలువ ఉండగా, ఇప్పు డు 24 టీఎంసీలకే పరిమితమైంది. ఇందులో ఐదు టీఎంసీలు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ముంపు ప్రాంతాల తాగునీటి అవస రాల కోసం వినియోగించాలి. సాగుకు చుక్కనీరు వదిలే పరిస్థితి లేదు. ఎందుకిలా జూన్ 30న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిస్తే, దానికి తోడు వానలు కురిస్తే జులై ఒకటి నుంచి నాలుగు నెలలపాటు శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతుందని భా వించారు. వానలు కురియలేదు. ఎగువ నుంచి వరదలు రాలేదు. గతేడాది కురిసిన వానల కారణంగా చేరిన 24 టీఎంసీల నీరే ప్రస్తుత నిల్వగా ఉంది. ఇందులో ఐదు టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోను, మరో ఐదు టీఎంసీలను ప్రాజెక్టు వాటర్ లాసెస్ (ఆవిరి)గా చూపుతారు. మిగిలిన 14 టీఎంసీలలో ఐదు టీఎంసీలు ఎస్ఆర్ఎస్పీ కనిష్ట నీటి మట్టం కాగా, ఇక 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగు కోసం కనీసం 35 టీఎంసీలు, రబీ కోసం 50 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో 9 టీఎంసీలు ఏ మూలకూ సరిపోవు. దీంతో రబీ కోసం చుక్క నీరు కూడ వదిలే అవకాశం లేదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ‘బాబ్లీ’తో ఆందోళనే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా బాబ్లీ వద్ద అక్కడి సర్కారు ప్రాజెక్టును నిర్మించింది. ఇది ఎస్ఆర్ఎస్పీకి ఎగువ భాగాన 80 కిలోమీటర్ల దూరం లో ఉంది. బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రైతులు అనేక ఆందోళనలు చేశారు. చివరకు ఇది రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంగా మారింది. రెండు రాష్ట్రాలూ సుప్రీం కోర్టు గడప తొక్కాల్సి వచ్చింది. విచారణ అనంతరం, ఏటా జూన్ 30 నుంచి అక్టోబరు 29 వరకు బాబ్లీ గేట్లను తెరవాలని సుప్రీం కోర్టు మహారాష్ట్రను ఆదేశించింది. ఈ సారి ఈ నాలుగు నెలల కాలమూ తెలంగాణకు ఆశించిన సాగు నీటి ప్రయోజనం తీర్చలేదు. ఈ క్రమంలో బుధవారం బాబ్లీ గేట్లు మళ్లీ మూసుకోనున్నాయి. వాస్తవానికి ఈ మాయా గేట్లు తెరుచుకున్నా, మూసుకున్నా ఎస్‌ఆర్‌ఎస్‌పీకీ గండమే. ఇక ఎడారేనా! ఎస్ఆర్ఎస్పీలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీం నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందిన 18,66,765 ఎకరాల ఆయకట్టు పరి స్థితి డోలాయమానంలో పడింది. నిజామాబా ద్ జిల్లాలో 1,60,578 ఎకరాలు, ఆదిలాబాద్ లో 1,45,387, కరీంనగర్లో 6,72,900, వరంగల్‌లో 4,71,67 8, ఖమ్మంలో 1,28,914, నల్గొండ జిల్లాలో 2,87,508 ఎకరాలపై తీవ్ర ప్రభావం పడనుంది. శ్రీరాంసాగర్ ద్వారా ఎన్టీపీసీ వినియోగానికి, కరీంనగర్, జగిత్యా ల, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ, మల్యాల, నిజామాబాద్, బోధన్, వరంగల్ వంటి పట్టణాలు, నగరాలకు తాగునీరందాలి. మరికొన్ని ప్రాంతాల దాహమూ తీరాలి. ఇంతటి విశిష్ట ప్రాజెక్టుకు నీరందించే గోదావరి గలగలలకు ‘బాబ్లీ’ సంకెళ్లు పడడం సంకటంగా మారింది. -
ఎట్లయినా ఎస్సారెస్పీకే నష్టం
బాల్కొండ: ‘బాబ్లీ’.. అంటూ ముద్దుగా పేరుపెట్టి.. గోదావరిపై ఆనకట్ట కట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం మనకచ్చే నీళ్లనూ దోచేస్తోంది. అసలు ఈ ప్రాజెక్టు కట్టడంలోనే మాయ చేసింది. తన నీళ్లు తనకే.. మన నీళ్లూ తనకే వచ్చేలా కనికట్టు ప్రదర్శించింది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా.. దించినా మనకేం ప్రయోజనం లేదు.. సరికదా మన నీళ్లూ వాళ్లకే వెళ్లిపోతాయి. ఇలా నిర్మించిన ‘బాబ్లీ అడ్డుకట్ట’ వల్ల ఉత్తర తెలంగాణ కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రాకపోవడంతో.. ‘ఆయకట్టు’ కన్నీళ్లు పెడుతోంది. ఎస్సారెస్పీకి నీటి గండమే ఎగువన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(ఎస్సారెస్పీ)కు నీటిగండం తప్పదు. బాబ్లీ గేట్లు ఎత్తిన, దించిన ఎస్సారెస్పీ నీటికి గండమే. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జూలై నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిఉంచాలి. అయితే గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీలోని నికర జలాలు వెనక్కు వెళ్తాయి. దించితే ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చే నీరు నిలిచి పోతుంది. ఇలా ఎత్తినా.. దించినా.. బాబ్లీలోకే నీరు వచ్చేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఎగువన నిండిన తర్వాతే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ప్రధానంగా మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల నుంచే వరద వస్తుంది. ఈ నీటితోనే ప్రాజెక్ట్ నిండు కుండలా మారుతుంది. జూలై వరకు బాబ్లీ గేట్లు మూసి వేయడం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటికి ఆటంకం కలుగుతోంది. అనంతరం అక్టోబర్ వరకే గేట్లు తెరిచి ఉంచితే... ఎస్సారెస్పీలోకి వచ్చే వరద నీటికి గండం తప్పదు. గత పదేళ్లుగా వర్షపాతం చూస్తే.. సకాలంలో వర్షాలు కురిసింది చాలా తక్కువ. అలాంటప్పుడు ఎస్సారెస్పీ ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు అక్టోబర్ వరకు మాత్రమే తెరిచి ఉంచితే లాభం లేదు. వరదలు వచ్చినా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ లాంటి ప్రాజెక్ట్‌తో పాటు ఎగువ ప్రాంతంలో నిర్మించిన 16 చెక్‌డ్యాంలు నిండిన తర్వాతనే మిగులు జలాలను వదులుతోంది. గేట్లు ఎత్తితే బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే మనకు నీళ్లు వస్తాయని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు సంబురపడ్డారు. తీరా ఆ ప్రాజెక్ట్ నిర్మాణశైలి తెలుసుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీలోని నీళ్లు సైతం వెనక్కి వెళ్తాయి. నీటిని వెనక్కు లాక్కునే విధంగా బాబ్లీ ప్రాజెక్ట్‌కు రివర్స్ గేట్లను నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం 1072 అడుగులకు చేరిన తర్వాత ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు నిలిచి పోతే నికర జలాలను వారు దోచేసుకోవచ్చు. అక్టోబర్‌లోనే గేట్లు దించితే శ్రీరాంసాగ ర్ ప్రాజెక్ట్ ఎగువ భాగన నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అక్టోబర్‌లోనే కిందికి దించితే.. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చే నీరు నిలిచిపోతుంది. దీంతో ఖరీఫ్‌లో ఎస్సారెస్పీ నిండుకుండలా ఉన్నప్పటికీ.. రబీపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. బాబ్లీ ప్రాజెక్ట్ 2.74 టీఎంసీల సామర్థ్యం అయినప్పటికీ అందులో నుంచి పంపింగ్ ద్వారా ఇతర జలాశయాలకు నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎగువ నుంచి తమకు వరదనీరు రాకపోతే శ్రీరాంసాగర్‌లో నుంచి దాదాపు 56టీఎంసీల నీటిని రివర్స్గేట్ల ద్వారా బాబ్లీలోకి మళ్లించుకోవచ్చు. ఇలా ఎస్సారెస్పీ మొత్తం 90టీఎంసీల్లో 56టీఎంసీల వర కు బాబ్లీ గండం ఉంటుంది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎస్సారెస్పీపై ఆధారపడిన 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. 10.50లక్షల ఎకరాలు ప్రశ్నార్థకం బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల ఎస్సారెస్పీ ఆయకట్టులో సాగవుతున్న 10.50 లక్షల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ఒక్క టీఎంసీ నీటితో 20వేల ఎకరాల పంటకు నీరందించవచ్చని అధికారుల లెక్కలే తెలుపుతున్నాయి. అంటే 56 టీఎంసీల నీటితో 10.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చు. ఉత్తర తెలంగాణలోని నల్గొండ,ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 18 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీటిని అందిస్తుంది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఎస్సారెస్పీ ఆయకట్టులో 60 శాతం ఎడారిగా మారే ప్రమాదముంది. పాలకులు స్పందించి శ్రీరాంసాగర్ ఆయకట్టును కాపాడాలని రైతులు కోరుతున్నారు.