
కాంగ్రెస్‌ది నీచపు రాజకీయం: సుమన్
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాల కోసం తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోనున్న ఒప్పందంపై కాంగ్రెస్ మతిలేకుండా విమర్శలు చేస్తోందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.
ఉమ్మడి ఏపీలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిందని, ఇప్పుడు డ్రామాలు ఆడుతూ నీచరాజకీయానికి పాల్పడుతోందని సోమవారం ఇక్కడ సుమాన్ విమర్శించారు.