70 కోట్ల స్థలం 1.75 లక్షలకే | 70 crore land to 1.75 million itself | Sakshi
Sakshi News home page

70 కోట్ల స్థలం 1.75 లక్షలకే

Published Sun, Apr 24 2016 4:00 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

70 కోట్ల స్థలం 1.75 లక్షలకే - Sakshi

70 కోట్ల స్థలం 1.75 లక్షలకే

ముంబై: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి రూ. 70 కోట్ల విలువైన భూమిని  రూ. 1.75 లక్షలకే మహారాష్ట్ర ప్రభుత్వం అప్పగించినట్లు వెల్లడైంది. సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్‌గలీ కోరిన మీదట ముంబై సబర్బన్ కలెక్టర్ ఆఫీసు సంబంధిత పత్రాలను అందజేసింది.

వీటి ప్రకారం ప్రభుత్వం ఖరీదైన 2వేల చదరపు మీటర్ల స్థలాన్ని చదరపు మీటరుకు రూ. 87.50 చొప్పున రూ. 1.75 లక్షలకు డ్యాన్స్ అకాడెమీ కోసం హేమకు అప్పగించినట్లు తేలింది. దీన్ని కలెక్టర్ కూడా ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement