సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన చేరికకు మార్గం సుగమం అవుతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో శివసేనను కూడా చేర్చుకోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణకు ఈ సందర్భంగా ఆమోదం లభించినట్లు సమాచారం. డిసెంబర్ 8 నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు జరిగే విస్తరణలో శివసేనకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి శనివారం చెప్పడం తాజా పరిణామాలను సూచిస్తోంది. విస్తరణ ఈ నెల 25 నుంచి 30 మధ్య ఉంటుందన్నారు.
స్నేహం కొనసాగుతుంది: ఫడ్నవిస్
శివసేనతో త్వరలోనే ఓ అంగీకారానికి వస్తామని ఫడ్నవిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. శివసేన ఎప్పటికీ బీజేపీ మిత్రపక్షమేనని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని హిందూస్థాన్ టైమ్స్ ఢిల్లీలో నిర్వహించిన నాయకత్వ సదస్సులోపేర్కొన్నారు. శివసేనతో చర్చలు సరైన దిశలో నడుస్తున్నాయని చెప్పారు.
‘మహా’ సర్కారులోకి శివసేన!
Published Sun, Nov 23 2014 1:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement