ముంబై: మహారాష్ట్రలో నిషేధం ఉన్నందున గోవధ తప్పని.. అదే సమయంలో బీఫ్ తినడం తప్పుకాదని శుక్రవారం ముంబై హైకోర్టు శుక్రవారం విచిత్రమైన వ్యాఖ్యలు చేసింది. బీఫ్ అమ్మకాన్ని, గోవధను సంవత్సరం క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అన్ని మతాలు, కులాలు కలసి ఉన్న ముంబై మహానగరంలో ‘ఆహారం’పై నిషేధం విధించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.