Mumbai High Court
-
బద్లాపూర్ కస్టడీ డెత్.. ఆ ఐదుగురే కారణం
ముంబై: మహారాష్ట్రలో సంచలన రేపిన బద్లాపూర్ స్కూల్ లైంగికదాడి ఘటనలో నిందితుడి లాకప్ మరణంపై మేజిస్ట్రేట్ విచారణ పూర్తయింది. నిందితుడు అక్షయ్ షిండే లాకప్ డెత్‌కు ఐదుగురు పోలీసు అధికారులు బాధ్యులని తేలింది. నకిలీ ఎన్కౌంటర్లో పోలీసులే తమ కుమారుడు అక్షయ్‌ను చంపేశారని తండ్రి అన్నా షిండే ఫిర్యాదుపై ముంబై హైకోర్టు జస్టిస్ రేవతి మొహితె డెరె, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనానికి సోమవారం సీల్డు కవర్లో దర్యాప్తు నివేదికను మేజిస్ట్రేట్ సమర్పించారు. నివేదిక తమకు అందిందని ధర్మాసనం తెలిపింది. థానె క్రైం బ్రాంచి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరె, హెడ్ కానిస్టేబుళ్లు అభిజీత్ మోరె, హరీశ్ తావడెతోపాటు ఒక పోలీస్ డ్రైవర్‌ను కూడా కస్టడీ మరణానికి కారణమని అందులో పేర్కొన్నారని చెప్పింది. దీని ఆధారంగా ఈ ఐదుగురిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక(ఎఫ్ఎస్ఎల్) నివేదికను బట్టి చూస్తే మృతుడి తండ్రి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయ పడింది. ఈ నివేదిక ప్రతిని అన్నా షిండేకు, ప్రభుత్వానికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు ప్రతి, ఆధారాల పత్రాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు తమ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ చేపట్టేదెవరో రెండు వారాల్లో తమకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బద్లాపూర్ స్కూల్లో అటెండర్‌గా పనిచేసే అక్షయ్ షిండే(24)స్కూల్ టాయిలెట్లో ఇద్దరు బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో గతేడాది ఆగస్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 23న అతడు చనిపోయాడు. అక్షయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకు తలోజా జైలు నుంచి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో వీరితోపాటు నీలేశ్ మోరె, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, డ్రైవర్ ఉన్నారు. -
రోడ్డుకు రెండు దిక్కులా బారికేడ్లు ఎందుకు?
దాదర్: ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఇరు దిక్కుల మార్గంపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను ఎందుకు అడ్డుకుంటున్నారని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. దీనివల్ల సామాన్య వాహన చోదకులు ఇబ్బందులు పడటమే కాకుండా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు, పోలీసు వ్యాన్లు తదితర అత్యవసర సేవలు అందించే వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటాయని పేర్కొంది. అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతే అందుకు బాధ్యులెవరని పోలీసులను నిలదీసింది. మరోసారి ఇలా బారికేడ్లు ఏర్పాటుచేసి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తే ఊరుకునేది లేదని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చుట్టూ తిరిగి వెళ్లాలి.. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రమాదం జరిగిన రోడ్డును మూసివేస్తారు. కానీ ఇటీవల కాలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బారికేడ్లు అడ్డంగా పెట్టి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వాహన చోదకులు చాలా చుట్టూ తిరిగి వెళ్తుంటారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు వెంటనే తరలించినప్పటికీ మృతుల పంచనామా పనులు పూర్తయ్యేంత వరకు రోడ్డును మూసి ఉంచుతారు. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్‌లు కూడా సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేక పోతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రులు వెంటనే వైద్యం అందక ప్రాణాలు వదులుతారని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన రోడ్డును మూసి వేయాలి కానీ అనేక సందర్భాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి రెండు దిక్కుల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. వందల వాహనాలు వెనక్కి ఇటీవల పశ్చిమ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక దహిసర్ పోలీసులు రెండు దిక్కులా బారికేడ్లు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. మరో సంఘటనలో 2024, నవంబరు 8వ తేదీన పావస్కర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఇరు దిక్కులా బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను నిలిపివేశారు. ఫలితంగా వందలాది వాహనాలను వెనక్కి పంపించారు. ఫలితంగా అందులో ప్రయా ణిçస్తున్న వేలాది మంది సామాన్యులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కైలాస్ చోగ్లే బాంబే హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బి.పి.కులాభావాల, జస్టిస్ సోమశేఖర్ సుందర్సేన్ల ధర్మాసనం విచారణ జరిపింది. రోడ్డు ప్రమాదం జరిగిన చోట లేదా పంచనామా, దర్యాప్తు జరుగుతున్న చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దర్యాప్తు పనులు పూర్తికాగానే వాటిని వెంటనే తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని సూచించింది. లేదంటే చర్యలు తప్పవని న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది. -
18 ఏళ్ల నాటి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ముంబై : 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఫేక్ ఎన్కౌంటర్ కేసులో తాజాగా ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నవంబర్ 11, 2006 ఢిల్లీలో గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ సన్నిహితుడు రామ్‌నారాయణ్ గుప్తాది ఫేక్ ఎన్‌కౌంటరేనని నిర్ధారించింది. ఈ కేసులో మాజీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మను జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ గౌరీ గాడ్సేలతో కూడిన ముంబై హైకోర్టు ధర్మాసనం దోషిగా తేల్చుతూ ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2013లో ప్రదీప్ శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘శర్మ ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లు లభ్యమైన సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు. సాధారణ సాక్ష్యాధారాలు సైతం ఈ ఫేక్ ఎన్కౌంటర్లో అతని ప్రమేయం ఎలాంటిదో నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయి’ అని కోర్టు పేర్కొంది. అనంతరం, మూడు వారాల్లో సంబంధిత సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని ధర్మాసనం శర్మను ఆదేశించింది. దీంతో పాటు పోలీసులతో సహా 13 మందికి ట్రయల్ కోర్టు విధించిన నేరారోపణ, జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో ఆరుగురు నిందితుల నేరారోపణ, జీవిత ఖైదును రద్దు చేసి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. నవంబర్ 11,2006 ఢిల్లీ ఫేక్ ఎన్ కౌంటర్ కేసు నవంబర్ 11, 2006న మహరాష్ట్ర వాశి నగర పోలీస్ టీం సభ్యులు గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నారనే అనుమానంతో నారాయణ్ గుప్తా అలియాస్ లఖన్ భయ్యా అతని స్నేహితులు అనిబేదాను అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం ముంబై అంధేరి నానా నాని పార్క్‌లో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ టీం నారాయణ్ గుప్తాను ఎన్కౌంటర్ చేసింది. తన అన్న నారాయణ్ గుప్తాది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ నవంబర్ 15,2006న బాధితుడి తమ్ముడు రామ్ ప్రసాద్ గుప్తా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శర్మ నిర్ధోషి అప్పటి నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ కేసులో జులై 2013లో సెషన్స్ కోర్టు ఫేక్ ఎన్ కౌంటర్లో 13 మంది పోలీసులతో సహా 22 మందిపై అభియోగాలు మోపింది. సాక్ష్యాలు లేని కారణంగా శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ 21 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 21 మంది నిందితుల్లో ఇద్దరు కస్టడీలోనే చనిపోయారు. మా అన్నది ఫేక్ ఎన్‌కౌంటరే అయితే ఎన్కౌంటర్లో దోషులుగా నిర్ధారించడంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురు నారాయణ్ గుప్తా తమ్ముడు రామ్ ప్రసాద్ పెట్టిన కేసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ దోషులే కోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో కేసు మలుపు తిరిగింది. కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌కు తాజాగా, సుధీర్ఘంగా కొనసాగిన ఈ దర్యాప్తులో పోలీస్ అధికారి ప్రదీప్ శర్మ ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్లు ముంబై హైకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వ తరుపు న్యాయవాది, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ చవాన్ వాదిస్తూ .. ప్రస్తుత ఈ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌కు పాల్పడ్డారని వాదించారు. 3 వారాల గడువుతో ఈ కేసులో శర్మను దోషిగా నిర్ధారించాలని కోరుతూ ప్రాసిక్యూషన్, అపహరణ, హత్యల మొత్తం ఆపరేషన్‌కు మాజీ పోలీసు ఎన్కౌంటర్ స్పషలిస్ట్ ప్రదీప్ శర్మే అసలు సూత్రదారి అంటూ కేసును తీర్పిచ్చింది. శర్మ లొంగిపోయేందుకు 3 వారాల గడువు ఇచ్చింది. -
మహారాష్ట్ర పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్.. థాక్రే వర్గానికి ఎదురుదెబ్బ?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో 14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్‌పై ముంబై హైకోర్టు థాక్రే వర్గానికి, స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి హీటెక్కింది. వివరాల ప్రకారం.. 2022లో చీలిక తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు, సీఎం ఏక్నాథ్ షిండే వర్గం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రతివాదులందరూ తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని గిరీష్ కులకర్ణి, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. 2022లో పార్టీ చీలిక తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టాల కింద ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్ వచ్చింది. షిండేతో సహా అధికార వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాక్రే బృందం పిటిషన్లో డిమాండ్ చేసింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని షిండే డిమాండ్ చేశారు. అయితే, షిండే వెంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతూ శాసన సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ స్పీకర్ తిరస్కరించారు. శివసేన మొత్తం ఎమ్మెల్యేలు 57 మంది కాగా వారిలో అత్యధికులు (37 మంది) షిండేతో పాటే ఉన్నారని స్పీకర్ నిర్ధారించారు. ఉద్ధవ్ థాక్రే సవాల్.. ఇదిలా ఉండగా.. ఏది అసలైన శివసేననో బహిరంగ చర్ చద్వారా తేల్చుకుందామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, స్పీకర్ రాహుల్ నర్వేకర్‌లకు ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌పై ఆయన మంగళవారం స్పందించారు. ‘నేను ఈ పోరాటాన్ని ప్రజా కోర్టులోకి తీసుకెళ్తా. ఈ పోరాటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా అనేది తేలుతుంది’ థాక్రే స్పష్టం చేశారు. -
మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ తన మాజీ భార్య ఆలియాపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవలి కాలంలో నవాజుద్దీన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఆలియా అయితే సోషల్ మీడియా వేదికగా నవాజుద్దీన్‌పై పలుమార్లు ఆరోపణలు చేసింది. అయితే అసత్యాలు ప్రచారం చేస్తూ,తన పరువుకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ నవాజుద్దీన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మాజీ భార్య ఆలియాతో పాటు సోదరుడు షంసుద్దీన్పై కూడా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే తన పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టకుండా నిలువరించాలని పిటిషన్లో కోరారు. 2008 నుంచి తన దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరుడు షంసుద్దీన్ ఆ సమయంలో క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్వర్డ్లు తీసుకొని తనను ఆర్థికంగా మోసం చేసి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆలియాను సైతం ఉసిగొల్పాడని నవాజ్ తెలిపాడు. -
ర్యాపిడోకి ఊహించని షాక్.. అన్ని సర్వీసులు బంద్ చేయాలని కోర్టు అదేశాలు!
ర్యాపిడోకి బాంబే హైకోర్ట్ గట్టి షాక్ ఇచ్చింది. పుణెలో ర్యాపిడో సర్వీస్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడో ట్యాక్సీ సర్వీస్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. బైకలతో పాటు కంపెనీకి చెందిన వాహనాలకు లైసెన్స్ లేదని తేల్చి చెప్పింది. అసలేం జరిగింది గతేడాది డిసెంబర్లో ర్యాపిడో లైసెన్స్ దరఖాస్తుని రవాణా శాఖ తిరస్కరించింది. కంపెనీ అప్లికేషన్లో బైక్, ట్యాక్సీలపై మార్గదర్శకాలు స్పష్టంగా లేవని, కనుకు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ అంశంపై ర్యాపిడో కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసుకు సంబంధించి ర్యాపిడో తరపు న్యాయవాదులు వాదిస్తూ.. లైసెన్స్ కోసం కంపెనీ దరఖాస్తు చేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వాదించారు. అయితే లైసెన్స్ ప్రక్రియ ఇంకా దరఖాస్తు దశలోనే ఉందని, ప్రస్తుతం ర్యాపిడో కార్యకలపాలు జరపడం చట్టవిరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే శుక్రవారం వరకు ర్యాపిడో తమ అన్నీ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే శుక్రవారం (జనవరి 20న) కోర్టు మరో సారి దీనిపై విచారణ చేపట్టనుంది. చదవండి: ‘ఆ కారు ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. రతన్ టాటా భావోద్వేగ పోస్ట్ వైరల్! -
కోర్టును ఆశ్రయించిన అనుష్క శర్మ!
బాలీవుడ్ హీరోయిన్, టిమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ కోర్టు మెట్లు ఎక్కారు. పన్ను ఎగవేత కేసులో ఆమె తాజాగా కోర్టును ఆశ్రయించారు. వివరాలు.. ట్యాక్స్ రికవరి కోసం సేటస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇటీవల అనుష్కకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటిసులను సవాలు చేస్తు తాజాగా ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఈ నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్వయంగా కోర్టులో కొత్త పటిషన్ దాఖలు చేసింది. చదవండి: షాకింగ్.. ఏంటీ జయసుధ మళ్లీ పెళ్లి చేసుకుందా? ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు? 2012-13, 2013-14 సంవత్సరాలకు సంబంధించిన పన్ను రికవరీ కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనుష్కకు నోటీసులు పంపింది. గతంలోనే ఈ కేసును విచారించిన కోర్టు.. అనుష్క శర్మపై సీరియస్ అయ్యింది. ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా పిటీషన్ ను దాఖలు చేయడం తాము ఇంతవరకు చూడలేదని, డైరెక్ట్‌గా పిటీషన్ ఎందుకు వేయలేదంటూ ఆమె తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో అనుష్క శర్మ స్వయంగా కోర్టుకు హాజరై కొత్త పిటీషన్‌ను దాఖలు చేసింది. చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ పార్ట్నర్ ఏదో తెలుసా? స్ట్రీమింగ్ ఎప్పుడంటే! రకరకాల సందర్భాల్లో ప్రొడ్యూసర్స్, ఈవెంట్ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నటిగా మూవీతో పాటుగా కొన్నిఅవార్డు ఫంక్షన్స్ లల్లో పాల్గొంటాను. అలాగని నిర్మాతలకు విధిస్తున్న శ్లాబుల్లో పన్ను చెల్లించాలి అంటే ఎలాగని తన పటిషన్లో పేర్కొంది. ఇక నటులకు వర్తించే శ్లాబుల్లోనే పన్నులు వేయాలి ఆమె తెలిపింది. కాగా అనుష్క కు 2012-13లో రూ. 1.2 కోట్ల వడ్డీతో కలిపి రూ. 12.3 కోట్లు పన్ను నిర్ణయించగా.. 2013-14 సంవత్సరానికి గాను దాదాపుగా రూ. 17 కోట్ల విక్రయ పన్ను రూ. 1.6 కోట్లుగా ఉందని ఆదాయ శాఖ తమ నోటీసులో పేర్కొంది. -
కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా శెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు
తనపై ఉన్న ముద్దు కేసును కొట్టివేయాలంటూ బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి కోర్టు మెట్లు ఎక్కింది. 2007లో తనపై నమోదైన ఈ ముద్దు కేసుపై రీసెంట్గా ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఈ కేసును కొట్టివేయాలని శిల్పా తరపు న్యాయవాది మధుకర్ దాల్వీ కోర్టును కోరారు. లాయర్ మధుకర్ వాదన విన్న హైకోర్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేసు పటిషనర్ పూనంచంద్ భండారి నాలుగు వారాల్లో తమ సమాధానం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. వివరాలు.. 2007లో శిల్పా శెట్టిని ఓ హాలీవుడ్ నటుడు పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్న సంఘటన అప్పట్లో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. చదవండి: విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్! 2007 ఏప్రిల్ 15న ఢిల్లీలో జరిగిన ఎయిడ్స్ అవగాహ కార్యక్రమంలో శిల్పాశెట్టి, నటుడు రిచర్డ్ గేరితో పాటు తదితర నటీనటులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిచర్డ్ గేరిని శిల్పా చేతులు పట్టుకుని స్టేజ్‌పైకి తీసుకువెళుతుంది. అనంతరం రిచర్డ్.. శిల్పాను హగ్ చేసుకుని ఆమెపై ముద్దు వర్షం కురిపించాడు. అప్పట్లో ఈ సంఘటన సినీ వర్గాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు శిల్పాను విమర్శస్తూ పలు సామాజిక సంఘాలు మండిపడ్డాయి. ఇక పూనంచంద్ భండారి అనే వ్యక్తి శిల్పా, రిచర్డ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టులో పటిషన్ వేశాడు. చదవండి: విక్రమార్కుడు తర్వాత ఇంట్లో నన్ను దారుణంగా చూశారు: అజయ్ అయితే.. 2011లో తనపై ఉన్న కేసును ముంబైకి బదిలీ చేయాలనీ సుప్రీం కోర్టును కోరింది. శిల్ప పిటిషన్ కి పర్మిషన్ ఇస్తూ.. కేసును ముంబైకి బదిలీ చేసింది సుప్రీం కోర్టు. అయితే.. శిల్పపై ఉన్న రెండు నేరాలలో ఒకదాంట్లో నిర్దోషిగా తేలింది. ఇక రెండో నేరంపై కేసు ఇంకా నడుస్తోంది. శిల్ప తరపున మధుకర్ దాల్వీ, లాయర్.. అవచాట్ సింగిల్ బెంచ్ ముందు వాదించారు. దాల్వీ వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు వేసిన ఫిర్యాదుదారుడు పూనంచంద్ భండారితో పాటు స్టేట్ గవర్నమెంట్ నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. -
చదువుకున్నంత మాత్రాన పని చేయాలనేం లేదు
ముంబై: చదువుకున్నంత మాత్రాన మహిళలను ఉద్యోగం చేసి తీరాలని ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని ముంబై హైకోర్టు పేర్కొంది. పని చేయాలా, ఇల్లు చక్కదిద్దుకోవడానికే పరిమితం కావాలా అన్నది పూర్తిగా ఆమె ఇష్టమేనని న్యాయమూర్తి జస్టిస్ భారతీ డాంగ్రే స్పష్టం చేశారు. ఓ విడాకుల కేసులో భార్యకు మనోవర్తి చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పెట్టుకున్న రివిజన్ పిటిషన్‌ను శుక్రవారం ఆమె విచారించారు. డిగ్రీ చేసిన తన మాజీ భార్యకు సంపాదించుకునే సామర్థ్యముంది గనుక మనోవర్తి చెల్లించాలన్న ఆదేశాలు సరికాదన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చారు. ‘‘ఈ రోజు నేను న్యాయమూర్తిని. రేపు బహుశా ఇంట్లో కూర్చోవాల్సి రావచ్చు. న్యాయమూర్తిగా పని చేయగల సామర్థ్యముంది గనుక అలా ఊరికే ఉండొద్దని చెప్తారా మీరు?’’అని ప్రశ్నించారు. తన భార్యకు స్థిరమైన ఆదాయ వనరు ఉన్నా ఆ వాస్తవాన్ని దాచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై వచ్చే వారం తదుపరి విచారణ జరగనునుంది. -
కోర్టును ఆశ్రయించిన సల్మాన్ ఖాన్
Salman Khan Approaches Bombay HC: బాలీవుడ్ కండల వీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. జర్నలిస్టుపై దాడి కేసులో ఇటీవల అంధేరీ కోర్టు సల్మాన్, అతని బాడీగార్డ్ నవాజ్ షేక్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు(ఏప్రిల్ 5)అంధేరి కోర్టు ముందు వీరు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ అంధేరీ కోర్టు, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆర్ఆర్ ఖాన్ ఉత్తర్వుల వ్యతిరేకిస్తూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించాడు. చదవండి: సుక్కు-చిరు కమర్షియల్ యాడ్, మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కాగా 2019లో అశోక్ పాండే అనే జర్నలిస్ట్ సల్మాన్, అతడి బాడీగార్డు తనపై దాడి చేశారని, తన ఫోన్ బలవంతంగా లాక్కుని బెదిరించాడని ఆరోపిస్తూ అంధేరి కోర్టులో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్డును కోరాడు. ముంబై రోడ్డులో సల్మాన్ సైకిలింగ్ చేస్తుండగా మీడియా ఆయన చూట్టు చేరి ఫొటోలు, వీడియోలు తీస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో సల్మాన్ తన ఫోన్ లాక్కుని బెదించాడని, అతడి బాడీగార్డు నవాజ్ షేక్ కూడా తనతో దురుసుగా ప్రవర్తించినట్లు అతడు ఫిర్మాదులో పేర్కొన్నాడు. చదవండి: ‘గని’ టీంకు తెలంగాణ సర్కార్ షాక్, తగ్గించిన టికెట్ రేట్స్ అతడి ఫిర్యాదు మేరకు లోకల్ పోలీసులను ఈ కేసు విచారణ చెప్పట్టాల్సిందిగా కోర్డు ఆదేశించింది. ఇటీవల దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ సల్మాన్, ఆయన బాడీగార్డ్‌కు ప్రతికూలంగా ఉంది. దీంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆర్ఆర్ ఖాన్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు జారీ చేస్తూ సల్మాన్, ఆయన బాడీగార్డ్‌పై ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు మార్చి 23న సల్మాన్, ఆయన బాడీగార్డుకు నోటిసులు ఇచ్చి ఏప్రిల్ 5న విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. -
బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్‌కు ఊరట
Aryan Khan Gets Relief From Weekly Attendance At NCB Mumbai Office: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్‌పై విడుదలైన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్ షరతు నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఆర్యన్‌కు సంబంధించిన బెయిల్ షరతు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆర్యన్.. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఢిల్లీ ఎన్సీబీ కార్యాలయం ఎప్పుడు సమన్లు పంపినా 72 గంటల్లోగా హాజరు కావాలని ఆర్యన్‌కు సూచించింది. అంతేకాకుండా ముంబై వదిలి వెళ్లేటప్పుడు అధికారులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే..
Aryan Khan Bail Petition: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్ బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం ఈసారైనా బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. గతవారమే ఆర్యన్‌కు బెయిల్ వస్తుందని అంతా భావించినా కోర్టు షాకిచ్చింది. దీంతో ఈసారైనా బెయిల్ వస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది. ఒకవేళ ఆర్యన్‌కు ఈ వారంలో బెయిల్ రాకపోతే మాత్రం అతను మరో 14 రోజుల పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చే నెల1వ తేదీ నుంచి ముంబై హైకోర్టుకు వరుసగా దీపావళి సెలవులు ఉన్నాయి. నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు ముంబై హైకోర్టుకు సెలవులు కావడంతో నేడు జరిగే విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే కొడుకు అరెస్ట్‌తో షారుక్ దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు సమాచారం. అటు షారుక్‌ఖాన్ భార్య గౌరీ ఖాన్ అయితే కొడుకు బెయిల్ కోసం నిత్యం ప్రార్థనలు చేస్తోందని, ఆర్యన్ విడుదల కావాలంటూ భగవతుండ్ని ప్రార్థించమని తన స్నేహితులకు కూడా విన్నవించుకుంటుందట. కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లో స్వీట్స్ వండొద్దని ఇప్పటికే గౌరీ ఖాన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. పుట్టినరోజు, పండుగలను కూడా జరుపుకోవడం లేదు. కొడుకు ఇంటికి వచ్చాకే అన్ని పండుగలు అన్ని గౌరీ సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. చదవండి: Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వస్తుందా? రాదా? ‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు -
వాట్సాప్ అడ్మిన్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు
ముంబై: వాట్సాప్ గ్రూపు నిర్వాహకుల విషయంలో బొంబాయి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు ఎవరైనా అభ్యంతరకరమైన, నేరపూరితమైన సమాచారం పంపితే అందుకు గ్రూప్ అడ్మిన్ జవాబుదారీ కాదని బొంబాయి హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. 33 ఏళ్ల వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసుకు విషయంలో నమోదైన కేసును కొట్టివేస్తూ కోర్టు ఈ వాఖ్యలు చేసింది. వాట్సాప్ గ్రూపుల నిర్వాహకులకు దానిపై పరిమిత నియంత్రణ ఉందని కోర్టు పేర్కొంది. వాట్సాప్ గ్రూపు నిర్వాహకులు కేవలం కొత్త సభ్యులను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు కానీ, గ్రూపులో పోస్ట్ చేసిన కంటెంట్‌ను నియంత్రించలేరు లేదా సెన్సార్ చేయలేరు అని తెలిపింది. అసలు విషయానికి వస్తే.. కిశోర్ తరోన్ పై 2016లో గోండియా జిల్లాలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తరోన్ నియంత్రణలో ఉన్న వాట్సాప్ గ్రూపు సభ్యుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకాపోవడంలో విఫలమయ్యాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఓ గ్రూపులో కొందరు వ్యక్తులు మహిళా సభ్యులను అసభ్య పదజాలంతో దూషించినా ఆ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న కిశోర్ తరోనే(33) స్పందించలేదని, ఆ సభ్యుడిని గ్రూప్ నుంచి తొలగించి లేదని కనీసం అతనిచే క్షమాపణ చెప్పించలేదు అని ప్రాసిక్యూషన్ వారు పేర్కొన్నారు. అతనిపై ఐపీసీ 354, 509, 107 సెక్షన్ల కింద, ఐటీ చట్టం 67వ నిబంధన కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ గ్రూప్ అడ్మిన్ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ వాఖ్యలు చేసింది. గ్రూపులో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు చేస్తే అతను మాత్రమే చట్టపరమైన చర్యలకు ఎలా బాధ్యుడు అవుతాడని కోర్టు స్పష్టం చేసింది. చదవండి: వాట్సాప్ స్టేటస్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? -
వరవర రావుకు బెయిల్
ముంబై/ సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావుకి ముంబై హైకోర్టు ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. ఎల్గార్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2018 ఆగస్టు 28న వరవర రావుని అరెస్టు చేశారు. గత కొంతకాలంగా వరవర రావుకు తీవ్ర అనారోగ్యం నేపథ్యంలో ఆయన భార్య హేమలత వరవరరావు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. 82 ఏళ్ళ వరవరరావు వయసు, అతని తీవ్ర అనారోగ్య పరిస్థితి, తలోజా జైలులో ఆయనకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని జస్టిస్ షిండే, జస్టిస్ మనీష్ పైటేల్ల ధర్మాసనం బెయిల్ మంజూరుచేసింది. ‘ఉపశమనం ఇవ్వదగిన కేసు ఇది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వవచ్చు. తక్షణమే ఆయన్ను విడుదల చేయండి’అని కోర్టు ఆదేశించింది. హైకోర్టు జోక్యంతో గత ఏడాది నవంబర్‌లో వరవరరావుని నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 1న వాదనలు ముగిశాక బెయిల్ అంశాన్ని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ప్రస్తుతం ముంబై నానావతీ ఆసుపత్రిలో వరవరరావు చికిత్స పొందుతున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. వరవరరావుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంపై మూడు వారాల పాటు స్టే విధించాలంటూ, ఎన్ఐఏ తరఫున వాదిస్తోన్న అడిషనల్ సోలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే, వరవరరావుకి బెయిలు మంజూరు చేస్తూ షరతులను కోర్టు విధించింది. వరవరరావు ఎన్ఐఏ కోర్టు పరిధిలో ముంబైలోనే ఉండాలని ఆదేశించింది. రూ.50వేల వ్యక్తిగత బాండు, అదే మొత్తానికి రెండు ష్యూరిటీలు సమర్పించాల్సిందిగా కోర్టు సూచించింది. తన సహనిందితులతోనూ, ఈ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారెవరితోనూ వరవరరావు సంబంధాలు నెరపరాదని కోర్టు చెప్పింది. వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫోన్లు చేయరాదని కోర్టు సూచించింది. 15రోజులకు ఒకసారి పోలీసులకు వరవరరావు వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలి. అన్ని కోర్టు విచారణలకు హాజరుకావాలని, కోర్టు సమన్లకు స్పందించాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో వరవరరావుని కలిసేందుకు సందర్శకులను అనుమతించబోమని, ఆయన పాస్‌పోర్టుని ఎన్ఐఏ కోర్టులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకి సంబంధించి మీడియా ఎదుట ప్రకటనలు చేయడాన్ని కోర్టు నిషేధించింది. వరవరరావుని కలిసేందుకు న్యాయవాదులకు, కార్యకర్తలకు అనుమతివ్వాలని వరవరరావు తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ఆరునెలల వ్యవధి ముగిశాక ఎన్ఐఏ కోర్టు ఎదుట హాజరుకావాలని, లేదా బెయిలు పొడిగింపునకు హైకోర్టుకి దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. -
టీఆర్పీ కేసు: అర్నబ్ గోస్వామికి ఊరట
ముంబై : టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ఆంగ్ల వార్తాచానెనల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి, ఇతర ఉద్యోగులపై జనవరి 29 వరకు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టబోమని ముంబై పోలీసులు శుక్రవారం బొంబాయి హైకోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. రిపబ్లిక్ టీవీ యాజమాన్య సంస్థ అయిన ఏఆర్జీ ఔట్లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు, హంస రీసెర్చ్ గ్రూప్ ఉద్యోగులకు గతంలో కల్పించిన తాత్కాలిక ఊరటను కూడా జనవరి 29 వరకు కోర్టు పొడగించింది. ఆ ఉద్యోగులను వారానికి రెండు సార్లకు మించి విచారణకు పిలవకూడదని కోర్టు గతంలో ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ఏఆర్జీ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. టీఆర్పీ కోసం అర్నబ్ గోస్వామి లంచం ఇచ్చారని ముంబై పోలీసులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని సాల్వే వాదించారు. మరోవైపు, ఈ టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నగదు అక్రమ చలామణీ కేసును నమోదు చేసి, విచారణ చేస్తోందని కోర్టుకు తెలిపారు. ఈడీ నమోదు చేసిన కేసు స్టేటస్ రిపోర్ట్‌ను కూడా కోర్టు తెప్పించుకోవాలని కోరారు. ఈడీ నివేదికకు, ముంబై పోలీసుల నివేదికకు మధ్య తేడాలున్నట్లయితే.. ఏఆర్‌జీపై దురుద్దేశంతో కేసు పెట్టినట్లు అర్థమవుతుందని వివరించారు. నివేదిక సీల్డ్ కవర్లో అందించేందుకు ఈడీ సిద్ధంగా ఉందని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వాదనను ముంబై పోలీసుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఖండించారు. ఈ కేసులో ఆర్థిక అక్రమాలపై వాదించే ఈడీకి భాగస్వామ్యం కల్పించడం సరికాదన్నారు. ఇప్పటివకు ఈడీ ఈ కేసులో భాగస్వామిగా లేదని వాదించారు. కేసులో భాగస్వామి కాకుండానే, స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలని ఈడీ ఎందకంత ఉత్సాహం చూపుతోందని ప్రశ్నించారు. -
సుశాంత్ కేసు: రియా సోదరుడికి బెయిల్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా చక్రవర్తికి అక్టోబర్‌లో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తికి కూడా ముంబై స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్ మంజురూ చేసింది. అయితే సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసులో రియా, ఆమె సోదరుడు సోవిక్, సుశాంత్ ఇంటి మెనేజర్ శామ్యూల్ మిరాండాతో పాటు పలువురిని సెప్టెంబర్ 4న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియా, ఆమె సోదరుడు సోవిక్‌కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని వారు సుశాంత్‌కు డ్రగ్ కూడా సప్లై చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్సీబీ అధికారులు వెల్లడించడంతో వారిని ముంబై హైకోర్టు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో రియా, సోవిక్లు బెయిల్ కోరుతూ సెప్టంబర్ చివరి వారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’) అయితే అక్టోబర్‌లో రియాకు బెయిల్‌ను మంజూరు చేసిన కోర్టు సోవిక్ బెయిల్‌ను రద్దు చేసింది. అనంతరం నవంబర్ మొదటి వారంలో సోవిక్ మళ్లీ బెయిల్ పటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈసారి సోవిక్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ముంబై హైకోర్టు ఎన్సీబీ అధికారులు ఇచ్చిన సాక్ష్యాలు అమోధయోగ్యం లేవని సోవిక్‌కు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్ 14వ సుశాంత్ సింగ్ ముంబైని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు అతడి ప్రియురాలు రియాను అనుమానిస్తూ విచారణ చేపట్టగా డ్రగ్ కేసు వెలుగు చూసింది. దీంతో ముంబై పోలీసుల ఈ కేసు విచారణను ఎన్సీబీ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రియాను విచారించగా ఆమెకు, సోవిక్‌కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విచారణలో రియా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, అలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లను కూడా చెప్పడంతో ఎన్సీబీ వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) -
కంగనా ఆఫీస్ కూల్చివేత.. హైకోర్టు కీలక తీర్పు
-
కంగనా ఆఫీస్ కూల్చివేత.. హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు భారీ ఊరట లభించింది. ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీసును బ్రిహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేయడాన్ని ముంబై హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. చట్ట ప్రకారం నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని బీఎంసీ అధికారుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. పిటిషనర్‌కు జరిగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలతో పాటు ముంబైను పీవోకేతో పోల్చుతు కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల ఫలితంగా బాంద్రాలోని కంగనా కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందని ఆరోపిస్తూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చేందుకు సిద్ధమైయ్యారు. (కంగనాను అరెస్టు చేయకండి: హైకోర్టు) ఈ క్రమంలోనే బీఎంసీ అధికారులు నిర్ణయాన్నీ సవాలు చేస్తూ ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. కూల్చివేతపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. కంగనా కార్యాలయాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో పేర్కొంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై పోరాడి న్యాయస్థానంలో కంగనా విజయం సాధించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
వరవరరావుకు ఊరట
-
వరవరరావుకు ఊరట
ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు(80)కు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ముంబై హైకోర్టు బుధవారం అనుమతించింది. దీంతో 15 రోజులపాటు నానావతి ఆస్పత్రిలో వరవరరావుకు చికిత్స అందించనున్నారు. ఆస్పత్రి నిబంధనల ప్రకారం వరవరరావును కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఉంది. కాగా ఎల్గార్ పరిషత్ కేసులో జైలులోఉన్న తెలుగు కవి వరవరరావు ఆరోగ్యంపై బొంబాయి హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వివరణ ఇచ్చింది. వరవరరావు ఆరోగ్యం బావుందని, మానసికంగా కూడా పూర్తి స్పృహలో ఉన్నారని వివరించింది. అయితే, వరవరరావుకు న్యూరలాజికల్ సమస్య, మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమస్యులున్నాయని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. దీంతో, అన్ని వైద్య పరీక్షలను నిర్వహించి, సమగ్ర వైద్య నివేదికను అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరవరరావు ప్రస్తుతం తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. చదవండి: వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ -
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత రచయిత వరవరరావు (80)కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యుల పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త నవరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తున్నా తన భర్త ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తలోజా జైలులో అమానవీయ పరిస్థితుల్లో వరవరావు మగ్గుతున్నారని ఆమె వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన హక్కులను ఉల్లంఘనకిందికి వస్తుందన్నారు. కాగా భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొంది. జూన్, 2018లో అరెస్టు అయినప్పటి నుండి వరవరావు జైలులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వరవరావు తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. -
అర్నబ్ గోస్వామికి ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై : ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి మరో ఎదురురెబ్బ తగిలింది. 2018 నాటి కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేని స్పష్టం చేసింది. అలాగే హైకోర్టును ఆశ్రయించేముందుగా అలీబాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే ఇప్పటికే అలీబాగ్ సెషన్స్ కోర్టులో అర్నాబ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సంబంధిత పిటిషనపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. (అర్నాబ్ గోస్వామి అరెస్ట్ అన్యాయమేనా!?) ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తన భర్త అరెస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అతని భార్య అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అర్నాబ్‌కు ముంబై పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. -
రిచా దావా: కేఆర్కే న్యాయవాది వివరణ
ముంబై: లైంగిక ఆరోపణలు నేపథ్యంలో నటి రిచా చద్ధాపై వివాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నటి పాయల్ ఘోష్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ముంబై హైకోర్టు పాయల్ క్షమాపణ అంగీకరించి ఇకపై రిచాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వును జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులు ఏబీఎన్‌కు, వివాదాస్పద నటుడు కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్కేను ఉద్దేశిస్తూ జారీ చేసింది. అంతేగాక దీనిపై ఏబీఎన్, కమల్ రషీద్‌లు వివరణ ఇవ్వాలని నాలుగు వారాల గుడువు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం కమల్ తరపు న్యాయవాది బుధవారం స్పందించారు. ‘రిచాపై పరువు నష్టం కలిగించేలా బహిరంగంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన దీనిపై బహిరంగ ప్రకటన కూడా చేయనున్నట్లు వెల్లండించారు. (చదవండి: రిచాను క్షమాపణలు కోరిన పాయల్) దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడంటూ నటి పాయల్ ఘోష్ గత నెలలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రిచా చద్ధాతో పాటు మరో ఇద్దరూ నటీనటులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీంతో చద్ధా, పాయల్‌పై పరువు నష్టం దావా వేస్తూ నోటీసుల జారీ చేశారు. దీంతో గత వారం పాయల్ ముంబై కోర్టులో బహిరంగంగా తను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, బేషరతుగా రిచాను క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. పాయల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసిందంటూ చద్ధా బుధవారం ట్వీట్ చేశారు. (చదవండి: నా పేరెందుకు వాడారు?: నటి) -
నా వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. క్షమాపణలు
ముంబై: లైంగిక ఆరోపణల నేపథ్యంలో నటి రిచా చద్ధాపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, బేషరతుగా ఆమెను క్షమాపణలు కోరుతున్నాని నటి పాయల్ ఘోష్ ముంబై హైకోర్టుతో పేర్కొన్నారు. రిచా కూడా క్షమాపణలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా బాధపెట్టాడని ఇటీవల పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి రిచాపై పాయల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై పాయల్ నిరాధారమైన వ్యాఖ్యలు చేసిందంటూ చద్ధా గత వారం ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాయల్ తన న్యాయవాది నితిన్ పాట్పుట్... హైకోర్టులో విచారణకు జస్టిస్ మీనన్ ఎదుట హాజరయ్యారు. రిచాపై చేసిన వ్యాఖ్యలకు పాయల్ చింతిస్తున్నట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఆమెను కించపరిచేందుకు చేసిన వ్యాఖ్యలు కాదన్నారు. పాయల్, రిచా అభిమాని అని, ఆమెను గౌరవిస్తున్నారని చెప్పారు. ఏ స్త్రీని కించపరచాలన్న ఉద్దేశం పాయల్‌కు లేదని నితిన్ పేర్కొన్నారు.(చదవండి: నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా) తాము పాయల్ క్షమాపణలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి నష్టపరిహారాన్ని పొందే ఆలోచన లేదని రిచా న్యాయవాది వీరేంద్ర తుల్జాపూర్కర్, సవీనా బేడీ సచార్‌లు కోర్టుకు వెల్లడించారు. అనంతరం రెండు పార్టీలు సమ్మతి నిబంధనలను అక్టోబర్ 12న కోర్టులో సమర్పించాల్సి ఉంటుందని జస్టిస్ మీనన్ చెప్పారు. రిచాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా ఇకపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వును జారీ చేశారు. అయితే ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ నటి పాయల్ ఘోష్ సబర్బన్ వెర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నటి రిచాతో పాటు మరో ఇద్దరూ మహిళా నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: నా పేరెందుకు వాడారు?: నటి) (చదవండి: ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్) -
రియాకు బెయిల్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియాచక్రవర్తికి ముంబై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 28 రోజుల జైలు జీవితం తరువాత, రియా చక్రవర్తి బైక్యులా మహిళా జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. రూ.1లక్ష వ్యక్తిగత బాండు, ప్రతిరోజూ పోలీస్ స్టేషన్లో సంతకం చేయడం, ఆరు నెలల పాటు, ప్రతినెలా ఒకటవ తారీకున ఎన్సీబీ ముందు హాజరుకావడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేయరాదని హైకోర్టు షరతులు విధించింది. రియా ఎన్సీబీ అనుమతి లేకుండా, ముంబై వీడి వెళ్ళరాదని, విదేశాలకు వెళ్ళాలనుకుంటే స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు షరతులు విధించింది. రియాకు నేర చరిత్ర లేదని, కనుక రియా సాక్ష్యాలను తారుమారు చేస్తారని తాము భావించడం లేదని బెయిలు ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానమేనని, సెలబ్రిటీలకీ, రోల్ మోడల్స్కీ ప్రత్యేక హక్కులేవీ ఉండవని హైకోర్టు వ్యాఖ్యానించింది. రియా విడుదల సందర్భంగా, మీడియా ఆమె వెంటబడటం, ఆమె వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించడం సహించబోమని ముంబై పోలీసులు మీడియాని హెచ్చరించారు. రాజ్‌పుత్ వ్యక్తిగత సహాయకులు దీపేష్ సావంత్, సామ్యూల్ మిరిండాలకు హైకోర్ట్ బెయిలు మంజూరు చేసింది. రియా సోదరుడు షోవిక్, డ్రగ్ స్మగ్లర్ అబ్దెల్ బాసిత్ పరిహార్‌లకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. -
రియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ విచారణను ముంబై హైకోర్టు బుధవారం వాయిదా వేసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బాంబే హైకోర్టు సెలవులో ఉంది. దీంతో రేపు(గురువారం) బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. నేడు రియా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసినట్లు బాంబే హైకోర్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటల్లో 173 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నాయరో కోవిడ్-19 ఆస్పత్రి నీట మునిగింది. వర్షం కారణంగా ముంబైలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు నిలవడంతో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. చదవండి: (రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా) -
హైకోర్టు ఆగ్రహం: వారికి అనుమతించిన మహారాష్ట్ర
ముంబై: చలనచిత్ర, టీవీ పరిశ్రమలో పనిచేసే 65 ఏళ్లకు పైబడిన నటీనటులు యధావిధిగా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో చైల్డ్ ఆర్టిష్టులు, సీనియర్ సిటిజన్లు అవుట్ డోర్ షూటింగ్లో పాల్గొనడానికి వీలు లేదని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం వారి కుటుంబాలకు ఆర్థిక సవాలుగా మారింది. ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రమోద్ పాండే అనే సీనియర్ నటుడు జూలై 21 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇటీవల ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను ముంబై హైకోర్టు రద్దు చేసింది. 65 ఏళ్లు పైబడిన నటులను షూటింగ్‌లకు అనుమతించకపోవడం వెనుక ఉన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వివరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. (చదవండి: మహారాష్ట్రలో 10,163 మంది పోలీసులకు కరోనా) అయితే కరోనా నేపథ్యంలో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బందిని షూటింగ్లో పాల్గొనడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రమోద్ పాండే పిటిషన్‌పై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక సీనియర్ సిటిజన్ తన దుకాణం తెరిచి రోజంతా కూర్చోవడానికి అనుమతి ఉన్నప్పుడు.. 65 ఏళ్లు పైబడిన నటీనటులు బయటకు వెళ్లకుండా ఏ ప్రాతిపదికన నిరోధించారని పేర్కొంది. ఇది వివక్ష చూపేదిగా ఉందంటూ ప్రభుత్వ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టు ఆదేశం మేరకు సీనియర్ సిటిజన్లు తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. (చదవండి: కరోనా: 38 శాతం ఐదు రాష్ట్రాల నుంచే!) -
చార్జర్స్‌కు రూ. 4,800 కోట్లు చెల్లించండి...
ముంబై: ఐపీఎల్ నుంచి దక్కన్ చార్జర్స్ (డీసీ) జట్టును తొలగించడంపై ముంబై హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ శుక్రవారం ఇచ్చిన తీర్పు బోర్డుకు ప్రతికూలంగా వెలువడింది. నష్టపరిహారంతో పాటు ఇతర ఖర్చుల కింద డీసీ యాజమాన్యానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ. 4,800 కోట్లు చెల్లించాలని హైకోర్టు మధ్యవర్తి రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ ఆదేశించారు. 2012 నుంచి సాగిన ఈ వివాదంలో చివరకు హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ పైచేయి సాధించింది. ఈ ఉత్తర్వులను బీసీసీఐ హైకోర్టులో సవాల్ చేసే అవకాశముంది. నేపథ్యమిది... ఐపీఎల్లో 2008 నుంచి 2012 వరకు ఐదేళ్ల పాటు దక్కన్ చార్జర్స్ జట్టు కొనసాగింది. 2009లో టీమ్ చాంపియన్‌గా కూడా నిలిచింది. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) కంపెనీ ఈ టీమ్‌ను ప్రమోట్ చేసింది. అయితే 2012లో రూ.100 కోట్ల బ్యాంకు గ్యారంటీని చూపించడంలో విఫలమైందంటూ బీసీసీఐ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాతి పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. వివరణ కోసం చార్జర్స్‌కు 30 రోజుల గడువు ఇచ్చినా అది పూర్తి కాకముందే టీమ్‌ను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత ఇదే జట్టు స్థానంలో 2013 సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. కోర్టుకెక్కిన చార్జర్స్... తమ జట్టును రద్దు చేయడం అక్రమమని డీసీహెచ్ఎల్ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన జట్లను జరిమానావంటి స్వల్ప శిక్షలతో సరిపెట్టిన బోర్డు చిన్న తప్పుకే తమ జట్టును తొలగించడం అన్యాయమని వాదించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒప్పందం ప్రకారం బాంబే హైకోర్టు ఆదేశాలతో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీకే ఠక్కర్ మధ్యవర్తిగా వాదనలు మొదలయ్యాయి. నష్టపరిహారం, వడ్డీ, ఇతర ఖర్చుల కింద తమకు రూ. 8 వేల కోట్లు చెల్లించాలని దక్కన్ చార్జర్స్ కోరింది. అయితే ఫ్రాంచైజీ ఫీజు కింద మిగిలిన ఐదేళ్లకు కలిపి రూ. 214 కోట్లు డీసీ తమకు చెల్లించాలని బోర్డు కౌంటర్ వేసింది. చివరకు శుక్రవారం ఆర్బిట్రేటర్ తుది తీర్పు వినిపించారు. జట్టును రద్దు చేయడం సరైంది కాదంటూ నష్టపరిహారంగా రూ. 4,814.67 కోట్లతో పాటు ఆర్బిట్రేషన్ మొదలైన 2012నుంచి ఏడాదికి 10 శాతం వడ్డీ, ఖర్చులకు మరో రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. భారీ మొత్తం కాబట్టి బీసీసీఐ హైకోర్టుకు వెళ్లనుంది. తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సీఈఓ హేమంగ్ అమీన్ స్పష్టం చేశారు. -
అర్నాబ్ గోస్వామికి ఊరట
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై నమోదైన రెండు కేసులను కొట్టివేస్తూ ముంబై హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనకు రక్షణ కల్పించాలని కోరింది. పాల్ఘర్ లించింగ్, వలసకూలీలలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అర్నాబ్‌పై కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్, రియాజ్ చాగ్లాతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. విద్వేశాలు రెచ్చగొట్టేలా అర్నాబ్ ప్రయత్నించినట్లు ఎక్కడా కనిపించలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దాఖలైన రెండు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఓ జర్నలిస్టుకు మతపరమైన సంఘటనలపై విశ్లేషించే హక్కు ఉందన్న అర్నాబ్ తరపు న్యాయవాదుల వాదనను సైతం కోర్టు అంగీకరించింది. సామాజిక అంశాలపై జరిపిన చర్చలో అర్నాబ్ తన వృత్తిధర్మాన్ని పోషించారని న్యాయవాదులు హరీష్ సాల్వే , మిలింద్ సాతే కోర్టుకు వివరించారు. (రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు ) View this post on Instagram ✌️✌️ #republictv A post shared by Arnab Goswami (@arnab_goswami_republictv) on Jun 30, 2020 at 2:16am PDT వివరాల్లోకి వెళితే.. పాల్ఘర్ మూకదాడికి సంబంధించి అర్నాబ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దేశవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో అర్నాబ్ సుప్రీంను ఆశ్రయించగా అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై స్టే విధించకుండా ముంబైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. మరోవైపు బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు గుమిగూడటంపై ప్రసారం చేసిన కథనంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏప్రిల్ 22, మే 2న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తాజా తీర్పుతో అర్నాబ్‌కు ఊరట లభించినట్లైంది. (చైనాలో మన న్యూస్ సెన్సార్ ) -
విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నాం
ముంబై: 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతకు సంబంధించి దేశ, విదేశాల్లోని విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నట్లు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఐఎస్‌సీఈ)బోర్డు తెలిపింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ఐఎస్ఈసీ 10, 12వ తరగతి పరీక్షలు జరపాలని నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ముంబై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐఎస్ఈసీ.. లాక్డౌన్ సమయానికి రాయగా మిగిలిన సబ్జెక్టులకు జూలైలో పరీక్షలు రాయడం లేదా ప్రి–బోర్డు పరీక్షలు/ అంతర్గత అంచనా ద్వారా మార్కులు వేసే విధానానికి అంగీకరించడం.. ఈ రెండింటిలో తమకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకునే వీలుంటుందని తెలిపింది. ఈ విషయాన్ని స్కూళ్లకు తెలిపామని, విద్యార్థుల నుంచి ఆప్షన్లు అందాక ఆ మేరకు 22వ తేదీ కల్లా ఒక అంచనాకు వస్తామని పేర్కొంది. విద్యార్థుల ప్రి–బోర్డు పరీక్షల ఫలితాలు/అంతర్గత అంచనా మార్కులను ఇప్పటికే పాఠశాలల నుంచి తెప్పించుకున్నట్లు వెల్లడించింది. లాక్డౌన్ విధించడంతో 10, 12వ తరగతి ఫైనల్ పరీక్షలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో మిగిలిన పరీక్షలను జూలైలో జరిపేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. -
మృతదేహాల ద్వారా కరోనా వ్యాపించదు
ముంబై : కరోనా వైరస్ బాధితుల మృతదేహాలను పూడ్చేందుకు అవసరమైన శ్మశాన వాటికలను గుర్తించే అధికారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఉందని ముంబై హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శవాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారలు లేవని న్యాయస్థానం పేర్కొంది. కరోనా కారణంగా మరణించిన వ్యక్తుల మృతదేహాలను పూడ్చేందుకు 20 శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ముంబై కార్పొరేషన్ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. (వలస కార్మికులకు అండగా హైకోర్టులు) అయితే బీఎంసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సబర్బన్ బాంత్రా నివాసి ప్రదీప్ గాంధీ ఏప్రిల్ 9న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్ఎస్ షిండేలతో కూడిన ధర్మాసనం కరోనా మృతదేహాల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేనందున పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. (డబ్ల్యూహెచ్ఓలో కీలక బాధ్యతలు చేపట్టిన భారత్) బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ప్రకటన చట్టానికి అనుగుణంగానే ఉందని, కరోనా రోగుల మృతదేహాలను పూడ్చేందుకు కావాల్సిన శ్మశానవాటికలను గుర్తించడానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు అధికారం ఉందని కోర్టు తీర్పు వెల్లడించింది. కరోనా సోకిన మృతదేహాలను సురక్షితంగా పూడ్చేందుకు కార్పొరేషన్, ఇతర అధికారులు భారత ప్రభుత్వం అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. (పలాసలో బుక్‌చేస్తే.. ఢిల్లీలో గుర్తించారు) -
కార్పొరేటర్ హత్య.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ముంబై: ముంబై మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీకి ముంబై హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన కార్పొరేటర్ హత్య చేసులో అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ మేరకు దిగువ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సోమవారం హైకోర్టు సమర్థించింది. హత్యకేసులో దాదాపు 11 ఏళ్లుగా నాగపూర్ సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కార్పొరేటర్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినందుకు అరుణ్ మరణించే వరకు జైలు జీవితం గడపాలని కోర్టు తీర్పును వెలువరించింది. కాగా 2008లో హత్య రాజకీయ వివాదంలో శివసేన కార్పొరేటర్‌ను గావ్లీ హత్య చేసిన విషయం తెలిసిందే. ముంబైలో డాన్‌గా పేరొందిన ఆయన.. తొలుత శివసేనలో చేరి రాజకీయంగా ఎదగాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే కొద్ది కాలంలోనే ఆయన శివసేన నుంచి బహిష్కరణకు గురికావడంతో.. అఖిల భారతీయ సేన పేరుతో ఓ పార్టీని స్థాపించాడు. అదే పార్టీ నుంచి పోటీ చేసి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అనంతరం 2008లో పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. తాజా శిక్షతో జీవితాంతం జైలు జీవితానికే పరిమితం కానున్నాడు. -
అనూహ్య హత్యకేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు
-
వివాదంలో షారూఖ్ ‘జీరో’
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జీరో. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న షారూఖ్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. బాద్షా మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్ కారణంగానే ఇప్పుడు ఈ సినిమా కష్టాల్లో పడింది. ట్రైలర్లో చూపించిన ఓ సీన్లో షారూఖ్ బనియన్, షార్ట్ ధరించి సిక్కులు పవిత్రంగా భావించే కిర్పన్‌ను పట్టుకోవటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ అనే న్యాయవాధి ఆ సీన్‌ను తొలగించాలంటూ షారూఖ్‌తో పాటు చిత్రయూనిట్‌పై ముంబై హైకోర్ట్‌లో పిటీషన్ వేశారు. అంతేకాదు జీరో సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపాలని, ఒక వేళ ఇప్పటికే ఇచ్చి ఉంటే వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. పిటీషన్‌ను విచారణకు సీక్వరించిన కోర్టు నవంబర్ 30న విచారించనున్నట్టు వెల్లడించారు. -
నిజంగా విషాదకరం
ఎవరూ మాట్లాడలేని, ఎవరూ స్వేచ్ఛగా సంచరించలేని ఒక ‘విషాదకర దశ’ను దేశం చూస్తున్న దని బొంబాయి హైకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యానాన్ని ధర్మాగ్రహ ప్రకటనగా భావించాలి. అయిదేళ్లక్రితం మహారాష్ట్రలోని పుణేలో హేతువాది నరేంద్ర దభోల్కర్‌నూ, మూడేళ్లక్రితం అదే రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో మరో హేతువాది గోవింద్ పన్సారేనూ కాల్చిచంపిన ఉదంతాలపై దర్యాప్తుల్లో పురోగతి లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ హైకోర్టు ఈ ఘాటు వ్యాఖ్య చేసింది. ఈ కేసుల దర్యాప్తును ఎడతెగకుండా సాగదీస్తున్న సీబీఐ, ఆ రాష్ట్ర సీఐడీ సంస్థలు ఉన్నత న్యాయస్థానానికి ఈ పరిస్థితిని కల్పించాయి. ఇవి దర్యాప్తును పూర్తి చేసి, నేరగాళ్లను బంధించే ఉద్దేశంలో లేవని, న్యాయస్థానం స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు చేయిస్తే తప్ప తమకు న్యాయం దక్కదని ఆ పిటిషనర్లు విన్నవించుకున్నారు. వారికి మణిపూర్ ఎన్కౌంటర్ల కేసులకు పడుతున్న గతి తెలియదనుకోవాలి. అక్కడ జరిగిన 1,500కుపైగా ఎన్కౌంటర్లపై దర్యాప్తు కోరుతూ ఏడేళ్లక్రితం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపి నిరుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీబీఐ డైరెక్టర్‌ను ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటికి కేవలం నాలుగు కేసుల్లో రెండు చార్జిషీట్లు మాత్రమే సిట్ దాఖలు చేయగలిగింది. ఆ కేసు ల్లోని నిందితులనైనా ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేకపోయారన్న ధర్మాసనం ప్రశ్నకు సీబీఐ దగ్గర జవాబు లేదు. సర్వోన్నత న్యాయస్థానం నిలదీసినందుకు కాబోలు మేజర్ విజయ్ సింగ్ బల్హారా అనే సైనిక అధికారిపై సీబీఐ కేసు దాఖలు చేసింది. 2009లో పన్నెండేళ్ల కుర్రవాడిని అతని తల్లిదండ్రుల కళ్లముందే ఎన్కౌంటర్ పేరుతో కాల్చిచంపిన ఉదంతమిది. దేశంలో అడపా దడపా సాగే ఎన్కౌంటర్లు, లాకప్ డెత్‌లు మన దేశ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ల గురించి సుప్రీంకోర్టు మాత్రమే కాదు... ఐక్యరాజ్యసమితి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మొన్న జూన్‌లో సమితి మానవ హక్కుల మండలి ‘కావాలని, అనుచితంగా, అకారణంగా’ ఈ కేసుల దర్యాప్తును సాగదీస్తున్నారని కటువుగా విమర్శించింది. దేశంలో ఎన్కౌంటర్లు, లాకప్‌డెత్‌లు లేని రాష్ట్రాలు దాదాపు ఉండవు. కానీ 2008–09లో మణిపూర్ అన్ని రాష్ట్రాలనూ తలదన్నిందని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత స్థానం ఉత్తరప్రదేశ్‌ది. 89 ఎన్కౌంటర్ కేసులపై నిరుడు డిసెంబర్ ఆఖరికి దర్యాప్తు పూర్తికావాలని సుప్రీంకోర్టు గడువునిస్తే ఆ సమయానికి దర్యాప్తు సంగతలా ఉంచి, కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత ఆ గడువు మొన్న ఫిబ్రవరికి మారింది. కానీ మార్చి 12 నాటికి 42 కేసుల నమోదు మాత్రమే పూర్తయింది. కనీసం జూన్ నెలాఖరుకు 50 కేసుల్లో అయినా దర్యాప్తు పూర్తికావాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే జూలై 2న హాజరైన సీబీఐ అధికా రులు కేవలం నాలుగు కేసుల్లో దర్యాప్తు పూర్తిచేశామని విన్నవించారు. ఆ కేసుల్లో ఏ ఒక్కరూ అరెస్టు కాలేదని తాజాగా వెల్లడైంది. లాకప్ డెత్‌ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. నిరుడు ఏప్రిల్ నుంచి మొన్న ఫిబ్రవరి వరకూ దేశంలో మొత్తం 1,674 లాకప్ మరణాలు సంభవించాయని ఆసియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్(ఏసీహెచ్ఆర్) గత నెలలో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారత్‌లో రోజుకు సగటున అయిదు లాకప్ డెత్‌లు జరుగుతున్నాయని సంస్థ లెక్కే సింది. చిత్రమేమంటే మన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసే గణాం కాల్లో ఈమధ్యవరకూ లాకప్ మరణాల ప్రస్తావన ఉండేది కాదు. అవి సర్వసాధారణంగా అనా రోగ్యం, ఆత్మహత్య, కస్టడీనుంచి అదృశ్యం కావటం, నిందితుణ్ణి తరలిస్తుండగా చనిపోవటం వంటి ఖాతాల్లో పడటం ఆనవాయితీ. ఎన్కౌంటర్ మరణాలైతే హక్కుల సంఘాల దృష్టికొస్తాయి. చివరకు ఏమవుతాయన్న సంగతలా ఉంచి కనీసం న్యాయస్థానాల్లో ఆ మరణాలపై విచారణ కోరుతూ పిటిషన్లు దాఖ లవుతాయి. కానీ లాకప్ డెత్‌లు అలా కాదు. మరీ ప్రాముఖ్యత సంతరించుకున్న కేసులైతే చెప్పలేంగానీ చాలా కేసుల్లో చివరివరకూ పట్టుదలగా పోరాడేవారుండరు. ఎందుకంటే వీటిల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు పూటకు గతి లేని, రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగు కులాలకు చెందినవారే. వారి తల్లిదండ్రులైనా, బంధువులైనా కూలి పనులు మానుకుని న్యాయస్థానాల చుట్టూ తిరిగే పరిస్థితిలో ఉండరు. ఉన్నా వారికి బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తుంటాయి. కేరళలో ప్రభావతి అనే ఒక తల్లి తన కుమారుడి లాకప్ మరణంపై పట్టుదలగా పోరాడి నిందితులకు సీబీఐ కోర్టులో ఈమధ్యే ఉరిశిక్ష పడేలా చూసిన ఉదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఆ తల్లి పట్టుదలగా పోరాడిన వైనం గమనిస్తే అదే రాష్ట్రంలో 1976లో ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో పోలీసుల చేతుల్లో అదృశ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్, అతని ఆచూకీ చెప్పాలంటూ 2006లో తుది శ్వాస విడిచేవరకూ పోరాడిన అతని తండ్రి ప్రొఫెసర్ ఎచెరా వారియర్ గుర్తుకొస్తారు. అంతం తమాత్రం చదువుకొని ఆయాగా పనిచేస్తున్న ఒంటరి మహిళ ప్రభావతి 2005లో తన ఒక్కగానొక్క బిడ్డను పోలీసులు కొట్టి చంపారని తెలిసినప్పటినుంచీ మొండిగా పోరాడింది. గూండాల నుంచి బెదిరింపులొచ్చినా, రోడ్డు ప్రమాదంలో హతమార్చే ప్రయత్నం జరిగినా, డబ్బు ముట్టజెబుతా మని ఆశ చూపినా తన సంకల్పం వీడలేదు. కానీ ఇంత సాహసికంగా, ఇంత నిర్భీతితో పోరాడటం అందరికీ సాధ్యమయ్యే పనేనా? ఈ ఎన్కౌంటర్లు, లాకప్ మరణాలు అంతర్జాతీయంగా మనల్ని నగుబాటుపాలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. ఈ ఉదంతాలను పాలకులు నివారించలేకపోతే పోయారు... ఇప్పటికైనా మేల్కొని కనీసం త్వరితగతిన దర్యాప్తు పూర్తయ్యేలా, నిందితులకు శిక్షలు పడేలా చూడకపోతే ఈ ఘటనలకు వారి పరోక్ష ఆమోద మున్నదనే అభి ప్రాయం బలపడుతుంది. -
మల్టీ దోపిడీ
ఐటీ సిటీలో టాకీస్లు పోయాయి, మల్టీప్లెక్స్ స్క్రీన్లు వచ్చాయి. ఒక్కసారిసరదాగా వెళ్తే అక్కడి టికెట్లు, తిండి పదార్థాల ధరలు వింటే నిజంగానే సినిమా కనిపిస్తుంది. బిస్కెట్లు, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ వంటి సాధారణ చిరుతిళ్లను 10, 15 రెట్లు అధిక ధరలకు అమ్ముతూ ప్రేక్షకులను నిలువునా దోచుకోవడం మామూలు విషయమే. ఈ పరిస్థితుల్లో ముంబయి హైకోర్టు తీర్పు నగరవాసులకు ఆశాకిరణమైంది. సాక్షి బెంగళూరు: మల్లీప్లెక్స్‌లో బయట ఆహారాన్ని అనుమతించరని విషయం అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్స్‌లో ఏదీ కొనాలన్నా ధరలు ఆకాశంలో ఉంటాయి. సరదాగా కుటుంబంతో కలసి సినిమా చూద్దామని వెళితే అక్కడ దొరికే చిరుతిండ్లను కొనాలంటే గుండెలు అవిసిపోతాయి. అలా అని ఇంటి నుంచో, బయట నుంచో ఆహారాన్ని తెచ్చుకుంటే లోపలికి అనుమతించరు.. దీంతో చేసేదేమీ అయిష్టంగానే అంతంత ధరలను భరించి మల్టీప్లెక్స్‌లోనే ఆహారాన్ని సినీ ప్రియులు కొంటుంటారు. అయితే ఇటీవల ముంబైలోని మల్టీప్లెక్స్‌లో బయట తిండి, కూల్‌డ్రింక్స్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ముంబయి హైకోర్టు ఏం చెబుతోంది ముంబయి హైకోర్టు ఆదేశాలనుసారం మహారాష్ట్ర ప్రభుత్వం మల్టీప్లెక్స్ థియేటర్లలోకి ప్రేక్షకులు బయటి నుంచి ఆహారాన్ని తీసుకెళ్లేలా నిబంధనలను సవరించింది. దీనివల్ల ప్రేక్షకులకు వేలాది రూపాయలు ఆదా కానున్నాయి. అలాంటి నిబంధనలేవీ బెంగళూరులని మల్టీప్లెక్స్‌లో లేనందువల్ల సినిమాలు చూసేందుకు వెళ్లే సినీప్రియులు అక్కడ లభించే ఖరీదైన స్నాక్స్‌ను కొనాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అయితే అక్కడి ధరలు వింటే ఎవరైనా హడలిపోతారు. నలుగురితో కూడిన కుటుంబం వెళ్తే స్నాక్స్‌కు కనీసం రూ.3 వేలు చెల్లించుకోవాల్సిందే. కాఫీ– రూ. 120, పాప్‌కార్న్ రూ.270 ♦ బెంగళూరులోని ఏదైనా ఒక హోటల్లో కాఫీ ధర రూ. 10 నుంచి రూ. 20 వరకు ఉంటోంది. కానీ మల్టీప్లెక్స్‌లో ఓ కప్పు కాఫీ ధర రూ. 120 చెల్లిస్తే కానీ దొరకడం లేదు. ♦ మల్లీప్లెక్స్‌లో మినీ పాప్‌కార్న్ కనీస ధర రూ. 270. ♦ ఇక మీడియం సైజు పాప్ కార్న్ ధర రూ. 360 కాగా, బకెట్ పాప్‌కార్న్ రూ. 470గా ఉంది. ♦ కూల్‌డ్రింక్స్ ధరలు వింటే అంతే. 900 మిల్లీలీటర్ కలిగిన కూల్‌డ్రింక్ ధర రూ. 170 కాగా, 650 మిల్లీలీటర్ల శీతల పానీయం ధర రూ. 160గా ఉంది. బయట షాపులో ఇవి రూ.80 లోపే లభిస్తాయి. ♦ 100 గ్రా ఫ్రెంచ్ ప్రైస్‌ను ఆన్లైన్లో రూ. 100–రూ. 120 మధ్య లభిస్తుంటే అదే మల్టీప్లెక్స్‌లో దాని ధర రూ. 160ను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ♦ అర్ధలీటర్ బిస్లరీ మినరల్ వాటర్ బాటిల్ ధర కేవలం రూ. 10. లీటరు ధర రూ. 19, రెండు లీటర్ల ధర రూ. 28. మల్టీప్లెక్స్‌లో హాఫ్ లీటర్ వాటర్ బాటిల్‌కు రూ. 40– 60 చెల్లించాలి. -
వాట్సాప్ నోటీసులపై కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ముంబై: లీగల్ నోటీసులపై ముంబై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇక మీదట నేరుగా లేదా పోస్టు ద్వారానే కాకుండా సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఈమెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా పంపిన లీగల్ నోటీసులకు చట్టబద్ధత ఉంటుందని ప్రకటించింది. ఎస్బీఐ, ముంబైకి చెందిన రోహిత్ జాదవ్ కేసులో కోర్టు ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం లేదంటూ ముంబైకి చెందిన రోహిత్ జాదవ్‌పై ఎస్బీఐ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. అతనికి లీగల్ నోటీసులు పంపించింది. అయితే జాదవ్ ఆ నోటీసులకు స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా జవాబు ఇవ్వలేదు. దాంతో, లీగల్ నోటీసులు పంపించామనీ, కోర్టుకు హాజరు కావాలని వాట్సాప్‌లో జాదవ్‌కు సమాచారం ఇచ్చింది. కోర్టుకు హాజరుకావాల్సిన తేదీని పేర్కొంటూ వాట్సాప్‌లో పీడీఎఫ్ ఫైల్ పంపింది. చూశాడు... అయినా స్పందించలేదు..! తాము వాట్సాప్‌లో పంపిన పీడీఎఫ్ ఫైల్‌ను జాదవ్ చూశాడనీ, అయినా ఎలాంటి జవాబు ఇవ్వలేదని ఎస్బీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. ఎస్బీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు.. సదరు రుణ ఎగవేతదారు వాట్సాప్‌లో పంపిన మేసేజ్‌ను ఓపెన్ చేసినట్లు యాప్ సమాచారంలో ఉన్న ‘బ్లూ టిక్’ను చూస్తే స్పష్టమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఐటీ చట్టంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రిజిస్ట్రర్ పోస్టు, నేరుగా పంపిన నోటీసులతో పాటు వాట్సాప్, ఈమెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా పంపిన నోటీసులు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. దీంతో రోహిత్ కోర్టులో హాజరు కావాలని, ఎస్బీఐకు చెల్లించాల్సిన బిల్లును వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. లేకపోతే జైలుకి పంపాల్సి వస్తుందని హెచ్చరించింది. -
‘దళిత్’ మాటను వాడొద్దని చెప్పండి
ముంబై: ‘దళిత్’ అనే మాటను మీడియాలో వాడకుండా తగు సూచనలు చేయాలని ముంబై హైకోర్టు కేంద్ర సమాచార ప్రసార శాఖను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ పత్రాలు, ఉత్తరప్రత్యుత్తరాల్లో ‘దళిత్’ పదాన్ని తొలగించాలంటూ పంకజ్ మెష్రాం అనే వ్యక్తి వేసిన పిల్‌ను ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ విచారించింది. ‘దళిత్’కు బదులు ‘షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి’ అని పేర్కొనాలంటూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్లు జారీ చేసిందని పిటిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మీడియా కూడా దళిత్ అనే మాట వినియోగించకుండా చూడాలని కోరారు. స్పందించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రెస్ కౌన్సిల్‌కు, మీడియాకు కూడా ‘దళిత్’ అనే మాట వాడరాదని సూచనలు ఇవ్వడం సబబని భావిస్తున్నట్లు పేర్కొంది. -
వేకువజామున మూడింటిదాకా కేసుల విచారణ
ముంబై: వేసవి సెలవుల నేపథ్యంలో ముంబై హైకోర్టు జడ్జీలంతా సాయంత్రం ఐదింటికి విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోగా ఒక్కరు మాత్రం తెల్లవారేదాకా కేసుల పరిష్కారంలో తలమునకలై ఉన్నారు. ఆయన.. జస్టిస్ షారుఖ్ జె కథావాలా..! జస్టిస్ కథావాలా శుక్రవారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరై, శనివారం వేకువజాము 3.30 గంటల దాకా కోర్టులో ఉండి, అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన దాదాపు 100 పిటిషన్లను విచారించారని జడ్జి ఒకరు చెప్పారు. గత వారం కూడా ఆయన అర్ధరాత్రి దాకా కేసులు విచారించారని చెప్పారు. ‘జస్టిస్ కథావాలా 3.30దాకా పనిచేసినా ఆయన ముఖంలో ఎలాంటి అలసటా కనిపించలేదు.ఆఖరుగా విచారించిన పిటిషన్లలో నాది కూడా ఒకటి. నా వాదనలను ఆయన చాలా ప్రశాంతంగా, ఓపిగ్గా విని ఉత్తర్వులు జారీ చేశారు’ అని న్యాయవాది ప్రవీణ్ సందాని చెప్పారు. తెల్లవారుజాము దాకా అత్యవసర ఉత్తర్వులను జారీ చేసి వెళ్లిన ఆయన.. తిరిగి శనివారం ఉదయం తన కార్యాలయానికి వచ్చి పెండింగ్ పనులు పూర్తి చేశారని చెప్పారు. మిగతా జడ్జీల కంటే గంట ముందుగా ప్రతిరోజూ ఆయన ఉదయం 10 గంటలకే కోర్టు విధులను ప్రారంభిస్తారు. కోర్టు వేళలు ముగిసేదాకా తన సీటులోనే ఉంటారని కోర్టు సిబ్బంది తెలిపారు. కాగా, ముంబై హైకోర్టుకు ఈనెల 7వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు వేసవి సెలవులున్నాయి. -
అందరినీ అలాగే చూశారా?
ముంబై: రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికీ బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు వర్తింపజేసిన నిబంధనలనే అమలు చేశారా అని ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 1993 ముంబై పేలుళ్ల కేసు నిందితుడు, ప్రముఖ నటుడు సంజయ్ దత్‌కు పలుమార్లు పెరోల్ ఇచ్చి బయటకు పంపటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజోపయోగ పిటిషన్‌పై శుక్రవారం ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. దత్‌కు ఇచ్చిన ప్రతి పెరోల్ విషయంలోనూ ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించిందని అడ్వొకేట్ జనరల్ తెలపగా.. ప్రత్యేక కారణాలుంటేనే పెరోల్ మంజూరవుతుందని, కానీ, కొందరు దానిని హక్కుగా భావిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. -
ముంబై హైకోర్టు సంచలన తీర్పు
⇔ అప్పు తీర్చాలని వేధించడం ఆత్మహత్యకు ప్రేరేపించడమే ముంబై: తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని మాటలతో, శారీరకంగా వేధించడం కూడా ఆత్మహత్యకు ప్రేరేపించడమేనని బాంబే హైకోర్టు ఆదివారం తేల్చి చెప్పింది. గురునాథ్ గావ్లీ, సంగీతా గావ్లీ అనే ఇద్దరు లైసెన్సులున్న రుణదాతలు తమపై దాఖలైన ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉమేశ్ బాంబ్లే అనే ముంబై నగరవాసి వీరి వద్ద రూ.19 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇతను డబ్బు తిరిగివ్వడంలో విఫలమవ్వడంతో వీరిద్దరూ ఇతన్ని మాటలతో వేధించారు. కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులు కూడా చేశారు. దీంతో అతను ఆత్మహత్యాయత్నం చేయడంతో అతని భార్య సునీత వీరిద్దరిపై కేసు పెట్టింది. ప్రతిరోజూ అతన్ని అప్పు కట్టాలని ఒత్తిడి చేయడం ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తిని ఆత్మహత్యాయత్నానికి పురికొల్పిందని న్యాయమూర్తి జస్టిస్ బాడర్ అభిప్రాయపడ్డారు. అతని ఇంట్లో, పనిచేసే ప్రదేశంలో అతన్ని పదేపదే అవమానాలకు గురిచేయడం, భౌతికదాడులు చేయడంతో అతను తీవ్ర మనోవేదనకు లోనయ్యాడని పేర్కొన్నారు. -
దబోల్కర్ హత్య కేసులో తొలి అరెస్టు
ముంబై: హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో సీబీఐ తొలి అరెస్టు చేసింది. హిందూ జనజాగృతి సమితి సభ్యుడు వీరేంద్రసింగ్ తావ్డేను శుక్రవార ముంబై సమీపంలోని పన్వెల్‌లో అదుపులోకి తీసుకుంది. శనివారం మధ్యాహ్నం పుణేలోని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చామని సీబీఐ ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ తెలిపారు. ఆగస్టు 20, 2013న పుణేలో పట్టపగలు దబోల్కర్‌ను దారుణంగా హత్య చేశారు. మే, 2014లో ఈ కేసును ముంబై హైకోర్టు సీబీఐకి అప్పగించింది. గోవాకు చెందిన ‘సనాతన్ సంస్థ’తో జనజాగృతి సమితికి సంబంధాలున్నాయని విచారణలో తేలింది. -
సెన్సారింగ్ మీ పని కాదు
సర్టిఫికేషనే మీ బాధ్యత - సీబీఎఫ్సీపై బాంబే హైకోర్టు మండిపాటు - ఏం చూడాలో ప్రజలను నిర్ణయించుకోనివ్వండి ముంబై: ఉడ్తా పంజాబ్ చిత్రంలో దృశ్యాలను కత్తిరించాలని కేంద్ర ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్సీ) సూచించటంపై ముంబై హైకోర్టు మండిపడింది. చిత్రానికి సర్టిఫికేషన్ ఇవ్వటమే బోర్డు పని అని.. అది వది లేసి సెన్సారింగ్ చేయటం మీ పని కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రం నిజంగానే అభ్యంతరకరంగా, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఉందనుకుంటే.. ఎందుకు దీనిపై నిషేధం విధించలేదో తెలపాలని ఆదేశించింది. ఇదే సమయంలో చిత్ర నిర్మాతలు కూడా బోర్డు సూచించిన అనవసరమైన దృశ్యాలను తొలగించాలని సూచించింది. ప్రజలు ఏం చూడాలనుకుంటున్నారో వారి నే నిర్ణయించుకోనివ్వాలంది. రెండ్రోజులు జరిగిన విచారణను ముగించిన జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, జస్టిస్ శాలిని జోషిల డివిజన్ బెంచ్ సోమవారం తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా సీబీఎఫ్సీ బోర్డుపై కోర్టు మండిపడింది. ‘సర్టిఫికేషన్ ఇవ్వటంలో అతిగా ప్రవర్తిం చొద్దు దీనివల్ల సినిమాల్లోని సృజనాత్మకత చచ్చిపోతుంది. చిత్రంలో పంజాబ్, పంజాబ్‌లోని నగరాల పేర్లను తొలగించాలన్న రివైజింగ్ కమిటీ నివేదిక ప్రకారం ముందుకెళ్తే.. సినిమా అర్థమే మారిపోతుంది. ఓ వ్యక్తి, ఓ ప్రాంతం గురించి నిర్మాతలు విమర్శించాలనుకుంటే దాన్నలాగే చూపించండి. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఉందనిపిస్తే నిషేధించండి’ అని సూచించింది. అనవసర రాద్ధాంతం వల్ల చిత్రానికి అవసరానికి మించిన పబ్లిసిటీ పెంచుతున్నారని తెలిపింది. ‘చిత్ర నిర్మాతలు కూడా అనవసర దృశ్యాలు, అసభ్యపదజాలాన్ని చూపిస్తేనే జనాలకు నచ్చుతుందనుకోవద్దు. నేటి తరం చాలా పరిణతితో ఆలోచిస్తోంది. మంచి కథాంశం లేక ఎన్నో చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోర్లాపడుతున్న విషయాన్ని మరిచిపోవద్దు’ అని సూచించింది. ‘అడల్ట్ విత్ కాషన్’ ఉండాలి: శ్యాంబెనగల్ ముంబై: సినిమాల్లో కేటగిరీల్లో ‘అడల్ట్ విత్ కాషన్’ అనే కేటగిరీ ఉండాల్సిన అవసరం ఉందని సెన్సార్ బోర్డు పనితీరుపై ఏర్పాటైన కమిటీ సారథి దర్శకుడుశ్యామ్ బెనగల్ అభిప్రాయపడ్డారు. పెద్దలకు చెందిన విషయాల తీవ్రత ఎక్కువగా ఉన్న చిత్రాలకు ‘అడల్ట్ విత్ కాషన్’ లేదా ఏ/సీ పేరుతో సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించామన్నారు. అలాగే యూనివర్సల్(యూ)లో ‘యూ/ఏ 12 ప్లస్’, ‘యూ/ఏ 15 ప్లస్’.. ఇలా రెండు కేటగిరీలు ఉండాలని చెప్పామన్నారు. -
‘గోవధపై నిషేధమే.. కానీ బీఫ్ తినొచ్చు’
ముంబై: మహారాష్ట్రలో నిషేధం ఉన్నందున గోవధ తప్పని.. అదే సమయంలో బీఫ్ తినడం తప్పుకాదని శుక్రవారం ముంబై హైకోర్టు శుక్రవారం విచిత్రమైన వ్యాఖ్యలు చేసింది. బీఫ్ అమ్మకాన్ని, గోవధను సంవత్సరం క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అన్ని మతాలు, కులాలు కలసి ఉన్న ముంబై మహానగరంలో ‘ఆహారం’పై నిషేధం విధించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. -
డంపింగ్‌కు స్థలం ఎందుకు లభించట్లేదు?
‘‘నగరంలో మూతపడిన మిల్లు స్థలాల్లో పుట్టగొడుగుల్లా నూతన కట్టడాలు వెలుస్తున్నాయి. అందుకు అవసరమైన స్థలం కావల్సినంత లభిస్తుంది. కానీ ప్రతీ రోజు పోగవుతున్న వేలాది టన్నుల చెత్తను వేసేందుకు అవసరమైన డంపింగ్ గ్రౌండ్లకు మాత్రం స్థలం లభించడం లేదు. పోగైన చెత్తను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందుకు నగరంలో డంపింగ్ ఏర్పాటు చేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు త్వరగా సాధ్యమైనంత స్థలం సమకూర్చి ఇవ్వాలి’’ - ముంబై హైకోర్టు సాక్షి, ముంబై : వాణిజ్య, వ్యాపార సంస్థలు నెలకొల్పేందుకు స్థలం లభిస్తుంది.. కానీ డంపింగ్ గ్రౌండ్లకు స్థలం ఎందుకు లభించడం లేద ని ముంబై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నగరం, ఉప న గరంలోని దేవ్నార్, కాంజూర్‌మార్గ్, ములుండ్ ప్రాంతాల్లోని డంపింగ్ గ్రౌండ్లో పోగైన చెత్తను నిర్వీర్యం చేయడంలో నియమాలు అమలు చేయడం లేదని గతంలో జరిగిన అనేక విచారణల్లో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై న్యాయమూర్తులు అభయ్ ఓక్, అచలియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 10 రోజుల్లో నిర్ణయం తీసుకోండి కాంజూర్మార్గ్లోని డంపింగ్ గ్రౌండ్ సామర ్థ్యం పెంచివ్వాలని బీఎంసీ డిమాండ్ చేసింది. డంపింగ్‌కు అదనంగా స్థలం సమకూర్చి ఇచ్చే అంశం కూడా ప్రభుత్వం వద్ద పెండింగులో ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదన సీంఎ దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. కాగా, ప్రస్తుతం నగరం, పట్టణాల్లోని అన్ని డంపింగ్ గ్రౌండ్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే నూతన కట్టడాలకు మంజూరునిచ్చే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని బెంచి స్పష్టం చేసింది. అయినప్పటికి డంపింగ్ గ్రౌండ్‌కు స్థలం సేకరించలేకపోయాయి. ములుండ్, దేవ్నార్ డంపింగ్ గ్రౌండ్లో చెత్త వేసేందుకు గడువు ఈ ఏడాది నవంబరు వరకు ఉంది. ఆ తరువాత పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంజూర్‌మార్గ్ డంపింగ్ గ్రౌండ్లో రోజూ 3,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుంది. మిగతా డంపింగ్ గ్రౌండ్లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. సామర్థ్యానికి మించి చెత్త పోగవుతున్నప్పటికీ ఏ డంపింగ్ గ్రౌండ్లో కూడా నియమాలను పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. -
మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం తొలగింపు
ముంబయి : సంచలనం రేపిన మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తుల నిషేధం కేసులో నెస్లే సంస్థకు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మ్యాగీ నూడుల్స్‌పై కోర్టు నిషేధాన్ని తొలగించింది. ఆరు వారాల పాటు మ్యాగీపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు కోర్టు గురువారం వెల్లడించింది. అలాగే మ్యాగీ నూడుల్స్ ను మరోసారి తాజాగా పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. మ్యాగీ నిషేధం విషయంలో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. మ్యాగీలో లెడ్ ధాతువులు పరిమితికి మించి ఉన్నాయన్న ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఆరు వారాల్లో ప్రతి అయిదు శ్యాంపుల్స్ను ...మూడు ల్యాబ్‌ల్లో పరీక్షలకు పంపించాలని నెస్లే కంపెనీని బాంబే హైకోర్టు ఆదేశించింది. ల్యాబ్ నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది. అంతేకాకుండా అప్పటివరకూ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను, తయారీ చేయకూడదని కోర్టు ఆదేశించింది. కాగా హైదరాబాద్, జైపూర్, మొహాలీ ల్యాబ్‌లలో మ్యాగీకి పరీక్షలు నిర్వహించనున్నారు. -
'ఆరోజు జరిగింది కేవలం యాక్సిడెంటే'
ముంబయి : హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై అతని తరపు న్యాయవాది అమిత్ దేశాయి వాదనలు వినిపించారు. ఈ కేసు వివరాలను ఆయన శుక్రవారం ముంబై హైకోర్టు జడ్జి ముందు ఉంచారు. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలని అమిత్ దేశాయి ఈ సందర్భంగా జడ్జిని కోరారు. ఆ రోజు జరిగింది కేవలం యాక్సిడెంట్ మాత్రమే అని, చావుకు కారణమయ్యారనే అభియోగాలను తొలగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్ ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కాగా ఈ కేసులో నాలుగో వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, సల్మాన్‌తో పాటు కారులో ఉన్న బంధువు కమాల్ ఖాన్ వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదనే అంశాన్ని అమిత్ దేశాయి లేవనెత్తారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు వ్యక్తులున్నారన్నారు. నలుగురు కూడా ప్రత్యక్ష సాక్షులని, దీనిని కింద కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పోలీస్ అధికారుల ముందు ఇచ్చిన సాక్ష్యాలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 90 నుంచి 100 కిలోమీరట్ల వేగంగా ప్రయాణించిందని సాక్షి చెబుతున్నారని, అయితే హోటల్ నుంచి ఘటనా స్థలానికి రావటానికి 30 నిమిషాలు పట్టిందని, దూరం 14 కిలోమీటర్ల మాత్రమే అన్నారు. సల్మాణ్ ఖానే కారు నడుపుతున్నారని ఎవరూ నిరూపించలేకపోయారని అమిత్ దేశాయి వాదనలు వినిపించారు. అనంతరం ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే వాదనలు ప్రారంభం అయ్యాయి. -
'సల్మాన్ పారిపోయే మనిషి కాదు'
-
సల్మాన్ ఇంటికి పోటెత్తిన అభిమానులు
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి అభిమానులు పోటెత్తారు. సల్మాన్ బెయిల్ పిటీషన్ ముంబై హైకోర్టులో ఈ రోజు విచారణకు రానుండటంతో.. ఆయనకు మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బాంద్రాలోని సల్మాన్ ఇంటి ముందు గుమిగూడారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. రాజకీయ, సినీ ప్రముఖులు సల్మాన్‌ను పరామర్శించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, బాలీవుడ్ ప్రముఖులు ఆమీర్ ఖాన్, కరీనా కపూర్, సోనాక్షి సిన్హా, కరణ్ జోహార్ సల్మాన్ ఇంటికి వచ్చారు. సల్మాన్ ఈ రోజు ఇంట్లోనే ఉన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది. బెయిల్ గడువు ఈ రోజుతో ముగియనుంది. హైకోర్టు సల్మాన్‌కు బెయిల్ ను పొడగిస్తుందా లేదా అన్న విషయం కాసేపట్లో తేలనుంది. -
సల్మాన్‌కు బెయిలా? జైలా?
-
'సల్మాన్ పారిపోయే మనిషి కాదు'
ముంబయి : హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు జైలా...బెయిలా అనే అంశంపై ముంబయి హైకోర్టు నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో వేరేకేసు విచారణ ఉన్నందున సల్మాన్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఇవాళ హైకోర్టుకు హాజరు కావటం లేదు. దాంతో సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించనున్నారు. కాగా అయిదేళ్లకు పైగా జైలు శిక్ష పడినవాళ్ల అప్పీల్ పిటిషన్‌పై నిర్ణయానికి కొంత సమయం పడుతుందని సీనియర్ క్రిమినల్ న్యాయవాది మజీద్ మెమన్ పేర్కొన్నారు. ఈలోగా దోషిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. సల్మాన్ పారిపోయే మనిషి కాదు అని మజీద్ మెమన్ వ్యాఖ్యానించారు. 2002లో ముంబైలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి తన వాహనంతో దూసుకెళ్లి ఒకరి మృతికి కారణమైన కేసులో సల్మాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌పై నమోదు చేసిన అభియోగాలన్నీ రుజువయ్యాయని స్పష్టం చేసింది. దాంతో అతనికి ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. -
సల్మాన్‌కు బెయిలా? జైలా?
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరవుతుందా? లేక జైలుకెళ్లాలా అన్న విషయం ఈ రోజు తేలనుంది. శుక్రవారం ముంబై హైకోర్టు సల్మాన్ బెయిల్ పిటీషన్ ను విచారించనుంది. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించనున్నారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది. బెయిల్ గడువు ఈ రోజుతో ముగియనుంది. హైకోర్టు సల్మాన్‌కు బెయిల్ ను పొడగిస్తుందా లేదా అన్న విషయం కొన్ని గంటల్లో తేలనుంది. సల్మాన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకానవసరం లేదు. ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తారు. సల్మాన్‌కు బెయిల్ లభించకుంటే.. ఇదే రోజు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముంది. 2002లో ముంబైలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి తన వాహనంతో దూసుకెళ్లి ఒకరి మృతికి కారణమైన కేసులో సల్మాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌పై నమోదు చేసిన అభియోగాలన్నీ రుజువయ్యాయని స్పష్టం చేసింది. -
కోట్ల ఆస్తి ఉన్నా..దిక్కులేని చావు!
ముంబై: నగరంలో ఉంటున్న ఓ వృద్ధురాలికి కోట్లలో ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉంటే ఎవరైనా దర్జాగానే జీవితాన్ని వెల్లదీస్తారని అనుకుంటాం. అయితే ఇక్కడ భిన్నంగా జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. జయశ్రీ ఘోల్ కర్(68) అనే వృద్దురాలికి వెర్సినోవాలోని యారీ రోడ్డులోరూ. 30 కోట్లకు పైగా ఆస్తి ఉంది. ఆ వృద్ధురాలు సోదరుల్లో ఒకరు స్థానికంగా ఒక బంగ్లాలో ఉండగా, మరో సోదరడు అమెరికా లో సెటిల్ అయ్యాడు. కాగా, ఆ వృద్ధురాలిని ఇంట్లో వాళ్లు బయటకు గెంటేశారు. దీంతో దయనీయ స్థితిలో జీవనాన్ని సాగించిన ఆ వృద్దురాలు జనవరి 9 వ తేదీన అసువులు బాసింది. జనవరి ఏడో తేదీన బాంబే హైకోర్టు ఆదేశాలతో జేజే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో రెండు రోజుల అనంతరం అసువులు బాసింది. దీనిపై హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. వృద్ధులకు తగిన సంక్షేమ పథకాలు కల్పించడంలో ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడాన్ని తప్పుబట్టింది. ఒకవేళ ఇంట్లో వాళ్లు వృద్దులను చూసినా.. చూడకపోయినా వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. వైద్య సదుపాయాలతో పాటు, ఓల్డేజ్ హోమ్ లను ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా?అని ప్రశ్నించింది. -
ఏది పరస్పర అంగీకార శృంగారం & ఏది రేప్..?
-
'డ్రంక్ అండ్ డ్రైవ్' చట్ట సవరణపై వివరణ ఇవ్వండి
ముంబై: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి చట్ట సవరణ ఎందుకు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ముంబై హైకోర్టు ప్రశ్నించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో బాధితులకు పరిహారం పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సమర్ధించిన హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ అభయ్ ఓకా మరియ జస్టిస్ ఏఎఎస్ చందుర్ కార్ లతో కూడిన ముంబై హైకోర్టు నాలుగు వారాల్లో ప్రభుత్వం వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2002 లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ రన్ కేసులో బాధితులకు పరిహారం కోరుతూ జర్నలిస్టు నిఖిల్ వాగ్లే ప్రజాప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేశారు. -
‘భద్రత’ బాధ్యత వారిదే..!
సాక్షి, ముంబై: మహిళా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇక మీదట ప్రతి రైల్వే స్టేషన్లో ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగర రైల్వే స్టేషన్లలో మహిళల భద్రత విషయంలో జీఆర్పీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ముంబై హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించడంలో విఫలమవుతోందని దుయ్యబట్టింది. దీనిపై జీఆర్పీ సమాధానమిస్తూ తగినంత సిబ్బంది లేకపోవడం వల్లే కొన్నిసార్లు తాము నిందితులను గుర్తించడంలో విఫలమవుతున్నామని సమాధానమిచ్చింది. అలాగే రైల్వే అధికారుల మధ్య సమన్వయం సాధించేందుకు అవసరమైన వాకీటాకీలు కూడా అందుబాటులో లేవని, అందువల్ల వివిధ స్టేషన్ల అధికారుల మధ్య సమన్వయం సాధ్యం కావడంలేదని వివరించింది. నగరంలోని 136 రైల్వేస్టేషన్లు ఉండగా, కేవలం 120 వాకీటాకీలో ఇక్కడ అందుబాటులో ఉన్నాయని సమాధానమిచ్చింది. ఇదిలా ఉండగా, తమకు ఎదురవుతున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్లలో భద్రత చర్యలను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి రైల్వే స్టేషన్లో తప్పనిసరిగా ఒక అధికారిని నియమించేలా కొత్త నిబంధనను రూపొందించారు. ప్రతి జీఆర్పీ స్టేషన్ పరిధిలో దాదాపు ఐదు రైల్వే స్టేషన్లు ఉంటాయి. దీంతో ఒక్కో పోలీస్ స్టేషన్లో కనీసం ఐదుగురు ఇన్స్పెక్టర్ల అవసరం ఉంటుంది. వీరు తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తారు. కొత్త ప్రణాళిక ప్రకారం.. ఈ ఇన్స్పెక్టర్లు తమకు కేటాయించిన రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు జవాబుదారీగా వ్యవహరిస్తారు. తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో నేరాల సంఖ్య పెరిగినా వీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటిని నివారణకు తగిన చర్యలు తీసుకోవడం కూడా వీరి బాధ్యతే.వీటి ద్వారా రోజురోజుకు అధికారుల బాధ్యతల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని జీఆర్పీ కమిషనర్ రవీందర్ సింగాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జీఆర్పీలో సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆ శాఖ లోకల్ ఆర్మ్స్ (ఎల్ ఏ) సహాయం కూడా తీసుకోనుంది. వీరి సహకారంతో రోజూ అన్ని ముఖ్య రైల్వే స్టేషన్లలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బాంద్రా, లోకమాన్య తిలక్ టెర్మినస్ (కుర్లా), దాదర్, ముంబై సెంట్రల్, ఇతర రైల్వే స్టేషన్లలో రోజువారీ భద్రతను పర్యవేక్షించనున్నారు. ఎల్‌ఏకు చెందిన దాదాపు 40 మంది సిబ్బంది ఈ టర్మినస్లకు చేరుకుంటారు. తర్వాత జీఆర్పీ సిబ్బందితో అన్ని స్టేషన్ల ఆవరణలో నిర్వహించే కూంబింగ్‌లో పాల్గొంటారని వెస్టర్న్ రైల్వే జీఆర్పీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ప్రదీప్ బిజ్వే పేర్కొన్నారు. -
జైళ్లలో ‘పే ఫోన్’ సౌకర్యం
సాక్షి, ముంబై : జైలులో గడిపే ఖైదీలకు వారి కుటుంబీకులతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఫే ఫోన్’ అనే పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఠాణే, తలోజా సెంట్రల్ జైళ్లలో ప్రవేశపెట్టిన ఈ పథకం సఫలీకృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో అమలుచేయనున్నారు. ఈ విషయంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ముంబై హైకోర్టుకు అన్ని వివరాలు తెలిపింది. హై కోర్టుకు అందించిన వివరాల మేరకు పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో జైళ్లలోని ఖైదీలకు తమ కుటుంబీకులతో మాట్లాడేందుకు ఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఖైదీలకు కూడా ఇలాంటి సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ముందుగా ప్రయోగాత్మకంగా ఠాణే, తలోజా జైళ్లలో మూడు నెలల కోసం ఈ పే ఫోన్ పథకాన్ని అమలుచేస్తోంది. అదేవిధంగా తొందర్లోనే నాగపూర్ సెంట్రల్ జైల్లో కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి పథకాన్ని ప్రారంభించాలని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు, నాసిక్ జైలులోని అఫ్తాబ్ సయ్యద్ శేఖ్, జావేద్ అహ్మద్ మాజిద్ అనే ఇద్దరు ఖైదీలు ప్రజావ్యాజ్యం వేశారు. ఈ విషయం న్యాయమూర్తి అనుజా ప్రభుదేశాయ్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పే ఫోన్ పథకం గురించి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలు అందించింది. అయితే ఈ పే ఫోన్ సౌకర్యాన్ని ప్రస్తుతం కొందరు ఖైదీలు మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. స్వల్ప నేరారోపణలున్న ఖైదీలకు మాత్రమే ఈ పే ఫోన్ వినియోగించుకునేందుకు అనుమతించారు. కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు, తీవ్ర నేరారోపణలు ఉన్న ఖైదీలను ఈ పథకానికి దూరంగా ఉంచారు. కాగా, ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే సదరు ఖైదీ ముందు తాను ఎవరెవరికి ఫోన్ చేస్తాననేది జైలు అధికారులకు సమాచారమివ్వాల్సి ఉంటుంది. అలాగే రోజూ నిర్ణీత సమయంలోనే ఖైదీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఈ పే ఫోన్ విషయంపై మళ్లీ ఆగస్టులో విచారణ జరగనుంది. దీంతో అంతవరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం సఫలీకృతమయ్యిందా లేదా అనేది కూడా తెలియనుంది. -
ఒక కుటుంబం.. ఒక వాహనం ప్రణాళిక అమలు చేయాలన్న బాంబే హైకోర్టు
సాక్షి, ముంబై: ముంబైలో జనాభాతోపాటు వాహనాల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. నగరంలోని ప్రముఖ రోడ్లపై ట్రాఫిక్ సమస్య తీవ్రంకాగా, మరోవైపు వాహనాలను పార్కింగ్ చేయాలన్నా స్థలం లభించడంలేదు. ‘ఒక కుటుంబం.. ఒక వాహనం’ ట్రాఫిక్ సమస్యను తగ్గించాలంటే వాహనాల సంఖ్య తగ్గాలి. అందుకు ‘ఒక కుటుంబం ఒక వాహనం’ అనే ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన బాంబే హైకోర్టు ఇలాంటి ప్రణాళికను తొందరగా అమలు చేసే దిశగా ఆలోచించాలని ‘ఆర్టీఓ’కు సూచిం చింది. ఈ ప్రణాళికను అమలు చేస్తే పార్కింగ్ సమస్య కొంత తీరనుంది. మరోవైపు అనేక మంది ముంబైలో నివసిస్తున్నప్పటికీ ఠాణే, భివండీలో నివసిస్తున్నట్లు చిరునామాలో పేర్కొని వాహనాలు తీసుకుంటున్నారు. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా అక్ట్రాయి, ఇతర పన్నుల రూపంలో లభించే ఆదాయానికి గండిపడుతోంది. తప్పుడు చిరునామాతో వాహనాల కొనుగోలు ముఖ్యంగా కొందరు డీలర్లు కూడా పన్నులను ఎగ్గొట్టేందుకు ఇలాంటి తప్పుడు చిరునామాలతో వాహనాలు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇలా చేసే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముంబై హైకోర్టులో ఠాణే మాజీ కార్పొరేటర్ సుధీర్ బర్గే ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్లో రెవెన్యూ కూడా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు ముంబైలోని ట్రాఫిక్ సమస్య తీరేందుకు పై విధంగా ఆర్టీఓకు సూచించింది. పార్కింగ్ స్థలం ఉందా లేదా? చూడండి వాహనాలు కొనుగోలు చేసే సమయంలో పార్కింగ్ స్థలం ఉందా లేదా? చూడాల్సిన అవసరం ఉందని ముంబై హైకోర్టు పేర్కొంది. అనేక కుటుంబాల వద్ద ఒకటి కంటే అధికంగా వాహనాలున్నాయి. అయితే వాటన్నింటికీ వారు నివసించే స్థలంలో పార్కింగ్ లేకపోవడంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. దీంతో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మరోవైపు కొన్ని వాహనాలైతే ఒకే చోట అనేక రోజులుగా నిలిపి ఉంచుతున్నారు. దీంతో ఒక కుటుంబం ఒక వాహనం ప్రణాళికను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముంబై హైకోర్టు సూచించింది. తీవ్రమవుతున్న పార్కింగ్ సమస్య నగరంలో పార్కింగ్ సమస్య రోజు రోజుకి తీవ్రమవుతోంది. ముఖ్యంగా నగరంలో బీఎంసీకి చెందిన 89 ‘పే పార్కింగ్’ ప్రాంతాలున్నాయి. వీటిలో 10,314 వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుంది. అయితే వాహనాల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో కొన్ని పార్కింగ్ ప్రాంతాలను ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అపోలో మిల్లు వద్ద 650 వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుండే బహుళ అంతస్తుల పే పార్క్‌ను నిర్మించింది. అదేవిధంగా మరో 33 బహుళ అంతస్తుల పే పార్కింగ్ భవనాలను నిర్మించేందుకు బీఎంసీ అనుమతులను ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా పార్కింగ్ సమస్య మాత్రం తీరే అవకాశాలు కన్పించడంలేదు. దీనికి ప్రధాన కారణంగా వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరగడం. ముఖ్యంగా ఒకే కుటుంబంలో నాలుగైదు వాహనాలు ఉండటం. ఇలాంటి వాటి ని తగ్గించి ట్రాఫిక్‌తోపాటు పార్కింగ్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. -
భర్త మానసిక వైకల్యం విడాకులకు దారికాదు:బాంబే హైకోర్టు
ముంబై: భర్తకు మానసిక వైకల్యం ఉన్నంత మాత్రాన భార్యకు విడాకులు మంజూరు చేయడం కుదరదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్తకు మానసిక వైకల్యం ఉన్నా.. అది ఆమె అతడితో కలిసి జీవించడానికి వీల్లేకుండా ఉన్నట్లు కూడా రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తన భర్త స్కీజోఫ్రీనియా బాధితుడని, వివాహం తర్వాత తనను పలుసార్లు కొట్టాడని.. కనుక విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వీఎల్ అచ్లియా, జస్టిస్ విజయ తహిల్మ్రణితో కూడిన ధర్మాసనం విచారణ అనంతరం కొట్టివేసింది. భర్త కనీసం తన పనులను కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడనేందుకు తగిన ఆధారాలను ఈ కేసులో పిటిషనర్ పేర్కొనలేకపోయారని ధర్మాసనం పేర్కొంది. తొలుత ముంబైలోని కుటుంబ వివాదాల పరిష్కార కోర్టు విడాకుల మంజూరుకు తిరస్కరించగా.. ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. -
షారుక్‌పై కేసు విచారణ నేడు
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌పై నమోదైన ముందస్తు లింగనిర్ధారణ కేసును ముంబై హైకోర్టు శనివారం విచారించనుంది. షారుక్, గౌరీ ఖాన్ దంపతులకు ఇటీవల జన్మించిన అబ్రామ్ తల్లి గర్భంలో ఉన్నపుడే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త ఫిర్యాదు చేశారు. షారుక్ దంపతులు సరోగసీ విధానం ద్వారా తమ కుమారునికి జన్మనిచ్చారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ పిల్లాడు జన్మించాడు. కాగా షారుక్ దంపతులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ ఆరోపణల్ని షారుక్ కొట్టిపారేశారు. -
శివసేన దసరా ర్యాలీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ముంబై: శివసేన ప్రతి ఏటా దాదర్‌లోని శివాజీపార్‌కలో నిర్వహించే దసరా ర్యాలీకి మంగళవారం ముంబై హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరణానంతరం మొట్టమొదటిసారిగా జరగనున్న దసరా ర్యాలీని శివాజీపార్‌కలో నిర్వహించేందుకు మార్గం సుగమమయింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన దసరా ర్యాలీ వేదికను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడినట్టయితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని శివసేన నాయకులు భావించారు. అందుకే అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎట్టకేలకు ఉన్నత న్యాయస్థానం శివసేనకు అనుకూలంగా తీర్పుచెప్పడంతోసేన కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. గత నెలలో శివాజీపార్‌కలో దసరా ర్యాలీ నిర్వహించేందుకు శివసేన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతి కోరింది. అయితే బీఎంసీ అనుమతి నిరాకరించిన విషయం విదితమే. ర్యాలీ వేదిక ‘సెలైన్సజోన్’ పరిధిలోకి వస్తుంది కాబట్టి అనుమతి ఇవ్వడం కుదరదని కార్పొరేషన్ వివరణ ఇచ్చింది. దీంతో శివసేన ఈ సారి ర్యాలీని వేరే చోట నిర్వహిస్తుందని అంతా భావించారు. దసరాకు వారం రోజుల ముందు హైకోర్టు శివసేనకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించింది. సేన ప్రతి ఏటా దసరా సందర్భంగా శివాజీపార్కులో ర్యాలీ నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఇక ర్యాలీకి భారీగా జనాన్ని సమీకరించడానికి సేన నాయకులు సమాయత్తమవుతున్నారు. -
ముందస్తు బెయిల్ కోసం యుక్తాముఖి భర్త పిటిషన్
ముంబై : గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి భర్త ప్రిన్స్ తులి ముందస్తు బెయిల్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణకు రానున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గత ఆగస్టు 31న సెషన్స్ కోర్టు తిరస్కరించింది. అయితే అతడు అరెస్టు కాకుండా రక్షణ కల్పించింది. వేధింపుల కేసులో అరెస్టు చేయకుండా దిగువకోర్టు తన భర్త ప్రిన్స్ తులికి రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కాగా, తులికి ముందస్తు అరెస్టు బెయిల్ ఇచ్చిన సెషన్స్ కోర్టునే ఆశ్రయించాలని యుక్తాముఖికి హైకోర్టు సూచించింది. తనను అసహజ శృంగారంలో పాల్గొనాలని తన భర్త హింసిస్తున్నాడని యుక్తాముఖి గత జూలై లో పోలీసులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే.