
'సల్మాన్ పారిపోయే మనిషి కాదు'
ముంబయి : హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు జైలా...బెయిలా అనే అంశంపై ముంబయి హైకోర్టు నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో వేరేకేసు విచారణ ఉన్నందున సల్మాన్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఇవాళ హైకోర్టుకు హాజరు కావటం లేదు. దాంతో సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించనున్నారు.
కాగా అయిదేళ్లకు పైగా జైలు శిక్ష పడినవాళ్ల అప్పీల్ పిటిషన్పై నిర్ణయానికి కొంత సమయం పడుతుందని సీనియర్ క్రిమినల్ న్యాయవాది మజీద్ మెమన్ పేర్కొన్నారు. ఈలోగా దోషిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. సల్మాన్ పారిపోయే మనిషి కాదు అని మజీద్ మెమన్ వ్యాఖ్యానించారు.
2002లో ముంబైలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి తన వాహనంతో దూసుకెళ్లి ఒకరి మృతికి కారణమైన కేసులో సల్మాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌పై నమోదు చేసిన అభియోగాలన్నీ రుజువయ్యాయని స్పష్టం చేసింది. దాంతో అతనికి ఐదేళ్లు జైలు శిక్ష విధించింది.