
ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై నమోదైన రెండు కేసులను కొట్టివేస్తూ ముంబై హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనకు రక్షణ కల్పించాలని కోరింది. పాల్ఘర్ లించింగ్, వలసకూలీలలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అర్నాబ్‌పై కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్, రియాజ్ చాగ్లాతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. విద్వేశాలు రెచ్చగొట్టేలా అర్నాబ్ ప్రయత్నించినట్లు ఎక్కడా కనిపించలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దాఖలైన రెండు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఓ జర్నలిస్టుకు మతపరమైన సంఘటనలపై విశ్లేషించే హక్కు ఉందన్న అర్నాబ్ తరపు న్యాయవాదుల వాదనను సైతం కోర్టు అంగీకరించింది. సామాజిక అంశాలపై జరిపిన చర్చలో అర్నాబ్ తన వృత్తిధర్మాన్ని పోషించారని న్యాయవాదులు హరీష్ సాల్వే , మిలింద్ సాతే కోర్టుకు వివరించారు.
(రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు )
వివరాల్లోకి వెళితే.. పాల్ఘర్ మూకదాడికి సంబంధించి అర్నాబ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దేశవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో అర్నాబ్ సుప్రీంను ఆశ్రయించగా అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై స్టే విధించకుండా ముంబైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. మరోవైపు బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు గుమిగూడటంపై ప్రసారం చేసిన కథనంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏప్రిల్ 22, మే 2న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తాజా తీర్పుతో అర్నాబ్‌కు ఊరట లభించినట్లైంది. (చైనాలో మన న్యూస్ సెన్సార్ )
Comments
Please login to add a commentAdd a comment