ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ విచారణను ముంబై హైకోర్టు బుధవారం వాయిదా వేసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బాంబే హైకోర్టు సెలవులో ఉంది. దీంతో రేపు(గురువారం) బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. నేడు రియా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసినట్లు బాంబే హైకోర్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటల్లో 173 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నాయరో కోవిడ్-19 ఆస్పత్రి నీట మునిగింది. వర్షం కారణంగా ముంబైలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు నిలవడంతో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. చదవండి: (రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా)
Comments
Please login to add a commentAdd a comment