ముంబై : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఘటన కేసులో బాంద్రా పోలీసులు మొత్తం 13 మంది వ్యక్తుల వాంగ్మూలాలు రికార్డు చేశారు. వీరిలో సుశాంత్ సింగ్ ప్రేమికురాలుగా ఉన్న రియా చక్రవర్తిని బుధవారం బాంద్రా పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా ఈ నెల 14న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉరి వేసుకోవడం వల్లే సుశాంత్ మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే సుశాంత్ మానసిక ఒత్తిడికి గురికావడానికి కారణాలేంటనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో గురువారం సుశాంత్ ప్రేమికురాలుగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తిని పోలీసులు విచారించారు. పోలీస్ స్టేషన్లో ఆమె దాదాపు 9 గంటల పాటు ఉన్నారు. ఈ విచారణలో యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో కాంట్రాక్టు అయిపోయిందని, తనను కూడా ఒప్పందం ఆపేయాలని కోరినట్లు రియా తెలిపారు. (సుశాంత్ మరణం; కరణ్‌కు మద్దతుగా వర్మ)
కాగా నిన్న(గురువారం) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) మధ్య కుదిరిన ఒప్పందం కాపీని దర్యాప్తు కోసం సమర్పించాలని బాంద్రా పోలీసులు కోరారు. సుశాంత్ ఇప్పటి వరకు రెండు వైఆర్ఎఫ్ చిత్రాలలో నటించారు. 2013లో విడుదలైన శుద్ధ్ దేశీ రొమాన్స్, 2015లో వచ్చిన డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి. వీటిలో శుద్ధ్ దేశీ రొమాన్స్.. సుశాంత్ కెరీర్‌లో రెండో చిత్రం. అయితే సుశాంత్ వైఆర్‌ఎఫ్‌తో మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు అప్పట్లో విస్తృతంగా వార్తలు వచ్చాయి. (బాలీవుడ్ బంధుప్రీతిపై వైరల్ వీడియో)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణ వార్త బాలీవుడ్‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అంతేగాక నెపోటిజమ్(బంధుప్రీతి) అనే వాదనను తెరమీదకు తీసుకువచ్చింది. సినీ పరిశ్రమలో కేవలం స్టార్ హీరోల వారసులు మాత్రమే ఎదుగుతున్నారని, సుశాంత్‌కు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్లే తనను ఎవరు సినిమాల్లోకి తీసుకోలేదని.. అందువల్లే మానసిక ఒత్తిడికి గురైన సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని అనేక ఆరోపణలు విపిస్తున్నాయి. నెపోటిజం కారణంగా ఇప్పటికే కరణ్ జోహార్, అలియాభట్ వంటి వారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన వృత్తిపరంగా ఉన్న వివాదాలతో సహా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. (సుషాంత్ మరణం టిక్‌టాక్‌లో చూసి..)
Comments
Please login to add a commentAdd a comment