నీళ్లలాంటి ఆహారం.. టాయిలెట్‌ పక్కనే పడుకున్నా..: హీరోయిన్ | Rhea Chakraborty Opens Up About Her Jail Life In Mumbai | Sakshi
Sakshi News home page

Rhea Chakraborty: శారీరక బాధ కన్నా మానసిక క్షోభ అనుభవించా: సుశాంత్ ప్రియురాలు రియా

Published Mon, Jan 15 2024 11:33 AM | Last Updated on Mon, Jan 15 2024 12:22 PM

Sushanth Lover Rhea Chakraborty Open About her Jail Life In Mumbai - Sakshi

బాలీవుడ్‌ నటుడు, ఎంఎంస్ ధోని హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. యంగ్ హీరో సూసైడ్‌ చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా ఆ తర్వాత బెయిల్‌పై రిలీజై బయటికొచ్చారు. తాజాగా ఓ షోకు హాజరైన రియా జైలులో ఉన్నప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. 

రియా మాట్లాడుతూ.. 'నాకు జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం పెట్టేవాళ్లు. కేవలం అవీ పేరుకే  గానీ మొత్తం నీళ్లలాగే ఉండేది. అయినప్పటికీ ఆకలిగా ఉండటంతో గతిలేక తినేసేదాణ్ని. నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్‌రూమ్ ఉండేది. ఇలాంటివి దుర్భర పరిస్థితులు జైలులో చవిచూశా.  ఆ సమయంలో పడిన శారీరక బాధల కన్నా.. మానసిక క్షోభనే ఎక్కువ అనుభవించా. కానీ మిగిలిన వారితో పోలిస్తే నా పరిస్థితి  కాస్తా ఫరవాలేదనిపించేది. కొందరు బెయిల్‌ వచ్చినా రూ.5 వేలు, రూ.10 వేలు కూడా కట్టలేక అక్కడే ఉండేవారు. నాకు బెయిల్‌ వచ్చినప్పుడు.. మీరు హీరోయిన్‌ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్‌ చేసి చూపిచండని కొందరు అడిగారు. అందుకే ఆ సమయంలో నాగిని పాటకు డ్యాన్స్‌ చేశా' అని జైలులోని అనుభవాలను చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement