ముంబయి : హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై అతని తరపు న్యాయవాది అమిత్ దేశాయి వాదనలు వినిపించారు. ఈ కేసు వివరాలను ఆయన శుక్రవారం ముంబై హైకోర్టు జడ్జి ముందు ఉంచారు. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలని అమిత్ దేశాయి ఈ సందర్భంగా జడ్జిని కోరారు. ఆ రోజు జరిగింది కేవలం యాక్సిడెంట్ మాత్రమే అని, చావుకు కారణమయ్యారనే అభియోగాలను తొలగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్ ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కాగా ఈ కేసులో నాలుగో వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, సల్మాన్తో పాటు కారులో ఉన్న బంధువు కమాల్ ఖాన్ వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదనే అంశాన్ని అమిత్ దేశాయి లేవనెత్తారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు వ్యక్తులున్నారన్నారు. నలుగురు కూడా ప్రత్యక్ష సాక్షులని, దీనిని కింద కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పోలీస్ అధికారుల ముందు ఇచ్చిన సాక్ష్యాలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 90 నుంచి 100 కిలోమీరట్ల వేగంగా ప్రయాణించిందని సాక్షి చెబుతున్నారని, అయితే హోటల్ నుంచి ఘటనా స్థలానికి రావటానికి 30 నిమిషాలు పట్టిందని, దూరం 14 కిలోమీటర్ల మాత్రమే అన్నారు. సల్మాణ్ ఖానే కారు నడుపుతున్నారని ఎవరూ నిరూపించలేకపోయారని అమిత్ దేశాయి వాదనలు వినిపించారు. అనంతరం ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే వాదనలు ప్రారంభం అయ్యాయి.
'ఆరోజు జరిగింది కేవలం యాక్సిడెంటే'
Published Fri, May 8 2015 12:12 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement