సల్మాన్కు బెయిలా? జైలా? | Will Salman Khan get bail, stay out of jail? | Sakshi
Sakshi News home page

సల్మాన్కు బెయిలా? జైలా?

Published Fri, May 8 2015 9:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

సల్మాన్కు బెయిలా? జైలా?

సల్మాన్కు బెయిలా? జైలా?

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు బెయిల్ మంజూరవుతుందా? లేక జైలుకెళ్లాలా అన్న విషయం ఈ రోజు తేలనుంది. శుక్రవారం ముంబై హైకోర్టు సల్మాన్ బెయిల్ పిటీషన్ ను విచారించనుంది. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించనున్నారు.

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది. బెయిల్ గడువు ఈ రోజుతో ముగియనుంది. హైకోర్టు సల్మాన్కు బెయిల్ ను పొడగిస్తుందా లేదా అన్న విషయం కొన్ని గంటల్లో తేలనుంది. సల్మాన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకానవసరం లేదు. ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తారు. సల్మాన్కు బెయిల్ లభించకుంటే.. ఇదే రోజు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముంది.

2002లో ముంబైలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి తన వాహనంతో దూసుకెళ్లి ఒకరి మృతికి కారణమైన కేసులో సల్మాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌పై నమోదు చేసిన అభియోగాలన్నీ రుజువయ్యాయని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement