
సల్మాన్ ఇంటికి పోటెత్తిన అభిమానులు
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి అభిమానులు పోటెత్తారు. సల్మాన్ బెయిల్ పిటీషన్ ముంబై హైకోర్టులో ఈ రోజు విచారణకు రానుండటంతో.. ఆయనకు మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బాంద్రాలోని సల్మాన్ ఇంటి ముందు గుమిగూడారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. రాజకీయ, సినీ ప్రముఖులు సల్మాన్ను పరామర్శించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, బాలీవుడ్ ప్రముఖులు ఆమీర్ ఖాన్, కరీనా కపూర్, సోనాక్షి సిన్హా, కరణ్ జోహార్ సల్మాన్ ఇంటికి వచ్చారు. సల్మాన్ ఈ రోజు ఇంట్లోనే ఉన్నారు.
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది. బెయిల్ గడువు ఈ రోజుతో ముగియనుంది. హైకోర్టు సల్మాన్కు బెయిల్ ను పొడగిస్తుందా లేదా అన్న విషయం కాసేపట్లో తేలనుంది.