
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ క్రేజే వేరే లెవెల్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఫ్యాన్స్ ఉన్న హీరోల్లో సల్మాన్ ముందుంటారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో వేదికపై చిన్నపిల్లాడి అభిమానంతో సల్మాన్ కాళ్లకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. తాజాగా బిగ్‌బాస్-18 సెట్స్‌లోనూ ఆయన ఓ అభిమానితో ముచ్చటించారు.
సల్మాన్ ఖాన్‌ను చూసిన ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది. మీకోసం నేను దేవుడిని ప్రార్థించానంటూ సల్మాన్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంది. ఆమె చెబుతున్న మాటలను సల్మాన్ ఖాన్ ఆసక్తిగా విన్నారు. కొద్దిసేపు ఆమెతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఫ్యాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. సల్మాన్ ఖాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ప్రస్తుతం ఆయన 'సికందర్'మూవీలో కనిపించనున్నాడు, ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది. అంతేకాకుండా కమల్ హాసన్- అట్లీ మూవీలోనూ సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment