ముంబై : గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి భర్త ప్రిన్స్ తులి ముందస్తు బెయిల్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణకు రానున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గత ఆగస్టు 31న సెషన్స్ కోర్టు తిరస్కరించింది. అయితే అతడు అరెస్టు కాకుండా రక్షణ కల్పించింది.
వేధింపుల కేసులో అరెస్టు చేయకుండా దిగువకోర్టు తన భర్త ప్రిన్స్ తులికి రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కాగా, తులికి ముందస్తు అరెస్టు బెయిల్ ఇచ్చిన సెషన్స్ కోర్టునే ఆశ్రయించాలని యుక్తాముఖికి హైకోర్టు సూచించింది. తనను అసహజ శృంగారంలో పాల్గొనాలని తన భర్త హింసిస్తున్నాడని యుక్తాముఖి గత జూలై లో పోలీసులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే.