Prince Tuli
-
యుక్తాముఖి కేసులో మధ్యవర్తిని నియమించిన బాంబే కోర్టు
ముంబై: మాజీ మిస్ వరల్డ్ యుక్తా ముఖి, ఆమెకు దూరంగా ఉంటున్న భర్త ప్రిన్స్ తులిల మధ్య వైవాహిక వివాదాన్ని పరిష్కరించేందుకు బాంబే హైకోర్టు సోమవారం ఓ మధ్యవర్తిని నియమించింది.ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ పాటిల్ సమక్షంలో మంగళవారం చర్చలు జరుగుతాయని తులి తరఫు న్యాయవాది ఫిజి ఫ్రెడరిక్ తెలిపారు. తులి అసహజ శృంగారం చేస్తున్నారని, ఆయన కుటుంబ సభ్యులు గృహ హింసకు పాల్పడుతున్నారని గత ఏడాది జూన్‌లో పోలీసులకు యుక్తాముఖి ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే తులి కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసును న్యాయవాదులతో కలిసి సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆదేశించింది. వారిద్దరి మధ్య మద్యవర్తిగా రాజీవ్ పాటిల్‌ను నియమించింది. -
ముందస్తు బెయిల్ కోసం యుక్తాముఖి భర్త పిటిషన్
ముంబై : గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి భర్త ప్రిన్స్ తులి ముందస్తు బెయిల్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణకు రానున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గత ఆగస్టు 31న సెషన్స్ కోర్టు తిరస్కరించింది. అయితే అతడు అరెస్టు కాకుండా రక్షణ కల్పించింది. వేధింపుల కేసులో అరెస్టు చేయకుండా దిగువకోర్టు తన భర్త ప్రిన్స్ తులికి రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కాగా, తులికి ముందస్తు అరెస్టు బెయిల్ ఇచ్చిన సెషన్స్ కోర్టునే ఆశ్రయించాలని యుక్తాముఖికి హైకోర్టు సూచించింది. తనను అసహజ శృంగారంలో పాల్గొనాలని తన భర్త హింసిస్తున్నాడని యుక్తాముఖి గత జూలై లో పోలీసులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. -
‘జంజీర్’ రీమేక్‌పై స్టేకు బాంబే హైకోర్టు నిరాకరణ
ముంబై: బాలీవుడ్లో ఘన విజయం సాధించిన 1973 నాటి ‘జంజీర్’ సినిమా రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు సోమవారం నిరాకరించింది. దీనిపై కథా రచయితలు సలీమ్‌ఖాన్, జావెద్ అక్తర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. పాత జంజీర్ చిత్ర కథ, స్క్రిప్ట్, డైలాగులకు సంబంధించిన కాపీరైట్లు తమ వద్ద ఉన్నాయని...అందువల్ల అదే పేరుతో దాన్ని రీమేక్ చేసిన నాటి నిర్మాత ప్రకాశ్ మెహ్రా కుమారుల నుంచి రూ. 6 కోట్ల పరిహారం ఇప్పించాలని సలీమ్, జావేద్‌లు కోర్టును కోరారు. అయితే పిటిషనర్లు ఆలస్యంగా కేసు వేసినందున ఈ చిత్రంపై స్టే విధించాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రామ్‌చరణ్‌తేజ జంజీర్ రీమేక్ ద్వారా తొలిసారి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.