ముంబై: బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 1973 నాటి ‘జంజీర్’ సినిమా రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు సోమవారం నిరాకరించింది. దీనిపై కథా రచయితలు సలీమ్‌ఖాన్, జావెద్ అక్తర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. పాత జంజీర్ చిత్ర కథ, స్క్రిప్ట్, డైలాగులకు సంబంధించిన కాపీరైట్లు తమ వద్ద ఉన్నాయని...అందువల్ల అదే పేరుతో దాన్ని రీమేక్ చేసిన నాటి నిర్మాత ప్రకాశ్ మెహ్రా కుమారుల నుంచి రూ. 6 కోట్ల పరిహారం ఇప్పించాలని సలీమ్, జావేద్‌లు కోర్టును కోరారు. అయితే పిటిషనర్లు ఆలస్యంగా కేసు వేసినందున ఈ చిత్రంపై స్టే విధించాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రామ్‌చరణ్‌తేజ జంజీర్ రీమేక్ ద్వారా తొలిసారి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.