
యుక్తాముఖి కేసులో మధ్యవర్తిని నియమించిన బాంబే కోర్టు
ముంబై: మాజీ మిస్ వరల్డ్ యుక్తా ముఖి, ఆమెకు దూరంగా ఉంటున్న భర్త ప్రిన్స్ తులిల మధ్య వైవాహిక వివాదాన్ని పరిష్కరించేందుకు బాంబే హైకోర్టు సోమవారం ఓ మధ్యవర్తిని నియమించింది.ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ పాటిల్ సమక్షంలో మంగళవారం చర్చలు జరుగుతాయని తులి తరఫు న్యాయవాది ఫిజి ఫ్రెడరిక్ తెలిపారు. తులి అసహజ శృంగారం చేస్తున్నారని, ఆయన కుటుంబ సభ్యులు గృహ హింసకు పాల్పడుతున్నారని గత ఏడాది జూన్లో పోలీసులకు యుక్తాముఖి ఫిర్యాదు చేసింది.
ఆ వెంటనే తులి కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసును న్యాయవాదులతో కలిసి సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆదేశించింది. వారిద్దరి మధ్య మద్యవర్తిగా రాజీవ్ పాటిల్ను నియమించింది.