బాంబే హైకోర్టును ఆశ్రయించిన యుక్తాముఖి | Yukta Mookhey moves Bombay High Court against protection from arrest to husband | Sakshi
Sakshi News home page

బాంబే హైకోర్టును ఆశ్రయించిన యుక్తాముఖి

Published Mon, Aug 19 2013 9:22 PM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

బాంబే హైకోర్టును ఆశ్రయించిన యుక్తాముఖి

బాంబే హైకోర్టును ఆశ్రయించిన యుక్తాముఖి

వేధింపుల కేసులో అరెస్టు చేయకుండా దిగువకోర్టు తన భర్త ప్రిన్స్‌తులికి రక్షణ కల్పించడాన్ని సవాల్ చేస్తూ బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ యుక్తాముఖి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తులి తనను వేధించడంతోపాటు అసహజ శృంగారం కోసం బలవంతం చేశాడంటూ ఆమె గత నెల మూడున ఫిర్యాదు చేయడం తెలిసిందే.  దీంతో న్యాయమూర్తి ఆర్పీ సొండూర్ బల్డోటా తులికి నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈ నెల 23న విచారణ నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కేసులో అరెస్టు కాకుండా తమకు రక్షణ కల్పించాలంటూ తులి, అతని తండ్రి బచత్తర్‌సింగ్, తల్లి హరీందర్ కౌర్, తోబుట్టువులు మన్మీత్ కౌర్, చందన్ కౌర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం సెషన్స్ కోర్టు ఈ నెల 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణ కోసం పోలీసుల ఎదుట హాజరు కావాలని తులిని ఆదేశించింది. వీరిద్దరికి 2008లో వివాహమయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement